శ్రీదేవి కూతురి కోసం సాహసం..! | Ishan Jumps From Balcony for Jhanvi Kapoor | Sakshi
Sakshi News home page

Published Sun, Feb 11 2018 12:28 PM | Last Updated on Sun, Feb 11 2018 12:28 PM

Hero Ishan - Sakshi

బాల్కనీ నుంచి కిందకు దూకుతున్న ఇషాన్‌

దడక్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అవుతున్న అతిలోక సుందరి వారసురాలు జాన్వీ కపూర్‌ కోసం ఆ సినిమా హీరో ఇషాన్‌ కట్టర్‌ సాహసం చేశాడు. తన కోసం వెయిట్ చేస్తున్న జాన్వీ ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ఏకంగా బాల్కనీ నుంచి కిందకి దూకేశాడు. దడక్ షూటింగ్ సమయంలో ఇషాన్, జాన్వీల మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అందుకే తన కో స్టార్‌ ను షూటింగ్ కు తీసుకెళ్లేందుకు స్వయంగా జాన్వీ.. ఇషాన్‌ దగ్గరకు వెళ్లింది.

ఆ సమయంలో ఇషాన్‌ జిమ్‌ లో ఉండటంతో బయటకు రావటం కాస్త ఆలస్యం అయ్యింది. ఈలోగా కారులో జాన్వీ ఉన్న సంగతి అక్కడ ఉన్నవారికి తెలియంటంతో చుట్టూ జనాలు గుమిగూడారు. మీడియా కూడా వచ్చేయటంతో విషయం తెలుసుకున్న ఇషాన్ పెద్ద సాహసమే చేశాడు. ఏకంగా ఫస్ట్ ఫ్లోర్‌ బాల్కని నుంచి దూకేశాడు. ఈ లోగా జాన్వీ బాల్కని దగ్గరకు కారు తీసుకురావటంతో ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇషాన్ చేసిన రిస్క్‌ను కొంతమంది ప‍్రశంసిస్తుంటే మరికొదంరు మాత్రం ఏదైన ప్రమాదం జరిగి ఉంటే షూటింగ్ ఆగిపోయి ఉండేది, హీరోలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని అభిప్రాయ పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement