
సూర్య
సూర్య సినిమాల్లో మస్త్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆయన ఫైట్స్, చేజ్‌లను ప్రేక్షకులు సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయాన్నే డైరెక్టర్ సుధా కొంగర తన కొత్త చిత్రంలో బాగా ఉపయోగించుకుంటున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సురరై పోట్రు’. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్‌మేన్‌ను టీమ్‌లో తీసుకున్నారు. ‘హ్యారీ పోటర్, అవెంజర్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాలకు యాక్షన్ పార్ట్‌ను హ్యాండిల్ చేసిన గ్రెగ్ పొవెల్ ‘సూరరై పోట్రు’కు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేయనున్నారు. అంటే.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్‌లో ప్లాన్ చేశారో ఊహించవచ్చు. అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు.