
సిద్ధార్థ్, జీవీ ప్రకాష్‌లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఒరేయ్ బామ్మర్ది’ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. బిచ్చగాడు లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ మూవీకి దర్శకత్వం వహించగా కశ్మీర పరదేశి, లిజోమోల్ జోస్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రమేష్ పి పిళ్లై నిర్మించారు.
యాక్షన్ ఓరియెంటెడ్ తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధార్థ్, జీవీ ప్రకాష్ కుమార్‌లు పోటాపోటీగా నటించారు. వీరి కాంబినేషన్‌లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రానికి హైలెట్‌గా నిలవనున్నాయి. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంటోంది. ఈ సినిమాని శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ పై ఏ.ఎన్ బాలాజీ ఈ నెలలో విడుదల చేయనున్నారు. సిద్ధూ కుమార్ సంగీతం అందించగా ప్రసన్న కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రం గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment