
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, దర్శకుడు బాబీ (కేఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో ఓ మూవీ రూపొందించడానికి సన్నాహాలు మొదలయ్యాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇటీవల హృతిక్ రోషన్ ను కలిసి ఓ కథ వినిపించారట బాబీ. ఈ స్టోరీ లైన్‌కు ప్రాథమికంగా అంగీకారం తెలిపారట హృతిక్.
దీంతో ప్రస్తుతం స్క్రిప్ట్‌కు మరింత మెరుగులుదిద్దే పనిలో దర్శకుడు బాబీ బిజీగా ఉన్నారని సమాచారం. మరోసారి హృతిక్ రోషన్ ను కలిసి, బాబీ ఫైనల్ స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వనున్నారట. అప్పుడు ఈ స్టోరీకి హృతిక్ రోషన్ ఫైనల్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ కాంబినేషన్ సెట్ అయినట్లేనని ఫిల్మ్‌నగర్ టాక్.
ఇక ఈ మూవీని భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మించనున్నారని భోగట్టా. మరి.. హృతిక్ రోషన్ కథ విన్నారా? హృతిక్–బాబీల కాంబినేషన్ సెట్ అవుతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇదిలా ఉంటే హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటించిన స్పై యాక్షన్ డ్రామా ‘వార్ 2’ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో ఆదిత్యా చోప్రా ఈ సినిమాను నిర్మించారు.