ఐశ్వర్య రాజేశ్... దక్షిణాది సినిమాలో స్టార్ హీరోయిన్. చిన్నచిన్న పాత్రలతో అంచెలంచెలుగా ఎదిగి లేడీ ఓరియంటెెడ్ కథా చిత్రాలు చేసే స్థాయికి ఎదిగారు. యంగ్ ఏజ్‌లోనే కాక్కా ముట్టై చిత్రంలో ఇద్దరు పిల్లల తల్లిగా నటించి ఆ పాత్రకు జీవం పోశారు. ఆ చిత్రమే ఐశ్వర్య రాజేశ్ కేరీర్‌కు పెద్ద టర్నింగ్ పాయింట్ అయ్యింది.
తండ్రి అతి మంచి వల్ల
ఈ హీరోయిన్ ఇటీవల మాతృదినోత్సవం సందర్భంగా తన కుటుంబం ఎదుర్కొన్న కష్టాలను, అమ్మ పడ్డ బాధలను వివరించారు. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయడానికి తన తండ్రి ష్యూరిటీ ఇచ్చి రుణాలు ఇప్పించారన్నారు. అయితే ఆనారోగ్యం కారణంగా తన తండ్రి మరణిస్తే అప్పులు ఎగ్గొట్టిన వారి రుణ భారం అంతా తల్లిపై పడిందన్నారు. దీంతో తమకు ఉన్న ఒకే ఒక్క ప్లాట్‌ను విక్రయించి ఆ అప్పును తీర్చినట్లు చెప్పారు.
అమ్మ ఏ లోటూ లేకుండా
అంత కష్టంలోనూ అమ్మ తమను మంచి పాఠశాలలో చదివించారని, ఏ లోటూ లేకుండా చూసుకున్నారన్నారు. తన అన్నయ్యలు ఇద్దరూ చదువు పూర్తి చేసి ఉద్యోగం చేయడానికి సిద్ధమైన సమయంలో ఒక ప్రమాదంలో మరణించారన్నారు. అప్పటికే పుట్టెడు కష్టాల్లో ఉన్న అమ్మను ఆ సంఘటన మరింత కుంగదీసిందన్నారు. అయినా తను ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదని తెలిపారు.
అమ్మ నుంచే నేర్చుకున్నా
వృత్తిపరంగా తాను ఎన్నో ఎత్తుపల్లాలను ఎదుర్కొన్నా, ధైర్యంగా ముందుకు సాగే గుణాన్ని తన తల్లి నుంచే నేర్చుకున్నట్లు చెప్పారు. అలాగే అతి మంచికి పోకూడదన్నది తన తండ్రి జీవితం నుంచి నేర్చుకున్నట్లు ఐశ్వర్య రాజేశ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment