మోహన్‌బాబు
నాయకుడు.. ప్రతినాయకుడు.. సహాయ నటుడు.. ఏ పాత్రని అయినా అవలీలగా చేయగల నటుడు మోహన్‌బాబు. అందుకే చెన్నై ఇప్పుడు ఆయన్ను ‘వాంగ.. వాంగ..’ అంటోంది. అంటే.. రండి.. రండి. అని అర్థం. అసలు చెన్నై ఆయన్ను ఇప్పుడు రమ్మనడమేంటి? ఎప్పుడో 40 ఏళ్ల క్రితం ఆయన తమిళ సినిమాల్లో నటించారు. వాటిలో 1980లో చేసిన ‘గురు’ అనే సినిమా ఒకటి. ఇప్పుడు కూడా మోహన్‌బాబు కోసం కబురు పంపింది నేటి ‘గురు’ (2017) డైరెక్టర్ సుధా కొంగర.
వెంకటేశ్ హీరోగా ‘గురు’ చిత్రాన్ని తెరకెక్కించిన సుధ తెలుగమ్మాయి. ఈ చిత్రం తర్వాత సూర్య హీరోగా ఓ చిత్రం చేయడానికి సుధ సన్నాహాలు చేస్తున్నారు. కథ రాసుకునేటప్పుడు సినిమాకి అతికీలకమైన ఓ పాత్రను మోహన్‌బాబు చేస్తే బాగుంటుందని ఆమె అనుకున్నారట. కథ విన్న సూర్య కూడా మోహన్‌బాబు అయితే న్యాయం జరుగుతుందని భావించారట. ఇటీవల మోహన్‌బాబుకు సుధ కథ చెప్పడం, ఆయన గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయి. ఇప్పటివరకూ కనిపించన విలక్షణ పాత్రలో ఆయన కనిపించనున్నారని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment