guru
-
సాధకులు... గురువులు
గురు అన్న మాటని అతి సామాన్యంగా వాడేస్తూ ఉంటాం. దారిలో కనపడిన ముక్కు మొహం తెలియని మనిషిని పలకరించటానికి, ఎలా సంబోధించాలో తెలియని సందర్భంలోనూ, స్నేహితులు ఒకరినొకరు పలకరించుకోటానికి, చివరికి బస్ కండక్టర్నీ, డ్రైవర్నీ, ఇంకా ఎవరిని పడితే వారిని గురూ అని సంబోధించటం చూస్తాం. కాస్త పెద్దవారైతే గురువుగారూ అంటారు. గురువు అంటే పెద్ద వాడు అన్న అర్థంలో వాడితే సరే! గురు అన్నది అర్థం మాట అటు ఉంచి, పదమే సరి కాదు. గురువు అన్నది సాధు పదం.అసందర్భంగా ఉపయోగించటమే కాదు కొంత మంది ఆ విధంగా పిలిపించుకోవాలి అని చాలా తాపత్రయ పడుతూ ఉంటారు. నిజానికి ఆ విధంగా పిలిపించుకోవటం చాలా పెద్ద బరువు. బాధ్యత అవుతుంది. నాలుగు లలిత గీతాలు నేర్పి, పది పద్యాలో, శ్లోకాలో నేర్పి, రెండు మూడు యోగాసనాలు నేర్పించి, నాలుగు ప్రవచనాలు చెప్పి ‘గురు’ అనే బిరుదాన్ని తమకు తామే తగిలించుకోవటం చూస్తాం. వారి వద్ద నేర్చుకుంటున్న వారు గురువుగారు అనటం సహజం. తప్పనిసరి. అందరూ అట్లాగే అనాలి అనుకోవటం వల్ల సమస్య. అందరూ ఎందుకు అంటారు? అందుకని తామే తమ పేరులో భాగంగా పెట్టుకుంటున్నారు. అయితే ఏమిటిట?గురువు అంటే అజ్ఞాన మనే చీకట్లని తొలగించి, జ్ఞానమనే వెలుగుని ప్రసాదించే వాడు అని కదా అర్థం. గురుత్వాన్ని అంగీకరిస్తే శిష్యుల పూర్తి బాధ్యత నెత్తి కెత్తుకోవలసి ఉంటుంది. వారి తప్పులకి బాధ్యత తనదే అవుతుంది. బోధకుడుగా ఒక విషయంలో బాధ్యత వహించ వచ్చు. కానీ, గురువు అంటే మొత్తం అన్ని విషయాలలోనూ బాధ్యత ఉంటుంది. ఈ బరువు మోస్తూ ఉంటే తన సాధన సంగతి ఏమిటి? తన జీవన విధానం ఆదర్శ్ర΄ాయంగా ఉన్నదా? ఒక్కసారి గురుస్థానం ఆక్రమిస్తే తరచుగా జరిగేది గర్వం పెరగటం. తాను ఒక స్థాయికి రావటం జరిగింది కనుక ఇక పై తెలుసుకోవలసినది, సాధన చేయవలసినది లేదు అనే అభి్ర΄ాయం కలుగుతుంది. దానితో ఎదుగుదల ఆగి΄ోతుంది. గిడసబారి, వామన వృక్షాలు అవుతారు. బోధిసత్వుడు తనను ‘తథాగతుడు’ అనే చెప్పుకున్నాడు కానీ గురువుని అని చెప్పుకోలేదు. శ్రీ రామ చంద్రుడికి అరణ్యవాసంలో మార్గనిర్దేశనం చేసిన ఋషులు కూడా ‘ఇది ఋషులు నడచిన దారి’ అనే చె΄్పారు. మా దారి అని చెప్పలేదు. ఎందుకంటే, వారు అప్పుడు ఉన్న స్థితి కన్నా ఇంకా ఎక్కువ స్థాయికి వెళ్ళటం అనే ఆదర్శం ఉన్న వారు. ఒక్క సారి తనని గురువు అనిప్రకటించుకున్నాక ముందుకి సాగటం ఉండదు. ఈ జన్మకి ఇంతే! సాధకులు అనే స్థితి లేక ΄ోతే, సాధన ఎక్కడ? సిద్ధి ఎక్కడ? అటువంటి వారిని ఎంతో మందిని చూస్తూనే ఉంటాం. ఏదో చిన్న సిద్ధి రాగానే దానిని ప్రకటించుకుంటూ ఆగి ΄ోతారు. పతనం కూడా అవుతారు. మరొక గొప్ప బాధకరమైన ఉదాహరణ. చిన్నపిల్లలలో ప్రతిభ ఉండచ్చు. దాన్ని ్ర΄ోత్సహించాలి కూడా. కానీ, వాళ్ళకి బిరుదాలు మొదలైనవి ఇచ్చిన తరువాత మరొక్క అడుగు ముందుకి వేయక ΄ోవటం అనుభవమేగా! ఒక రంగంలో అత్యున్నత స్థానాన్ని ΄÷ందిన వారు ఎవరు కూడా తాము గురువులము అని చెప్పుకోవటం చూడం. ఇంకా సాధన చేస్తున్నాము, జ్ఞానం అనంతం మాకు ఈ మాత్రం అందినందుకు ధన్యులం అంటారు. పైగా ప్రతిరోజు మరింతగా సాధన చేస్తూ ఉంటారు. సంగీత విద్వాంసులయినా, వేద పండితులైనా, క్రికెట్ ఆటగాళ్లయినా అభ్యాసం ఆపరు. తాను చెప్పినది విని తనని నలుగురు అనుసరిస్తున్నారు అంటే ఎంత జాగ్రత్తగా మసలుకోవాలి? – డా. ఎన్. అనంత లక్ష్మి -
ఆయనే రుషి..అక్షర కార్మికుడు..మార్గదర్శి..!
ఆదియుగం నుంచి ఆధునికయుగం వరకు ఆయనే రుషి.. శిష్యుల భవిష్యత్‌కు నిచ్చెన వేసే అక్షర కార్మికుడు.. సమాజ దేవాలయానికి నిజమైన రక్షకుడు.. ఆయనెవరో కాదు మనందరికీ విద్యా బుద్ధులు నేర్పే గురువు. అందుకే తల్లిదండ్రుల తర్వాత ఆచార్య దేవో భవ అంటూ గురువుకి స్థానం ఇచ్చాం. గురువు బ్రహ్మ.. గురువు విష్ణువు.. గురువు శివుడు అంటూ కీరిస్తాం.. దేశాన్ని ఏలే రాజైనా సరే ఒక గురువుకి శిష్యుడే.. ప్రపంచాన్ని శాసించే పరమాత్ముడైనా ఒక గురువుకి శిష్యుడిగా మారి విద్యను అభ్యసించాల్సిందే.. గురుభక్తి ఉన్న శిష్యుడు ఉన్నత స్థితికి చేరుకుంటాడు. గురువు ఆశీస్సులతో మనం ఏదైనా సాధించగలం. ఈ రోజు (సెప్టెంబర్ 5న) డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా మనందరికీ స్ఫూర్తినిచ్చే ఉత్తమ గురు-శిష్య జంటల గురించి తెలుసుకుందాం.మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ, అర్జునుడిని సిసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి తనకు కృష్ణుడితో సమానమని జాతిపిత మహాత్మా గాంధీ కీర్తించారు. ‘మీరు నా కృష్ణుడు, నేను అర్జునుడిని’ అన్నారు గాంధీజీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని కీర్తించారు పండిట్ నెహ్రూ. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే ఆయన పుట్టిన రోజును టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టిందేమో..!గురువులకే గురువు..యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు అని కొనియాడారు హోవెల్. నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి అని కీర్తించారు సోవియట్ అధినేత స్టాలిన్. అలాంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు, జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్. గురువులకే గురువు ఆయన. అందుకే ఆయన పుట్టిన రోజు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయ్యింది.తరతరాలుగా, యుగయుగాలుగా సనాతన భారతీయ విచారధారలోని పరమార్థ విషయాల్ని ప్రపంచానికి సూటిగా, సులభంగా, స్పష్టంగా తెలియజెప్పిన ధీమంతుడు, ధీశాలి సర్వేపల్లి. హృదయాన్ని, మేధను సమపాళ్లలో పండించిన ప్రజ్ఞాశాలి ఆయన. తత్వశాస్త్రానికి సాహిత్య మాధుర్యం చేకూర్చిన మహా రచయిత రాధాకృష్ణన్. ఆధునిక సమాజానికి ఎలాంటి గురువు అవసరమో, గురువు ఎలా ఉండాలో ఆయన స్వీయచరిత్రలో స్పష్టంగా వివరించారు. బోధ గురువులు, బాధ గురువుల లక్షణాలను ప్రస్తావించారు.గురువు గొప్పదనం..మహాభారతం అరణ్య పర్వంలోని యక్షప్రశ్నల ఇతివృత్తంలోని అంశం.. యక్షుడు ‘మనిషి మనీషి ఎలా అవుతాడు?’ అని ధర్మరాజును ప్రశ్నిస్తాడు. అప్పుడు ధర్మరాజు ‘అధ్యయనం వల్ల, గురువు ద్వారా’ అని బదులిస్తాడు. గురువుకు ఉన్న శక్తి అంతటి గొప్పది. అధర్వణ వేద సంప్రదాయం ప్రకారం చదువు ప్రారంభించే ముందు శిష్యుడు మొదటగా ఇష్టదేవతా ప్రార్థన చేస్తాడు. ఆ తర్వాత ‘స్వస్తినో బృహస్పతిర్దదాతు’ అని గురువును స్మరిస్తాడు.చాణక్యుడు చేతిలో రూపుదిద్దుకున్న శిల్పం చంద్రగుప్తమౌర్యుడు. సమర్థ రామదాసు తయారుచేసిన వీరఖడ్గం శివాజీ. రామకృష్ణ పరమహంస అందించిన ఆధ్యాత్మిక శిఖరం వివేకానందుడు. భారతీయ గురుశిష్య శక్తికి వీళ్లు ఉదాహరణలు మాత్రమే. ఆదిదేవుడితో మొదలైన గురుపరంపర వేదవ్యాసుడితో సుసంపన్నమైంది. భారతీయ సంస్కృతిలో నేటికీ అది కొనసాగుతూనే ఉంది.మన సనాతన ధర్మాన్ని సంరక్షిస్తున్న ఆ గురుదేవులందర్నీ స్మరించుకుంటూ.. ఈ ఉత్తమ గురు-శిష్య ద్వయం నుంచి నేటి తరం అపారమైన జీవిత పాఠాన్ని నేర్చుకుని స్ఫూర్తి పొందొచ్చు.(చదవండి: గురువును మించిన శిష్యులు: ఈ సెలబ్రిటీల గురించి తెలుసా?) -
భక్త విజయం: రుద్రాక్షధారణ ఫలితం
చంద్రసేనుడు కశ్మీర రాజు. అతడి కొడుకు సుధర్ముడు. చంద్రసేనుడి మంత్రి గుణనిధి. రాజు కొడుకు సుధర్ముడికి మంత్రి కొడుకు తారకుడికి బాల్యం నుంచి స్నేహం ఏర్పడింది. వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది. రాజు కొడుకు, మంత్రి కొడుకు ఇద్దరూ ఐశ్వర్యంలో పుట్టిపెరిగిన వారే! ఇద్దరూ అందగాళ్లే! అయినా వారికి రత్నాభరణాలను ధరించడం మీద ఏమాత్రం మోజు ఉండేది కాదు. వారిద్దరూ శివపూజా తత్పరులు. శరీరంపై భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షలు ధరించేవారు. ఎందరు ఎన్ని విధాలుగా నచ్చచెప్పినా, వారు రత్నాభరణాలను ధరించేవారు కాదు. ఆ బాలురిద్దరి ప్రవృత్తి మిగిలిన బాలురి కంటే కొంత విచిత్రంగా ఉండేది. ఒకనాడు పరాశర మహర్షి చంద్రసేనుడి వద్దకు వచ్చాడు. చంద్రసేనుడు ఎదురేగి పరాశరునికి స్వాగతం పలికి, అతిథి సత్కారాలు చేశాడు. ఆయనకు ఈ విచిత్ర బాలురిద్దరినీ పరిచయం చేశాడు. ‘స్వామీ! ఇతడు నా కుమారుడు సుధర్ముడు. అతడి పక్కనున్నవాడు నా మంత్రి కుమారుడు తారకుడు. వీరిద్దరి ప్రవర్తన కొంత వింతగా ఉంటోంది. మిగిలిన బాలల మాదిరిగా అలంకరణలపై ఆసక్తి చూపరు. శరీరంపై నిత్యం భస్మత్రిపుండ్రాలు ధరించి, రుద్రాక్షమాలలు వేసుకుని తిరుగుతుంటారు. మేమంతా ఎంతగా నచ్చచెప్పినా రాజోచితమైన రత్నాభరణాలను ధరించడం లేదు. వీరికి బాల్యంలోనే ఇంతటి వైరాగ్య ప్రవృత్తి ఎందుకు కలిగిందో మాకెవరికీ అర్థం కావడంలేదు. మీరే వీరి సంగతి చెప్పాలి’ అన్నాడు చంద్రసేనుడు. పరాశరుడు దివ్యదృష్టితో ఆ బాలురిద్దరి వృత్తాంతాన్నీ గ్రహించాడు. ‘రాజా! దిగులు చెందకు. వీరి ప్రస్తుత ప్రవృత్తికి కారణం వీరి పూర్వజన్మలోనే ఉంది’ అంటూ ఆ బాలురి పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగాడు. ‘పూర్వం నందిగ్రామంలో మహానంద అనే గణిక ఉండేది. ఆమె మహా ఐశ్వర్యవంతురాలు. ఆమె సౌధంలో రత్నరాశులు విరివిగా ఉండేవి. పాడిపంటలతో ఆమె సమృద్ధిగా తులతూగేది. సర్వాలంకారభూషితగా ఉండేది. కులవృత్తిరీత్యా ఆమె స్వేచ్ఛాసంచారిణిగా ఉండేది. అయినా, ఆమె శివదీక్షా తత్పరురాలు. తన ఇంట నిత్యం శివపూజ చేసేది. శివాలయాలకు విరివిగా దానాలు చేసేది. శివభక్తులైన బ్రాహ్మణులను ఆదరించి, వారు కోరిన దానాలు ఇచ్చేది. వినోదం కోసం ఆమె ఒక కోతిని, ఒక కోడిని పెంచుకునేది. వాటికి భస్మత్రిపుండ్రాలతోను, రుద్రాక్షలతోను అలంకరించేది. వాటిని నాట్యమండపానికి తీసుకొచ్చి, వాటితో ఆటలాడించేది. రుద్రాక్షలు ధరించిన కోతి బాలకునిలా ఆ గణిక ముందు నృత్యం చేసేది. కోతి నృత్యాన్ని చూసి కోడి కూడా నాట్యమాడేది. వాటి ప్రదర్శన చూపరులకు ఆనందం కలిగించేది. ఇలా చాలాకాలం గడిచింది. ఒకనాడు శివదీక్షాపరుడైన ఒక వర్తకశ్రేష్ఠుడు ఆ గణిక ఇంటికి వచ్చాడు. భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షమాలలు, రత్నకంకణ కేయూరాది ఆభరణాలను ధరించి, చూడటానికి అపర కుబేరుడిలా ఉన్నాడు. మహానంద ఆ వర్తకశ్రేష్ఠుడిని సాదరంగా ఆహ్వానించి, పూజించింది. అతడికి సపర్యలు చేసింది. అతడితో కబుర్లాడుతూ, ‘మహాత్మా! మీరు ధరించిన రత్నకంకణం స్త్రీలు ధరిస్తే శోభిస్తుంది. మీ కంకణం ధరించాలని నాకు మక్కువగా ఉంది’ అని అంది. ‘అంత కోరికగా ఉంటే నా కంకణాన్ని నీకిస్తాను. మరి దీనికి మూల్యంగా ఏమిస్తావు?’ అన్నాడు ఆ వర్తకుడు. ‘అయ్యా! నేను గణికను. మీ కంకణాన్ని నాకు అనుగ్రహిస్తే, అందుకు బదులుగా మూడు రోజులు మీకు భార్యగా నడుచుకోగలను’ అని బదులిచ్చింది. అందుకు సంతోషంగా సమ్మతించిన వర్తకశ్రేష్ఠుడు ఆమెకు తన కరకంకణాన్ని ఇచ్చాడు. దానితోపాటు రత్నఖచితమైన శివలింగాన్ని కూడా ఇచ్చాడు. ‘ఈ శివలింగం నాకు ప్రాణప్రదమైనది. దీనిని జాగ్రత్తగా భద్రపరచు. దీనికి భంగం కలిగితే, నాకు ప్రాణభంగమే’ అని చెప్పాడు. మహానంద ఆ వర్తకశ్రేష్ఠుడు ఇచ్చిన కంకణాన్ని అలంకరించుకుని, అతడిచ్చిన శివలింగాన్ని తన పూజామందిరంలో భద్రపరచింది. నాటి రాత్రి ఆ వర్తకుడితో గడిపి నిద్రించింది. అర్ధరాత్రి వేళ అకస్మాత్తుగా ఆ గణిక ఇంట్లో మంటలు చెలరేగాయి. మంటల వేడికి మేలుకున్న గణిక ఇంట్లో కట్టేసి ఉన్న కోతికి, కోడికి కట్లు విప్పి వాటిని బయటకు విడిచిపెట్టింది. ఇంటిని మంటలు కమ్మేస్తుండటంతో ఆమె, ఆమె వెనుకనే వర్తకుడు బయటకు వచ్చేశారు. వాళ్లు చూస్తుండగానే ఇల్లు భస్మీపటలమైంది. పూజామందిరంలో భద్రపరచిన శివలింగం కూడా అగ్నికి ఆహుతైపోయింది. ప్రాణప్రదమైన శివలింగం దగ్ధమవడంతో ఆ వర్తకుడు ప్రాణత్యాగం చేశాడు. అతడికి ఇచ్చిన మాట ప్రకారం అతడితో మూడురోజులు గడపాల్సి ఉండగా, అతడు ఒక రోజు గడిచేసరికే ప్రాణత్యాగం చేయడంతో ఆ గణిక చాలా దుఃఖించింది. ఆమె కూడా అతడితో పాటే ప్రాణత్యాగం చేసింది. ఆమె విడిచిపెట్టిన కోతి, కోడి కొన్నాళ్లకు కాలధర్మం చెందాయి. గణిక వద్ద పెరిగినప్పుడు భస్మత్రిపుండ్రాలు, రుద్రాక్షలు ధరించిన కోతి, కోడి ఇప్పుడు నీకు, నీ మంత్రికి కొడుకులుగా పుట్టారు. పూర్వజన్మ స్నేహమే వారి మధ్య నేటికీ కొనసాగుతోంది. ధార్మికులైన వీరిద్దరూ మీ తర్వాత జనరంజకంగా ప్రజలను పరిపాలించి, చివరకు శివసాయుజ్యాన్ని చేరుకుంటారు’ అని చెప్పాడు పరాశరుడు. –సాంఖ్యాయన ఇవి చదవండి: పాతాళవనం కాదు! అదొక 'నేలమాళిగలో ఉద్యానవనం..! -
గురు వాక్యస్య... !!!
వాగ్గేయకారులలో గమనించవలసిన ఒక గొప్ప లక్షణం– వారిలోని గురుభక్తిని. అది లేకుండా సనాతన ధర్మంలో ఏ వ్యక్తీ పరిఢవిల్లలేదు. పుస్తకజ్ఞానం ఎంత ఉన్నా గురుముఖతః నేర్చుకున్నదేదో అది మాత్రమే అభ్యున్నతికి కారణమవుతుంది. ‘శ్రద్థ’ అని మనకు ఒక మాట ఉంది. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం– అంటారు గీతాచార్యులు. ఆ శ్రద్ధ ఎవరికి ఉన్నదో వారికి మాత్రమే జ్ఞానం కలుగుతుంది–అని. శ్రద్ధ అన్న మాటకు శంకరభగవత్పాదులు వ్యాఖ్యానం చేస్తూ.. ‘‘శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యవధారణమ్’ సాశ్రద్ధా కథితా సద్భిర్యాయా వస్తూపలభ్యతే’’.. అంటారు. శాస్త్రం చెప్పిన విషయం తిరుగులేని సత్యం... అన్న నమ్మకం ఉండాలి. కలడుకలండనెడువాడు కలడోలేడో...’ అన్న అనుమానం దగ్గరే ఉండిపోకుండా ‘భగవంతుడు ఉన్నాడు. శాస్త్రం చెప్పిన విషయం పరమ సత్యం..అని నమ్మాలి. ఆ పైన గురువాక్యస్య.. అంటే గురువుగారి నోటివెంట ఏది వచ్చిందో అది సత్యం. గురువుగారి నోటి వెంట వచ్చినది సత్యమయ్యేట్లు చూడవలసిన కర్తవ్యం భగవంతుడు తీసుకుంటాడు. అందుకే యోగివాక్కు అంటారు. యోగి వాక్కు అంటే – గురువుగారు సత్యం చెప్పారు.. అని కాదు .. గురువుగారు చెప్పినది సత్యం... అని అన్వయం చేసుకోవాలి. అంటే అంత తిరుగులేని విశ్వాసం ఉండాలి. అందుకే గురు విషయంలో స్థాన శుశ్రూష అంటారు. మనం ఉంటున్న ఇంటిని, మనం కొలిచే దేవుడు ఉండే దేవాలయాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో అలా గురువుగారుండే ప్రదేశాన్ని కూడా శిష్యులు శుభ్రం చేస్తూ గురువుగారికి సౌకర్యంగా ఉండేటట్లు చూస్తుంటారు. ఈ కంటితో చూడలేని పరబ్రహ్మం సశరీరంతో... అంటే మనలాగా కాళ్ళూచేతులతో, ఇతరత్రా మనలాగే నడిచివెడితే అదే గురువు. ‘గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్పరబ్రహ్మ తస్మైశ్రీగురువేనమః’–అని. గురువే బ్రహ్మ. గురువు మనలోని జ్ఞానజ్యోతిని వెలిగిస్తాడు. అందుకని సృష్టికర్త. గురుర్విష్ణుః..అంటే శ్రీమహావిష్ణువు స్థితికారుడై ఏ విధంగా ఈ సృష్టినంతటినీ నిలబెడుతున్నాడో అలా జ్ఞానాన్ని, భక్తిని పతనం కాకుండా గురువు కాపాడుతుంటాడు. అందుకని విష్ణువు. గురుర్దేవో మహేశ్వరః.. మహేశ్వరుడు ఎలా లయకారుడో అట్లా అజ్ఞానాన్ని గురువు లయం చేసి జ్ఞానాన్ని ఇచ్చి నిలబెడుతుంటాడు. అందుకే గురువు పరబ్రహ్మము. అటువంటి గురువుకు... తస్మైశ్రీగురవేనమః. ... నమస్కరించుచున్నాను. ఈ లోకంలో గురువుగారికి ప్రత్యుపకారం చేయడం కానీ, గురువుగారిని సత్కరించడం కానీ, గురువుగారికి మనం పదేపదే కృతజ్ఞతలు చెప్పడం కానీ సాధ్యమయ్యే విషయం కాదు. కాబట్టి గురువు విషయంలో కృతజ్ఞత గా చెయ్యగలిగినది ఒక్కటే– రెండు చేతులు కలిపి జోడించి శిరస్సు తాటించి నమస్కరించడం మాత్రమే. అది గురువుపట్ల చెదరిపోని నమ్మకంతో చేయాలి.. అది వాగ్గేయకారులందరూ చేశారు. కాబట్టే మహాత్ములయ్యారు. -
ర్యాలీస్‌లో రేఖా ఝున్‌ఝున్‌వాలా వాటాల విక్రయం
ముంబై: దివంగత ఇన్వెస్ట్మెంట్ గురు రాకేష్ ఝున్‌ఝున్‌వాలా సతీమణి రేఖా ఝున్‌ఝున్‌వాలా తాజాగా ర్యాలీస్ ఇండియాలో మరో 6.2586 శాతం వాటాలను విక్రయించారు. దీంతో ఇకపై తన దగ్గర 2.278 వాటాలు (సుమారు 44.30 లక్షల షేర్లు) ఉన్నట్లవుతుందని ఆమె స్టాక్ ఎక్సేచంజీలకు తెలియజేశారు. 2013 మార్చి 11 నాటికి తమ వద్ద 2.03 కోట్ల షేర్లు (10.4581 శాతం వాటాలు) ఉన్నట్లు.. అప్పటి నుంచి ఈ ఏడాది జూలై 17 మధ్య తాము 37 లక్షల షేర్లు (1.9446 శాతం) విక్రయించామని పేర్కొన్నారు. జూలై 18 – జూలై 20 మధ్యలో మరో 1.21 కోట్ల షేర్లను (6.2586 శాతం) విక్రయించినట్లు వివరించారు. శుక్రవారం ర్యాలీస్ ఇండియా షేర్లు 1.31 శాతం క్షీణించి సుమారు రూ. 218 వద్ద క్లోజయ్యాయి. కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4,237 కోట్ల ప్రకారం రేఖ వద్ద ప్రస్తుతమున్న వాటాల విలువ సుమారు రూ. 96 కోట్లుగా ఉంటుంది. -
హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు : నటి
గురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన బ్యూటీ రితిక సింగ్. తొలి సినిమాతోనే ఆకట్టుకున్న ఆమె ఆ తర్వాత నీవెవరో, శివలింగ వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా రితిక సింగ్ మెయిన్ లీడ్‌లో ఇన్కార్ అనే తమిళ సినిమాలో నటించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సహా పాన్ ఇండియా స్థాయిలో మార్చి 3నుంచి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్లో రితిక సింగ్ మాట్లాడుతూ హీరోయిన్లపై వచ్చే మీమ్స్, ట్రోల్స్‌పై ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతి ఒక్కరికి గౌరవం ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో హీరోయిన్ల ఫోటోలు అసహ్యంగా ఎడిట్ చేసి డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. నేను కూడా ఇలాంటివి ఫేస్ చేశాను. ఇలాంటివి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. మీకే కాదు నాకు కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది. నా ఫోటోలు అలా చూసి నా పేరెంట్స్ ఏమనుకుంటారు? వాళ్ల గుండె బద్దలవుతుంది అలాంటివి చూసినప్పుడు. అందుకే ఇలాంటి చెత్త మీమ్స్, ట్రోల్స్ చేసేటప్పుడు ఒకసారి ఆలోచించడం అంటూ రితిక భావోద్వేగానికి లోనైంది. -
ప్రవచన కర్త చాగంటి కోటేశ్వర్ రావుకు గురజాడ పురస్కారం
-
మహాస్వామి వారి మౌన బోధనం
జగద్గురు ఆదిశంకరులు కూడా మౌనంగానే శిష్యులకు బోధించేవారట. వారి చిన్ముద్రలోనే శిష్యులకు సమస్తసమూ బోధపడేవిట. సత్వం, రజస్సు, తమస్సు అనే మూడు గుణాల కారణంగా ఏర్పేడేదే సంసారం. వీటికి దూరంగా ఉండటమే చిన్ముద్ర సందేశం. ఈ సందేశాన్ని ఉత్తమ విద్యార్థులైన రుషులు అర్థం చేసుకున్నారట. అందుకే వారందరూ మూకుమ్మడిగా ఆయననే తమ ఉత్తమోత్తమ గురువుగా, ఉత్తరోత్తరా కూడా ఆయనే తమ గురువుగా ఉండాలని కోరుకున్నారు. అదేవిధంగా కంచి పరమాచార్యను కూడా వారి భక్తులు, శిష్యులు ఇప్పటికీ తమ గురుపరంపరలో ఆద్యునిగా ఆరాధిస్తున్నారు. సేవిస్తున్నారు. సాంత్వన పొందుతున్నారు. ప్రాచీన ఆలయాల ప్రాకారాలపై చెక్కి ఉన్న దక్షిణామూర్తి రూపాన్ని చూస్తే దక్షిణామూర్తి ఒక యువకుడు. చెట్టు మూలంలో కూర్చుని ఉంటాడు. శిష్యులందరూ వృద్ధులు. ఆయనేమో మౌనంగా చిన్ముద్రలో ఉంటాడు. ఆ మౌన వ్యాఖ్యతోనే శిష్యుల సందేహాలు పటాపంచలౌతాయట. చెట్టు ఒక ప్రసిద్ధమైన సంకేతం. ఎడతెరిపి లేని జనన మరణాలతో కూడిన సంసారమనే వక్షం. సంసారానికి మూలమైన పరమాత్మ అనేది శుద్ధ చైతన్యమని మన సిద్ధాంతం. ఈ చైతన్యంలో ప్రకటమయ్యే సృజనాత్మక శక్తినే ప్రకృతి లేదా మాయ అన్నారు. చైతన్యమే జగత్తుగా కనిపిస్తుందని అర్థం. ఈ చెట్టు మూలంలో ఉన్న దక్షిణామూర్తి ఎల్లప్పుడూ మౌనంగా చిన్ముద్రలో కూర్చుని ఉంటాడు. ఆ మౌనముద్రలోనే అంత పెద్ద శిష్యుల సందేహాలన్నీ పటాపంచలు కావడానికి ప్రత్యక్ష ఉదాహరణమే శ్రీశ్రీశ్రీ కంచిçకామకోటి పీఠాధిపతి జగద్గురు చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి. ఆయన సాక్షాత్తూ దక్షిణామూర్తి స్వరూపులు. స్వామివారి సన్నిధికి వచ్చి ఆయనను దర్శించుకుని, తమకున్న కొండంత కష్టాల గురించి ఆయనతో మొరపెట్టుకుని ఆయన అనుగ్రహంతో వాటిని తొలగించుకుని తిరిగి సాధారణ జీవితాన్ని గడిపిన వారు కోకొల్లలు. స్వామివారు కాష్ఠమౌనంలో ఉన్నప్పుడు కూడా ఆయనకు తమ సమస్యలను నివేదించుకునేవారు. ఆయన మౌనంగానే ఉండి తమకు అంతా తెలుసునన్నట్లు వారివంక చిరునవ్వుతో చూసేవారు. సాక్షాత్తూ దైవస్వరూపులైన స్వామి వారి కరుణాపూరిత దృక్కులు చాలదా వారి దుఃఖాలను బాపటానికి! మానవ సంబంధాలలో అత్యుత్తమ మైనది గురుశిష్య బాంధవ్యం. అర్థరహిత, స్వార్థరహితమైన బాంధవ్యం. ఆ గురుశిష్య సంబంధానికి అర్థబలంతో అంగబలంతో పనిలేదు. అహంకారంతో పనిలేదు. స్వార్ధరహితం. ఇలా రహిత పద్ధతిగా ఏర్పడేది ఒక్క గురుశిష్య బాంధవ్యం మాత్రమే. దానిలో ఏమీ మిగలదు. ఎందుకంటే అశరీర పద్ధతే లక్ష్యం కాబట్టి. సశరీర ధర్మాలుగానీ, సశరీర బాంధవ్యాలు గానీ లేకుండా చేసే పద్ధతిగా నిన్ను పరిణమింపచేయడమే దాని ఉద్దేశ్యం. వింతైన విషయం ఏమిటంటే ఈ అన్యోన్య దర్శనం ఉన్నప్పుడే ఈ మౌన వ్యాఖ్య సాధ్యమౌతుంది. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక మార్గముంది. ప్రకటించటం అంటే తెలియచెప్పటం. పరబ్రహ్మ తత్త్వాన్ని తెలియచెప్పాలంటే ఒకే ఒక పద్ధతుంది. మౌనవ్యాఖ్య. దానిని గురించి శాస్త్రాలలో, ఉపనిషత్తులలో ధర్మ పద్ధతిగా, జ్ఞాన పద్ధతిగా, యోగ పద్ధతిగా ఎలా చెప్పబడింది అనే సాంప్రదాయ రీతులలో దానిని గురించి విశేషంగా మాట్లాడటాన్ని వ్యాఖ్య అన్నారు. గురు హృదయంలో బోధించాలనే సంకల్పం కలగగానే, వ్యక్తీకరించక ముందే శిష్యుడికి అర్థమైపోవాలి.. దక్షిణామూర్తిని గమనిస్తే ‘వటమూల నివాసిని’ వటవృక్షమంటే మర్రిచెట్టు. వటవృక్షం దక్షిణామూర్తి సమానం. అశ్వత్థ వృక్షమంటే రావిచెట్టు. అశ్వత్థ వృక్షం విష్ణు సమానం. పరబ్రహ్మ నిర్ణయాన్ని తెలుసుకోవడానికి ఈ వటవృక్షాన్ని అధ్యయనం చేయాలి, ఆశ్రయించాలి. ‘‘వటవిటపి సమీపే భూమి భాగే విషణ్ణం! సకల ముని జనానాం జ్ఞాన దాతార మారాత్!!’’ ఇటువంటి జ్ఞానానికి అధికారి ఎలా ఉండాలట? జ్ఞానదాత అంటే సద్గురువే. అటువంటి సద్గురువు, నడిచేదైవంగా పేరు పొందిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామికి జేజేలు. ఆయన సన్నిధిని ప్రత్యక్షంగా అనుభవించిన వారికే కాదు, పరోక్షంగా ఆయన బోధల వల్ల ప్రేరణ పొందిన వారికి కూడా ఆయన జీవన్ముక్త స్థితి, భక్తవత్సలత గురించీ బాగా తెలుసు. ఎంతటి క్లిష్టపరిస్థితులనైనా, తమ అనుగ్రహంతో, ఆశీర్వాదపూర్వకంగా మార్చిన కర్మయోగి, జ్ఞానయోగి. గీతాబోధకు ప్రత్యక్ష నిదర్శనం. నడిచేదైవానికి సహస్రకోటి ప్రణామాలు. సూక్తి సుధ ► మీరెలా ఆలోచిస్తే అలాగే తయారవుతారు. బలహీనులని భావిస్తే.. బలహీనులే అవుతారు. శక్తిని స్మరిస్తే శక్తిమంతులే అవుతారు. ► ఈ ప్రపంచంలో కష్టమయిన పని అంటూ ఏది లేదు.మనకి అదంటే ఇష్టం లేకపోవటం వలన అది ’కష్టం’ గా మారుతుందంతే. ► దూరంగా ఉన్నంత మాత్రాన బంధాలు తెగిపోవు. దగ్గరగా ఉంటే బంధాలు పెరిగిపోవు. ఎదుటివారి మనసులో మనం ఉన్నపుడు దూరం, దగ్గర అనేవి సమస్యలు కానేకావు. ► మంచో చెడో ఒకడుగు ముందుకెయ్యడానికి ప్రయత్నించు. గెలుపైతే ముందుకెళ్ళు. ఓటమైతే ఆలోచన మార్పు చేయి. ► ఎవరైనా తమతో స్నేహం చేసేవారికి వారివద్దనున్న గుణాన్నే పంచగలరు. మంచివాడు మంచిని, చెడ్డవారు చెడును, కోపిష్టి కోపాన్ని, అజ్ఞానుడు అజ్ఞానాన్ని, తెలివి వంతుడు తన తెలివిని పంచగలడు. ఇందులో నీకు ఎలాంటి స్నేహం కావాలో ఎంచుకోవడం నీ బాధ్యత. నీ స్నేహాన్నిబట్టే సమాజం నిన్ను అంచనా వేస్తుంది. – ఎన్. రమేశన్, ఐ.ఎ.ఎస్. -
వాంగ.. వాంగ...
నాయకుడు.. ప్రతినాయకుడు.. సహాయ నటుడు.. ఏ పాత్రని అయినా అవలీలగా చేయగల నటుడు మోహన్‌బాబు. అందుకే చెన్నై ఇప్పుడు ఆయన్ను ‘వాంగ.. వాంగ..’ అంటోంది. అంటే.. రండి.. రండి. అని అర్థం. అసలు చెన్నై ఆయన్ను ఇప్పుడు రమ్మనడమేంటి? ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆయన తమిళ సినిమాల్లో నటించారు. వాటిలో 1980లో చేసిన ‘గురు’ అనే సినిమా ఒకటి. ఇప్పుడు కూడా మోహన్‌బాబు కోసం కబురు పంపింది నేటి ‘గురు’ (2017) డైరెక్టర్ సుధా కొంగర. వెంకటేశ్ హీరోగా ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ తెలుగమ్మాయి. ఈ చిత్రం తర్వాత సూర్య హీరోగా ఓ చిత్రం చేయడానికి సుధ సన్నాహాలు చేస్తున్నారు. కథ రాసుకునేటప్పుడు సినిమాకి అతికీలకమైన ఓ పాత్రను మోహన్‌బాబు చేస్తే బాగుంటుందని ఆమె అనుకున్నారట. కథ విన్న సూర్య కూడా మోహన్‌బాబు అయితే న్యాయం జరుగుతుందని భావించారట. ఇటీవల మోహన్‌బాబుకు సుధ కథ చెప్పడం, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పటివరకూ కనిపించన విలక్షణ పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం. -
సైన్యంలో చేరతా అమర జవాన్ భార్య
కుమారుడు దేశసేవలో ఉన్నాడని గర్వించే తల్లిదండ్రులు, భర్త రాక కోసం మధురానుభూతులతో నిరీక్షించే సతీమణి గుండెల్లో ఇప్పుడు అంతులేని విషాదం తాండవిస్తోంది. కొద్దిరోజుల కిందటివరకు తమ మధ్యనే ఉన్న ఆత్మీయుడు మంచుకొండల నడుమ నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగురోజుల నుంచి అన్నపానీయాలు లేక విలపిస్తూ మంచం పట్టారు. మండ్య: ‘నా భర్త స్వప్నాన్ని ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ఆయన కలను నెరవేర్చడానికి నేను సైన్యంలో చేరడానికి సిద్ధం. దేశ సేవ చేస్తా’ అని అమరవీరుడు గురు సతీమణి కళావతి ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాను గురు (33) స్మృతులను తలుచుకొని తల్లిదండ్రులు, భార్య ఇప్పటికీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో గురు తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని పదేపదే ఆవేదన చెందుతున్నారు. 14వ తేదీన మరణవార్త తెలిసిననాటి నుంచి తిండీ నిద్రకు దూరమై గురును స్మరిస్తున్నారు. పాకిస్థాన్‌ను నాశనం చేయాలి: తండ్రి హన్నయ్య గురు తండ్రి హన్నయ్య మాట్లాడుతూ.. గురు తన కుమారుడని చెప్పుకోవడానికి తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గురుతో పాటు ఎంతోమంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌ను సర్వనాశనం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనవడిని కూడా భారతసైన్యంలో చేర్పిస్తానని తెలిపారు. గురు భార్య కళావతి మాట్లాడుతూ.. తన భర్త మరో పదేళ్లపాటు సైన్యంలో సేవలు అందించాలని కలలు కనేవారన్నారు. అయితే ఉగ్రవాదులు ఆ కలను సర్వనాశనం చేశారని విలపించారు. భర్త కలను తాను నెరవేర్చుతానని, సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆవేశంగా చెప్పారు. ఆస్పత్రిలో చికిత్స నాలుగు రోజులుగా దుఃఖిస్తూ అస్వస్థతకు గురైన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురును కోల్పోవడంతో గుడిగెరె గ్రామంలో కూడా మౌనవాతావరణం నెలకొంది. గురుతో గడిపిన క్షణాలు తలుచుకొని గ్రామస్థులు, స్నేహితులు కన్నీటి పర్యతంమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురు కుటుంబ సభ్యులను ఆదివారం సీఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రదీప్ పరామర్శించి భారత సైన్యం అందించిన వీరమరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గురు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శించారు. పలువురు గురు తండ్రిని కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. గురు కుటుంబానికి ఆర్థిక సహాయం పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన గురు కుటుంబ సభ్యులను ఆదివారం ప్రముఖులతో పాటు ప్రజలు సాంవత్వన తెలిపి ఆర్థిక సహాయం అందించారు.గురు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి డీసీ తమ్మణ్ణ కోడలు కవిత సంతోష్ రూ.25 వేల నగదు అందజేశారు. శ్రద్ధాంజలి, పరామర్శలు సరిపోవని, దొంగదెబ్బతో సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులను అంతమొందించనపుడే సైనికుల ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె అన్నారు. బెల్‌బాటం కన్నడ చిత్రం హీరో హీరోయిన్లు రిషభ్ శెట్టి, హరిప్రియ, డైరెక్టర్ సంతోష్‌కుమార్‌లు గురు కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.75వేల ఆర్థిక సహాయం అందించారు. ఆత్మాహుతికి సిద్ధం ఆత్మాహుతి దాడి చేసి భారత సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులు,పాకిస్థాన్ సైనికులపై ప్రతీకారం తీర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అందుకు అదే తరహాలో ఆత్మాహుతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చేతన్ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసిన వీడియో వైరల్‌గా మారింది. సైనికులపై జరిగిన దాడిని జీర్ణించుకోలేకపోతున్నానని శత్రువలపై ప్రతీకారం తీర్చుకోవడానికి మనసు పరితపిస్తోందని వీడియోలో పేర్కొన్నాడు. -
రచ్చకెక్కిన గురు ఫ్యామిలీ
సాక్షి, చెన్నై: వన్నియర్ సంఘం నేత, మాజీ ఎమ్మెల్యే దివంగత కాడు వెట్టి గురు కుటుంబం రచ్చకెక్కింది. ఆయన కుమార్తె విరుదాంబిగై ప్రేమ వివాహం చేసుకోవడం, ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. తన కుటుంబం నుంచి ప్రాణహాని ఉందంటూ ఆమె కుంభకోణం పోలీసుల్ని ఆశ్రయించారు. వివాదాస్పద నేతగా కాడు వెట్టి గురు అందరికీ సుపరిచితుడే. రాందాసు నేతృత్వంలోని పీఎంకేకు కుడి భుజంగా వన్నియర్ సంఘాలు ఉన్నాయంటే, అందులో గురు పాత్ర కీలకం. వ్యక్తిగత పలుకుబడి కల్గిన నాయకుడిగా, వన్నియర్ సంఘాల్ని ఒకే వేదిక పైకి తీసుకొచ్చి నడిపించారు. అలాగే, కాడువెట్టి గురు చుట్టూ కేసులు మరీ ఎక్కువే. అరియలూరు జిల్లా ఆండి మడం నుంచి ఓ సారి, జయం కొండం నుంచి మరోసారి అసెంబ్లీకి సైతం ఎన్నికైన ఆయన వివాదాస్పద వ్యాఖ్యలతో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చారు. బలం కల్గిన నాయకుడిగా ముద్ర పడ్డ గురు అనారోగ్యం మేలో మరణించారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని, ఇక ఆయన కుటుంబానికి అన్ని తానై ఉంటానని పీఎంకే నేత రాందాసు ప్రకటించారు. గురు తన పెద్దకుమారుడు అని, ఆయన పిల్లలు తన మనవడు, మనవరాలు అని ప్రకటించారు. అయితే, ప్రస్తుతం ఆ కుటుంబంలో ఆస్తి వివాదం చాప కింద నీరులా సాగుతూ వచ్చి, ప్రస్తుతం విశ్వరూపం దాల్చడమే కాదు, రచ్చకెక్కింది. కుమార్తె వివాహం: కొద్ది రోజులుగా చాప కింద నీరులా సాగుతూ వచ్చిన కుటుంబ సమరం తాజాగా రచ్చకెక్కింది. కొద్ది రోజుల క్రితం తనయుడు ధన అరసన్ కనిపించడం లేదని గురు సతీమణి లత గగ్గోలు పెట్టారు. అదే సమయంలో తన తల్లి కనిపించడం లేదని ధన అరసన్ వీడియో వైరల్‌గా మారింది. ఈ పరిస్థితుల్లో బుధవారం గురు కుమార్తె విరుదాంబిగై వివాహంతో కుటుంబం ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. గురు మూడో సోదరి, తన చిన్న అత్తయ్య చంద్రలేఖ కుమారుడు మనోజ్‌ను ఆమె తంజావూరులోని స్వామిమలైలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహం వీడియో వైరల్‌గా సామాజిక మాధ్యమాల్లో మారాయి. అలాగే, తమకు భద్రత కల్పించాలంటూ విరుదాంబిగై వేడుకోవడం గమనార్హం. అదే సమయంలో ఈ వివాహానికి గురు భార్య లత మినహా బంధువులు, విరుదాంబిగై సోదరుడు ధన అరసన్ సైతం పాల్గొన్నట్టుగా మరో వీడియో తెర మీదకు రావడంతో కుటుంబ వ్యవహరాలు రచ్చకెక్కినట్టు అయింది. దీంతో తనకు, తన భర్తకు రక్షణకల్పించాలని విరుదాంబిగై కుంబకోణం పోలీసుల్ని ఆశ్రయించడం గమనార్హం. కాగా, గురు కుటుంబంలో వివాదాలు తారా స్థాయికి చేరి ఉన్న ఈ నేపథ్యంలో పీఎంకే నేత రాందాసు చూసి చూడనట్టుగా వ్యవహరించడంపై విమర్శలు బయలుదేరాయి. -
తాప్సీ లీడ్రోల్లో ‘గేమ్ ఓవర్’
టాలీవుడ్, బాలీవుడ్‌లలో సత్తా చాటిన తాప్సి ప్రధాన పాత్రలో వై నాట్ స్టూడియోస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న సినిమా గేమ్ ఓవర్. గతంలో లవ్ ఫెయిల్యూర్, గురు సినిమాలను తెరకెక్కించిన ఈ సంస్థ ఇప్పుడు తెలుగు తమిళ భాషల్లో మరో చిత్రాన్ని నిర్మిస్తోంది. ‘నయనతార’ ప్రధాన పాత్రలో తమిళ నాట ఘనవిజయం సాధించిన ‘మయూరి’ వంటి చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు అశ్విన్ శరవణన్.. గేమ్ ఓవర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమా ఈ రోజు(గురువారం) చెన్నై ప్రారంభమయింది. ఓ సరికొత్త కధ, కథనాలతో తెలుగు,తమిళ భాషలలో ఏక కాలంలో ఈ రోజు నుంచి ఏక ధాటిగా ఆంద్ర,తెలంగాణ,తమిళనాడు రాష్ట్రాలలోని పలు ప్రదేశాలలో ఈ చిత్రం షూటింగ్ జరుపుకోనుంది అని నిర్మాత ఎస్.శశికాంత్ తెలిపారు. -
లేడీ డైరెక్టర్ సినిమాకి యస్
హీరో సూర్య టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నారు. వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్‌ను మస్త్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్, కేవీ ఆనంద్ దర్శకత్వంలో హీరోగా సినిమాలు చేస్తోన్న సూర్య తర్వాతి చిత్రం ‘ఇరుది సుట్రు’ ఫేమ్ సుధా కొంగర డైరెక్షన్లో రూపొందనుందని కోలీవుడ్ సమాచారం. తొలిసారి ఓ లేడీ డైరెక్టర్‌తో సూర్య చేయనున్న చిత్రం ఇది. ‘ఇరుది సుట్రు’ తెలుగు రీమేక్ ‘గురు’ చిత్రం కూడా సుధా కొంగర దర్శకత్వంలోనే తెరకెక్కిన సంగతి తెలిసిందే. ‘మెర్సెల్, వేలైక్కారన్, సర్కార్’ చిత్రాలకు పాటలు రాసిన వివేక్ ఈ సినిమాకు కూడా లిరిక్స్ రాయనున్నారు. జీవీ ప్రకాశ్ సంగీతం అందించనున్నారు. ‘‘సూర్య సార్‌తో తొలిసారి వర్క్ చేయడం ఆనందంగా ఉంది. జీవీ ప్రకాశ్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. సుధా మేడమ్‌కి థ్యాంక్స్’’ అన్నారు వివేక్. -
తోట పనీ ధ్యానమే
ఆ జెన్ గురువు ఓ పర్వతం పాదాలకింద ఓ పర్ణశాల ఏర్పాటు చేసుకున్నాడు. అందులోనే ఏళ్ళ తరబడి నివసిస్తున్నాడు. ఆ ఆశ్రమంలో ఓ అందమైన పూలతోట కూడా ఉంది. ఆ తోటలో బోలెడన్ని పూలమొక్కలు. వాటి బాగోగులు పరిశీలించే పనులన్నీ శిష్యులకు అప్పగించారు సాధువు. వాళ్ళూ గురువుగారి మాట మీరకుండా పూదోటను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నిత్యమూ బోలెడు పువ్వులు వికసిస్తూ చూపరులను ఆకర్షించడమే ఆ పూలమొక్కల పని. సాధువుకు ఆ పూలవనం అంటే ఎంతో ఇష్టం. వాటిని శిష్యులు ప్రాణప్రదంగా చూసుకోవడం గురువుకెంతో నచ్చింది. అందుకే ఆయన ప్రతిరోజూ ఆ తోటలో కొన్ని గంటలు గడుపుతారు. అంతేకాదు, ఆయన కూడా కొన్ని మొక్కలకు నీరు పోస్తారు. పువ్వులతోనూ, మొగ్గలతోనూ, పచ్చని ఆకులతోనూ కబుర్లు చెబుతూనే, రాలిన ఆకులను సేకరించి తోటనంతా శుభ్రం చేస్తుంటారు. గురువు తీరుని చూసి ఆశ్చర్యంతో ఒకరడిగారు... ‘‘అయ్యా, ఈ తోటలో చెత్తాచెదారం మీరు బాగు చేయాలా... మీరు ఏం చెప్తే అది చెయ్యడానికి శిష్యులు ఉన్నారు... ఒకవేళ శిష్యులు బద్దకించినా డబ్బులు వెదజల్లితే తోట పనులు చెయ్యడానికి మనుషులు ముందుకొస్తారు కదా’’ అని. సాధువు నవ్వి ‘‘ఎవరో ఎందుకూ... నేను ఈ తోట పని చేస్తే తప్పేంటీ...’’ అని ప్రశ్నించారు. ‘‘తప్పు లేదండి. కానీ మీరు మహాత్ములు. ఎన్నో ప్రసంగాలు చేసే గొప్ప ఆలోచనాపరులు. మీ అపూర్వమైన కాలాన్ని మీరు మరివేటికైనా ఉపయోగించుకోవచ్చు కదా’’ అని ఆయన మనసులోని మాట చెప్పాడు. సాధువు ‘‘మిత్రమా, నేను ఒట్టి తోట పనే చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ నిజానికి నేను ఇక్కడ ధ్యానం చేస్తున్నాను... ప్రతి రోజూ నేను ఈ సమయం కోసమే నిరీక్షిస్తుంటాను. తోటలోకెళ్ళి ఎప్పుడు శుభ్రం చేస్తానా అని. ఇక్కడే ఇతర ఆలోచనలేవీ మనసులోకి రానివ్వక మొక్కలతోనూ పువ్వులతోనూ నా సమయాన్ని గడుపుతాను. మొక్కలకు నీరు పోస్తూ, వికసించిన పువ్వులతో మాట్లాడుతూ పరవశించి నన్ను నేను మరచిపోతుంటాను. అలాంటి అమృతఘడియలు మరెక్కడా అంత అమోఘంగా అద్భుతంగా దొరకవు. కనుక నాకీ తోట పనీ ఓ ధ్యానమే‘‘ అని చెప్పారు. – యామిజాల జగదీశ్ -
మరణించిన భోజన పాత్ర
శిష్యుడు ఆశ్రమాన్ని శుభ్రం చేస్తున్నాడు. చూడకుండా చేయి తగలడంతో ఒక పింగాణీ పాత్ర కిందపడి, భళ్లున బద్దలైంది. గురువుగారికి కోపమెక్కువ. పైగా ఆయనకు అది ఇష్టమైన పాత్ర. అందులోనే భోంచేయడం ఆయన అలవాటు. శిష్యుడికి భయమేసింది. ఒళ్లంతా చమట పట్టింది. గురువు తనను ఏం చేయనున్నాడో! చకచకా ఆ పెంకులన్నీ ఏరి ఒకచోట జాగ్రత్తగా పెట్టాడు. గురువుకు ఏమని సమాధానం చెప్పాలా అని ఆలోచించసాగాడు. కాసేపట్లో గురువు వస్తున్నట్టుగా పాదాల అలికిడి వినబడింది. శిష్యుడు ఎదురెళ్లి, వినయంగా చేతులు కట్టుకుని, ‘గురువర్యా, పొద్దున్నే నాకో సందేహం వచ్చింది. అడగమంటారా?’ అన్నాడు. శిష్యుడి వాలకం కొత్తగా అనిపించినప్పటికీ, అడగమన్నట్టుగా తలూపాడు గురువు. ‘అసలు మనుషులకు మరణం ఉండాల్సిందేనా?’ ప్రశ్నించాడు శిష్యుడు. ‘అది ప్రకృతి సహజం. ప్రతిదీ ఏదో రోజు నశించి తీరవలసిందే’ చెప్పాడు గురువు. వెంటనే అందుకున్నాడు శిష్యుడు: ‘అయితే, ఇవ్వాళ మీ భోజన పాత్ర మరణించింది’. వివేకవంతుడు కావడంతో గురువుకు తక్షణం జరిగినదేమిటో అర్థమైంది. శిష్యుడి ప్రశ్నకు ఉన్న మూలం గుర్తించాడు. దానికి కారణమైన తన కోపగుణం కూడా మనసులో మెదిలింది. శిష్యుడిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ‘ఇవ్వాళ నా కోపం కూడా మరణించింది’ అన్నాడు. -
ఎటువైపైనా ఒక వైపే
ఒక యువకుడు గుర్రం మీద బయల్దేరాడు. అతడు కొత్తగా బౌద్ధధర్మాన్ని స్వీకరించాడు. గుర్రం మీద ప్రయాణిస్తూ ప్రయాణిస్తూ ఒక చోటికి చేరుకున్నాడు. అక్కడ ఒక చిన్న యేరు అడ్డం వచ్చింది. అది ఉధృతంగా పారుతోంది. గుర్రంతో సహా దిగలేనంత లోతుగా ఉందని వెంటనే అంచనాకు రాగలిగాడు. కానీ ఎలా దాటడం? అవతలి వైపునకు ఎలా చేరడం? ఎంత ఆలోచించినా ఉపాయం తోచలేదు. గుర్రం దిగి చాలాసేపు అలాగే నిరీక్షించాడు. గుర్రం పచ్చిక మేస్తూవుంది. సాయంత్రం కావస్తోంది. యువకుడి సహనం నశిస్తూవుంది. అప్పుడు యేరుకు అటువైపు ఒక గురువు నడుస్తూ కనిపించాడు. యువకుడు ఉత్సాహంగా లేచి, గొంతెత్తి కేకేశాడు. ‘గురువర్యా, నేను అవతలి వైపు ఎలా రావాలి?’ గురువు ఏమాత్రం తడుముకోకుండా అంతే బిగ్గరగా సమాధానమిచ్చాడు. ‘నాయనా, నువ్వున్నది కూడా అవతలి వైపే’. ఇది హాస్యం కాదు. ఒక అవరోధం రాగానే ప్రయత్నాన్ని విరమించుకొమ్మని చెప్పడం కాదు. అసలు ఏ వైపైనా ఎందుకు దాటాలి? ఏ ప్రపంచం ఇవ్వగలిగే అనుభవం ఆ ప్రపంచానికే ఉండగా మరెక్కడికో చేరాలన్న ఉబలాటం దేనికి? గురువు చెప్పింది అర్థమైన యువకుడు సానుకూలంగా గురువుకు నమస్కరించి, తిరుగు ప్రయాణం కోసం మళ్లీ తన అశ్వం వైపు బయల్దేరాడు. ‘గురువర్యా, నేను అవతలి వైపు ఎలా రావాలి?’గురువు ఏమాత్రం తడుముకోకుండా అంతే బిగ్గరగా సమాధానమిచ్చాడు. ‘నాయనా, నువ్వున్నది కూడా అవతలి వైపే’. -
భూమ్మీదే స్వర్గనరకాలు
ఒక సైనికుడికి స్వర్గనరకాలు అంటే ఏమిటో తెలుసుకోవాలన్న జిజ్ఞాస కలిగింది. చాలామందిని అడిగాడు. దానికి వారు ఇచ్చిన సమాధానాలు అతడికి తృప్తి కలిగించలేదు. చివరగా సుదూర నగరంలోని ఒక గురువును ఆశ్రయించాడు. గురువుకు వినయంగా నమస్కరించి– ‘గురువర్యా! ఈ స్వర్గనరకాలు అంటారే, అవేమిటి?’ అని వినయంగా ప్రశ్నించాడు. ‘నీ ముఖానికి నీక్కూడా స్వర్గనరకాలు అంటే ఏమిటో తెలుసుకోవాలని ఉందా?’ కఠినంగా ప్రశ్నించాడు గురువు. సైనికుడు ఆ ప్రశ్నను ఊహించలేదు. అతడి ముఖంలో రంగులు మారినై. కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే తన ఒరలోని కత్తిని బయటికి తీశాడు. ‘అదిగో, నరక ద్వారం ఇప్పుడే తెరుచుకుంది,’ అన్నాడు గురువు. సైనికుడు మౌనం వహించాడు. ‘అయితే ఆ కత్తితో నా తలను ఖండిద్దామనే అనుకుంటున్నావా? నా మెడను నరికేంత పదును దానికి ఉందా?’ అన్నాడు ఆత్మవిశ్వాసంగా గురువు. గురువు మాటల్లోని ఆంతర్యం గ్రహించిన సైనికుడు సిగ్గుపడి కత్తిని తీసి మళ్లీ ఒరలో పెట్టుకున్నాడు. ‘ఇప్పుడు చూడు, స్వర్గ ద్వారం నిన్ను ఆహ్వానిస్తోంది’ అన్నాడు చిర్నవ్వుతో గురువు. సైనికుడి ప్రయాణం సఫలమైంది. తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న ప్రశ్నకు సరైన జవాబు దొరికింది.,కోపమే నరకం. శాంతియే స్వర్గం. ‘అదిగో, నరక ద్వారం ఇప్పుడే తెరుచుకుంది,’ అన్నాడు గురువు. సైనికుడు మౌనం వహించాడు. -
శిష్యుడు గురువ్రతుడు
గురువుగారూ! అని ఎవరినైనా పిలిస్తే వారు మనకు గురువులయిపోరు. నీ ఉద్ధరణ కోసం పాటుపడుతున్న వారిలో నీకు ఎవరిమీద గురి పెరిగిందో వారు నీకు గురువులు. గురిలేనప్పుడు వారు గురువులు కాలేరు, కారు కూడా. ఒక్కొక్కసారి గురువు ప్రమేయం లేకుండా కొందరు గురువుకి శిష్యులయిపోతుంటారు. పూనిక అంత గొప్పది. గురుశిష్యుల సంబంధం శిష్యుడి వైపునుంచి ప్రవహిస్తుంది. కబీర్దాసుగారి విషయంలో అలా జరిగింది. గురుశిష్య సంబంధం చాలా చమత్కారంగా ఉంటుంది. శిష్యుడి ఆర్తిచేత గురువవుతాడు తప్ప గురువుకి తెలియదు వాడు నా శిష్యుడని. ఆర్తితో శిష్యుడైపోతాడు. అంతేవాసిత్వాన్ని పొందేస్తాడు, ఉద్ధరణ పొందేస్తాడు. అంతే. మరి కొన్ని సందర్భాల్లో గురువు శిష్యుణ్ణి ఎంతగానో అనుగ్రహిస్తుంటాడు. అంతేవాసి అంటే శిష్యుడు. గురువు మనసులో చోటు సంపాదించి కొడుకయిపోతాడు. కొంతకాలానికి కొడుకుకంటే శిష్యుడే ఎక్కువ గుర్తుకొస్తుంటాడు. అలా శుశ్రూషచేత గురువు గారి హృదయంలో చేరిపోతాడు. గురువుకూడా ప్రేమతో స్వీకరిస్తాడు. గురువు ఆజ్ఞ స్వీకరించి ఈశ్వరపథంలో నడవడానికి అనుష్ఠానం చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అటువంటి శిష్యుణ్ణి చూసి ’ఏమి దీక్షరా, ఎంత అనుష్ఠానం చేస్తున్నాడ్రా, ఎంత ధార్మిక జీవనం చేస్తున్నాడ్రా’ అని గురువు మురిసిపోతుంటాడు. గురుశిష్య సంబంధాల్లో అనేక విధాలుంటాయి. పతివ్రత అనేమాట మీరు వినే ఉంటారు కదా ! అటువంటిదే గురువ్రత అనే మాట ఒకటుంది.అత్యంత ప్రీతిపాత్రమైన శిష్యుణ్ణి పిలిచేటప్పుడు మాత్రమే గురువు ఈ మాట వాడతాడు. పతివ్రత అంటే ఆమె ఆలోచనలన్నీ ఆమె భర్త గౌరవాన్ని పెంచడం పైనే కేంద్రీకృతమై ఉంటాయి. అలా గురువ్రతుడైన శిష్యుడు గురువుగారి గౌరవాన్ని పెంచుతూ ఆయనకు వశవర్తయి ఉంటాడు. అందుకే ’ఇదినాది’అనే భావన ఉండదు. ‘ఇదంతా నీది. నీ ఉచ్చిష్టాన్ని నేను ప్రసాదంగా అనుభవిస్తున్నాను’ అనే భావనతో ఉంటాడు. గురువు సమర్థ రామదాసు కనబడితే భిక్షాపాత్రలో శివాజీ మహరాజ్ ఒక కాగితం ఉంచాడు. అది విప్పి చూస్తే రాజ్యమంతా ధారపోసినట్లుంది. ‘‘నాకెందుకురా సన్యాసిని. నా ప్రసాదంగా నువ్వే ఏలుకో. ఇదిగో కాషాయ పతాకం. అన్ని చోట్ల పెట్టు.’’ అన్నాడు. అలాగే విద్యారణ్యులవారు రాజ్యస్థాపన చేసారు. తర్వాత దాన్ని హరిహర బుక్కరాయల వారికి ఇచ్చేసారు. ఇప్పటికీ శృంగేరీ గురువులకు ‘కర్ణాటక సింహాసన ప్రతిష్ఠాపనాచార్య’ అన్నది వారి బిరుదావవళిలో వినిపిస్తుంటుంది. గురువోచ్చిష్టం. గురువు తాను ఏం అనుభవిస్తున్నాడో ఎంత ఐశ్వర్యం ఉందో అది గురువోచ్చిష్టంగా శిష్యుడు అనుభవిస్తాడు. శిష్యుడు బయట ఎంత గొప్పవాడయినా గురువ్రతుడిగా గురువుకి లొంగి ఉంటాడు. ‘ఆజ్ఞాపాలన హనుమ’ లాగా గురువుగారు చెప్పే దానిని శాసనంగా స్వీకరిస్తాడు. ఆయన శాసకుడు. గురుశిష్య సంబంధంలోని ఒక సత్యాన్ని రూఢం చేసుకున్నవాడిని ‘గురువ్రత’ అంటారు. ఏమిటా సత్యం? ‘గురువు శాసకుడు తప్ప అభ్యర్థించువాడు కాడు’ అని. లోకంలో ఎవరు ఇచ్చినా అది సలహా కావచ్చు. కానీ గురువు ఇచ్చేది ఆజ్ఞ. ‘నేను కింకరుణ్ణి. ఆయన చెప్పింది చేసేయడమే నా పని’ అనేది శిష్యుడి భావనగా ఉంటుంది. ‘నాకు, నా భార్యకు అత్యంత ప్రియమైన పని ఒకటి ఉంది. మంచిపనే. ఎందుకో ఒకరోజు గురువుగారు – ’ అది నువ్వు జీవితంలో చేయడానికి వీల్లేదు’ అన్నారు. ఎందుకని అని–మేం అడగలేదు. ఆనాటినుంచి నేను కానీ, నా భార్యకానీ దాని జోలికెళ్ళలేదు. దాన్ని సలహాగా కాదు, శాసనంగా స్వీకరించాం. ప్రపంచంలో ఎవరయినా ఇంకొకరికి లొంగితేనే వృద్ధిలోకి వస్తారు. -
గురువుగారిల్లు గుడితో సమానం
బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా గురువు తపించేది శిష్యుడికోసమే. అంతగా పరితపించే గురువు శిష్యుడినుండి ఏం కోరతాడు? ఏమీ ఉండదు. అంటే తను అడగ దలుచుకున్నది బలవంతంగా అణచుకోవడం కాదు. కోరుకోవడానికి ఆయనకు మరే కోరిక ఉండదు కనుక. ’నాకిది కావాల్రా’ అని అడగడు. కారణం –ఆయన కోరుకుంటే ఇచ్చేవాడు వేరొకడున్నాడు(పరమేశ్వరుడు). ఆయన్ని అడుగుతాడు తప్ప శిష్యుడి ముందు చేయిచాపడు. అయనకా అవసరం లేదు కూడా. ఆయన పరిపూర్ణుడు. ఎప్పుడూ తృప్తితో ఉంటాడు. మరి అటువంటి గురువు పట్ల శిష్యుడి కర్తవ్యం? గురువుగారు శరీరంలో ఉండేటట్లు చూసుకోవడమే. శరీరం అనిత్యమని గురువుకు తెలుసు. అది పడిపోతుంది. కించిత్ బెంగపెట్టుకోడు. ‘నేను ఆత్మ, శాశ్వతం. ఎక్కడికీ వెళ్ళను’ అన్న అవగాహనతో పరమ సంతోషంతో ఉంటాడు. ఈ శరీరంతో అనుభవించడానికి ఆయనకు భోగాపేక్ష ఉండదు. ఒకవేళ కష్టం వస్తే... గతజన్మల తాలూకు కర్మఫలం పోతున్నదని అనుభవిస్తాడు. కానీ గురువుగారి శరీరం లేకపోతే నష్టం కలిగేది శిష్యులకు. ఊపిరి త్వరగా తీసి త్వరగా విడిచిపెడుతుంటే ఆయువు క్షీణిస్తుంటుంది. బోధనలు నిర్విరామంగా చేస్తూంటాడు గురువు. ఆయన ఆయువు త్వరగా క్షీణిస్తుంది. ఇలా శిష్యులకోసం తన ఆయువును తాను తగ్గించుకుంటున్న గురువుకు శిష్యుడు చెయ్యడానికేమీ ఉండదు. మరి ఏం చేయాలి ? కేవలం శుశ్రూష మాత్రమే చేయగలడు. ఆయన శరీరం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండడం కోసమని తాపత్రయపడి చేసే సేవే శుశ్రూష. ఇది స్థాన శుశ్రూష అని, దేహ శుశ్రూష అని రెండు రకాలు. స్థాన శుశ్రూష అంటే – గురువుగారి ఇల్లు సాక్షాత్ పరమేశ్వరుడు కొలువైన దేవాలయంతో సమానం. అందుకే గురువుగారి ఇంటిపక్కనుంచి వెళ్ళేటప్పుడు అది గుడి అన్న భావనతో ప్రదక్షిణంగా వెడతారు చాలామంది. విరాటపర్వంలో ఉత్తరకుమారుడితో అర్జునుడు– ‘‘రథం నడపడంలో నీకంత ప్రవేశం లేదు. ఆయన మా గురువు ద్రోణాచార్యులవారు. వారు నాకు పరమ పూజ్యులు. నీవు రథం నడిపేటప్పుడు పొరబాటున కూడా నా రథాన్ని మా గురువుగారి రథం ముందు పెట్టవద్దు. మా గురువుగారి రథం నా ఎడమవైపున కూడా ఉండడానికి వీల్లేదు. వారి రథం నా కుడి చేతివైపునే ఉండాలి. కారణం– నేను మా గురువుగారి మీద బాణం వెయ్యను. గురువుగారే ఒకవేళ ముందు వేస్తే...నేను క్షత్రియుడిని కాబట్టి దానికి బదులుగా బాణం వేస్తాను తప్ప నా అంతట నేను వేయను. యుద్ధరంగంలోకి వెళ్ళేటప్పుడు కూడా వారి రథాలకు ప్రదక్షిణచేసి లోపలకు నడుపు’’ అన్నాడు. దీన్ని స్థాన శుశ్రూష అంటారు. దానివల్ల గురువులకు ఒరిగేదేమీ ఉండదు. శిష్యుడి స్థాయి పెరుగుతుంది. అంతే. గురువుగారు ఉన్న ఇంటిని శుభ్రం చేయడం, గురువుగారి అవసరాలు గుర్తెరిగి సమకూర్చడంవంటివి చేస్తారు. దేహ శుశ్రూష–దేహము అంటే దహ్యమానమయిపోతుంది. ఆయన శరీరం బడలిపోతుంది. నీరసపడిపోతుంది. వయసు పెద్దదవుతుంది. శరీరంలో బలమూ తగ్గిపోతుంది. కానీ ఆయనకు శిష్యుడిపట్ల ప్రేమ ఎక్కువవుతుంటుంది. ఆ గురువు ఉండాలి ఆ శరీరంలో. అందుని గురువుగారు పడుకుంటే ఆయన కాళ్ళు ఒత్తుతారు. మంచినీళ్ళు తెచ్చిస్తుంటారు. గురువుగారు నదీస్నానం చేస్తుంటే ప్రవాహదిశలో దిగువకు శిష్యుడు స్నానం చేస్తాడు. గురువుగారిని తాకి వస్తున్న నీరు గంగకన్నా గొప్పది. -
గురువు సదాశివుడు
గురువు బ్రహ్మ అనీ, గురువు విష్ణువు అనీ తెలుసుకున్నాం. గురువు మహేశ్వరుడెలా అయ్యాడో చూద్దాం. మహేశ్వరుడేం చేస్తాడు? ఆయన లయకారకుడు. అంటే చంపేస్తాడని కాదు. స్వల్పకాలిక లయం, ఆత్యంతిక ప్రళయం, మహా ప్రళయం అని మూడు చేస్తాడు. అవికూడా పరమదయతో చేస్తాడు. అంతేకానీ ఆయనది క్రౌర్య స్వభావం కాదు. అందుకే ఆయనకు ’సదాశివ’అని వేదం బిరుదిచ్చింది. ఆయన ఎప్పుడూ ఎవ్వరిజోలికి వెళ్ళి బాధపెట్టే స్వభావమున్న వాడు కాదు. కోపం నటిస్తాడు, అదీ మనకోసమే, మన ఉద్ధరణకోసమే తప్ప నాన్నగారు వేలు చూపిస్తూ ’చితక్కొట్టేస్తా’ అంటే అది మనలను బాగుచేయడానికే కదా! అలా అన్నప్పుడు తండ్రి మనసులో ఎంత ప్రేమ ఉంటే అంత కోపం వ్యక్తమయిందో శివుడి కోపంలో కూడా అంతే ప్రేమ ఉంటుంది. అందుకని సదాశివ. గురువు సదాశివ. ఎందువల్ల? శివుడు లయకారకుడు. కొన్నిటిని నొక్కేస్తాడు. గురువు చేసే పని–శిష్యుడు ఎక్కడ పొరపాటు చేస్తున్నాడో పట్టుకుంటాడు. సాధనలో అనేక వైక్లబ్యాలుంటాయి. ‘నేను మంచి మార్గంలో వెడుతున్నా’ అనుకుంటూ శిష్యుడు దారితప్పి ధర్మానుష్ఠానంలో వైక్లబ్యాన్ని పొందుతాడు. వెళ్ళరాని మార్గంలో వెళ్ళిపోతుంటాడు. ధర్మం అత్యంత ప్రధానం. పరమ సున్నితమైన విషయమది. అంత సున్నితమైన ధర్మాన్ని ఆచరింపచేయడంలో గురువు దిద్దుతుంటాడు శిష్యుణ్ణి.గురువుగారితో బాగా అంటకాగి తిరగడం అలవాటయింది. గురుబోధలు వింటూ తన సంసారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. గురువుగారికి అనుమానమొచ్చింది. పిలిచి – ’ఏమిరా, నేను గృహస్థాశ్రమంలో లేనా! నా భార్యాబిడ్డల్ని చూడ్డం లేదా ! ధర్మం ధర్మమే. గృహస్థుగా ఉండగా నీ మొదటి కర్తవ్యం వారి బాగోగులను చూడడం.’’ అని హెచ్చరించి దిద్దుతాడు. ’కర్తవ్యం’ అని ఒక మాట ఉంది. గురువు గొప్పదనమంతా కర్తవ్యనిష్ఠలో ఉంది. గురువు ఒకసారి చెప్తాడు.. వినలేదు, రెండుసార్లు, మూడుసార్లు చెప్తాడు.. వినలేదు. తను బతికున్నంత వరకు చెపుతుంటాడు తప్ప ‘నీ ఖర్మ’ అనడు. అది కర్తవ్యం. అంటే చేయవలసిన పని తాను చేయడం. ఫలితం–ఈశ్వరానుగ్రహం. కొడుకును కన్న తరువాత వాడికి విద్యాబుద్ధులు నేర్పించడం, వాడికి సరైన ఆదర్శంగా నిలబడడం, వాడు మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా తాను జీవించడం గృహస్థు ధర్మం. కొడుకు అలాగే ఉంటే సంతోషం. అలా ఉండకపోతే? బెంగపెట్టేసుకుని గృహస్థు అనుష్ఠానం మానేయకూడదు. తన అనుష్ఠానం తాను చేసి వెళ్ళిపోవాలి. అది కర్తవ్యం. ఈశ్వరునిపట్ల నమ్మకం వేరు, ఆశ్రమధర్మం వేరు. ఆశ్రమధర్మాన్ని ఆశ్రమ ధర్మంగానే పట్టుకోవాలి, నీవు పండేవరకు. నీ కర్తవ్యం పూర్తయ్యేవరకు నీవలాగే పట్టుకోవాలి. శిష్యుని పొరబాట్లను గురువు దిద్దుతాడు. ఉత్థానపతనాలలో జారిపోకుండా శిష్యుణ్ణి కాపాడుకుంటాడు. గురువు ఒక్కొక్కసారి తీవ్రస్వరంతో మాట్లాడతాడు. కోపాన్ని ఆయుధంగా తీసుకుని చక్కబెడతాడు. ఒక్కొక్కసారి ప్రశాంతవదనంతో మాట్లాడతాడు. ఏది ఎలా మాట్లాడినా లక్ష్యం ఒక్కటే. శిష్యుణ్ణి కాపాడుకోవాలి. ధర్మంనుంచి జారిపోకుండా చూసుకోవాలి. అలా చూసుకునే ప్రక్రియలో గురువు మహేశ్వర స్వరూపంతో నిలబడతాడు. అలా గురువు బ్రహ్మగా, విష్ణువుగా, మహేశ్వరుడిగా తన కర్తవ్యాన్ని పాలిస్తాడు. వెరసి గురువు పరబ్రహ్మ. -
విషాదాన్ని అలా పోగొట్టుకున్నాడు
రాయబారాలన్నీ విఫలమై, తీరా యుద్ధం ప్రారంభమయ్యే తరుణంలో అర్జునుణ్ని విషాదం చుట్టుముట్టింది: ‘నా శరీరంలోని ఇంద్రియాల్లాంటి ఈ నా చుట్టాల్నీ, సొంతవాళ్లనీ చంపి ఏం బావుకోవాలి?’ అనే జాలి పుట్టుకొచ్చింది. శ్రీకృష్ణుణ్ని ‘నాకిప్పుడేమీ పాలుపోవడం లేదు. నాకు గురువువై మార్గాన్ని చూపించు’ అని వేడుకొన్నాడు. శ్రీకృష్ణుడప్పుడు కర్తవ్యాన్ని బోధించాడు: ‘ఇక్కడ ఈ లోకంలో లోపలా బయటా అన్నీ సంఘర్షణలే. వాటి నుంచి ఎవడూ పారిపోలేడు. ఈ కర్మలనన్నిటినీ నిమిత్త మాత్రంగా చెయ్యాలి తప్ప, వాటి ఫలితాల ఆస్తి మీద మనకెవ్వరికీ హక్కు లేదు. పరమేశ్వరుణ్నే శరణు కోరుకొని, ఫలితాలన్నీ అతనివేనన్న వివేకంతో, అతని చేతిలో ఒక సాధనంగా మాత్రమే పనిచెయ్యాలి. ఇక్కడ ఎవ్వరూ ఎవ్వర్నీ చంపడం లేదు, చావడం లేదు కూడాను. మార్పులకు గురి అయ్యే శరీరాలు మార్పుల్ని పొందితే మనం ఏడవవలసిన పనిలేదు. అంతటా వ్యాపించి ఉన్న మనలో ఎవరికీ చావులేదు. భగవంతుణ్నే గుండెలో పెట్టుకొని తొణుకూ బెణుకూ లేకుండా ఈ జగన్నాటకాన్ని వినోదంగా చూస్తూ ఉండాలి. అతనూ నేనూ ఒకటేనన్న భావాన్ని రూఢి చేసుకొని, జీవితంలో సంఘర్షణలన్నీ నవ్వుతూనే ఎదుర్కోవాలి. అప్పుడే నీ మోహం పోతుంది’. ఈ ఉద్బోధను విని, విషాదాన్ని పోగొట్టుకుని గురువు చెప్పినట్టుగానే చేస్తూ అర్జునుడు యుద్ధంలో విజృంభించాడు. మొత్తంమీద భారతమంతటా అర్జునుడి సాధకరూపం ఉట్టిపడుతూ వచ్చింది. -
గూగుల్ కన్నా గురువే మిన్న
సాక్షి, భువనేశ్వర్ : సామాజంలో పరివర్తన తీసుకురావండలో గురువుది అద్వితీయమై పాత్రని భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ విషయంలో గూగుల్ లేదా మరో సెర్చ్ ఇంజిన్ ఎన్నటికీ గురువుకు పోటీకాలేవని ఆయన స్పష్టం చేశారు. తల్లి, మాతృభూమి, మాతృభాష, గురువు అనే ఈ నలుగురు వ్యక్తి జీవిత రేఖను నిర్ణయిస్తారని ఆయన అన్నారు. భువనేశ్వర్‌లోని కేఐఐటీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సం కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆధునిక కాలంలో గూగుల్ ముఖ్యమైనదే.. కానీ గురువును కాదనేంత స్థాయిలో మాత్రం కాదని వెంకయ్యనాయుడు విద్యార్థులకు చెప్పారు. ఇంగ్లీష్, హిందీ, ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలు నేర్చుకోవడంలో తప్పులేదు.. కానీ మాతృభాషను కాపాడుకోవాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఆవేదన, ప్రేమ, బాధ వంటి భావాలను మాతృభాషలో స్పష్టం చేసినట్లుగా ఇతర భాషల్లో వ్యక్తం చేయలేమని ఆయన అన్నారు. -
మంచి శిష్యుడికోసం ఆరాటం!
మర్త్యలోకంలో (మానవలోకంలో) ఉన్నాడంటే పాపపుణ్యాల ఫలితాలు సుఖదుఃఖాలుగా అనుభవించడానికి వచ్చాడని గుర్తు. ఇక్కడకు వచ్చినవాడెవడూ పూర్తి సుఖాన్నీ పొందడు, పూర్తి దుఃఖాన్నీ పొందడు. నూరేళ్లు కష్టాలు పడ్డా, చివరకు మంచి మాట వింటాడు ఏదో ఒకటి. కానీ జీవితమంతా సుఖాలుండవు, అలాగే దుఃఖాలు కూడా ఉండవు. ఏవయినా కొన్నాళ్లే. మారిమారి అనుభవిస్తుంటాడు. ఇవి అనుభవంలోకి వచ్చినప్పుడు తాత్కాలికమైన ఉపశమనాలకోసం చూస్తే ఉద్ధరణ ఉండదు. అలా లేకుండా పోవాలంటే వైరాగ్యంతో భగవంతుడిని ఆశ్రయించాలి. ఆ అనుగ్రహం గురువు కారణంగానే వస్తుంది. గురువు రక్షణ బాధ్యత స్వీకరిస్తాడు. అందుకే శంకర భగవత్పాదులంటారు ‘సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్త్వం, నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః’. గురువు సత్ స్వరూపుడు. రామకృష ్ణపరమహంస అంటారు. ఏనుగుకు ఒక లక్షణం ఉంటుంది. అదలా వెళ్ళిపోతూ తన తొండాన్ని చాపి కనబడ్డ ప్రతి వస్తువునూ పీకుతుంది. అది జాజి తీగ కానివ్వండి, పనసచెట్టు కానివ్వండి. దానికనవసరం. అది లాగేస్తుంది. అదే ఏనుగు పక్కన మావటి వెడుతున్నాడనుకోండి. అది తొండం ఎత్తినప్పుడల్లా తన చేతిలో ఉన్న అంకుశం ప్రయోగిస్తాడు. అంతే. ఎంత బక్కపలచటివాడైనా మావటి మాటకు అంతటి బలమైన ఏనుగు లొంగిపోతుంది. దేన్నీ పాడుచేయదు. గురువుగారితో మమేకం చెందిన శిష్యుడు నిరంతరం గురువుని స్మరిస్తుంటాడు. నేనీ తప్పు చేస్తే, గురువుగారి దగ్గరకు వెళ్ళి ఏముఖం పెట్టుకుని నిలబడను? గురువు గారికి తెలియదులే అనుకుంటారా! మరి గురువు ఇంకెందుకు పరబ్రహ్మం అయినట్లు! ఒకవేళ గురువుగారికి నిజంగానే తెలియదనుకుందాం. నువ్వు తప్పుచేసి గురువుగారి దగ్గరకు వెళ్ళి తప్పుచేయని వాడిలా నిలబడతావా! అది గురుద్రోహం కాదా! కట్టి కుడుపదా! ‘నేనీ తప్పుచేయను. గురువుగారి ముందు నిలబడి నమస్కరించగల యోగ్యత నాకు చాలు’ అనుకున్నప్పుడు.. గురువు రక్షణ బాధ్యత స్వీకరించినట్లే. ఆ గురువు వలన ఉత్తర జన్మలన్నీ కూడా నిలబడ్డాయి. మంచి జన్మలలోకి వెళ్ళిపోతాడు. ఇంకా మంచి జన్మలలోకి వెళ్ళి శాస్త్రం మీద అధికారం ఉన్న తండ్రి కడుపునపుట్టి ఆయన అనుష్ఠానాన్ని చూసి ఆయన దగ్గర ఉపదేశం పొంది చాలా తొందరగా వైరాగ్యాన్ని పొంది బహుకొద్ది జన్మలలో ఈశ్వరుడి లోకి చేరిపోతాడు. అందుచేత గురువు రక్షకుడు. అంతేకాదు, మనం పొందిన జ్ఞానాన్ని నిలబెట్టేవాడు గురువే. గురువంటే డిగ్రీ సర్టిఫికెట్ ఇచ్చినట్లుగా ఓసారి చెప్పేసి వదిలిపెట్టేవాడు కాడు. గురువుతోడి అనుబంధం తెగిపోయేది కాదు. అలాగే శిష్యుడు లేని గురువు కూడా శోభిల్లడు. శిష్యుడికోసం పాకులాడతాడు గురువు. ‘అవంతీ హోమం’ అని వేదంలో ఒక ప్రస్తావన ఉంది. ఇది యోగ్యులైన శిష్యుల కోసం చేస్తారు. యోగ్యులైన శిష్యులు తన దగ్గరకు వచ్చి పాఠం నేర్చుకోవాలని గురువు ఈ హోమం చేస్తాడు. ఇది స్వార్థం కాదు, త్యాగం. కారణం తన విద్య తనతో పోకూడదు. సరస్వతి అంటే ప్రవాహం. గంగానది కళ్ళకు కనబడుతుంది, యమున కనబడుతుంది, అంతర్వాహిని అయిన సరస్వతి కనబడదు. అది అంతర్లీనంగా ప్రవహిస్తుంది. గురువు విద్య ఆ గురువుతో ఆగిపోకూడదు. ఆ గురువు హృదయాన్ని, ఉపదేశాన్ని అందిపుచ్చుకుని గురువుగారిలా తయారు కాగలిగిన శిష్యుడు దొరకాలి. దానివల్ల ఎప్పటికీ బోధ చేసే వాళ్ళుంటారు. అప్పుడే ఈ లోకానికి క్షేమం. -
ఆయనకు గుడి లేదు, పూజా లేదు!
గురుర్బ్రహ్మ్ర... అంటాం. గురువు బ్రహ్మ ఎలా అయ్యాడు? బ్రహ్మగారికి పూజలు లేవు కదా. అలా లేకపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. వాటిలో ఒకటి– బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏమీ లేదు కనుక. అంటే... మనం చేసిన కర్మఫలితానికి ఈ శరీరాన్ని ఇచ్చేసాడు. మళ్ళీ ఇవ్వాలంటే ఈ శరీరం పడిపోవాలి. ఈ శరీరంతో ఉండగా ఇక బ్రహ్మగారు కొత్తగా అనుగ్రహించడానికి ఏముంది.. అందుకని ఆయనకు గుడిలేదు, పూజలేదు. స్థితికారుడైన విష్ణువు, జ్ఞానదాత అయిన మహేశ్వరుడు మాత్రం అనుగ్రహిస్తారు. బ్రహ్మ సృష్టి చేస్తాడు. సృష్టికంతటికీ పెద్దవాడు. అందువల్ల ఆయనను గౌరవించాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు మనం చేసిన కర్మలను బట్టి శరీరాన్ని ఇస్తుంటాడు. మనుష్యుడు పొందిన ఈ శరీరాన్ని బట్టి కర్మాధికారం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం జాగ్రత్తగా గమనించాలి. ’జంతూనాం నరజన్మ దుర్లభం’అంటారు శంకరభగవత్పాదులు. అంటే అందరూ పశువులే. పశువుకానివాడు ఉండడు. పశువు అంటే పాశం చేత కట్టబడినది. జన్మ అది ఒక రాట(పశువులను కట్టే గుంజ). కర్మపాశాలు పలుపుతాళ్ళు. అవి మెడకు తగిలి ఉండడంవల్ల ఆ కర్మ ఫలితాలను అనుభవించడానికి మనుష్యుడు ఒక శరీరంలోకి వస్తాడు. ఆ కర్మపాశాలను తెగకోయకలిగినవాడు–పశుపతి. ’ఈశ్వరా! నేను పశువుని. మీరు పశుపతి. నన్ను ఉద్ధరించడానికి మనిద్దరి మధ్య ఈ సంబంధం చాలదా’ అన్నారు శంకరులు. కాబట్టి బ్రహ్మగారిచ్చిన ఈ శరీరం ఒక అద్భుతం. దేవతలు, మనుష్యులు, రాక్షసులు, మిగిలిన తిర్యక్కులు (భూమికి వెన్నుపాము అడ్డంగా కలిగిన ప్రాణులు).. అలా అన్నిటిలోకి మనుష్యుల శరీరమే గొప్పది. మనుష్యుడు ఎక్కడుంటాడు... మర్త్యలోకంలో ఉంటాడు. మర్త్యలోకమంటే.. మృత్యువుచేత గ్రసింపబడేది. అంటే ఈ లోకంలోకి ఏ ప్రాణివచ్చినా అది వెళ్లిపోతుంది ఒకనాడు.‘జాతస్యహి ధృవో మృత్యుః ధృవం జన్మ మృతస్యచ’’. వచ్చిన ప్రతి శరీరం వెళ్ళిపోవలసిందే. అయినా మనుష్య శరీరం చాలా గొప్పది. కారణం ? దేవతలు మనకన్నా గొప్పవాళ్ళంటారేమో! కానీ వారి శరీరాలకు కర్మాధికారం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వాళ్లకా అధికారం లేదు. వాళ్ళ పుణ్యం క్షీణించిపోయే వరకు దేవలోకాల్లోఉండి తరువాత మర్త్య లోకంలో పడిపోయి మళ్ళీ సున్నతో మొదలు పెడతారు. కానీ మనుష్యుడు అలా కాదు. ఇక్కడుండి పుణ్యం చేసుకుని దేవలోకానికి వెళ్ళగలడు. లేదా చిత్తశుద్ధి కలిగి, దాని వలన జ్ఞానం కలిగి, మోక్షం కావాలని కోరుకుని తద్వారా ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేకుండా పునరావృత్తిరహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని పొందగలడు. మనుష్యశరీరంతో వచ్చినా, దానివిలువ తెలియనప్పుడు పాపకర్మలే చేసి కేవలం తాను బతికితే చాలని, ఇతరులగురించి ఆలోచించకుండా, శాస్త్రాధ్యయనం చేయకుండా, గురువుగారి పాదాలు పట్టుకోకుండా స్వార్థంతో బతికి చివరకు మళ్ళీ కొన్ని కోట్లజన్మల వెనక్కి తిర్యక్కుగా వెళ్ళిపోగలడు. మోక్షం పొందాలన్నా, దేవతా పదవులలోకి వెళ్ళాలన్నా, పాతాళంలోకి వెళ్ళాలన్నా, తిర్యక్కుగా వెళ్ళిపోవాలన్నా... మనుష్య శరీరానికే. అంటే పైకెక్కాలన్నా, కిందకుపోవాలన్నా ఇక్కడికి రాకుండా ఉండాలన్నా అటువంటి కర్మచేయగల అధికారం ఉన్న ఏకైక ప్రాణి సృష్టిలో మనుష్యుడు ఒక్కడే. ఈ శరీరాన్ని బ్రహ్మగారిచ్చారు. ఇస్తే... ఏమిటి దానివల్ల ఉపయోగం? సనాతనధర్మంలో ఆశ్రమ వ్యవస్థ వచ్చింది ఎందుకు... మెలమెల్లగా వ్యామోహాన్ని తీసేసి భగవంతునివైపు నడిపించడానికి. అందుకే ఎప్పుడు ఆశ్రమం మారినా, ఆ మార్పుచేత కట్టు మీద కట్టు వేసినా, ఆ కట్టువేయవలసినవాడు ఎవడు... అంటే... గురువొక్కడే. గురువుకు తప్ప ఆ కట్టువేసే అధికారం మరెవ్వరికీ లేదు. -
గురుపాద స్మరణే... సాధనకు మార్గం
‘‘నాకు ఉపనయనం చేసేటప్పుడు మా తండ్రిగారు గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేశారు. తదనంతరం వేరొక గురువు మరొక మంత్రాన్ని ఉపదేశించారు. నేను ధ్యానం చేసేటప్పుడు, జపం చేసేటప్పుడు నా మనోనేత్రంతో ఏ దేవతా స్వరూపాన్ని చూస్తున్నానో నాకు ఆమె కనబడడం లేదు. ఆమెకు బదులుగా గురువుగారిచ్చిన వేరొకమంత్రం తాలూకు దేవతా రూపం కనబడుతున్నది. పోనీ ఆ మంత్రం చేద్దామనుకుంటే, తండ్రిగారిచ్చిన గాయత్రీ స్వరూపం కనబడుతోంది. ఒక్కొక్కసారి ఈ రెండూ కూడా కనబడకుండా ఇష్టదేవతా స్వరూపం కనబడుతున్నది. మరి ఆ ధ్యానశ్లోకం చెప్పి ఆ దేవతా స్వరూపాన్ని మనోనేత్రంతో చూడకుండా వేరొక దేవతా స్వరూపం లోపల దర్శనమవుతుంటే–అటువంటి రూపాన్ని ధ్యానం చేస్తూ జపం చేయవచ్చా ?’’ – మహాపురుషులు శృంగేరీ పీఠానికి ఆధిపత్యం వహించిన శ్రీ చంద్రశేఖర భారతీ స్వామి వారిని ఓ జిజ్ఞాసువు అడిగిన ప్రశ్న ఇది. ఉపదేశం పొందిన ఒక్కొక్క మంత్రానికి ఒక ధ్యానశ్లోకం ఉంటుంది. అంతటా నిండిన పరబ్రహ్మాన్ని సాకారరూపంగా ఇలా ఉంటుంది... ఆ రూపం అని చెప్పి ఊహచేస్తాం. తర్వాత మనసు దానితో తాదాత్మ్యత చెందడం మొదలుపెడుతుంది. ఉప్పుతో చేయబడిన ఒక బొమ్మ సముద్రంలో పడినప్పుడు లోతుకు వెళ్ళేకొద్దీ సాగరజలాల్లో అది కరిగిపోయినట్లు– ఏ వస్తువుపట్ల ధ్యానం మొదలుపెట్టాడో ఆ వస్తువులోనే సాధకుడు ఐక్యమయిపోతాడు. ఇప్పుడు ధ్యానం, ధ్యానవస్తువు, ధ్యేయం... మూడు ఒకటయిపోయి ఒక వస్తువుగా నిలబడిపోతుంది. అప్పుడు లోపలినుంచి ఆనందం అంకురించి రోమాంచితమవుతుంది. అలా జపం చేసేటప్పుడు శరీరానికి కదలిక లేకుండా ప్రాణాయామంతో ఊపిరిని బాగా క్రమబద్ధీకరిస్తే మనసు కదలదు. కదలని మనస్సును నిలబెట్టి ధ్యానవస్తువుని చూస్తూ క్రమంగా దేన్ని ధ్యానిస్తున్నాడో దానిలోకి లయమయ్యే ప్రయత్నం చేస్తాడు సాధకుడు. జిజ్ఞాసువు సందేహాన్ని విన్న స్వామివారు –‘‘నీకు నీ గురువుగారి పాదాలు గుర్తున్నాయా?’’ అని అడిగారు. ‘మా గురువుగారి పాదాలు నాకు ఎప్పుడూ జ్ఞాపకమే. అవి ఎప్పుడూ నా స్మరణలోనే ఉంటాయి’ అని ఆయన సమాధానం చెప్పారు. ‘‘గాయత్రి మహామంత్రం చేసినా, గురువుగారిచ్చిన వేరొక మంత్రం చేసినా ధ్యానశ్లోకం చదివి వదిలిపెట్టేయ్. ఆయాదేవతల రూపాన్ని ధ్యానం చేసే ప్రయత్నం చేయకు. నీకు పరమ ప్రీతికరం కనుక, నీకు వెంటనే జ్ఞాపకంలోకి వస్తాయి కాబట్టి నీ గురువుగారి పాదాలు ధ్యానం చెయ్. ఆ దేవతయినా, ఈ దేవతయినా గురువులోనే ఉంటారు. గురువు పరబ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపమైన గురుపాదాలను స్మరించి చేసే జపం సిద్ధిస్తుంది. నీ సాధన ఫలిస్తుంది’’ అని మహాస్వామివారు వివరించారు. కాబట్టి గురువుగారి పాదాలను ధ్యానం చేయడం అంటే.. పరబ్రహ్మను ధ్యానం చేయడమే. అందుకే ఇప్పటికీ మనం ‘‘గురుర్బహ్మ్ర, గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర:’’ అంటాం.