Rogue
-
పోకిరీల లెక్కతీయండి..
సాక్షి, హైదరాబాద్ : గ్రామాల్లో జులాయిగా తిరిగే పోకిరీల డేటా పోలీసుల వద్దకు చేరనుంది. అమ్మాయిలను వేధించే ఆకతాయిల జాబితా ఇకపై ప్రతీ పోలీస్‌స్టేషన్‌లో ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ‘దిశ’ఘటన దరిమిలా మహిళల భద్రత, రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా పోకిరీల డేటా సేకరించనున్నారు. పట్టణాలతో పా టు గ్రామాల్లో పనీపాటా లేకుండా తిరిగేవారిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. మహిళలపై వేధింపులకు సంబం ధించిన కేసుల్లో అధిక శాతం నిందితులు పనీపాటా లేనివారే కావడం గమనార్హం. ఎస్‌హెచ్‌జీలకు శిక్షణ... మహిళలపై లైంగిక వేధింపుల నివారణకు.. సమస్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం స్వయం సహాయక గ్రూపు(ఎస్‌హెచ్‌జీ)ల్లోని మహిళకు చట్టాలు, సైబర్ క్రైమ్, లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, పోలీసులను ఎలా సంప్రదించాలి.. తదితర సమస్యలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. వీరు పాఠశాలలు, కాలేజీల్లో మహిళా రక్షణపై విద్యార్థులను చైతన్యం చేయనున్నారు. వీరికి షీటీమ్స్, పోలీసు కళాబృందాలు తోడవనున్నాయి. విద్యాసంస్థలే కాదు, కార్యాలయాలు, గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లోనూ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పించనున్నారు. పాఠ్యాంశాల్లోనూ మార్పులు.. మహిళా భద్రత కోసం సమాజం ఆలోచ నల్లో మరింత మార్పు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. బాలికలపై వివక్షను రూపుమాపడం, లింగ సమా నత్వం సాధించడానికి స్కూలు పాఠ్యాంశాల్లో కొత్త అంశాలు చేర్చాలని నిర్ణయించారు. అమ్మాయిలను వేధిస్తే తలెత్తే పరిణామాలు, చట్టపరంగా ఎలాంటి శిక్షలు పడతాయో వివరించేలా పాఠ్యాంశాలు రూపొందించనున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఈ మేరకు మార్పులు చేయాలని భావిస్తోంది. -
రాక్ స్టార్‌గా మారనున్న ‘రోగ్’!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిన సినిమా రోగ్. ఈ సినిమాతో నిర్మాత సీఆర్ మనోహర్ వారసుడు ఇషాన్ హీరోగా పరిచయం అయిన సంగతి తెలిసిందే. పూరి మార్క్ యాక్షన్ లవ్ స్టోరిగా తెరకెక్కిన ఈ సినిమా ఇషాన్‌కు బ్రేక్ ఇవ్వలేదు. దీంతో మరో సినిమా చేసేందుకు లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు ఇషాన్. తాజాగా ఈ యంగ్ హీరో తన రెండో సినిమా పనులు ప్రారంభించినట్టుగా తెలుస్తోంది. తొలి సినిమాతో రిస్క్ చేసిన ఇషాన్ రెండో సినిమాను మ్యూజికల్ ఎంటర్టైనర్గా ప్లాన్ చేస్తున్నాడు. రెండో సినిమాతో రోగ్.. రాక్ స్టార్‌గా మారే ప్రయత్నాలు చేస్తున్నాడన్న టాక్ వినిపిస్తోంది. విజయదశమికి లాంచనంగా ప్రారంభం కానున్న ఈ సినిమాలో 12 పాటలు ఉంటాయట. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. అయితే ఈ సినిమాను కన్నడలోనే తెరకెక్కిస్తారా లేక ఒకేసారి తెలుగు, కన్నడలలో రూపొందిస్తారా అన్న విషయం తెలియాల్సి ఉంది. -
‘లాడెన్’ను చంపటానికి అనుమతించండి!
అస్సాం : అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ చనిపోయి దాదాపు ఏడు సంవత్సరాలు కావొస్తుంది.. అయినా చనిపోయిన లాడెన్‌ను చంపాలనుకోవడమేంటని అనుకుంటున్నారా? ఇక్కడ లాడెన్ అన్నది ఓ మగ ఏనుగు పేరు. దాని రూపం, ఎత్తు చూసి అసోంలోని గోల్పరా అటవీ ప్రాంత ప్రజలు దానికి ఆ పేరు పెట్టారు. అడవి చుట్టు పక్కల నివసిస్తున్న ప్రజలకు లాడెన్ కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2016 నుంచి ఇప్పటి వరకు దాదాపు 37 మందిని చంపినట్లు అటవీ అధికారులు అంచనా వేస్తున్నారు. మదపుటేనుగుగా మారిన లాడెన్‌ను చంపి దాని బారి నుంచి ప్రజల్ని రక్షించాలనుకుంటున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులను అనుమతి కోరారు. వివరాల్లోకి వెళితే.. అస్సాంలోని గోల్పరా అటవీ ప్రాంతంలోని గిరిజన ప్రజలపై లాడెన్ దాడి చేసి చంపుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 1న పట్‌పారా పహర్‌టోలి గ్రామానికి చెందిన మనోజ్ హజోంగ్ అనే వ్యక్తి ఇంటిపై అర్థరాత్రి దాడి చేసి అడ్డువచ్చిన అతన్ని తొక్కి చంపేసింది. అటవీ సంరక్షణాధికారులు మాట్లాడుతూ.. లాడెన్ గోల్పరా అడవుల్లో అడుగుపెట్టిన తర్వాత దాదాపు 37 మందిని చంపినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కువగా సాయంత్రం, రాత్రి సమయాల్లో దాడి చేస్తోందన్నారు. ఏనుగుల గుంపును చూసిన వెంటనే గిరిజనులు వాటిని తరమటానికి చేసే ప్రయత్నం వల్ల ఒక్కో సారి ఏనుగులు దాడికి తిరగబడే అవకాశం ఉందన్నారు. ఒంటరిగా ఉన్న ఏనుగులు చాలా ప్రమాదకరమని తెలిపారు. దాడి జరిగిన ప్రతిసారి 10-15 రోజులు ఆ ఏనుగు కనిపించకుండా పోతోందన్నారు. చాలా దాడులు నెలలోని చివరి రోజుల్లో జరిగాయన్నారు. లాడెన్‌ను మదపుటేనుగుగా గుర్తించి చంపటానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. 2006లో సోనిత్‌పుర్ జిల్లాలోని లాడెన్ అనే ఓ ఏనుగును మదపుటేనుగా గుర్తించి చంపటం జరిగిందన్నారు. గిరిజనులు రిజర్వ్ ఫారెస్ట్‌లోకి వెళ్లకుండా ఉండటం మంచిదని అధికారులు సూచించారు. -
హీరోగా పూరి విలన్..!
పూరి దర్శకత్వంలో తెరకెక్కిన రోగ్ సినిమాతో విలన్‌గా దక్షిణాది ప్రేక్షకులను పలకరించాడు థాకూర్ అనూప్ సింగ్. మిస్టర్ వరల్డ్‌గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న అనూప్, బాలీవుడ్లో తెరకెక్కిన మహాభారత్ సీరియల్లో ధృతరాష్ట్రుడిగా నటించాడు. సౌత్‌లో ముందుగా రోగ్ సినిమాలో నటించినా.. సింగం 3 సినిమా ముందు రిలీజ్ అయ్యింది. తరువాత విన్నర్, రోగ్ సినిమాల్లో ఆకట్టుకున్న థాకూర్ అనూప్ సింగ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. కన్నడ, తెలుగు భాషల్లో తెరకెక్కుతున్న సునీల్ కుమార్ దేశాయ్ తెరకెక్కిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ మూవీతో హీరోగా మారుతున్నాడు అనూప్. ఈ సినిమాలో కబాలి ఫేం ధన్సిక హీరోయిన్గా నటిస్తోంది. తన తొలిచిత్రం నుంచే ఓన్‌గా డబ్బింగ్ చెప్పుకుంటున్న అనూప్, కన్నడ వర్షన్‌కు కూడా స్వయంగా డబ్బింగ్ చెప్పేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు బ్యాడ్ బాయ్ పాత్రల్లోనే ఆకట్టుకున్న ఈ యువ నటుడు, హీరోగానూ మెప్పిస్తానంటున్నాడు. -
కొత్తవాళ్లతో కిక్ : పూరి
‘‘తెలుగు, కన్నడ భాషల్లో ‘రోగ్’ చిత్రానికి చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. మా టీమ్ అంతా ప్రేక్షకులతో కలసి సినిమా చూశాం. వారి రెస్పాన్స్ చూసి చాలా ఎంజాయ్ చేశాం’’ అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. ఇషాన్, మన్నార్ చోప్రా, ఏంజెలా హీరో హీరోయిన్లుగా పూరి దర్శకత్వంలో జయాదిత్య సమర్పణలో సీఆర్ మనోహర్, సీఆర్ గోపి నిర్మించిన ‘రోగ్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో చిత్రబృందం ‘థ్యాంక్స్ మీట్’ నిర్వహించారు. పూరి మాట్లాడుతూ– ‘‘ఇషాన్ వంటి మంచి హీరోని పరిచయం చేశారంటూ నాకు కొన్ని వందల మెసేజ్‌లు వస్తున్నాయి. ఈ సినిమాకి చాలా మంది కొత్తవాళ్లు పని చేశారు. ప్రతిభ ఉన్న కొత్తవాళ్లతో వర్క్ చేస్తే కిక్ లభిస్తుంది. ‘రోగ్’ని పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’’ అన్నారు. ఇషాన్ మాట్లాడుతూ– ‘‘నాపై నమ్మకంతో మనోహర్, గోపి అన్నయ్యలు యాక్టింగ్ కోర్సు నేర్పించారు. నా స్టిల్స్ చూసి పూరీగారు ధైర్యంగా నన్ను హీరోగా పరిచయం చేస్తూ, మంచి సినిమా తీశారు. ఈ సక్సెస్ క్రెడిట్ అంతా పూరీ సార్‌దే ’’ అన్నారు. ‘‘అంజలి వంటి మంచి పాత్ర ఇచ్చిన నా గాడ్‌ఫాదర్ పూరీగారికి థ్యాంక్స్’’ అని మన్నార్ చోప్రా అన్నారు. -
హృతిక్‌కు కోపం తెప్పించిన పూరి హీరోయిన్
రోగ్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన బ్యూటి ఏంజెలా క్రిస్లిజింకీ. సినిమాలో ఏంజెలాది చిన్న పాత్రే అయినా దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం ఏంజెలానే మెయిన్ హీరోయిన్ అన్న రేంజ్లో ప్రమోట్ చేశాడు. అంతేకాదు రోగ్ ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో ఏంజెలా జోరుగా పాల్గొంటుంది. అలా రోగ్ ప్రమోషన్లో భాగంగా ఈ బ్యూటి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్‌కు కోపం తెప్పించింది. ఓ నేషనల్ పేపర్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఏంజెలా, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తనకు మంచి స్నేహితుడని, తన తీసుకునే ప్రతి నిర్ణయం హృతిక్‌తో సంప్రదించాకే తీసుకుంటానని తెలిపింది. ఈ ఇంటర్య్వూపై స్పందించిన హృతిక్, పేపర్ కటింగ్‌ను తన ట్విట్టర్ పేజ్‌లో పోస్ట్ చేస్తూ, ' మై డియర్ లేడీ, నువ్వు ఎవరు..? ఎందుకు అబద్ధం చెపుతున్నావ్..?' అంటూ కామెంట్ చేశాడు. ఏంజెలా గతంలో హృతిక్‌తో కలిసి కొన్ని యాడ్స్‌లో నటించింది. అయితే అవేవి హృతిక్ గుర్తు పెట్టుకునే స్థాయి పాత్రలు కాదు. హృతిక్ కామెంట్‌పై స్పందించిన ఏంజెలా సారీ చెప్పింది. My dear lady, who are you and why are u lying. pic.twitter.com/xydPrKr8nH — Hrithik Roshan (@iHrithik) 4 April 2017 -
ఇక్కడ విలన్ అక్కడ హీరో
‘‘నేను సెటిలైంది ముంబైలో అయినప్ప టికీ హైదరాబాద్‌తో అనుబంధం ఉంది. మా పూర్వీకులు ఇక్కడే ఉండేవాళ్లు. నాకు తెలుగు పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది’’ అని అనూప్ సింగ్ ఠాకూర్ అన్నారు. శుక్రవారం విడుదలైన ‘రోగ్’లో ఆయన విలన్‌గా నటించారు. అంతకుముందు ‘విన్నర్’, ‘సింగమ్–3’ చిత్రాల్లో నటించిన అనూప్ బుల్లితెర నుంచి వెండితెరకు వచ్చారు. కెరీర్ గురించి అనూప్ సింగ్ పత్రికలవారితో మాట్లాడుతూ – ‘‘బుల్లితెర నటుడిగా ‘మహాభారతం’ గుర్తింపు తెచ్చింది. ‘టెంపర్’ షూటింగ్ చూసినప్పుడు పూరీగారంటే అభిమానం ఏర్పడింది. ఆయన సినిమాల్లో చేయాలనుకున్నా. ‘రోగ్’కి ఛాన్స్ వచ్చినప్పుడు మిస్టర్ వరల్డ్ గెల్చుకున్నప్పుడు కన్నా రెట్టింపు ఆనందం కలిగింది. ప్రస్తుతం రెండు తెలుగు సినిమాలు చేస్తున్నాను. మరాఠీలో రెండు సినిమాల్లో హీరోగా యాక్ట్ చేస్తున్నా. హిందీ సినిమాలు చేస్తున్నాను’’ అన్నారు. -
'రోగ్' మూవీ రివ్యూ
టైటిల్ : రోగ్ జానర్ : రొమాంటిక్ యాక్షన్ డ్రామా తారాగణం : ఇషాన్, మన్నారా చోప్రా, ఏంజెలా, అనూప్ సింగ్ థాకూర్,సుబ్బరాజు సంగీతం : సునీల్ కశ్యప్ దర్శకత్వం : పూరి జగన్నాథ్ నిర్మాత : సి.ఆర్.మనోహర్, సి.ఆర్.గోపి చాలా కాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఓ బిగ్ సక్సెస్ కోసం రోగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి ఆ అంచనాలను రోగ్ అందుకుందా..? కొత్తబ్బాయి ఇషాన్, పూరి మార్క్ హీరోయిజంలో ఎంత వరకు ఫిట్ అయ్యాడు..? రోగ్.. పూరి కెరీర్‌ను గాడిలో పెట్టిందా..? కథ : చంటి (ఇషాన్) ప్రేమ కోసం ప్రాణం ఇచ్చేంత గొప్ప ప్రేమికుడు. కమిషనర్ చెల్లెలు అని తెలిసి కూడా అంజలి(ఏంజెలా)ని ప్రాణంగా ప్రేమిస్తాడు. కానీ కమిషనర్ తన అండర్లో పనిచేసే ఐపియస్ ఆఫీసర్(సుబ్బరాజు)తో అంజలికి నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తాడు. విషయం తెలుసుకున్న చంటి కమిషనర్ ఇంటికెళ్లి గొడవ చేస్తాడు. ఆ గొడవలో ఓ కానిస్టేబుల్‌ను బలంగా కొట్టడంతో అతని రెండు కాళ్లు చచ్చుబడిపోతాయి. ఈ గొడవ చేసినందుకు చంటికి రెండేళ్ల శిక్షపడుతుంది. జైల్లో ఉండగానే తను ప్రేమించిన అంజలి తనని మోసం చేసి సుబ్బరాజును పెళ్లి చేసుకుందని తెలుసుకున్న చంటి, అమ్మాయిల మీద ద్వేషం పెంచుకుంటాడు. జైలు నుంచి విడుదలైన తరువాత తండ్రి ద్వారా తన చేతుల్లో గాయపడ్డ కానిస్టేబుల్ కుటుంబం కష్టాల్లో ఉందని తెలుసుకుంటాడు చంటి. తన వల్ల నష్టపోయిన వాళ్ల జీవితాలకు ఏదైన దారి చూపించి తాను బ్యాంకాక్ వెళ్లిపోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం రికవరీ ఏజెంట్‌గా, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తుంటాడు. అయితే చంటి నుంచి సాయం పొందడానికి కానిస్టేబుల్ కుటుంబం అంగీకరించదు. వాళ్లకు ఇష్టం లేకపోయినా వాళ్ల ఇంటి ముందే ఉండి వాళ్ల అప్పులన్ని తీర్చేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కానిస్టేబుల్ చెల్లెలు అంజలి(మన్నారా చోప్రా) అతన్ని ప్రేమిస్తుంది. కానీ తనను మోసం చేసిన అమ్మాయి పేరు కూడా అంజలినే కావటంతో చంటి ముందు కాదన్నా.. తరువాత అంజలికి దగ్గరవుతాడు. అదే సమయంలో జైలు నుంచి పారిపోయిన ఓ సైకో(అనూప్ థాకూర్ సింగ్), చంటి ఆటో ఎక్కుతాడు. తానను ఓ అమ్మాయి మోసం చేసి జైలుకు పంపిందని చెప్పడంతో చంటి కూడా వాణ్ని పోలీసులకు పట్టించకుండా వదిలేస్తాడు. కానీ ఆ సైకో అంజలి చంపాడినికి ఆమె మీద ఎటాక్ చేస్తాడు. ఈ ఎటాక్ నుంచి తనని కాపాడిన చంటికి, అంజలి మీద పగతోనే సైకో జైలు నుంచి తప్పించుకున్నాడని తెలుస్తుంది. అసలు ఆ సైకో అంజలిని ఎందుకు చంపాలనుకుంటున్నాడు..? వాడి నుంచి చంటి, అంజలిని ఎలా కాపాడాడు అన్నదే మిగతా కథ. నటీనటులు : రోగ్ సినిమాతో హీరోగా పరిచయం అయిన ఇషాన్, మంచి నటన కనబరిచాడు. లుక్స్ పరంగా పూరి మార్క్ హీరోయిజంలో పర్ఫెక్ట్గా సెట్ అయిన ఇషాన్, మాస్ హీరోకు కావాల్సిన అన్ని క్వాలిటీస్ ను తొలి సినిమాలోనే చూపించే ప్రయత్నం చేశాడు. హీరోయిన్స్‌గా ఏంజెలా గ్లామర్ షోకే పరిమితం కాగా.. మన్నారా చోప్రా తన పరిథి మేరకు పరవాలేదనిపించింది. సింగం 3, విన్నర్ సినిమాల్లో స్టైలిష్‌గా కనిపించిన అనూప్ రోగ్‌లో సైకోగా మెప్పించాడు. విలనిజంతో పాటు కామెడీతోనూ ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో అలీ, పోసాని కృష్ణమురళి, సుబ్బరాజు, తులసి తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు. సాంకేతిక నిపుణులు : కొంత కాలంగా రొటీన్ ఫార్ములాతో బోర్ కొట్టిస్తున్న పూరి జగన్నాథ్, మరోసారి రోగ్ విషయంలోనూ అదే స్టైల్‌ను ఫాలో అయ్యాడు. రూడ్ హీరో క్యారెక్టర్, గ్లామర్ షోకే పరిమితమైన హీరోయిన్స్, బీచ్ సాంగ్స్, కామెడీ పండించే విలన్, అలీ కామెడీ ట్రాక్ ఇదే ఫార్ములాతో రోగ్ సినిమాను తెరకెక్కించాడు. అక్కడక్కడా పూరి కలం కాస్త మెరిసినా.. ఓవరాల్ పూరి స్టైల్, టేకింగ్ రొటీన్‌గా అనిపించింది. సునీల్ కశ్యప్ అందించిన పాటలు పరవాలేదనిపించినా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగా వచ్చింది. హీరో, విలన్ క్యారెక్టర్ లకు డిజైన్ చేసిన థీమ్స్ వాళ్ల క్యారెక్టర్స్‌ను మరింతగా ఎలివేట్ చేశాయి. ముఖేష్ సినిమాటోగ్రఫి, జునైద్ సిద్ధిఖీ ఎడిటింగ్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది. తన్వి ఫిలింస్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ : విలన్ క్యారెక్టరైజేషన్, అనూప్ సింగ్ నటన నేపథ్య సంగీతం మైనస్ పాయింట్స్ : రొటీన్ టేకింగ్ రోగ్.. రొటీన్ పూరి సినిమా - సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్ -
పూరి కొత్త సినిమా 'హే భగవాన్'..!
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను లైన్లో పెట్టేస్తాడు. ఇటీవల వరుస ఫ్లాప్‌లతో కెరీర్ ఇబ్బందుల్లో పడ్డా, పూరిలో స్పీడు మాత్రం తగ్గలేదు. ఇప్పటికే రోగ్ సినిమాను రిలీజ్‌కు రెడీ చేసిన పూరి.. బాలకృష్ణ హీరోగా మరో సినిమా షూటింగ్ ప్రారంభించాడు. ఇప్పటికే బాలయ్యతో చేస్తున్న సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసిన పూరి, ప్రస్తుతం రోగ్ సినిమా ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాడు. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న రోగ్, ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన పూరి, తన తదుపరి ప్రాజెక్ట్ విశేషాలను వెల్లడించాడు. బాలయ్య సినిమా తరువాత హే భగవాన్ అనే చిత్రాన్ని తెరకెక్కించనున్నట్టుగా తెలిపాడు పూరి. దేవుళ్ల కారణంగా ఈ ప్రపంచానికి ఎలాంటి కష్టాలు వస్తున్నాయో ఆ సినిమాలో చూపిస్తానంటున్నాడు. ఇప్పటికే ఇలాంటి వివాదాస్పద అంశాలను ఎంచుకొని చాలా మంది దర్శకులు ఇబ్బంది పడ్డారు. మరి పూరి ఈ సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను ఎలా డీల్ చేస్తాడో చూడాలి. -
నాకది స్వీట్ షాక్!
