
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ 'డ్రాగన్' సినిమాతో బిజీగా ఉన్నాడు. అటు బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ 'వార్ 2' మూవీ (War 2 Movie)లోనూ భాగమయ్యాడు. ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. జార్జియాలో జరిగిన వార్ 2 ఈవెంట్‌లో హృతిక్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. హృతిక్ (Hrithik Roshan) మాట్లాడుతూ.. వార్ సినిమా సీక్వెల్ ఎలా ఉంటుందోనని చాలా భయపడ్డాను. కానీ ఇప్పుడీ సినిమా చూస్తుంటే గర్వంగా ఉంది. మొదటి భాగం కంటే కూడా ఇదే మరింత బాగుంటుంది.
ఎన్టీఆర్‌తో డ్యాన్స్..
జూనియర్ ఎన్టీఆర్ నా ఫేవరెట్ కోస్టార్. తను అద్భుతమైన వ్యక్తి, చాలా తెలివైనవాడు. ఒక పాట మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయింది. ఆ పాటలో ఎన్టీఆర్‌తో కలిసి డ్యాన్స్ చేయాలంటే కాస్త భయంగా ఉంది. తను ఎలాగైనా చేయగలడు. నేను కూడా బాగా డ్యాన్స్ చేస్తానని అనుకుంటున్నాను. మీరు మా సినిమాను తప్పక ఆదరించాలి అని చెప్పుకొచ్చాడు. వార్ 2 విషయానికి వస్తే.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ మూవీతో తారక్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనున్నాడు.
ఇకపై డైరెక్టర్‌గానూ..
హృతిక్ రోషన్ నెక్స్ట్ 'క్రిష్ 4' సినిమా చేయనున్నాడు. ఈ చిత్రంతో అతడు దర్శకుడిగా మారనున్నాడు. '25 ఏళ్ల క్రితం నిన్ను నటుడిగా ప్రవేశపెట్టాను.. మళ్లీ పాతికేళ్ల తర్వాత నిన్ను దర్శకుడిగా పరిచయం చేస్తుండటం సంతోషంగా ఉంది' అని హృతిక్ తండ్రి రాకేశ్ ఇటీవల సోషల్ మీడియా పోస్ట్‌లో వెల్లడించాడు.
చదవండి: జైలు నుంచి విడుదల, మహేశ్ చేతికి చిక్కిన పాస్‌పోర్ట్.. వీడియో వైరల్