
∙ఇషాన్, జాన్వీ
జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ కెమెరా ముందుకొచ్చింది. ఇప్పటివరకూ చాలాసార్లు వచ్చింది కదా అనుకుంటున్నారా? నటిగా రావడం ఇదే ఫస్ట్ టైమ్. జాన్వీ కథానాయికగా నటిస్తోన్న మొదటి హిందీ చిత్రం ‘ధడక్’ షూటింగ్ శుక్రవారం మొదలైంది. శశాంక్ కేతన్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘సైరాట్’కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ‘‘మార్చికల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. జాన్వీ, ఇషాన్ చాలా కష్టపడుతున్నారు.
అలాంటి వారిని ఎవరైనా డైరెక్ట్ చేయాలనుకుంటారు. ఒరిజినల్ సినిమాలోని సోల్ మిస్ కాకుండా నా స్టైల్లో సినిమా తీయాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు కేతన్. వచ్చే ఏడాది జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. ఆ సంగతలా ఉంచితే.. ముద్దుల కూతురి మొదటి సినిమా, మొదటి రోజు షూటింగ్‌ని కళ్లారా చూడాలనుకున్నారేమో.. శ్రీదేవి కూడా లొకేషన్‌కి వెళ్లారు. కూతురితో కలసి సెల్ఫీ దిగి, సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment