
మహేశ్‌బాబు, సుధ కొంగర
‘గురు, ఆకాశమే నీ హద్దురా!’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకురాలు సుధ కొంగర. సూర్యతో ఆమె తెరకెక్కించిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రం ఆస్కార్ బరిలోనూ నిలిచింది. సుధ తదుపరి చిత్రంలో హీరో ఎవరు? అంటే.. మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. మహేశ్ కోసం ఆమె ఒక సబ్జెక్ట్ రెడీ చేశారట. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని తెలిసింది. మహేశ్ ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ దుబాయ్‌లో జరుగుతోంది. దుబాయ్ షెడ్యూల్ పూర్తయి, మహేశ్ హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత సుధ సినిమాకు సంబంధించిన చర్చలు ఫైనల్ అవుతాయని ఫిల్మ్‌నగర్ టాక్.