ముహూర్తం కుదిరింది గురూ! | Venkatesh in Sudha kongara Direction | Sakshi
Sakshi News home page

ముహూర్తం కుదిరింది గురూ!

Published Tue, Sep 13 2016 11:26 PM | Last Updated on Mon, Sep 4 2017 1:21 PM

ముహూర్తం కుదిరింది గురూ!

ముహూర్తం కుదిరింది గురూ!

వెంకటేశ్ హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో పీవీపీ సంస్థ ఓ చిత్రం నిర్మించనున్న విషయం తెలిసిందే. హిందీలో సుధ కొంగర దర్శకత్వంలోనే ఘనవిజయం సాధించిన ‘సాలా ఖద్దూస్’కి రీమేక్ ఇది. తమిళంలో ‘ఇరుది సుట్రు’ పేరుతో సూపర్ హిట్ అయిన ఈ కథ ఇప్పుడు తెలుగు తెరపైకి కొత్త హంగులతో వస్తోంది.
 
  చిత్ర షూటింగ్ ఈ నెల 19న ప్రారంభం కానుంది. ఇందులో వెంకీ బాక్సింగ్ కోచ్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రానికి ‘గురు’ అనే టైటిల్ ఖరారు చేసినట్టు సమాచారం. హిందీలో హీరోయిన్‌గా నటించిన రితికా సింగ్‌నే ఇప్పుడీ తెలుగు ‘గురు’లోనూ ఎంపిక చేశారు. విశాఖపట్నం, చెన్నై, ఊటీలలో షూటింగ్ చేసి, క్రిస్మస్‌కి విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ స్వరకర్త.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement