పూరి రోగ్ రిలీజ్ అవుతోందట..! | Puri Jagannadh Rogue Movie Gets Ready To Release | Sakshi
Sakshi News home page

పూరి రోగ్ రిలీజ్ అవుతోందట..!

Published Wed, Sep 14 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

పూరి రోగ్ రిలీజ్ అవుతోందట..!

పూరి రోగ్ రిలీజ్ అవుతోందట..!

కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా మారిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బైలింగ్యువల్ సినిమా రోగ్. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతున్న ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ సమయంలోనూ హీరోయిన్ల మార్పుతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది రోగ్.

తాజాగా ఇజం షూటింగ్ చివరి దశకు రావటంతో మరోసారి రోగ్ సినిమా పేరు వార్తల్లోకి వచ్చింది. పూరి ఇజం రిలీజ్ తరువాత రోగ్ పోస్ట్ ప్రొడక్షన్పై దృష్టి పెట్టనున్నాడట. ఇప్పటికే ఆలస్యం కావటంతో ఎలాగైన ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇషాన్ సరసన పూజా జవేరి, మన్నార చోప్రాలు హీరోయిన్లుగా నటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement