
సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాశ్ కుమార్, నటి ఐశ్వర్య రాజేశ్ తొలిసారిగా జతకడుతున్నారు. వీరిద్దరు హీరోహీరోయన్లుగా ఓ సినిమా తెరకెక్కబోతోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం చెన్నైలో ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. సేతుమ్ అయిదు పొన్ చిత్రం ఫేమ్ ఆనంద్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నోట్ మేక్ ప్రొడక్షన్స్ పతాకంపై వరుణ్ త్రిపురనేని, అభిషేక్ రామ్ శెట్టి, పృథ్వీరాజ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ ఇంతకు ముందు మలయాళంలో నటి అమలాపాల్ ప్రధాన పాత్రలో నటించిన ది టీచర్ చిత్రాన్ని నిర్మించింది. ప్రస్తుతం ఐశ్వర్య రాజేశ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మాణిక్ చిత్రాన్ని రూపొందిస్తోంది.
నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. నటుడు కాళీ వెంకట్, ఇళవరసు, రోహిణి, తలైవాసల్ విజయ్ గీతాకైలాసం, బ్లాక్ షీప్ నందిని తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని, కృపాకరన్ చాయాగ్రహణం అందిస్తున్న ఈచిత్ర పూజా కార్యక్రమాలకు పలువురు సినీ ప్రముఖులు విచ్చేసి శుభాకాంక్షలు అందించారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఉంటుందని దర్శకుడు తెలిపారు.
చదవండి:
‘కాంతార’ లాంటి చిత్రాలు ఇండస్ట్రీని నాశనం చేస్తున్నాయి: స్టార్ డైరెక్టర్