‘ఆకాశం నీ హద్దురా!’ | Surya Aakasam Nee Haddura Telugu Movie First Look Revealed | Sakshi
Sakshi News home page

‘ఆకాశం నీ హద్దురా!’

Published Sun, Nov 10 2019 5:40 PM | Last Updated on Sun, Nov 10 2019 5:41 PM

Surya Aakasam Nee Haddura Telugu Movie First Look Revealed - Sakshi

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా లేడీ డైరెక్టర్‌ సుధా కొంగర దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. సురరై పోట్రుగా తమిళంలో వస్తున్న ఈ చిత్రానికి తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారు. దీనికి సంబంధించి మూవీ ఫస్ట్‌ లుక్‌, టైటిల్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్‌ అధికారికంగా విడుదల చేసింది. ప్రస్తుతం సూర్యకు సంబంధించిన లుక్‌ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అపర్ణా బాలమురళి హీరోయిన్‌గా కాగా.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రంలో మోహన్‌ బాబు విలన్ గా నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి

కాగా ఈ మూవీలో సూర్య పైలట్‌గా కనిపించనున్నట్లు సమాచారం. తెలుగులో ‘గురు’సినిమాతో మంచి క్రేజ్‌ సంపాదించుకున్న లేడీ డైరెక్టర్‌ సుధా కొంగర చాలా గ్యాప్‌ తర్వాత ఈ చిత్రాన్ని డైరెక్ట్‌ చేస్తుండటం విశేషం. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సూర్య నిర్మిస్తున్నారు. తమిళ, తెలుగు హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో రిలీజ్‌ కానుంది. జాకీష్రాఫ్, కరుణాస్‌లు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి జీవీ ప్రకాష్‌ సంగీతం అందిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement