పవన్ హిట్ కొట్టినా.. భయం లేదా..! | Five Films Planing to release on March 31st | Sakshi
Sakshi News home page

పవన్ హిట్ కొట్టినా.. భయం లేదా..!

Published Sat, Mar 25 2017 12:01 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ హిట్ కొట్టినా.. భయం లేదా..! - Sakshi

పవన్ హిట్ కొట్టినా.. భయం లేదా..!

సాధారణంగా స్టార్ హీరోల సినిమా రిలీజ్ అవుతుందంటే కనీసం రెండు వారాల పాటు, కాస్త హైప్ ఉన్న సినిమాలను రిలీజ్ చేయడానికి సాహసించరు. అదే, ఆ సినిమాకు హిట్ టాక్ వస్తే మూడు వారాల పాటు మరో సినిమాకు ఛాన్స్ ఉండదు. కానీ కాటమరాయుడు విషయంలో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఈ శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన కాటమరాయుడు పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్నాడు. అయినా సరే వచ్చే వారం మూడు, నాలుగు సినిమాలు రిలీజ్కు ప్లాన్ చేసుకుంటున్నాయి.

వెంకటేష్ హీరోగా తెరకెక్కిన గురు సినిమాను ముందుగా ఏప్రిల్ 7న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే కాటమరాయుడు రిలీజ్ తరువాత సినిమాను ప్రీపోన్ చేస్తూ మార్చి 31నే రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పూరి దర్శకత్వంలో ఇషాన్ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన రోగ్ సినిమాను కూడా అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. నయనతార లీడ్ రోల్లో నటించిన డోరతో పాటు చిన్న సినిమాలు కారులో షికారుకెల్తే, ఎంతవరకు ఈ ప్రేమ కూడా 31నే రిలీజ్ ప్లాన్ చేసుకుంటున్నాయి.పవన్ సినిమా కాటమరాయుడు మంచి టాక్తో దూసుకుపోతున్నా వారం గ్యాప్లో ఇన్ని సినిమాలు రిలీజ్ రెడీ అవ్వటం ఇండస్ట్రీ వర్గాలకు కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement