Sudha Kongara
-
ప్రముఖ నిర్మాత మృతి.. సుధా కొంగర ఎమోషనల్ నోట్
ప్రముఖ కోలీవుడ్ చిత్ర నిర్మాత మనో అక్కినేని కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే ఆమె చెన్నైలో మరణించారు. ఫేమస్ డైరెక్టర్ సుధా కొంగర తొలి చిత్రానికి మనో నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుడా అజిత్ కుమార్ చిత్రం కిరీడం, మాధవన నటించిన 13బీ సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ సందర్భంగా సుధా కొంగర ఆమెకు నివాళులర్పించారు. ఆమెతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.సుధా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా తొలి చిత్ర నిర్మాత, నా ప్రాణ స్నేహితురాలు మనో అక్కినేనికి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ భూమిపై మీరెలా జీవించారో.. అక్కడ కూడా ప్రకాశిస్తారని నమ్ముతున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. మీరు నా మొదటి సినిమాకు పనిచేయడం ఎప్పటికీ గుర్తుంటుంది. నీతో కలిసి తీసిన ద్రోహి చిత్రాన్ని అంకితమిస్తున్నా. ఎందుకంటే సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారిలో ఒకరిగా నువ్వు నా ప్రతి కదలికను గమనిస్తావని నాకు తెలుసు' అని పోస్ట్ చేశారు. కాగా.. 2008లో సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు. A long journey through life and cinema.Miss you Mano... pic.twitter.com/pQ1iTuhwHv— Sudha Kongara (@Sudha_Kongara) January 21, 2025 View this post on Instagram A post shared by Sudha Kongara (@sudha_kongara) -
1965లో ఏం జరిగిందో చెప్పనున్న శివకార్తికేయన్
అయలాన్, మావీరన్ చిత్ర వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివకార్తికేయన్‌కు తాజాగా అమరన్ చిత్రం బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రంలో ఆయన, సాయిపల్లవి నటన పలువురి ప్రశంసలను అందుకుంది. కాగా ప్రస్తుతం శివకార్తికేయన్ తన 23వ చిత్రాన్ని ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో చేస్తున్నారు. అదేవిధంగా సిబి చక్రవర్తి దర్శకత్వంలో 24వ చిత్రాన్ని చేయనున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శివకార్తికేయన్ హీరోగా నటించే 25వ చిత్రానికి మహిళా దర్శకురాలు సుధా కొంగర కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించనున్నారు. వాస్తవానికి ఈ చిత్రంలో సూర్య కథానాయకుడిగా నటించాల్సి ఉంది. దీనికి పురనానూరు అనే టైటిల్‌ను కూడా నిర్ణయించారు. అయితే కొన్ని కారణాల వల్ల సూర్య ఈ చిత్రం నుంచి వైదొలిగారు. దీంతో ఈ చిత్రంలో శివకార్తికేయన్‌ను ఎంపిక చేశారు. ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనుండడం విశేషం. అదేవిధంగా మరో నటుడు అధర్వ ముఖ్యపాత్ర పోషించనున్నారు. నటి శ్రీలీల నాయకిగా నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈమె ఈ చిత్రం ద్వారా నేరుగా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తున్నారన్నమాట. డాన్ పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని రూ. 150 కోట్ల భారీ బడ్జెట్లో నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం 1965లో జరిగే చారిత్రక కథాంశంతో తెరకెక్కనున్నట్లు తెలిసింది. కాగా ఇంతకుముందు దీనికి పురనానూరు అనే టైటిల్‌ను నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా పేరును మార్చినట్లు, 1965 అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు తాజా సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
రూ.150 కోట్ల బడ్జెట్ సినిమా.. ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల
వరుస విజయాలతో దూసుకుపోతున్న నటుడు శివ కార్తికేయన్. ఈయన ఇటీవల రాజ్‌కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో హీరోగా నటించిన అమరన్ చిత్రం ఘనవిజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. సాయి పల్లవి నాయికగా నటించిన ఈ చిత్రాన్ని నటుడు కమలహాసన్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై భారీ ఎత్తున నిర్మించారు. ప్రస్తుతం శివకార్తికేయన్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. తాజాగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఇందులో నటి శ్రీలీల నాయకిగా నటించనున్నారు. ఇదే ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం. పుష్ప సినిమా తర్వాత ఆమెకు భారీగా ఛాన్స్‌లు పెరుగుతున్నాయి. అయితే, ఆమె సెలక్టెడ్ పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందకు వెళ్తుంది. ఇందులో ప్రముఖ నటుడు జయం రవి కూడా ప్రధాన పాత్రను పోషించనున్నారు. మరో ముఖ్య పాత్రలో నటుడు అధర్వ పోషించనున్నారు. డాన్ పిక్చర్స్ పతాకంపై ఆకాష్ భాస్కరన్ నిర్మిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ఇది. దీనికి జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఆయనకు 100వ చిత్రం కావడం విశేషం. అదేవిధంగా ఈ చిత్రానికి రవి కె.చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీని గురించి నిర్మాత అధికారిక ప్రకటనను మీడియాకు విడుదల చేశారు. అందులో ఈ ఎస్.కె 25 చిత్రం ప్రేక్షకులకు కచ్చితంగా సరికొత్త అనుభూతిని కలిగిస్తుందనే అభిప్రాయాన్ని నిర్మాత ఆకాష్ భాస్కరన్ వ్యక్తం చేశారు. ఇది పీరియడ్ కాల కథాంశంతో రూపొందుతున్న చిత్రం. దీనికి పురనానూరు అనే టైటిల్ ఇంతకుముందే ఖరారు చేశారు అన్నది గమనార్హం. ఈ చిత్రం రూ.150 కోట్ల బడ్జెట్లో రూపొందుతున్నట్లు సమాచారం. మల్టీ స్టార్స్ నటిస్తున్న చిత్రం కావడంతో దీనిపై ఇప్పటి నుంచే భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. -
శివకార్తికేయన్, సుధా కొంగర మధ్య వివాదం..
నటుడు శివకార్తికేయన్ కథానాయకుడిగా వరుస విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అయలాన్, మావీరన్,ఇటీవల విడుదలైన అమరన్ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. కాగా తాజాగా మరో మూడు చిత్రాలతో ఆయన బిజీగా ఉన్నారు. అందులో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి 'డాన్' చిత్రం ఫేమ్ సిబి.చక్రవర్తి డైరెక్షన్లో ఒక చిత్రం రానుంది. అదేవిధంగా మహిళా దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో తన 25వ చిత్రంలో శివకార్తీకేయన్ నటించడానికి ఇప్పటికే ప్రాజెక్ట్ ఫైనల్ అయింది. పురనానూరు పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనుంది. కాగా ఈ చిత్ర షూటింగ్‌ను వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. కాగా అందులో భాగంగా బుధవారం ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమో షూట్ చేయడానికి చిత్ర యూనిట్ రెడీ అయినట్లు సమాచారం. అయితే, దర్శకురాలు సుధా కొంగర, నటుడు శివకార్తికేయన్ మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రోమో షూట్ రద్దు అయినట్లు సోషల్‌మీడియాలో ఒక వార్త వైరల్ అవుతోంది. ప్రోమో షూట్‌కు పూర్తి గడ్డంతో శివకార్తికేయన్ రావడం వల్ల సుధా కొంగర అభ్యంతరం చెప్పారట. గడ్డం తొలగించి రావాలని దర్శకురాలు సుధా కొంగర చెప్పడంతో వారిద్దరి మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయట. అయితే, కథ చెప్పినప్పుడు గడ్డంతోనే ఉండాలని చెప్పారు కదా అంటూ శివకార్తికేయన్ కాస్త అసహనం చెందారట. లైట్ బియార్డ్తో ఉండాలని చెబితే.. పరుత్తివీరన్‌లో కార్తీ మాదిరి ఉంటే ఎలా అని దర్శకురాలు సుధా కొంగర అనడంతో తన అభ్యంతరాన్ని తెలిపి షూటింగ్ స్పాట్ నుంచి శివకార్తికేయన్ వెళ్లిపోయినట్లు టాక్ స్ప్రెడ్ అవుతోంది. అయితే ఈ వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించి మళ్లీ త్వరలోనే ప్రోమో షూట్ నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే ఇందులో నిజం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. కాగా ఈ చిత్రం ద్వారా నటి శ్రీలీల కోలీవుడ్‌కు పరిచయం కానున్నారనే ప్రచారం జోరుగానే సాగుతోంది. అదే విధంగా ఇందులో నటుడు జయంరవి ప్రతినాయకుడిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి జీవీ.ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
సూర్య ప్లేస్‌లో శివకార్తికేయ.. ఓకే చెప్పిన శ్రీలీల!
కోలీవుడ్ నుంచి శ్రీలీలకు మళ్లీ కాల్ వెళ్లిందా అంటే తమిళ పరిశ్రమలో అవుననే మాట వినిపిస్తోంది. ఇంతకుముందు కూడా శ్రీలీలకు తమిళంలో అవకాశాలు వచ్చాయని వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఈసారి ప్రచారంలో ఉన్న వార్త నిజం అని కోలీవుడ్ అంటోంది. శివ కార్తికేయన్ హీరోగా నటించనున్న ఓ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించనున్నారన్నది ఆ వార్త సారాంశం. ‘గురు, ఆకాశం నీ హద్దు రా’ వంటి చిత్రాలతో దర్శకురాలిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధ కొంగర తెరకెక్కించనున్న చిత్రంలోనే శివ కార్తికేయన్, శ్రీలీల నటించనున్నారని సమాచారం. ఈ ఇద్దరూ పాల్గొనగా ఫొటోషూట్ కూడా జరిగిందట. త్వరలో అధికారికంగా ప్రకటిస్తుందట చిత్రబృందం. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో సూర్య హీరోగా నటించాల్సి ఉండగా ఆయన తప్పుకున్న నేపథ్యంలో శివకార్తికేయన్‌ని తీసుకున్నారట. సూర్యతో ‘పురనానూరు’ అనే టైటిల్‌తో తెరకెక్కించనున్నట్లు పేర్కొన్నారు. మరి.. శివ కార్తికేయన్‌తో అనుకుంటున్నది ఈ చిత్రమేనా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
టాలెంటెడ్ లేడీ డైరెక్షన్లో శివకార్తికేయన్
మహిళ దర్శకురాలు సుధా కొంగర దర్శకత్వంలో శివ కార్తికేయన్ కథానాయకుడిగా నటించడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఇంతకుముందు సుధా కొంగర సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు (ఆకాశం నీ హద్దురా) వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. 2020లో విడుదలైన ఈ చిత్రం పలు జాతీయ అవార్డులను గెలుచుకున్న విషయం విదితమే. కాక సుధా కొంగర తాజాగా సూర్య హీరోగా మరో చిత్రాన్ని రూపొందించడానికి సిద్ధమయ్యారు. దీనికి పురనానూరు అనే టైటిల్ కూడా నిర్ణయించారు. ఈ చిత్రాన్ని నటుడు సూర్య తన 2 డీ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై నిర్మించనున్నట్లు ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ చిత్ర నిర్మాణానికి చాలా సమయం అవసరం అవుతుందని అందువల్ల చిత్ర నిర్మాణాన్ని వాయిదా వేస్తున్నట్లు దర్శకురాలు సుధా కొంగర, నటుడు సూర్య కలిసి ప్రకటన చేశారు. అలాంటిది తాజాగా దర్శకురాలు సుధా కొంగర తన తాజా చిత్రాన్ని నటుడు శివ కార్తికేయన్ హీరోగా తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సామాజిక మాధ్యమంలో ప్రసారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదు. కాగా నటుడు శివ కార్తికేయన్ అమరన్ చిత్రాన్ని పూర్తిచేసి ప్రస్తుతం ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తన 23వ చిత్రాన్ని చేస్తున్నారు. అదేవిధంగా సుధా కొంగర సూరరై పోట్రు చిత్రానికి రీమేక్ అయిన సర్ఫరా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దీంతో సూర్య కథానాయకుడిగా నటించిన పురనానూరు చిత్రం పరిస్థితి ఏమిటన్నది చర్చనీయాంశంగా మారింది. -
సూర్య మూవీ వాయిదా.. విక్రమ్ కొడుకుతో సుధాకొంగర కొత్త చిత్రం!
తమిళసినిమా: నటుడు విక్రమ్ వారసుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయబోతున్నారా? అన్న ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. 2010లో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టిన సుధా కొంగర, 2016లో మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుదు చుట్రు చిత్రంతో సంచలన విజయాన్ని సాధించారు. ఆ చిత్రం ద్వారా బాలీవుడ్ రియల్ బాక్సర్ రిత్వికాసింగ్ను కథానాయకిగా పరిచయం చేశారు. ఆ తరువాత అదే చిత్రాన్ని తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా రీమేక్ చేశారు. కాగా 2022లో సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది.ప్రస్తుతం అదే చిత్రాన్ని హిందీలో అక్షయ్‌కుమార్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. కాగా తదుపరి మరోసారి సూర్య హీరోగా పురనానూరు పేరుతో చిత్రం చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఈ చిత్రానికి మరింత సమయం అవసరం కావడంతో వాయిదా వేసినట్లు, నటుడు సూర్య, దర్శకురాలు సుధాకొంగర సంయుక్తంగా ఓ ప్రకటనను ఇటీవల మీడియాకు విడుదల చేశారు. దీంతో సూర్య, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల్లో నటుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా సుధాకొంగర చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. దీనికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నట్లు టాక్. అయితే ఇది ఏ బ్యానర్లో రూపొందనుంది? ఎప్పుడు ప్రారంభం అవుతుందీ? వంటి వివరాలు తెలియా ల్సి ఉంది. కాగా ప్రస్తుతం నటుడు ధ్రువ్ విక్రమ్ మారిసెల్వరాజ్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీన్ని దర్శకుడు పా.రంజిత్ తన నీలం ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. -
సూపర్ హిట్ డైరెక్టర్‌తో జతకట్టనున్న శింబు?
కోలీవుడ్‌లో సంచలన నటుడిగా ముద్ర వేసుకున్న హీరో శింబు. తాజాగా ఆయనకు సంబంధించిన ఓ వార్త సామాజిక మాధ్య మాల్లో వైరల్ అవుతోంది. ఇటీవల శింబు నటించిన పత్తుతల చిత్రం పెద్దగా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అయితే అవకాశాలకు మాత్రం తగ్గడం లేదు. తాజాగా నటుడు కమలహాస న్ తన రాజ్ కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రంలో శింబు కథానాయకుడిగా నటించనున్నారు. దేశింగు పెరియ సామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నా యి. ఈ చిత్రం కోసం శింబు ప్రత్యేకంగా కసరత్తు చేయడంతో పాటు కరాటే వంటి ఆత్మ రక్షణ విద్యల్లోనూ శిక్షణ పొందారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇదిలా ఉండగా శింబు తన 49, 50వ చిత్రాలకు కూడా కమిట్ అయిన ట్లు తాజా సమాచారం. ఆయన తన 49వ చి త్రాన్ని అశ్వంత్ మారి ముత్తు దర్శకత్వంలో చే యనున్నట్లు తెలుస్తోంది. ఆయన చెప్పిన కథ డబుల్ ఓకే అనిపించడంతో వెంటనే అందులో నటించడాని కి సమ్మతించినట్లు తెలిసింది. ఇ కపోతే శింబు తాను 50వ చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో చేయనున్న ట్లు తాజాగా సామాజిక మాధ్యమాల్లో టా క్ వైరల్ అవుతోంది. సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన సుధా కొంగర తాజాగా మరోసారి సూర్యతో పురనానూరు అనే చి త్రాన్ని రూపొందించే పనిలో ఉన్నారు. ఈ చి త్రం తర్వాత శింబుతో చేసే చిత్రం ఉండే అ వకాశం ఉంది. అలాగే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
ఆ సూపర్ హిట్ కాంబో.. మళ్లీ రిపీట్ చేస్తామంటోన్న మేకర్స్!
తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్ రాజా, యూవీ క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్ విడుదల కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సూర్యకు నిర్మాతగానూ మంచి ట్రాక్ రికార్డ్ ఉంది. 2డీ ఎంటర్‌టైయిన్‌మెంట్ పతాకంపై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. కాగా సూర్య హీరోగా గతంలోనే సుధా కొంగర దర్శకత్వంలో సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబో రిపీట్ కాబోతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఇందులో సూర్యతో పాటు, దుల్కర్ సల్మాన్, విజయ్‌వర్మ ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. నటి నజ్రియా నాయకిగా నటించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. దీన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టెన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కాగా ఈ చిత్రం గురించి నటుడు, నిర్మాత సూర్య, దర్శకురాలు సుధా కొంగర సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పురనానూరు చిత్రానికి అదనంగా సమయం అవసరం అవుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తాము కలిసి పని చేయడం చాలా ప్రత్యేకమన్నారు. ఇది తమ మనసులను హత్తుకునే కథా చిత్రంగా ఉంటుందన్నారు. మీకు మంచి చిత్రాన్ని అందించాలని పని చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో నటుడు సూర్య పురనానూరు చిత్రానికి ముందు మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది. -
ఆకాశమే నీ హద్దురా కాంబో రిపీట్!
వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో సూర్య. సూరరై పోట్రు, జై భీమ్ చిత్రాల్లో ఒకదానికొకటి సంబంధం లేని పాత్రల్లో తన అసమాన నటనను ప్రదర్శించి ప్రేక్షకులను అలరించిన ఈయన చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నాయి. ప్రస్తుతం కంగువ చిత్రానికి తన గొంతుతో పరిపూర్ణత చేకూర్చే పనిలో ఉన్నారు. సోషల్ అంశాలకు పీరియడ్ కథాంశాలను జోడించి రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఇది. ఇందులో సూర్యలోని మరో కోణాన్ని చూస్తారు. 10 భాషల్లో కంగువా బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని చిరుతై శివ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీ డబ్బింగ్ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. 3డీ ఫార్మాట్లో తెరకెక్కుతున్న కంగువ చిత్రాన్ని 10 భాషల్లో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు కాగా తదుపరి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సూర్య సిద్ధం అవుతున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు సూరరై పోట్రు (ఆకాశమే నీ హద్దురా) వంటి హిట్ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే! విద్యార్థిగా సూర్య! తాజా చిత్రానికి సంబంధించిన అప్డేట్ ఏమిటంటే ఇందులో సూర్యతో పాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, నజ్రియా ముఖ్యపాత్రలు పోషించనున్నారట. ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మరో విషయం ఏమిటంటే ఇందులో సూర్య కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు సమాచారం. కంగువ చిత్రంలో గిరి వాసుల తరఫున పోరాడే వీరుడు పాత్ర కోసం తనను తాను పూర్తిగా మార్చుకుని నటించిన సూర్య తాజా చిత్రం పురనానూరు కోసం విద్యార్థిగా మారడానికి కసరత్తులు చేస్తున్నారట. సూర్య తన 2 డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రం మేలో సెట్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. చదవండి: టాలీవుడ్ డైరెక్టర్లపై మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు -
ఆ హిట్ డైరెక్టర్‌తో స్టార్ హీరో మరో సినిమా.. !
వైవిధ్య భరిత కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ కోలీవుడ్ స్టార్ హీరో సూర్య. గతంలో సూర్య నటించిన సూరారై పోట్రు, జై భీమ్ చిత్రాలు ఘన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మరో వైవిధ్యమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. కంగువ అనే భారీ చారిత్రాత్మక కథా చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. చిరుతై శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జేఈ జ్ఞానవేల్ రాజా యూవీ క్రియేషన్స్ సంస్థతో కలిసి నిర్మిస్తున్నారు. ఈ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. త్రీడీ ఫార్మాట్లో రూపొందుతున్న కంగువ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, గ్లిమ్స్ ఇప్పటికే విడుదల కాగా ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. కాగా ఈ చిత్ర షూటింగ్‌లోనే నటుడు సూర్య గాయాల పాలై చికిత్స అనంతరం విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం మిగిలిన షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. కంగువ తర్వాత మరోసారి సుధా కొంగర దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది సూర్య నటించే 43వ చిత్రం కానుంది. దీనిని సూర్య తన 2డీ ఎంటర్టైన్ పతాకంపై నిర్మించనున్నారు. ఇందులో నటి నజ్రియా నాయకిగా నటించనుండగా.. మలయాళ యువ స్టార్ దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రను పోషించనున్నారు. అదే విధంగా విజయవర్మ తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇది ఈయనకు సంగీత దర్శకుడుగా 100వ చిత్రం కావడం విశేషం. కాగా ఈ చిత్ర పాటల రికార్డింగ్ మొదలైంది. తొలిపాటను ఓ యువ గాయని పాడారు. ఈ విషయాన్ని జీవీ ప్రకాష్‌కుమార్ మంగళవారం తన ఎక్స్(ట్విటర్)లో పేర్కొన్నారు. అందులో సక్సెస్ఫుల్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్ర పాటల రికార్డింగ్ గాయని ‘దీ‘తో ప్రారంభించినట్లు పేర్కొన్నారు. -
స్టూడెంట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు. పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో ఉంటుందని, సూర్య క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, అందులో ఒకటి స్టూడెంట్ రోల్ అని కోలీవుడ్ సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుందట. 2డీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
1965 యదార్థ ఘటన ఆధారంగానే సూర్య కొత్త సినిమా
పాత్రలో పరకాయ ప్రవేశం చేసే అతికొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. అలా ఆయన ఇటీవల నటించిన ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలు ప్రేక్షకుల ఆదరణను పొందాయి. ప్రస్తుతం కంగువ చిత్రంలో నటిస్తున్నారు. చారిత్రక కథాచిత్రంగా రూపొంతున్న ఈ చిత్రం కోసం సూర్య తనను తాను చాలానే మార్చుకున్నారు. ఒక విప్లవ నాయకుడిగా సూర్య గెటప్, ఆ చిత్రం గ్లిమ్స్ ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రం రూపొందించడంతో పాటు 36 భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే పేర్కొన్నారు. కంగువ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపై రావడానికి ముస్తాబోతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ను కూడా సూర్య పూర్తి చేశారు. దీంతో ఆయన తన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో వీరి కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఆకాశం నీ హద్దురా అనే సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కాగా ఇదే చిత్రాన్ని సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నిర్మాతగా హిందీలో నిర్మించి సక్సెస్ అయ్యారు. కాగా ఈ కాంబినేషన్లో మూడోసారి చిత్రం తెరకెక్కనుంది. దీన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్ టెయిన్మెంట్ పతాకంపై నిర్మించనున్నారు. ఇది కూడా 1965 ప్రాంతంలో జరిగిన ఒక యదార్థ ఘటన ఆధారంగా తెరకెక్కనుందని సమాచారం. అప్పట్లో హిందీ భాషకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే ఈ చిత్రానికి నేపథ్యం అని తెలుస్తోంది. ఇదిలా ఉంటే 1965లో భాషాయుద్ధంలో మరణించిన రాజేంద్రన్ ఫోటో, సూర్య ఫోటోలు ఒకేసారి సోషల్ మీడియాలో షేర్ అవుతున్నాయి. ఇందులో సూర్య కాలేజీ విద్యార్థిగా నటించనున్నారు. ఇందుకోసం ఆయన కాలేజీ బుల్లోడుగా మేకోవర్ అవ్వడానికి తన సతీమణి జ్యోతికతో కలిసి ముంబైలో మకాం పెట్టినట్లు సమాచారం. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ ముఖ్య భూమిక పోషించడం ఉండగా, నటి నజ్రియా కథానాయకిగా నటించనున్నట్లు ఇప్పటికే ప్రచారంలో ఉంది. కాగా ఈ చిత్రం వచ్చే నెల సెట్ పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. -
ఆ సినిమా రీమేక్ హక్కులు సూర్య సొంతం
కథానాయకుడుగాను, నిర్మాతగాను దూసుకెళుతున్న నటుడు సూర్య. నటుడిగా నిర్మాతగా ఈయన గ్రాఫ్ చూస్తుంటే ఎవరికై నా ఈర్ష్య కలగక మానదు. కారణం సూరరైపోట్రు (ఆకాశం నీ హద్దురా), జైభీమ్ వంటి చిత్రాలు సంచలన విజయాలే. తాజాగా 'కంగువ' అనే మరో సూపర్ హిట్ కథా చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రం తొలిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై 10 భాషల్లో త్రీడీ ఫార్మెట్లో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. మరోపక్క తాను తమిళ్,తెలుగులో నటించి, నిర్మించిన సూపర్ హిట్ సినిమా సూరరైపోట్రు (ఆకాశం నీ హద్దురా) చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. చిత్ర నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. సూర్య త్వరలో సుధా కొంగర దర్శకత్వంలో మరో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటించే 43వ చిత్రం అవుతుంది మలయాళ స్టార్ నటుడు దుల్కర్సల్మాన్, విజయ్‌వర్మ, నటి నజ్రియా ముఖ్య పాత్రలు పోషించనున్నారు. జీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించనున్న ఈ చిత్రం కంగువా చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. తాజాగా హిందీలో ఇటీవల విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న ‘టువల్త్ ఫైల్’ చిత్ర తమిళ రీమేక్ హక్కులను సూర్య పొందినట్లు సమాచారం. యదార్థ సంఘటన ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు విను వినోద్ చోప్రా తెరకెక్కించిన ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్ర తమిళ్ రీమేక్‌లో సూర్య నటిస్తారా లేక మరో నటుడిని నటింపజేస్తారా వేచి చూడాల్సి ఉంది. -
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్.. తొలి సినిమాలో హీరోగా టాలీవుడ్ కమెడియన్!
కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ఆకాశం నీ హద్దురా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకురాలు సుధా కొంగర. ఈ చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్నారు. సూర్య హీరోగా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తెలుగు, తమిళ భాషల్లో విమర్శకుల ప్రశంసల్ని అందుకుంది. గురు, ఆకాశం నీ హద్దురా సక్సెస్ కావడంతో ఆమెతో సినిమాలు చేసేందుకు సౌత్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ డైరెక్టర్‌గా కొనసాగుతోన్న సుధా కొంగర సినీ ప్రయాణం మొదలైంది ఏ హీరోతో తెలుసా? ఆ విషయంపై ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ నటుడు, కమెడియన్ కృష్ణ భగవాన్ హీరోగా 2008లో విడుదలైన చిత్రం ఆంధ్ర అందగాడు. ఈ సినిమాతోనే దర్శకురాలిగా ఎంట్రీ ఇచ్చింది సుధా కొంగర. కామెడీ ఎంటర్టైనర్గా రూపొందించిన ఈ చిత్రం విడుదలైన సంగతి చాలా మందికి తెలియదు కూడా. ఆంధ్ర అందగాడు మూవీలో అభినయశ్రీ, చిత్రం శ్రీను, శ్రీనివాసరెడ్డి కీలక పాత్రలు పోషించారు. అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సుధా కొంగరకు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మణిరత్నం వద్ద అసిస్టెంట్‌గా జాయిన్ ఆయిన సుధా కొంగర ఆ తర్వాత మాధవన్ హీరోగా తెరకెక్కించిన ఇరుది సుట్రు సినిమాతో డైరెక్టర్‌గా ఫస్ట్ సక్సెస్‌ను అందుకున్నది. ఆ తర్వాత ఆకాశం నీ హద్దురా సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకుంది. ఇదిలా ఉండగా.. మరోవైపు ఆకాశం నీ హద్దురా చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా సూర్య గెస్ట్ రోల్లో నటిస్తోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ తర్వాత మరోసారి సూర్యతో జతకట్టనున్నారు సుధా కొంగర. ఇటీవలే ఈ సినిమాను అఫీషియల్‌గా ప్రకటించారు. -
హిట్ కాంబినేషన్ రిపీట్
‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధా కొంగర కాంబినేషన్లో తెరకెక్కనున్న కొత్త సినిమా ప్రకటన గురువారం వెల్లడైంది. సూర్య కెరీర్లో 43వ సినిమాగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, నటి నజ్రియా ఫాహద్, నటుడు విజయ్ వర్మ కీలక పాత్రల్లో నటించనున్నారు. 2డీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై జ్యోతిక, సూర్య, రాజశేఖర్, కర్పూర సుందరపాండియన్ ఈ సినిమాను నిర్మించనున్నారు. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ స్వరకర్త. అతనికి సంగీత దర్శకుడిగా ఇది నూరవ చిత్రం కావడం విశేషం. ఇదిలా ఉంటే.. 68వ జాతీయ అవార్డ్స్‌లో ఉత్తమ నటుడు, ఉత్తమ నేపథ్య సంగీతం, ఉత్తమ నటి, ఉత్తమ స్క్రీన్‌ప్లే, ఉత్తమ చిత్రం విభాగాల్లో ‘సూరరై పోట్రు’ సినిమా అవార్డులు సాధించింది. తాజా చిత్రంతో సూర్య–సుధల హిట్ కాంబో రిపీట్ అవుతోంది. -
మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. అదిరిపోయిన గ్లింప్స్!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మరో చిత్రానికి రెడీ అయిపోయారు. ఇప్పటికే కంగువా షూటింగ్లో బిజీగా ఉన్న హీరో.. సూరారై పోట్రు(ఆకాశం నీ హద్దురా) ఫేమ్ సుధా కొంగరతో మరోసారి జతకట్టనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ప్రస్తుతం సూర్య 43 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది?.. ఆ డైలాగ్ ఒక్కటేనా!) గ్లింప్స్ చూస్తే తమిళనాడులో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగానే ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో 'సీతారామం' ఫేమ్ దుల్కర్ సల్మాన్, తమన్నా ప్రియుడు విజయ్ వర్మ, మలయాళ నటి నజ్రియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జీవి ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. సుధా కొంగర, సూర్య కాంబినేషన్లో వచ్చిన సూరారై పోట్రు చిత్రానికి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో జాతీయ అవార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇదే సినిమాని సుధా కొంగర హిందీలో రీమేక్ చేస్తున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తుండగా.. సూర్య అతిథిగా కనిపించనున్నారు. (ఇది చదవండి: అమలాపాల్ రెండో పెళ్లి.. కాబోయే భర్త ఏం చేస్తాడో తెలుసా?) My next! With an awesome bundle of talents@Suriya_offl @dulQuer #Nazriya @MrVijayVarma @gvprakash #Jyotika @rajsekarpandian @meenakshicini #Suriya43 has begun! pic.twitter.com/6EBQNUL301 — Sudha Kongara (@Sudha_Kongara) October 26, 2023 -
మరో సాహసం చేస్తున్న హీరో సూర్య
నటుడు సూర్య ఇటీవల వైవిద్య భరిత పాత్రలకు కేరాఫ్‌గా మారారనే చెప్పాలి. ఆయన సమీపకాలంలో నటించిన జై భీమ్, ఆకాశం నీ హద్దురా చిత్రాలలో సరికొత్తగా కనిపించిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన కంగువ చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. చారిత్రక కథాచిత్రంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఒక యోధుడుగా సూర్య పాత్ర గానీ గెటప్ గానీ ఆయన గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్‌న్స్ సంస్థతో కలిసి కేఈ. జ్ఞానవేల్ రాజా తన స్టూడియో గ్రీన్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నారు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) ఇందులో బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని నాయకిగా నటిస్తోంది. ఈమె నటిస్తున్న తొలి తమిళ చిత్రం ఇదే కావడం విశేషం. కాగా విచిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన గ్లిమ్స్ విడుదలై కంగువపై ఆసక్తిని పెంచేశాయి. కాగా ఈ చిత్రాన్ని 2024లో సమ్మర్ స్పెషల్‌గా విడుదల చేయడానికి నిర్మాతలు చేస్తున్నారు. కాగా నటుడు సూర్య తన తర్వాత చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో నటించనున్నారు. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు ఆకాశం నీ హద్దురా వంటి సూపర్ హిట్ వచ్చిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి హిట్ కొట్టడానికి ఈ కాంబో సిద్ధమవుతోంది. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో సూర్య మరోసారి తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయబోతున్నట్లు సమాచారం. అందులో కొడుకు కళాశాల విద్యార్థిగా నటిస్తున్నట్లు అందుకు తగ్గట్టుగా ఆయన తనను మలుచుకోవడానికి వర్కౌట్ చేస్తున్నట్లు తెలిసింది. అందుకు గాను ఆయన 20 ఏళ్ల వ్యక్తిలా కనిపించనున్నాడట. ఇలాంటి విభిన్నమైన పాత్రలు చేయడం సూర్యకు మాత్రమే సాధ్యం అని ఆయన ఫాన్స్ చెప్తున్నారు. కాగా మరో ముఖ్య పాత్రలో మలయాళ యువస్టార్ దుల్కర్‌సల్మాన్‌ను నటింప చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. కాగా నవంబర్ రెండో వారంలో ఈ చిత్రం సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. జీవి ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందించనున్న 2డీ ఎంటర్టైన్మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు తాజా సమాచారం. -
సూర్య కోసం సెన్సేషనల్ హీరోయిన్, విలన్ ఎంట్రీ
సౌత్ ఇండియా స్టార్ హీరో 'సూర్య' ఇప్పుడు తన పాన్ ఇండియా చిత్రం 'కంగువ' షూటింగ్లో బిజీగా ఉన్నాడు, ఇందులో అతను గిరిజన లెజెండ్‌గా నటిస్తున్నాడు. ఇదీ పూర్తి అయిన వెంటనే తన 43వ చిత్రం కోసం దర్శకురాలు సుధా కొంగర, స్వరకర్త జివి ప్రకాష్‌తో మళ్లీ జతకట్టనున్నట్లు ఇప్పటికే సమాచారం. ఈ ముగ్గురూ ఇప్పటికే నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'సూరరై పొట్రు' (ఆకాశం నీ హద్దురా)లో కలిసి పనిచేశారు. (ఇదీ చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో 'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత?) 'సూర్య 43' ప్రాజెక్ట్ అక్టోబర్‌లో ప్రారంభం కానుందని సూర్య ఇటీవల ధృవీకరించిన విషయం తెలిసిందే. దుల్కర్ సల్మాన్ కూడా ఈ ప్రాజెక్ట్‌లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో ఆసక్తకరమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. ప్రముఖ నటి నజ్రియా నజీమ్ ఫహద్ కూడా సూర్య 43 లో ఒక ప్రధాన పాత్రతో తమిళ సినిమాలో తిరిగి రావడానికి సిద్ధంగా ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. కోలీవుడ్‌లో ఇది సెన్సేషనల్ న్యూస్ అని చెప్పవచ్చు. ఆమె గతంలో తమిళ చిత్రసీమలో భారీ హిట్ సినిమాల్లో నటించి పలు విజయాలను అందుకున్న విషయం తెలిసిందే. ఫహద్ ఫాసిల్‌తో పెళ్లి తర్వాత సినిమాల్లో నటించడం ఆమె తగ్గించారని చెప్పవచ్చు. ఈ సినిమాతో మళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు సమచారం. అలాగే, సూర్య 43లో విలన్‌గా నటించడానికి బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను మేకర్స్ సంప్రదిస్తున్నట్లు సమాచారం. వెండితెరపై ఆతని విలనిజం సరికొత్తగా ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. విజయ్ వర్మ డార్లింగ్స్ వంటి పలు చిత్రాలలో తన నటనతో విశ్వసనీయ నటుడిగా స్థిరపడ్డాడు, దహాద్, పింక్, గల్లీ బాయ్, సూపర్ 30, లస్ట్ స్టోరీస్ 2 వంటి చిత్రాలతో ఆయనకు పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు ఉంది. దీంతో దర్శకులు,నిర్మాతల దృష్టిని ఆకర్షించాడు. సుధా కొంగర ప్రస్తుతం అక్షయ్ కుమార్ కథానాయకుడిగా సూరరై పొట్రు హిందీ రీమేక్‌ని పూర్తి చేసే దశలో ఉంది. అది పూర్తి అయిన వెంటనే సూర్య 43 ప్రాజెక్ట్ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో సెట్స్‌పైకి వెళ్తుందని సమచారం. -
'రాజా రాణి' బ్యూటీ.. బంపరాఫర్ కొట్టేసింది!
మలయాళ బ్యూటీ నజ్రియా మరో బంపరాఫర్ కొట్టేసినట్లు అనిపిస్తుంది. నాని 'అంటే సుందరానికీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'జవాన్' డైరెక్టర్ అట్లీ తీసిన 'రాజా రాణి'లో నజ్రియా ఓ హీరోయిన్ గా చేసింది. అప్పటి నుంచి ఈమెకు తెలుగులో బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ఏరికోరి సినిమాలు చేసే ఈమె.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టులో భాగమైందట. (ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో) కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడివాసల్' మూవీ చేస్తాడు. మరోవైపు 'ఆకాశమే హద్దురా'తో సూపర్ హిట్ ఇచ్చిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించాల్సి ఉంది. ఇందులో హీరోయిన్ గా అదితి శంకర్ అన్నట్లు వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు నజ్రియా పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో నజ్రియాని హీరోయిన్ పాత్ర కోసం సెలెక్ట్ చేశారా? లేదా స్పెషల్ రోల్ అనేది తెలియాల్సి ఉంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?)) -
శంకర్ కూతురు.. సూపర్ ఛాన్స్ కొట్టేసింది!
ప్రముఖ దర్శకుడు శంకర్ కుమార్తె అదితీ శంకర్ హీరో సూర్యకి జోడీగా నటించనున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ చిత్ర వర్గాలు. సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ‘సూరరై పొట్రు’(తెలుగులో ఆకాశం నీ హద్దురా) సినిమా హిట్‌గా నిలిచింది. వీరి కాంబినేషన్లో మరో చిత్రం ‘సూర్య 43’(వర్కింగ్ టైటిల్) రూపొందనుంది. ఈ మూవీలో అదితీ శంకర్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారని టాక్. -
సూర్య కొత్త సినిమా ప్రకటన.. విశాఖలో పుట్టిన సుధకే డైరెక్టర్ ఛాన్స్
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైవిధ్యమైన పాత్రలు, కథలను ఎంచుకుంటూ అగ్ర నటుడిగా గుర్తింపు పొందాడు. కోలీవుడ్ స్టార్ హీరో అయిన సూర్యకు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. సూర్య తన పాన్ ఇండియా చిత్రం ‘కంగువ’తో ఫుల్ బిజీగా ఉన్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన దిశా పటానీ నటిస్తోంది. మృణాల్ ఠాకూర్ కూడా ఇందులో కీలక పాత్రలో మెరవనుంది. (ఇదీ చదవండి: చరణ్ కూతురు క్లీంకారకు అదిరిపోయే గిఫ్ట్ పంపిన ఎన్టీఆర్) సూర్య బర్త్‌డే జులై 23న ఘనంగ జరగనుంది. అందులో భాగంగానే కంగువ సినిమా తొలి గ్లింప్స్‌ను జులై 22న మేకర్స్ విడుదల చేయనున్నారు. ఇందులో సూర్య ఐదు భిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. దీన్ని త్రీడీలో దాదాపు పదికి పైగా భాషల్లో వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సూర్య పుట్టినరోజు నాడే అభిమానులకు మరో శుభవార్త ఆయన చెప్పనున్నారు. తన తదుపరి చిత్రం వివరాలు ప్రకటించనున్నారు. దానిని ఒక లేడీ డైరెక్టర్‌కు అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 'సూరారై పోట్రు' (ఆకాశమే నీ హద్దురా) చిత్రాన్ని రూపొందించిన సుధ కొంగరనే సూర్య 43 సినిమాకు దర్శకురాలు కానుందని టాక్. తను తెలుగులో కూడా వెంకటేశ్‌తో 'గురు' సినిమాను డైరెక్ట్ చేసిన విషయం తెలిసిందే. సుధ కొంగర పుట్టింది విశాఖలో అయినా ఆమె చెన్నైలో స్థిరపడింది. సినిమా గురించి సుధ ఏం చెప్పిందంటే.. గతంలో ఓ ఇంటర్వ్యూలో సుధ ఇలా చెప్పింది. ఆకాశమే నీ హద్దురా సినిమా కంటే సూర్యతో భారీ బడ్జెట్లో సినిమా తీయబోతున్నట్లు చెప్పింది. ఆ కథకు భారీగా ఖర్చు అవుంతుందని, అందుకు కొంచెం భయం కూడా ఉందని చెప్పుకొచ్చింది. నిజ జీవిత కథ ఆధారంగానే సినిమా తీస్తున్నా బయోపిక్ మాత్రం కాదని పేర్కొంది. ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం ఇవ్వనున్నారు. సుధ కొంగరకు సూర్య మరో అవకాశం ఇవ్వడం దాదాపు ఖాయంగానే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్-7 ప్రోమోతో వచ్చేసిన నాగార్జున.. ఈ డైలాగ్ అర్థం ఇదేనా?) -
మరోసారి సూపర్ హిట్ కాంబినేషన్.. సూర్య రిపీట్ చేస్తాడా?
నటుడు సూర్య కథానాయకుడిగా నటించనున్న వాడివాసల్ చిత్రం సెట్‌పైకి వెళ్లడానికి మరింత జాప్యం కానుందనే ప్రచారం జరుగుతోంది. సూర్య హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో కలైపులి ఎస్.థాను నిర్మించనున్న చిత్రం వాడివాసల్. జల్లికట్టు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం ఇంతకుముందే రిహార్సల్స్ నిర్వహించారు. షూటింగ్ ప్రారంభించడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో దర్శకుడు వెట్రిమారన్ హాస్యనటుడు సూరిని హీరోగా పరిచయం చేస్తూ విడుదలై చిత్రాన్ని చేయడానికి వెళ్లారు. ఈ చిత్రాన్ని ఆయన రెండు భాగాలుగా తెరకెక్కించారు. తొలిభాగం ఇప్పటికే విడుదలై మంచి విజయాన్ని సాధించింది. (ఇది చదవండి: సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న కాజల్.. కారణం ఇదేనా?) తర్వాత సూర్య కథానాయకుడిగా నటించే వాడివాసల్ చిత్రాన్ని మొదలెడతారని ప్రచారం జరిగింది. అయితే తాజాగా విడుదలై చిత్ర రెండవ భాగంపై దృష్టి సారిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి విడుదలై–2 చిత్రం చిన్నచిన్న ప్యాచ్ వర్క్ మినహా పూర్తయిందని చిత్ర వర్గాలు ప్రకటించాయి. విడుదలై చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో దాని సీక్వెల్‌ను ఇంకా బెటర్మెంట్ కోసం దర్శకుడు వెట్రిమారన్ పలు మార్పులు చేర్పులు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నాలుగైదు రోజులు అనుకున్నది మరో 40 రోజులు చిత్రీకరించ తలపెట్టినట్లు సమాచారం. తొలి భాగం సక్సెస్ కావడంతో నిర్మాత రెండవ భాగం చేర్పులు, మార్పులు చేయడానికి మరింత ఖర్చు భరించడానికి సమ్మతించినట్లు టాక్. ఇకపోతే ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా చిత్రం చేస్తున్న సూర్య వాడివాసల్ చిత్రం సెట్‌పైకి వెళ్లాడానికి ఇంకా సమయం పట్టనుండడంతో, ఈలోపు మరో చిత్రం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. దీంతో సుధాకొంగర దర్శకత్వంలో మరోసారి నటించనున్నట్లు తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు సూరరై పోట్రు వంటి సూపర్‌హిట్ చిత్రం వచ్చిన విషయం తెలిసిందే. (ఇది చదవండి: సుశాంత్ ఆత్మహత్యపై కంగనా సంచలన ఆరోపణలు..!) -
సుధా కొంగర దర్శకత్వంలో రజనీకాంత్ సినిమా!
ఏడు పదుల వయసు పైబడిన సూపర్ స్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఈయనతో చిత్రాలు చేయడానికి దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారు. ప్రస్తుతం ఈయన ఏక కాలంలో రెండు చిత్రాలు చేస్తున్నారు. అందులో ఒకటి నెల్సన్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న జైలర్ చిత్రం. కాగా రెండవది ఆయన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలాం చిత్రం. ఇందులో రజనీకాంత్ అతిథిగా ఓ పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. కాగా, ఈ రెండు చిత్రాల షూటింగులను రజనీకాంత్ పూర్తి చేశారు. తదుపరి జై భీమ్ చిత్రం ఫేమ్ టీజే.జ్ఞానవేల్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది రజనీకాంత్ నటించనున్న 170వ చిత్రం అవుతుంది. దీన్ని లైకా ప్రొడక్షన్స్ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. కాగా రజినీకాంత్ నటించే 171 వ చిత్రానికి కూడా ఇప్పుడు పోటీ నెలకొంది. దీనికి ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. కారణం ఇద్దరు దర్శకులు, పలువురు నిర్మాతలు క్యూలో ఉండటమే. రజినీకాంత్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక చిత్రం చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. దీన్ని నిర్మించడానికి పలువురు దర్శకులు పోటీ పడుతున్నారని, అందులో విశ్వ నటుడు కమల్ హాసన్ కూడా ఉస్ట్లు ప్రచారం జరుగుతోంది. (చదవండి: రూ. 37 కోట్లతో ఇల్లు కొన్న అలియా.. ఆ వ్యాపారం కోసమేనట!) తాజాగా మరో ఆసక్తికరమైన ప్రచారం వెలుగులోకి వచ్చింది. ఇంతకుముందు ఇరుదు చుట్రు, సూరరైపోట్రు వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వహించిన మహిళా దర్శకురాలు సుధా కొంగర కూడా రజనీకాంత్‌ను దర్శకత్వం వహించడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. ఈమె ఇప్పటికే రజనీకాంత్‌కు కథను వినిపించినట్లు అది ఆయనకు నచ్చినట్లు ప్రచారం జరిగింది. కాగా దీన్ని కేజీఎఫ్ చిత్రం ప్రేమ్ హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించనున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుతం బెంగళూరులోని ఒక ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న రజనీకాంత్ ను దర్శకురాలు సుధా కొంగర, హోంబలి చిత్ర నిర్మాత కలిసినట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. -
రంగుల ప్రపంచంలో వెండితెరను ఏలిన మహిళా దర్శకులు..
సినిమాకు కెప్టెన్ డైరెక్టర్. 24 క్రాప్టులను సమన్వయపరుస్తూ సినిమాను రూపొందించాలంటే ఎన్నో సవాళ్లు ఉంటాయి. పురుషాధిక్యత ఎక్కువగా ఉండే దర్శకత్వ విభాగంలోనూ తొలితరం నుంచే తమదైన ముద్ర వేశారు మహిళా దర్శకులు. మరికొంత మంది నటిగా వెండితెరకు పరిచయమైనా, ఆ తర్వాత దర్శకురాలిగానూ సత్తాచాటారు. మహిళా దినోత్సవం సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమలోని మహిళా దర్శకులపై స్పెషల్ స్టోరీ. సావిత్రి మహానటి సావిత్రి గొప్ప నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా పేరు సంపాదించుకున్నారు. హీరోయిన్గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే చిన్నారి పాపలు, మాతృ దేవత, వింత సంసారం వంటి పలు సినిమాలకు దర్శకత్వం వహించి సత్తా చాటారు. జీవితా రాజశేఖర్ జీవితా రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా అరంగేట్రం చేసిన జానకి రాముడు, ఆహుతి, అంకుశం వంటి ఎన్నో హిట్ సినిమాల్లో నటించారు. 1990లో డా.రాజశేఖర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత నటనకు దూరమైన ఆమె శేషు సినిమాతో దర్శకురాలిగా మారారు. ఆ తర్వాత సత్యమేవజయతే, మహంకాళి, శేఖర్ వంటి సినిమాలను రూపొందించారు. తాజాగా 33 ఏళ్ల తర్వాత సినిమాల్లోకి నటిగా మళ్లీ రీఎంట్రీ ఇస్తున్నారు. విజయనిర్మల విజయనిర్మల తన ఏడో ఏటనే ‘మత్స్యరేఖ’అనే సినిమా ద్వారా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో 200కుపైగా చిత్రాల్లో నటించిన ఆమె.. సూపర్ స్టార్ కృష్ణతోనే ఏకంగా 47 సినిమాల్లో నటించారు. 1971లో ‘మీనా’ చిత్రంతో దర్శకురాలిగా పరిచయం అయిన విజయనిర్మల మొగుడు పెళ్లాల దొంగాట, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్ రాబర్ట్ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు వంటి ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. దర్శకురాలిగా 44 సినిమాలకు తెరకెక్కించి ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళా దర్శకురాలిగా2002లో గిన్నీస్ బుక్‌లో చోటు సంపాదించుకోవడం విశేషం. నందినీ రెడ్డి అలా మొదలైంది సినిమాతో దర్శకురాలిగా మారింది నందినీ రెడ్డి. తొలి సినిమాతోనే ఆమె డైరెక్షన్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత జబర్ధస్థ్, కల్యాణ వైభోగమే వంటి చిత్రాలు తెరకెక్కించింది. సమంతతో తీసిన ఓ బేబీ సినిమా దర్శకురాలిగా నందినీరెడ్డిని మరో స్థాయికి తీసుకెళ్లింది. ప్రస్తుతం సంతోష్ శోభన్ హీరోగా అన్నీ మంచి శకునములే అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తుంది. మంజుల ఘట్టమనేని సూపర్‌స్టార్ కృష్ణ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మంజుల ఘట్టమనేని. తొలుత మళయాళ చిత్రం ‘సమ్మర్ ఇన్ బెత్లేహామ్’లో నటించిన ఆమె ఆ తర్వాత తొలిసారిగా ‘షో’ అనే చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జాతీయ స్థాయిలో ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత నాని, పోకిరి,కావ్యాస్ డైరీ వంటి చిత్రాలను నిర్మించింది. మెగాఫోన్ పట్టి ‘మనసుకు నచ్చింది’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది’ వంటి సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం నిర్మాతగా, నటిగా, దర్శకురాలిగా కొనసాగుతున్నారు. సుధా కొంగర ఒకప్పుడు విమర్శించిన నోళ్లతోనే శభాష్ అనిపించుకున్నారు డైరెక్టర్ సుధా కొంగర.2008లో కృష్ణ భగవాన్ హీరోగా వచ్చిన ఆంధ్రా అందగాడు సినిమాతో దర్శకురాలిగా మారింది సుధా కొంగర. ఈ సినిమా వచ్చినట్లు కూడా చాలామందికి తెలియదు. ఆ తర్వాత ద్రోహి, గురు చిత్రాలతో గుర్తింపు తెచ్చుకుంది. 2020లో సూర్య హీరోగా ఆకాశం నీ హద్దురా సినిమాతో అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది సుధా కొంగర. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ సినిమా జాతీయ స్థాయిలో అవార్డులను కొల్లగొట్టింది. ఈ సినిమా సూపర్ హిట్‌తో ఎంతోమంది స్టార్ హీరోలు ఆమెతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.