కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌.. తొలి సినిమాలో హీరోగా టాలీవుడ్ కమెడియన్! | Kollywood Star Director Sudha Kongara First Movie With Tollywood Hero | Sakshi
Sakshi News home page

Sudha Kongara: సుధా కొంగర తొలి సినిమా.. హీరోగా టాలీవుడ్ స్టార్ కమెడియన్ !

Nov 15 2023 1:07 PM | Updated on Nov 15 2023 1:58 PM

Kollywood Star Director Sudha Kongara First Movie With Tollywood Hero - Sakshi

కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ఆకాశం నీ హ‌ద్దురా సినిమాతో సూపర్ హిట్ కొట్టిన దర్శకురాలు సుధా కొంగర. ఈ చిత్రానికి జాతీయ అవార్డును అందుకున్న‌ారు. సూర్య హీరోగా డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన ఈ మూవీ తెలుగు, త‌మిళ భాష‌ల్లో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకుంది. గురు, ఆకాశం నీ హ‌ద్దురా స‌క్సెస్‌ కావడంతో ఆమెతో సినిమాలు చేసేందుకు సౌత్ హీరోలు క్యూ కడుతున్నారు. అయితే ప్రస్తుతం కోలీవుడ్‌లో టాప్ డైరెక్ట‌ర్‌గా కొన‌సాగుతోన్న సుధా కొంగ‌ర సినీ ప్ర‌యాణం మొదలైంది ఏ హీరోతో తెలుసా? ఆ విషయంపై ఓ లుక్కేద్దాం.

టాలీవుడ్ నటుడు, కమెడియన్ కృష్ణ భ‌గ‌వాన్ హీరోగా 2008లో విడుద‌లైన చిత్రం ఆంధ్ర అంద‌గాడు. ఈ సినిమాతోనే ద‌ర్శ‌కురాలిగా ఎంట్రీ ఇచ్చింది సుధా కొంగ‌ర‌. కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందించిన ఈ చిత్రం విడుదలైన సంగతి చాలా మందికి తెలియ‌దు కూడా. ఆంధ్ర అంద‌గాడు మూవీలో అభిన‌య‌శ్రీ, చిత్రం శ్రీను, శ్రీనివాస‌రెడ్డి కీల‌క పాత్ర‌లు పోషించారు.

అయితే ఈ సినిమా డిజాస్టర్ కావడంతో సుధా కొంగ‌ర‌కు అవకాశాలు రాలేదు. ఆ తర్వాత మ‌ణిర‌త్నం వ‌ద్ద అసిస్టెంట్‌గా జాయిన్ ఆయిన సుధా కొంగ‌ర ఆ త‌ర్వాత మాధ‌వ‌న్ హీరోగా తెర‌కెక్కించిన ఇరుది సుట్రు సినిమాతో డైరెక్ట‌ర్‌గా ఫ‌స్ట్ స‌క్సెస్‌ను అందుకున్న‌ది. ఆ తర్వాత ఆకాశం నీ హ‌ద్దురా సినిమాతో స్టార్‌ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకుంది. 

ఇదిలా ఉండగా.. మరోవైపు ఆకాశం నీ హ‌ద్దురా చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రీమేక్ చేస్తున్నారు. అక్ష‌య్ కుమార్ హీరోగా సూర్య గెస్ట్ రోల్‌లో న‌టిస్తోన్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ త‌ర్వాత మరోసారి సూర్య‌తో జతకట్టనున్నారు సుధా కొంగ‌ర‌. ఇటీవ‌లే ఈ సినిమాను అఫీషియ‌ల్‌గా ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement