స్టూడెంట్‌ | Surya and director Sudha Kongara combination movie update | Sakshi
Sakshi News home page

స్టూడెంట్‌

Published Fri, Dec 22 2023 1:40 AM | Last Updated on Fri, Dec 22 2023 1:40 AM

Surya and director Sudha Kongara combination movie update - Sakshi

‘సూరరై పోట్రు’ (తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా!’) వంటి విజయవంతమైన చిత్రం తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర కాంబినేషన్‌లో మరో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో దుల్కర్‌ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్‌ వర్మ కీలక పాత్రలు పోషించనున్నారు.

పీరియాడికల్‌ గ్యాంగ్‌స్టర్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమా 1970 నేపథ్యంలో ఉంటుందని, సూర్య క్యారెక్టర్‌లో డిఫరెంట్‌ షేడ్స్‌ ఉంటాయని, అందులో ఒకటి స్టూడెంట్‌ రోల్‌ అని కోలీవుడ్‌ సమాచారం. ఫిబ్రవరిలో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ఆరంభం కానుందట. 2డీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మించనున్న ఈ చిత్రం 2025లో విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement