Ishan
-
ధడక్ ప్రమోషన్లలో వీరిదే హవా..
ముంబై : శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, ఇషాన్ ఖట్టర్‌ల తొలి చిత్రం ధడక్ విడుదల కోసం స్టార్ కిడ్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈనెల 20న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందకొస్తున్న ఈ చిత్ర ప్రమోషన్లను మూవీ యూనిట్ వేగవంతం చేసింది. మరాఠా మూవీ సైరాత్ రీమేక్‌గా శశాంక్ ఖైతన్ దర్శకత్వంలో తెరకెక్కిన ధడక్‌పై జాన్వీ సహా కపూర్ కుటుంబం భారీ ఆశలే పెట్టుకుంది. హీరో ఇషాన్ ఖట్టర్ గతంలో మాజిద్ దర్శఖత్వంలో బియాండ్ ద క్లౌడ్స్ అనే మూవీలో నటించాడు.వీరిద్దరూ ప్రేమికులుగా ధడక్‌లో ప్రేక్షకులను అలరిస్తారని చిత్ర బృందం ధీమాగా చెబుతోంది. మరోవైపు మూవీ ప్రమోషన్స్‌లోనూ జాన్వీ, ఇషార్లే అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు. ధడక్ మూవీని ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. -
పోలీస్ కమిషనర్‌గా ఆరేళ్ల బాలుడు
సాక్షి, హైదరాబాద్ : బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఓ బాలుడి కోరికను తీర్చి హైదరాబాద్ పోలీసులు తమ సహృదయతను చాటుకున్నారు. మెదక్ జిల్లాకు చెందిన చాంద్ పాషా కుమారుడు ఇషాన్(6) గత కొద్దిరోజులుగా బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. రెండో తరగతి చదువుతున్న ఇషాన్‌కి పోలీసులంటే చాలా ఇష్టం. దీంతో భవిష్యత్తులో పోలీస్ ఆఫీసర్ అవ్వాలని లక్ష్యం పెట్టుకున్నాడు. అయితే బ్లెడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న ఇషాన్ గురించి తెలుసుకున్న రాచకొండ పోలీసులు అతని కోరిక తీర్చేందుకు ముందుకొచ్చారు. ఒక్క రోజు కమిషనర్‌గా వ్యవహరించేందుకు ఏర్పాట్లు చేశారు. బుధవారం కమిషనర్ ఇషాన్‌కి పోలీసులు సెల్యూట్ చేశారు. అంతేకాకుండా రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్ తన సీటులో కూర్చొబెట్టి మరి ఇషాన్ కోరిక తీర్చారు. -
శ్రీదేవి కూతురి కోసం సాహసం..!
దడక్ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్న అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్ కోసం ఆ సినిమా హీరో ఇషాన్ కట్టర్ సాహసం చేశాడు. తన కోసం వెయిట్ చేస్తున్న జాన్వీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏకంగా బాల్కనీ నుంచి కిందకి దూకేశాడు. దడక్ షూటింగ్ సమయంలో ఇషాన్, జాన్వీల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే తన కో స్టార్ ను షూటింగ్ కు తీసుకెళ్లేందుకు స్వయంగా జాన్వీ.. ఇషాన్ దగ్గరకు వెళ్లింది. ఆ సమయంలో ఇషాన్ జిమ్ లో ఉండటంతో బయటకు రావటం కాస్త ఆలస్యం అయ్యింది. ఈలోగా కారులో జాన్వీ ఉన్న సంగతి అక్కడ ఉన్నవారికి తెలియంటంతో చుట్టూ జనాలు గుమిగూడారు. మీడియా కూడా వచ్చేయటంతో విషయం తెలుసుకున్న ఇషాన్ పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా ఫస్ట్ ఫ్లోర్ బాల్కని నుంచి దూకేశాడు. ఈ లోగా జాన్వీ బాల్కని దగ్గరకు కారు తీసుకురావటంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇషాన్ చేసిన రిస్క్‌ను కొంతమంది ప్రశంసిస్తుంటే మరికొదంరు మాత్రం ఏదైన ప్రమాదం జరిగి ఉంటే షూటింగ్ ఆగిపోయి ఉండేది, హీరోలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయ పడుతున్నారు. -
అమ్మ తోడు యాక్షన్ మొదలైంది
జూనియర్ శ్రీదేవి జాన్వీ కపూర్ కెమెరా ముందుకొచ్చింది. ఇప్పటివరకూ చాలాసార్లు వచ్చింది కదా అనుకుంటున్నారా? నటిగా రావడం ఇదే ఫస్ట్ టైమ్. జాన్వీ కథానాయికగా నటిస్తోన్న మొదటి హిందీ చిత్రం ‘ధడక్’ షూటింగ్ శుక్రవారం మొదలైంది. శశాంక్ కేతన్ దర్శకత్వంలో షాహిద్ కపూర్ తమ్ముడు ఇషాన్ కట్టర్ హీరోగా కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. మరాఠీ చిత్రం ‘సైరాట్’కి ఇది రీమేక్ అనే సంగతి తెలిసిందే. రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ అయింది. ‘‘మార్చికల్లా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. జాన్వీ, ఇషాన్ చాలా కష్టపడుతున్నారు. అలాంటి వారిని ఎవరైనా డైరెక్ట్ చేయాలనుకుంటారు. ఒరిజినల్ సినిమాలోని సోల్ మిస్ కాకుండా నా స్టైల్లో సినిమా తీయాలనుకుంటున్నా’’ అని పేర్కొన్నారు కేతన్. వచ్చే ఏడాది జూలై 6న రిలీజ్ చేయనున్నట్లు నిర్మాత కరణ్ జోహార్ వెల్లడించారు. ఆ సంగతలా ఉంచితే.. ముద్దుల కూతురి మొదటి సినిమా, మొదటి రోజు షూటింగ్‌ని కళ్లారా చూడాలనుకున్నారేమో.. శ్రీదేవి కూడా లొకేషన్‌కి వెళ్లారు. కూతురితో కలసి సెల్ఫీ దిగి, సందడి చేశారు. -
'రోగ్' మూవీ రివ్యూ
టైటిల్ : రోగ్ జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం : ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా, అనూప్ సింగ్ థాకూర్,సుబ్బరాజు సంగీతం : సునీల్ కశ్యప్ దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాత : సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఓ బిగ్ సక్సెస్ కోసం రోగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను రోగ్ అందుకుందా..? కొత్తబ్బాయి ఇషాన్, పూరి మార్క్ హీరోయిజంలో ఎంత వరకు ఫిట్ అయ్యాడు..? రోగ్.. పూరి కెరీర్‌ను గాడిలో పెట్టిందా..? కథ : చంటి (ఇషాన్) ప్రేమ కోసం ప్రాణం ఇచ్చేంత గొప్ప ప్రేమికుడు. కమిషనర్ చెల్లెలు అని తెలిసి కూడా అంజలి(ఏంజెలా)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ కమిషనర్ తన అండర్లో పనిచేసే ఐపియస్ ఆఫీసర్(సుబ్బరాజు)తో అంజలికి నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తాడు. విషయం తెలుసుకున్న చంటి కమిషనర్ ఇంటికెళ్లి గొడవ చేస్తాడు. ఆ గొడవలో ఓ కానిస్టేబుల్‌ను బలంగా కొట్టడంతో అతని రెండు కాళ్లు చచ్చుబడిపోతాయి. ఈ గొడవ చేసినందుకు చంటికి రెండేళ్ల శిక్షపడుతుంది. జైల్లో ఉండగానే తను ప్రేమించిన అంజలి తనని మోసం చేసి సుబ్బరాజును పెళ్లి చేసుకుందని తెలుసుకున్న చంటి, అమ్మాయిల మీద ద్వేషం పెంచుకుంటాడు. జైలు నుంచి విడుదలైన తరువాత తండ్రి ద్వారా తన చేతుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకుంటాడు చంటి. తన వల్ల నష్టపోయిన వాళ్ల జీవితాలకు ఏదైన దారి చూపించి తాను బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం రికవరీ ఏజెంట్‌గా, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అయితే చంటి నుంచి సాయం పొందడానికి కానిస్టేబుల్ కుటుంబం అంగీకరించదు. వాళ్లకు ఇష్టం లేకపోయినా వాళ్ల ఇంటి ముందే ఉండి వాళ్ల అప్పులన్ని తీర్చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ చెల్లెలు అంజలి(మన్నారా చోప్రా) అతన్ని ప్రేమిస్తుంది. కానీ తనను మోసం చేసిన అమ్మాయి పేరు కూడా అంజలినే కావటంతో చంటి ముందు కాదన్నా.. తరువాత అంజలికి దగ్గరవుతాడు. అదే సమయంలో జైలు నుంచి పారిపోయిన ఓ సైకో(అనూప్ థాకూర్ సింగ్), చంటి ఆటో ఎక్కుతాడు. తానను ఓ అమ్మాయి మోసం చేసి జైలుకు పంపిందని చెప్పడంతో చంటి కూడా వాణ్ని పోలీసులకు పట్టించకుండా వదిలేస్తాడు. కానీ ఆ సైకో అంజలి చంపాడినికి ఆమె మీద ఎటాక్ చేస్తాడు. ఈ ఎటాక్ నుంచి తనని కాపాడిన చంటికి, అంజలి మీద పగతోనే సైకో జైలు నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుంది. అసలు ఆ సైకో అంజలిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు..? వాడి నుంచి చంటి, అంజలిని ఎలా కాపాడాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : రోగ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఇషాన్, మంచి నటన కనబరిచాడు. లుక్స్ పరంగా పూరి మార్క్ హీరోయిజంలో పర్ఫెక్ట్గా సెట్ అయిన ఇషాన్, మాస్ హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ను తొలి సినిమాలోనే చూపించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్స్‌గా ఏంజెలా గ్లామర్ షోకే పరిమితం కాగా.. మన్నారా చోప్రా తన పరిథి మేరకు పరవాలేదనిపించింది. సింగం 3, విన్నర్ సినిమాల్లో స్టైలిష్‌గా కనిపించిన అనూప్ రోగ్‌లో సైకోగా మెప్పించాడు. విలనిజంతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తులసి తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కొంత కాలంగా రొటీన్ ఫార్ములాతో బోర్ కొట్టిస్తున్న పూరి జగన్నాథ్, మరోసారి రోగ్ విషయంలోనూ అదే స్టైల్‌ను ఫాలో అయ్యాడు. రూడ్ హీరో క్యారెక్టర్, గ్లామర్ షోకే పరిమితమైన హీరోయిన్స్, బీచ్ సాంగ్స్, కామెడీ పండించే విలన్, అలీ కామెడీ ట్రాక్ ఇదే ఫార్ములాతో రోగ్ సినిమాను తెరకెక్కించాడు. అక్కడక్కడా పూరి కలం కాస్త మెరిసినా.. ఓవరాల్ పూరి స్టైల్, టేకింగ్ రొటీన్‌గా అనిపించింది. సునీల్ కశ్యప్ అందించిన పాటలు పరవాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా వచ్చింది. హీరో, విలన్ క్యారెక్టర్ లకు డిజైన్ చేసిన థీమ్స్ వాళ్ల క్యారెక్టర్స్‌ను మరింతగా ఎలివేట్ చేశాయి. ముఖేష్ సినిమాటోగ్రఫి, జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. తన్వి ఫిలింస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : విలన్ క్యారెక్టరైజేషన్, అనూప్ సింగ్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ రోగ్.. రొటీన్ పూరి సినిమా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
నాకది స్వీట్ షాక్!
‘‘పూరి జగన్నాథ్‌గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాతో హీరోగా పరిచయమవుతున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. పూరీగారి దర్శకత్వంలో నటించాలనేది నా డ్రీమ్. హీరోగా మొదటి సినిమాతోనే నా కల నిజమైంది. పూరీగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు’’ అన్నారు ఇషాన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ సీఆర్ మనోహర్, సీఆర్ గోపీ నిర్మించిన సినిమా ‘రోగ్’. శుక్రవారం ఈ సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఇషాన్ చెప్పిన సంగతులు.... ♦ చిన్నప్పట్నుంచీ హీరో కావాలనుకోలేదు. ఒక్కసారి మనసులో ఆలోచన రాగానే మా అన్నయ్య (నిర్మాత సీఆర్ మనోహర్)కు చెప్పా. ‘హీరో కావడానికి టాల్ అండ్ హ్యాండ్సమ్గా ఉంటే చాలదు. చాలా హార్డ్‌వర్క్ చేయాలి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్... అన్నిటిలో శిక్షణ తీసుకోవాలి’ అన్నారు. మా తన్వీ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో ఏడాదిన్నర పాటు రెండు కన్నడ సినిమాలకు పని చేయించారు. తర్వాత ‘వైజాగ్’ సత్యానంద్‌గారి దగ్గరకు యాక్టింగ్‌లో ట్రైనింగ్‌కి పంపించారు. ట్రైనింగ్ పూర్తవగానే అన్నయ్య ఫోన్ చేసి... ‘నువ్వు ఇంటికి రావొద్దు. హైదరాబాద్ వచ్చేయ్. పూరీగారితో మీటింగ్ ఏర్పాటు చేశా’ అన్నారు. నాకది షాక్ అండ్ సర్ప్రైజ్. ♦ పది నిమిషాల మీటింగ్ తర్వాత ‘అబ్బాయి ప్రామిసింగ్‌గా ఉన్నాడు. ఇతనితో కచ్చితంగా సినిమా చేస్తా’ అన్నారు పూరీగారు. నాకది స్వీట్ షాక్. వాళ్లబ్బాయి హీరోగా పరిచయమైతే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఈ సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాంకాక్ తీసుకువెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించారు. అంత పెద్ద సూపర్‌స్టార్ దర్శకుడు అయినా... షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు కథ, ప్రతి సీన్ నాకు వివరించారు. నీకు కథ నచ్చిందా? లేదా మరో కథతో ముందుకు వెళ్దామా? అనడిగారు. ♦ పూరీగారి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్లు నాకు ఇష్టం. ‘రోగ్’లో నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. నా క్యారెక్టర్‌తో పాటు విలన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్. చాలా ఎగ్జయిటింగ్‌గా, నెర్వస్‌గా ఉంది. -
రోగ్.. పక్కా పూరి ప్రాడక్ట్
-
రోగ్.. పక్కా పూరి ప్రాడక్ట్
వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి తన మార్క్ డిఫరెంట్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సీవీ ఇషాన్‌ను హీరోగా పరిచయం చూస్తూ పూరి తెరకెక్కిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరి రోగ్. ఇడియట్ సినిమాతో దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్న పూరి మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే ఇడియట్ సినిమా ట్యాగ్ లైన్‌ను రిపీట్ చేస్తూ రోగ్కు మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. పూరి గత చిత్రాల్లో హీరోల మాదిరి ఇషాన్ కూడా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. టేకింగ్ విషయంలో కూడా పూరి తన పాత స్టైల్‌నే ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది. బీచ్ సాంగ్స్, డిఫరెంట్ లోకేషన్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న రోగ్, పూరితో పాటు ఇషాన్‌కు కూడా బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
మరో చంటిగాడి ప్రేమకథ : రోగ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో డిఫరెంట్ లవ్ స్టోరి రోగ్. ఇడియట్ సినిమాతో హీరోయిజానికి అర్ధం మార్చేసిన పూరి, మరోసారి అదే తరహా ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందుకే రోగ్ సినిమాకు ఇది మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశాడు. చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా పూర్తి చేసిన పూరి, వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. టెంపర్ తరువాత వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి కెరీర్‌ను రోగ్ గాడిలో పెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రముఖ నిర్మాత సీఆర్ మనోహర్ వారసుడు ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌పై స్పందించిన రామ్‌గోపాల్ వర్మ 'సూపర్బ్ ఇడియట్ తరువాత గ్రేట్ లుకింగ్ రోగ్, నీకు అలాంటి వాళ్లే ఎందుకు నచ్చుతారు పూరి?' అంటూ ట్వీట్ చేశాడు. After the superb IDIOT now it's the great looking ROGUE..@purijagan why do u like only such people sir? pic.twitter.com/RSXgX1TYdg — Ram Gopal Varma (@RGVzoomin) 14 February 2017 -
పూరి రోగ్ రిలీజ్ అవుతోందట..!
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బైలింగ్యువల్ సినిమా రోగ్. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతున్న ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ సమయంలోనూ హీరోయిన్ల మార్పుతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది రోగ్. తాజాగా ఇజం షూటింగ్ చివరి దశకు రావటంతో మరోసారి రోగ్ సినిమా పేరు వార్తల్లోకి వచ్చింది. పూరి ఇజం రిలీజ్ తరువాత రోగ్ పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టనున్నాడట. ఇప్పటికే ఆలస్యం కావటంతో ఎలాగైన ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇషాన్ సరసన పూజా జవేరి, మన్నార చోప్రాలు హీరోయిన్లుగా నటించారు. -
రోగ్‌కి జోడీ దొరికింది
హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్న స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్. తన దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమా రిలీజ్ అయి వారం కూడా గడవక ముందే మరో సినిమాను సెట్స్ మీదకు తీసుకుకెళుతున్నాడు పూరి. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రోగ్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. తెలుగు, కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ బైలింగ్యువల్ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తిచేసిన పూరి త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. చాలా రోజులుగా ఈ సినిమాలో నటించే హీరోయిన్ విషయంలో భారీ చర్చ జరుగుతోంది. ఇషాన్ ఇంట్రడ్యూసింగ్ సినిమా కావటంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు చిత్రనిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే సౌత్‌లో ఫాంలో ఉన్న అమైరా దస్తర్ను హీరోయిన్గా ఫైనల్ చేశారు. అయితే ఆఖరి నిమిషంలో అమైరా డేట్స్ అడ్జస్ట్ కాకపోవటంతో మరో హీరోయిన్ను ఫైనల్ చేశారు. భం భోలేనాద్ సినిమాతో టాలీవుడ్‌కి పరిచయం అయిన పూజా జవేరిని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
ఒక్కో సినిమాకు 15 కోట్లు..?
సౌత్ ఇండస్ట్రీలో హీరోయిజాన్ని ఎలివేట్ చేయటంలో పూరి జగన్నాథ్‌ది సపరేట్ స్టైల్. ముఖ్యంగా మాస్ ఇమేజ్ కోరుకునే తారలు పూరితో సినిమా చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అంతేకాదు మాస్ హీరోగా నిలదొక్కుకోవాలనుకుంటున్న స్టార్ వారసులు కూడా పూరి డైరెక్షన్లో ఇంట్రడ్యూస్ అయితే పర్ఫెక్ట్ అని ఫీల్ అవుతుంటారు. అందుకే మెగా వారసుడు రామ్ చరణ్ కూడా పూరి దర్శకత్వంలో చిరుతగా వెండితెర అరంగేట్రం చేశాడు. ఈ ఇమేజే ఇప్పుడు ఈ క్రియేటివ్ డైరెక్టర్‌కు భారీ ఆఫర్ ను తీసుకువచ్చింది. ఇద్దరు హీరోలను వెండితెరకు పరిచయం చేసేందుకు భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నాడు పూరి. ఈ అప్‌కమింగ్ హీరోస్ భారీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న వారు కావటంతో పూరితో సినిమా చేయటానికి ఎంతైన ఖర్చుపెట్టడానికి ముందుకు వస్తున్నారు. మహాత్మ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన నిర్మాత సి ఆర్ మనోహర్ తన తనయుడు ఇషాన్‌ను వెండితెరకు పరిచయం చేసే బాధ్యతను పూరికి అప్పగించాడు. మాజీ ప్రధాని దేవేగౌడ మనుమడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడను కూడా పూరినే వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలు ఎనౌన్స్ కూడా అయ్యాయి. వీటిలో ఒక్కో సినిమాకు 15 కోట్ల మొత్తాన్ని పారితోషికంగా అందుకోబోతున్నాడట పూరి. ఇలాంటి విషయాలు అఫీషియల్‌గా బయటికి రాకపోయినా, పూరికి ఉన్న డిమాండ్‌కి ఆ మాత్రం ఇచ్చుకుంటారు అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. -
'రోగ్' ఎవరో తేల్చేశాడు
జెట్ స్పీడ్‌తో సినిమాలు పూర్తి చేసే స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అదే స్పీడు కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం వరణ్‌తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కిస్తున్న పూరి, ఆ సినిమా పూర్తి కాకముందే తన నెక్ట్స్ సినిమాను ప్రకటించేశాడు. చాలా రోజులుగా చిరంజీవి 150 సినిమా విషయంలో క్లారిటీ కోసం ఎదురుచూసిన పూరి ఆ సినిమా ఎంతకీ ఫైనల్ కాకపోవటంతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ మీద దృష్టిపెట్టాడు. చిరు సినిమాతో పాటు మహేష్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నట్టుగా గతంలోనే ప్రకటించాడు పూరి. అంతేకాదు ఈ సినిమాకు 'రోగ్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టుగా అప్పట్లో ప్రచారం జరిగింది. 'పోకిరి' సీక్వల్గా ఈ సినిమా తెరకెక్కనుందని అప్పట్లో భారీ చర్చ జరిగింది. అయితే ఈ గాసిప్స్ అన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ, తన నెక్ట్స్ సినిమాను స్వయంగా ప్రకటించాడు పూరి. ఇప్పటికే తన ట్విట్టర్ లో తన నెక్ట్స్ సినిమా టైటిల్ తో పాటు హీరోను కూడా ఎనౌన్స్చేశాడు. 'రోగ్' పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు పూరి జగన్నాథ్. తెలుగులో మహాత్మ లాంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని నిర్మించిన కన్నడ నిర్మాత, నటుడు సిఆర్ మనోహర్ తనయుడే ఈ ఇషాన్. గతంలో 'చిరుత' సినిమాతో రామ్‌చరణ్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేసిన పూరి చాలా కాలం తరువాత మరో స్టార్ వారసున్ని వెండితెరకు పరిచయం చేస్తున్నాడు. Launching a dashing new hero ISHAN In my next film #ROGUE shoot starts from Nov pic.twitter.com/8RA9TMq24S — PURI JAGAN (@purijagan) October 5, 2015