‘‘పూరి జగన్నాథ్‌గారికి నేను పెద్ద ఫ్యాన్. ఆయన సినిమాతో హీరోగా పరిచయమవుతున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. పూరీగారి దర్శకత్వంలో నటించాలనేది నా డ్రీమ్. హీరోగా మొదటి సినిమాతోనే నా కల నిజమైంది. పూరీగారికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు’’ అన్నారు ఇషాన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ సీఆర్ మనోహర్, సీఆర్ గోపీ నిర్మించిన సినిమా ‘రోగ్’. శుక్రవారం ఈ సినిమా రిలీజవుతోంది. ఈ సందర్భంగా ఇషాన్ చెప్పిన సంగతులు.... ♦ చిన్నప్పట్నుంచీ హీరో కావాలనుకోలేదు. ఒక్కసారి మనసులో ఆలోచన రాగానే మా అన్నయ్య (నిర్మాత సీఆర్ మనోహర్)కు చెప్పా. ‘హీరో కావడానికి టాల్ అండ్ హ్యాండ్సమ్గా ఉంటే చాలదు. చాలా హార్డ్‌వర్క్ చేయాలి. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్... అన్నిటిలో శిక్షణ తీసుకోవాలి’ అన్నారు. మా తన్వీ ఫిల్మ్స్ ప్రొడక్షన్లో ఏడాదిన్నర పాటు రెండు కన్నడ సినిమాలకు పని చేయించారు. తర్వాత ‘వైజాగ్’ సత్యానంద్‌గారి దగ్గరకు యాక్టింగ్‌లో ట్రైనింగ్‌కి పంపించారు. ట్రైనింగ్ పూర్తవగానే అన్నయ్య ఫోన్ చేసి... ‘నువ్వు ఇంటికి రావొద్దు. హైదరాబాద్ వచ్చేయ్. పూరీగారితో మీటింగ్ ఏర్పాటు చేశా’ అన్నారు. నాకది షాక్ అండ్ సర్ప్రైజ్. ♦ పది నిమిషాల మీటింగ్ తర్వాత ‘అబ్బాయి ప్రామిసింగ్‌గా ఉన్నాడు. ఇతనితో కచ్చితంగా సినిమా చేస్తా’ అన్నారు పూరీగారు. నాకది స్వీట్ షాక్. వాళ్లబ్బాయి హీరోగా పరిచయమైతే ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటారో ఈ సినిమాకి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. బ్యాంకాక్ తీసుకువెళ్లి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ ఇప్పించారు. అంత పెద్ద సూపర్‌స్టార్ దర్శకుడు అయినా... షూటింగ్ ప్రారంభం కావడానికి ముందు కథ, ప్రతి సీన్ నాకు వివరించారు. నీకు కథ నచ్చిందా? లేదా మరో కథతో ముందుకు వెళ్దామా? అనడిగారు. ♦ పూరీగారి సినిమాల్లో హీరో క్యారెక్టరైజేషన్లు నాకు ఇష్టం. ‘రోగ్’లో నా క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. నా క్యారెక్టర్‌తో పాటు విలన్ క్యారెక్టర్ కూడా బాగుంటుంది. మరో రెండు రోజుల్లో సినిమా రిలీజ్. చాలా ఎగ్జయిటింగ్‌గా, నెర్వస్‌గా ఉంది. -
పవన్ హిట్ కొట్టినా.. భయం లేదా..!
సాధారణంగా స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే కనీసం రెండు వారాల పాటు, కాస్త హైప్ ఉన్న సినిమాలను రిలీజ్ చేయడానికి సాహసించరు. అదే, ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే మూడు వారాల పాటు మరో సినిమాకు ఛాన్స్ ఉండదు. కానీ కాటమరాయుడు విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన కాటమరాయుడు పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతున్నాడు. అయినా సరే వచ్చే వారం మూడు, నాలుగు సినిమాలు రిలీజ్‌కు ప్లాన్ చేసుకుంటున్నాయి. వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు సినిమాను ముందుగా ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కాటమరాయుడు రిలీజ్ తరువాత సినిమాను ప్రీపోన్ చేస్తూ మార్చి 31నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పూరి దర్శకత్వంలో ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. నయనతార లీడ్ రోల్లో నటించిన డోరతో పాటు చిన్న సినిమాలు కారులో షికారుకెల్తే, ఎంతవరకు ఈ ప్రేమ కూడా 31నే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి.పవన్ సినిమా కాటమరాయుడు మంచి టాక్‌తో దూసుకుపోతున్నా వారం గ్యాప్‌లో ఇన్ని సినిమాలు రిలీజ్ రెడీ అవ్వటం ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. -
సౌతిండియాలో మణిరత్నం తర్వాత పూరీనే!
– వీవీ వినాయక్ ‘‘పాతిక సినిమాలు తీస్తే... అన్నిటికీ కథ, మాటలు సొంతంగా రాసుకున్న దర్శకులు సౌతిండియాలో ఇద్దరే ఇద్దరున్నారు. ఒకరు.. మణిరత్నం. ఆయన తర్వాత సౌతిండియాలో జగ్గూభాయ్ (పూరి జగన్నాథ్) ఒక్కడే. ‘టెంపర్’ తప్ప జగ్గూభాయ్ తీసిన ప్రతి సినిమా కథ, మాటలు ఆయనవే. నిజమైన దర్శకుడతను’’ అన్నారు దర్శకుడు వీవీ వినాయక్. ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సీఆర్ మనోహర్, సీఆర్ గోపీ నిర్మించిన సినిమా ‘రోగ్’. సునీల్ కశ్యప్ స్వరాలందించిన ‘రోగ్’ ఆడియో సోమవారం విడుదలైంది. హిందీ నటుడు అర్భాజ్‌ఖాన్ ఆడియో సీడీలను ఆవిష్కరించి, వీవీ వినాయక్‌కు అందజేశారు. అనంతరం వినాయక్ మాట్లాడుతూ ‘‘తమ్ముణ్ణి హీరోగా లాంచ్ చేయాలని పూరి కోసం సీఆర్ మనోహర్‌గారు రెండేళ్లు ఎదురు చూశారు. ఆయన ఎందుకు వెయిట్ చూశారో.. ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. జగ్గూభాయ్ వయసులో వెనక్కి వెళ్లుంటాడు. ఎవరో కొత్త కుర్రాడు సినిమా తీసినట్టుంది. ఇషాన్ పెద్ద హీరో కావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. పూరి జగన్నాథ్ మాట్లాడుతూ ‘‘నేను ‘బద్రి’ డైరెక్ట్ చేస్తున్నప్పుడు నిర్మాత త్రివిక్రమ్‌రావుగారికి ఎలా చేస్తానోననే టెన్షన్ ఉండేది. ఫస్ట్‌డే ప్యాకప్ చెప్పిన తర్వాత ‘50 సినిమాలు తీస్తావ్’ అన్నారు. ఆల్రెడీ 33 తీశా. అప్పుడాయన ఎంత నమ్మకంతో చెప్పారో... నేనూ అంతే నమ్మకంతో చెబుతున్నా. ఇషాన్ 50 సినిమాలు చేస్తాడు. సునీల్ కశ్యప్ మంచి మెలోడీలు ఇచ్చాడు’’ అన్నారు. సీఆర్ మనోహర్ మాట్లాడుతూ ‘‘పూరిగారి చేతుల్లో పడడం ఇషాన్ అదృష్టం. ఇషాన్ మా బాబాయ్ కుమారుడు. ‘మా అన్నయ్య డబ్బులు పెడుతున్నాడు, హీరోగా ఏదో ఒకటి చేసేద్దాం’ అని రాలేదు. చాలా కష్టపడ్డాడు’’ అన్నారు. ఇషాన్ మాట్లాడుతూ ‘‘ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో... నాకు ఇంత మంచి అన్నయ్యలు, ఫ్యామిలీ దొరికింది. అందరూ నేను సూపర్‌స్టార్ అవుతానంటున్నారు. తప్పకుండా ఏదొక రోజు సూపర్‌స్టార్ అయ్యి, మా ఫ్యామిలీ పేరు నిలబెడతా’’ అన్నారు. ‘‘హీరోలను ఇంట్రడ్యూస్ చేయాలంటే రాఘవేంద్రరావుగారి తర్వాత పూరిగారే. తమిళంలో ఈ సినిమాను నేనే రిలీజ్ చేస్తున్నా’’ అన్నారు ఏఎం రత్నం. ఈ వేడుకలో సన్నీ లియోన్ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిర్మాతలు ‘భవ్య’ ఆనంద్‌ప్రసాద్, పీవీపీ, దర్శకుడు క్రిష్, హీరో రామ్‌శంకర్, ఆకాశ్ పూరి తదితరులు పాల్గొన్నారు. -
రోగ్ ఆడియో రిలీజ్‌కు టాప్ స్టార్స్
వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో ఉన్న డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న లేటెస్ట్ మూవీ రోగ్. ఈ సారి ఎలాగైన హిట్ కొట్టాలన్న కసితో ఈ సినిమాను తెరకెక్కించాడు పూరి. తన కెరీర్‌ను మలుపు తిప్పిన ఇడియట్ లాంటి హిట్ అవుతుందన్న నమ్మకంతో ఈ సినిమాకు మరో చండిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్‌ను జోడించాడు. తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన టైలర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో ఇప్పుడు ఆడియో రిలీజ్‌ను మరింత గ్రాండ్‌గా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు. ఇషాన్ ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు కావటంతో లాంచింగ్ భారీగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఆడియో వేడుకకు పలువురు టాప్ స్టార్స్‌ను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే కన్నడ టాప్ హీరోలు శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, సుదీప్‌లు ఈ ఆడియో ఈవెంట్‌కు హాజరయ్యేందుకు అంగీకరించారు. వీరితో పాటు టాలీవుడ్ హీరోలను కూడా ఆహ్వానించేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. ఇషాన్ సరసన మన్నార చోప్రా, ఏంజెలా క్రిస్లిన్జ్కిలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు. విన్నర్, సింగం 3 సినిమాల్లో విలన్‌గా నటించిన థాకూర్ అనూప్ సింగ్ ప్రతినాయక పాత్రలో కనిపిస్తున్నాడు. చాలా రోజుల క్రితమే రిలీజ్ కావాల్సిన ఈ సినిమా, హీరోయిన్లు మార్పు తో పాటు ఇతర కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. భారీ గా ప్లాన్ చేసిన ఈ ఆడియో ఈవెంట్ ఈ నెల 9న బెంగళూరు ప్యాలెస్‌లో జరగనుంది. -
సౌత్ ఇండియా సూపర్‌స్టార్ అవుతాడు
– పూరి జగన్నాథ్ ‘‘నేను చాలా రోజుల తర్వాత తెరకెక్కించిన ప్రేమకథ ఇది. ఇషాన్ లో హీరో లక్షణాలు బాగా ఉన్నాయి. సౌత్ ఇండియాకు శ్రీదేవిని పరిచయం చేసిన రాఘవేంద్రరావుగారు ఎంత హ్యాపీగా ఫీలవుతున్నారో, ఈరోజు నేనూ అంతే సంతోషంగా ఫీలవుతున్నా. హండ్రెడ్ పర్సెంట్ ఇషాన్ సౌత్ ఇండియా సూపర్‌స్టార్ అవుతాడు’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ అన్నారు. ఇషాన్ , మన్నార్ చోప్రా, ఏంజెలా హీరో, హీరోయిన్ప్ గా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్ పతాకంపై డా. సీఆర్ మనోహర్, సీఆర్ గోపి నిర్మించిన లవ్ ఎంటర్టైనర్ ‘రోగ్’. మరో చంటిగాడి ప్రేమకథ అన్నది ఉపశీర్షిక. ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సీఆర్ మనోహర్ మాట్లాడుతూ– ‘‘ఇషాన్ ఫొటో పూరీగారికి చూపించడంతో, కుర్రాడు బాగున్నాడని, అదే రోజు మనం సినిమా చేస్తున్నామని, కథ వినడానికి రమ్మని అన్నారు. ఎంతో మంది స్టార్ హీరోలను ఇంట్రడ్యూస్ చేసిన పూరి కొత్త కుర్రాడు ఇషాన్ తో సినిమా చేస్తాననగానే హ్యాపీ ఫీలయ్యా’’ అన్నారు. ‘‘సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్ నేర్చుకుని ఇండస్ట్రీకి రాకుండా ఉండి ఉంటే పూరీగారి వంటి మంచి వ్యక్తితో పని చేసే అవకాశం కోల్పోయి ఉండేవాణ్ణి’’ అన్నారు ఇషాన్. నటుడు ఆలీ, హీరోయిన్లు మన్నార్ చోప్రా, ఏంజెలా, రచయిత భాస్కరభట్ల రవికుమార్, సంగీతదర్శకుడు సునీల్ కశ్యప్ పాల్గొన్నారు. -
'రోగ్' మూవీ స్టిల్స్
-
రోగ్.. పక్కా పూరి ప్రాడక్ట్
-
రోగ్.. పక్కా పూరి ప్రాడక్ట్
వరుస ఫ్లాప్ లతో డీలా పడిపోయిన డైనమిక్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ మరోసారి తన మార్క్ డిఫరెంట్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. సీవీ ఇషాన్‌ను హీరోగా పరిచయం చూస్తూ పూరి తెరకెక్కిస్తున్న డిఫరెంట్ లవ్ స్టోరి రోగ్. ఇడియట్ సినిమాతో దర్శకుడిగా స్టార్ స్టేటస్ అందుకున్న పూరి మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే ఇడియట్ సినిమా ట్యాగ్ లైన్‌ను రిపీట్ చేస్తూ రోగ్కు మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్ యాడ్ చేశారు. పూరి గత చిత్రాల్లో హీరోల మాదిరి ఇషాన్ కూడా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. టేకింగ్ విషయంలో కూడా పూరి తన పాత స్టైల్‌నే ఫాలో అయినట్టుగా కనిపిస్తోంది. బీచ్ సాంగ్స్, డిఫరెంట్ లోకేషన్స్‌తో టీజర్ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న రోగ్, పూరితో పాటు ఇషాన్‌కు కూడా బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తెలుగు కన్నడ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాను సమ్మర్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సైలెంట్‌గా కానిచ్చేశారు!
ఫొటో చూశారా.. అంత పెద్ద డైరెక్టర్ అయ్యుండి కింద కూర్చుని, అమ్మాయి కాళ్ల వైపు ఎలా చూస్తున్నాడో చూడండి. ఏంటిది రోగ్‌లా అనుకుంటున్నారా? మరి సార్ తీస్తున్నది ‘రోగ్’ సినిమా కదా. అందుకే ఇలా నాటీగా బిహేవ్ చేస్తున్నారు దర్శకుడు పూరి జగన్నాథ్. అప్పుడు ‘ఇడియట్’ అన్నా, నిన్న ‘లోఫర్’ అన్నా, ఈరోజు ‘రోగ్’ అన్నా పూరీకే చెల్లుబాటయింది. నెగటివ్ టైటిల్ పెట్టినప్పటికీ జనాలను పాజిటివ్‌గా థియేటర్‌కి రప్పించేస్తారు పూరి. ఇక, ఈ ‘రోగ్’ గురించి చెప్పాలంటే.. సైలెంట్‌గా సిన్మా కానిచ్చేశారు. అన్నట్లు.. మన పూరి చూపించిన చంటిగాడు గుర్తున్నాడా? అదేనండీ ‘ఇడియట్’లో రవితేజ. ఇప్పుడు చంటి గురించి ఎందుకు చెబుతున్నాం అనుకుంటున్నారా? మరేం లేదు.. ఈ ‘రోగ్’ టైటిల్‌కి ‘మరో చంటిగాడి ప్రేమకథ’ అని ట్యాగ్‌లైన్ పెట్టారు. కొత్త అబ్బాయి ఇషాన్‌ని హీరోగా పరిచయం చేస్తూ, పూరి తీసిన ఈ సినిమాలో మన్నార్ చోప్రా, ఏంజెల్ హీరోయిన్లుగా నటించారు. త్వరలోనే తెలుగు, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. సీఆర్ మనోహర్, సీఆర్ గోపి ఈ చిత్రాన్ని నిర్మించారు. -
పూరి జగన్నాథ్ 'రోగ్'
-
మరో చంటిగాడి ప్రేమకథ : రోగ్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో డిఫరెంట్ లవ్ స్టోరి రోగ్. ఇడియట్ సినిమాతో హీరోయిజానికి అర్ధం మార్చేసిన పూరి, మరోసారి అదే తరహా ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అందుకే రోగ్ సినిమాకు ఇది మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్ లైన్‌ను యాడ్ చేశాడు. చాలా కాలం క్రితమే ప్రారంభమైన ఈ సినిమా వివిధ కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా పూర్తి చేసిన పూరి, వీలైనంత త్వరగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. టెంపర్ తరువాత వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందుల్లో పడ్డ పూరి కెరీర్‌ను రోగ్ గాడిలో పెడుతుందన్న నమ్మకంతో ఉన్నారు. ప్రముఖ నిర్మాత సీఆర్ మనోహర్ వారసుడు ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వాలెంటైన్స్ డే కానుకగా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌పై స్పందించిన రామ్‌గోపాల్ వర్మ 'సూపర్బ్ ఇడియట్ తరువాత గ్రేట్ లుకింగ్ రోగ్, నీకు అలాంటి వాళ్లే ఎందుకు నచ్చుతారు పూరి?' అంటూ ట్వీట్ చేశాడు. After the superb IDIOT now it's the great looking ROGUE..@purijagan why do u like only such people sir? pic.twitter.com/RSXgX1TYdg — Ram Gopal Varma (@RGVzoomin) 14 February 2017 -
మరో సౌత్ రీమేక్‌పై కన్నేసిన సల్మాన్
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సౌత్ సినిమాల మీద ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతున్నాడు. వరుస ఫ్లాప్ లతో తన కెరీర్ కష్టాల్లో ఉన్న సమయంలో సల్మాన్ కెరీర్ ను గాడిలో పెట్టింది సౌత్ రీమేక్ లే. వాంటెడ్, రెడీ, కిక్ లాంటి రీమేక్ సినిమాలతో బాలీవుడ్ బాక్సాఫీస్ షేక్ చేసిన సల్మాన్, తరువాత కూడా తన సినిమాలో ఏదో ఒక రకంగా సౌత్ ఫ్లేవర్ కంటిన్యూ అయ్యేలా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు మరోసారి ఓ సౌత్ సినిమాను రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నాడు సల్మాన్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రోగ్ సినిమాను హిందీలో రీమేక్ చేసేందుకు సల్మాన్ ప్లాన్ చేస్తున్నాడట. ప్రముఖ నిర్మాత తనయుడు ఇషాన్ హీరోగా పరిచయం అవుతున్న రోగ్ త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. అయితే ఈ రీమేక్ లో సల్మాన్ నటించలేదు. కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తాడు. తాను పరిచయం చేసిన సూరజ్ పంచోలి హీరోగా రోగ్ ను బాలీవుడ్ లో రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నాడు సల్మాన్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన వెలువడనుంది. -
‘మూడు కోతులు...ఓ మేక’తో పూరి?
దర్శకుడు పూరీ జగన్నాథ్ తన సినిమాల టైటిల్స్ విషయంలో ఎప్పటికప్పుడు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఆయన చిత్రాల పేర్లు చూస్తే చాలు... ఆ విషయం మనకు అర్థం అవుతుంది. ‘ఇడియట్’, ‘దేశముదురు’, ‘పోకిరి’, ‘లోఫర్’ – ఇలాంటి టైటిల్సే ఇందుకు నిదర్శనం. తాజాగా ఆయన ‘మూడు కోతులు.. ఒక మేక’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను ఫిల్మ్‌ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించారని సమాచారం. నిజానికి, ఇటీవల విడుదలైన ‘ఇజం’ తర్వాత తెలుగులో ఆయన ఏ కొత్త చిత్రాన్నీ ప్రకటించలేదు. ప్రస్తుతం ఆయన కన్నడంలో తెరకెక్కించిన ‘రోగ్’ సినిమా విడుదల పనుల్లో ఉన్నారని తెలుస్తోంది. ఆ పనులన్నీ కాగానే, సొంత నిర్మాణ సంస్థ అయిన వైష్ణో అకాడమీ పతాకంపై ‘మూడు కోతులు.. ఒక మేక’ పేరుతో ఆయన చిత్రం తెరకెక్కించనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. ప్రస్తుతం పూరి స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసే పనిలో ఉన్నారట! -
పూరి 'మూడు కోతులు.. ఒక మేక'
పూరి జగన్నాథ్... టాలీవుడ్ సినిమా మేకింగ్‌కు స్పీడు నేర్పిన దర్శకుడు. కొత్త హీరోతో సినిమా అయినా.. స్టార్ హీరోతో సినిమా అయినా.. పూరి స్పీడు మాత్రం తగ్గదు. మూడు నెలల్లోనే సినిమాను పూర్తి చేయడం పూరి స్టైల్. సినిమా మేకింగ్ లోనే కాదు, సినిమా టైటిల్ ఎంపికలో కూడా పూర్తి కొత్తదనం చూపిస్తుంటాడు. స్టార్ హీరోల సినిమాలకు పోకిరి, దేశముదురు లాంటి టైటిల్స్ పెట్టాలన్న, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం లాంటి పొయటిక్ టైటిల్స్‌తో ఆకట్టుకోవాలన్నా పూరికే చెల్లింది. ఇటీవల తన స్థాయికి తగ్గ హిట్స్ అందించటంలో విఫలమవుతున్న పూరి జగన్నాథ్, ఓ బిగ్ హిట్‌తో తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. అందుకే యంగ్ హీరోలతో సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కించిన రోగ్ సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న పూరి, ఆ తరువాత చేయబోయే సినిమాకు ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాడు. అంతేకాదు ఈ సినిమాకు మరోసారి తన మార్క్ కనిపించేలా డిఫరెంట్ టైటిల్‌ను పిక్స్ చేశాడు. ముగ్గురు హీరోలతో రూపొందించనున్న ఈ సినిమా కోసం మూడు కోతులు ఒక మేక అనే టైటిల్‌ను రిజిస్టర్ చేయించాడు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించనున్నారు. -
పూరి రోగ్ రిలీజ్ అవుతోందట..!
కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన బైలింగ్యువల్ సినిమా రోగ్. ప్రముఖ నిర్మాత సిఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలా కాలం అవుతున్న ఇంత వరకు విడుదలకు నోచుకోలేదు. షూటింగ్ సమయంలోనూ హీరోయిన్ల మార్పుతో చాలా సార్లు వార్తల్లో నిలిచింది రోగ్. తాజాగా ఇజం షూటింగ్ చివరి దశకు రావటంతో మరోసారి రోగ్ సినిమా పేరు వార్తల్లోకి వచ్చింది. పూరి ఇజం రిలీజ్ తరువాత రోగ్ పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి పెట్టనున్నాడట. ఇప్పటికే ఆలస్యం కావటంతో ఎలాగైన ఈ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాలో ఇషాన్ సరసన పూజా జవేరి, మన్నార చోప్రాలు హీరోయిన్లుగా నటించారు. -
'రోగ్' ఏమయ్యాడు
జెట్ స్పీడుతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు పూరి జగన్నాథ్.. కొద్ది రోజులుగా స్లో అయ్యాడు. వరుస పరాజయాలు పలకరిస్తుండటంతో, నెక్ట్స్ సినిమాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. అదే బాటలో ప్రముఖ నిర్మాత సీఆర్ మనోహర్ తనయుడు ఇషాన్‌ను హీరోగా పరిచయం చేస్తూ రోగ్ చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ సినిమాను తన గత చిత్రాల మాదిరిగా కాకుండా నెమ్మదిగా షూటింగ్ చేస్తూ వచ్చాడు. అయితే తాజాగా కళ్యాణ్ రామ్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళుతున్నట్టుగా ప్రకటించిన పూరి, రోగ్ సినిమాకు సంభందించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇప్పటి వరకు ఒక సినిమా రిలీజ్ అయిన తరువాతే తన నెక్ట్స్ సినిమాను ప్రారంబించే పూరి, రోగ్ విషయంలో మాత్రం ఆ సినిమాను పక్కన పెట్టేసి కొత్త సినిమా స్టార్ట్ చేస్తున్నాడు. మధ్యలో హీరోయిన్లు హ్యాండ్ ఇవ్వడంతో ఆలస్యం అయిన రోగ్, షూటింగ్ అసలు పూర్తయ్యిందా లేదా అన్న విషయంలో కూడా క్లారిటీ లేదు.