GV Praksah kumar
-
నేడు మధ్యాహ్నం ఓటీటీలోకి రానున్న ఫాంటసీ మూవీ
కోలీవుడ్ హీరో జీవీ ప్రకాశ్ కుమార్ నటించిన చిత్రం 'కింగ్స్టన్' నేడు ఓటీటీలోకి రానుంది. కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించిన ఫాంటసీ అడ్వెంచర్ చిత్రంలో దివ్యభారతి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ గతనెల 7వ తేదీన థియేటర్లలో సందడి చేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ విడుదల చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే బాక్సాఫీస్ ఊహించినంత స్థాయిలో రాణించలేకపోయింది.భారతదేశపు మొట్టమొదటి సముద్ర ఫాంటసీ చిత్రంగా 'కింగ్స్టన్' గుర్తింపు తెచ్చుకుంది. మంచి విజువల్ ఎక్సిపీరియన్స్ పొందాలని ఉంటే ఈ చిత్రాన్ని చూడొచ్చు. నేడు (ఏప్రిల్ 13) మధ్యాహ్నం 12 గంటలకు కింగ్స్టన్ మూవీని స్ట్రీమింగ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జీ5 వేదికగా తమిళ్, తెలుగు వర్షన్స్లలో ఈ మూవీ అందుబాటులో ఉండనుంది. కింగ్స్టన్ చిత్రాన్ని జీ స్టూడియోస్, పారలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్స్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కేఆర్ బన్సల్ నిర్మించారు. ఈ సినిమాలో చేతన్, అళగం పెరుమాళ్, ఎలాంగో కుమారవేల్, సాబుమోన్ అబ్దుసమద్, ఆంటోని, అరుణాచలేశ్వరన్, రాజేష్ బాలచంద్రన్ కీలక పాత్రలు పోషించారు.కింగ్స్టన్ కథేంటి..?కింగ్ (జీవీ ప్రకాశ్ కుమార్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. ఆ కారణంతో ఆ ఊర్లో ఎవరికీ ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే కింగ్స్టన్ సినిమా చూడాల్సిందే. -
తొలిసారి జతకట్టిన జీవీ ప్రకాశ్-ఐశ్వర్య రాజేశ్
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేశ్ తొలిసారిగా జతకడుతున్నారు. వీరిద్దరు హీరోహీరోయన్లుగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సేతుమ్ అయిదు పొన్ చిత్రం ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నోట్ మేక్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామ్ శెట్టి, పృథ్వీరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ ఇంతకు ముందు మలయాళంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ది టీచర్ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాణిక్ చిత్రాన్ని రూపొందిస్తోంది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. నటుడు కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్ గీతాకైలాసం, బ్లాక్ షీప్ నందిని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, కృపాకరన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్ర పూజా కార్యక్రమాలకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు అందించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఉంటుందని దర్శకుడు తెలిపారు. చదవండి: ‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్ -
పోటీకి సిద్ధమవుతున్న సిద్ధార్థ్, జీవీ ప్రకాష్‌లు
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ మూవీకి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు. యాక్షన్ ఓరియెంటెడ్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్‌లు పోటాపోటీగా నటించారు. వీరి కాంబినేషన్లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలవనున్నాయి. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు. -
మస్త్ యాక్షన్
సూర్య సినిమాల్లో మస్త్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి. ఆయన ఫైట్స్, చేజ్‌లను ప్రేక్షకులు సూపర్‌గా ఎంజాయ్ చేస్తారు. ఈ విషయాన్నే డైరెక్టర్ సుధా కొంగర తన కొత్త చిత్రంలో బాగా ఉపయోగించుకుంటున్నారు. సుధా కొంగర దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘సురరై పోట్రు’. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్‌మేన్‌ను టీమ్‌లో తీసుకున్నారు. ‘హ్యారీ పోటర్, అవెంజర్స్, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాలకు యాక్షన్ పార్ట్‌ను హ్యాండిల్ చేసిన గ్రెగ్ పొవెల్ ‘సూరరై పోట్రు’కు యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా వర్క్ చేయనున్నారు. అంటే.. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు ఏ రేంజ్లో ప్లాన్ చేశారో ఊహించవచ్చు. అపర్ణా బాలమురళి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ సంగీతం అందిస్తున్నారు. -
హీరో చేస్తానని ఆశ పెట్టి ...
చెన్నై : చిత్ర కథానాయకుడిగా తనకు ఓ ప్రముఖ దర్శకుడు ఆశ పెట్టి వదిలేశారని, దాని పర్యవసానమే తన తెరంగేట్రమని యువ సంగీత దర్శకుడు జి.వి.ప్రకాష్‌కుమార్ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించిన డార్లింగ్ చిత్రం సంక్రాంతికి తెరపైకి రానుంది. స్టూడియో గ్రీన్, గీతా ఆర్ట్స్ చిత్ర నిర్మాణ సంస్థలు అధినేతలు కె.ఇ.జ్ఞానవేల్ రాజా, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. శ్యామ్ ఆండాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో జీవీ సరసన నిక్కి కవరాణి నటించారు. ఇది తెలుగులో మంచి విజయం సాధించిన ప్రేమ కథా చిత్రానికి రీమేక్. డార్లింగ్ చిత్రం సంక్రాంతికి విడుదలకు సిద్ధమవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా జి.వి.ప్రకాష్‌కుమార్ మాట్లాడుతూ నిజం చెప్పాలం టే తనకు నటించాలనే ఆలోచనే లేదన్నారు. ఒక చిత్ర ప్రమో షన్ కోసం ఫొటో సెషన్ చేశామన్నారు. వాటిని చూసిన ప్రముఖ దర్శకుడు ఎఆర్.మురుగదాస్ హీరోలా ఉన్నారు నటించండి అని అన్నారన్నారు. ఏదో సరదాగా అంటున్నారని తాను భావించానన్నారు. అయితే అన్నట్లుగానే తాను హీరోగా ఎ ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఒక చిత్రం చేసే ప్రయత్నాలు జరిగాయని తెలిపారు. తర్వాత నిర్మాతతో దర్శకుడికి అభిప్రాయభేదాలు రావడంతో ఆ చిత్రం తెరకెక్కలేదని చెప్పారు. ఆ విధంగా ఎఆర్.మురుగదాస్ తనలో హీరో ఆశ రేపి వెళ్లిపో యారన్నారు. అనంతరం తన చిరకాల స్నేహితుడు పెన్సిల్ చిత్ర కథతో వచ్చారని తెలిపారు. కథ నచ్చడంతో కథానాయకుడిగా నటించడానికి సిద్ధమయ్యానన్నారు. ఆ చిత్ర నిర్మాణం లో అనూహ్యంగా మూడు నెలలు గ్యాప్ వచ్చిందన్నారు. దాంతో కాస్త బాధ అనిపించిందని అన్నారు. అలా కాస్త మీసం, గడ్డం పెంచి ఒకసారి జిమ్‌కు వెళ్లినప్పుడు నిర్మాత జ్ఞానవేల్ రాజా కలిశారని పేర్కొన్నారు. జీవీ మీకు మీసం, గడ్డం బాగున్నాయి, నేనొక తెలుగు చిత్రాన్ని రీమేక్ చేస్తున్నాను, అందులో హీరోగా మీరు బాగుంటారు, సీడీ పంపిస్తాను చూడండి అని చెప్పారన్నారు. అలా మొదలైందే డార్లింగ్ చిత్రమని జి.వి.ప్రకాష్ వెల్లడించారు. మొదటిసారే దెయ్యం కథ చిత్రంలో నటిస్తున్నారేమిటని అన్నవారు ఉన్నారన్నారు. మంచి విషయం అయితే అది దెయ్యం మూలంగా జరిగినా మంచిదేగా అని తాను అన్నానని తెలిపారు. ప్రేమ, హార్రర్, థ్రిల్లర్ కథా చిత్రంగా తెరకెక్కిన డార్లింగ్ చిత్రాన్ని సంగీత దర్శకుడు ఎఆర్.రెహ్మాన్ చూసి బాగుందని మెచ్చుకున్నారని జీవీ వెల్లడించారు.