
ఒక స్టార్ హీరోగానీ, హీరోయిన్‌గానీ ఏదైనా కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు వారికి రక్షణగా పదిమంది బౌన్సర్లు ఉండటాన్ని మనం చూస్తుంటాం. ఒకప్పటి అతిలోక సుందరి అయిన శ్రీదేవి కుమార్తె కూడా ఈ కోవలో చేరారు. ఆమె పెద్ద కూతురు జాన్వీ సినీ రంగప్రవేశం గురించి రకరకాల ప్రచారం జరిగినా చివరకు హిందీ చిత్రం ద్వారా తెరంగేట్రానికి సిద్ధమైంది.
బాలీవుడ్‌లో స్టార్ హీరోలతో పలు హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు కరణ్‌జోహర్ జాన్వీని హీరోయిన్‌గా పరిచయం చేయనున్నారు. ఆయన మరాఠీలో మంచి విజయాన్ని సాధించిన సాయ్‌రద్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు. అందులో హీరోయిన్ బైక్ రైడింగ్ చేస్తుందట. దీంతో జాన్వీని బైక్ రైడింగ్ నేర్చుకోవలసిందిగా దర్శకుడు కోరడంతో ఆమెకు ఇద్దరు బౌన్సర్లను నియమించిన శ్రీదేవి బైక్ రైడింగ్‌లో శిక్షణ ఇప్పిస్తున్నారట.
శిక్షణ పూర్తి అయ్యే వరకూ ఆమెకు రక్షణగా ఉంటారట. అదే విధంగా జాన్వీ డాన్స్‌లోనూ శిక్షణ పొందుతోందని, త్వరలోనే ఆమె చిత్ర రంగ ప్రవేశానికి సన్నాహాలు జరుగుతున్నాయని సినీ రంగంలో చెప్పుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment