హృతిక్కు కోపం తెప్పించిన పూరి హీరోయిన్ | rogue heroine Angela Krislinzki publicity stunt upsets Hrithik roshan | Sakshi
Sakshi News home page

హృతిక్కు కోపం తెప్పించిన పూరి హీరోయిన్

Published Wed, Apr 5 2017 10:50 AM | Last Updated on Tue, Sep 5 2017 8:01 AM

హృతిక్కు కోపం తెప్పించిన పూరి హీరోయిన్

హృతిక్కు కోపం తెప్పించిన పూరి హీరోయిన్

రోగ్ సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయిన బ్యూటి ఏంజెలా క్రిస్లిజింకీ. సినిమాలో ఏంజెలాది చిన్న పాత్రే అయినా దర్శకుడు పూరి జగన్నాథ్ మాత్రం ఏంజెలానే మెయిన్ హీరోయిన్ అన్న రేంజ్లో ప్రమోట్ చేశాడు. అంతేకాదు రోగ్ ప్రమోషన్ కార్యక్రమాల విషయంలో ఏంజెలా జోరుగా పాల్గొంటుంది. అలా రోగ్ ప్రమోషన్లో భాగంగా ఈ బ్యూటి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్కు కోపం తెప్పించింది.

ఓ నేషనల్ పేపర్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఏంజెలా, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తనకు మంచి స్నేహితుడని, తన తీసుకునే ప్రతి నిర్ణయం హృతిక్తో సంప్రదించాకే తీసుకుంటానని తెలిపింది. ఈ ఇంటర్య్వూపై స్పందించిన హృతిక్, పేపర్ కటింగ్ను తన ట్విట్టర్ పేజ్లో పోస్ట్ చేస్తూ, ' మై డియర్ లేడీ, నువ్వు ఎవరు..? ఎందుకు అబద్ధం చెపుతున్నావ్..?' అంటూ కామెంట్ చేశాడు. ఏంజెలా గతంలో హృతిక్తో కలిసి కొన్ని యాడ్స్లో నటించింది. అయితే అవేవి హృతిక్ గుర్తు పెట్టుకునే స్థాయి పాత్రలు కాదు. హృతిక్ కామెంట్పై స్పందించిన ఏంజెలా సారీ చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement