యాక్షన్ మూవీలో యంగ్ హీరోయిన్.. పెద్ద ఆఫరే! | Aishwarya Rajesh New Movie Updates Latest | Sakshi
Sakshi News home page

యాక్షన్‌ సినిమాలో నటిస్తుండడం అదృష్టం: ఐశ్వర్యా రాజేశ్

Published Mon, Apr 8 2024 3:18 PM | Last Updated on Mon, Apr 8 2024 4:15 PM

Aishwarya Rajesh New  Movie Updates Latest - Sakshi

పేరుకే తెలుగమ్మాయి కానీ తమిళ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం తమిళంలోనే వరస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటివరకు హీరోయిన్ ఓరియెంటెడ్ కథల్లో నటించిన ఈ బ్యూటీ.. తొలిసారి ఓ యాక్షన్ మూవీలో నటిస్తున్నట్లు చెప్పుకొచ్చింది.

(ఇదీ చదవండి: పుకార్లకు చెక్.. 'పుష్ప 2' తర్వాత బన్నీ సినిమా ఫిక్స్)

డిఫరెంట్ పాత్రల్లో కనిపించిన నేను.. ఇప్పుడు యాక్షన్‌ ఓరియెంటెడ్‌ మూవీ చేస్తున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నానని ఐశ్వర్యా రాజేశ్ చెప్పుకొచ్చింది. చైన్నెలోని ఆదివారం జరిగిన ఓ షాప్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ కామెంట్స్ చేసింది.

ప్రతి సినిమాలో తన పాత్రకు ఉన్న ప్రాధాన్యతను తెలుసుకుని మరీ సినిమాలను ఎంపిక చేసుకుంటానని ఐశ్వర్యా రాజేశ్ చెప్పింది. సహజంగా నటించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటానని అందుకే ఈ మూవీ అవకాశం దక్కిందని తెలిపింది.

(ఇదీ చదవండి: ఎన్నికల్లో తొలిసారి పోటీ.. కోట్లు విలువైన కారు కొన్న హీరోయిన్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement