ప్రముఖ కోలీవుడ్ చిత్ర నిర్మాత మనో అక్కినేని కన్నుమూశారు. రెండు రోజుల క్రితమే ఆమె చెన్నైలో మరణించారు. ఫేమస్ డైరెక్టర్ సుధా కొంగర తొలి చిత్రానికి మనో నిర్మాతగా వ్యవహరించారు. అంతేకాకుడా అజిత్ కుమార్ చిత్రం కిరీడం, మాధవన నటించిన 13బీ సినిమాలకు నిర్మాతగా పనిచేశారు. ఈ సందర్భంగా సుధా కొంగర ఆమెకు నివాళులర్పించారు. ఆమెతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
సుధా తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'నా తొలి చిత్ర నిర్మాత, నా ప్రాణ స్నేహితురాలు మనో అక్కినేనికి ఆత్మకు శాంతి చేకూరాలి. ఈ భూమిపై మీరెలా జీవించారో.. అక్కడ కూడా ప్రకాశిస్తారని నమ్ముతున్నా. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నా. మీరు నా మొదటి సినిమాకు పనిచేయడం ఎప్పటికీ గుర్తుంటుంది. నీతో కలిసి తీసిన ద్రోహి చిత్రాన్ని అంకితమిస్తున్నా. ఎందుకంటే సినిమాలను ఎక్కువగా ఇష్టపడే వారిలో ఒకరిగా నువ్వు నా ప్రతి కదలికను గమనిస్తావని నాకు తెలుసు' అని పోస్ట్ చేశారు. కాగా.. 2008లో సల్మాన్ ఖాన్‌తో దిగిన ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేశారు.
A long journey through life and cinema.
Miss you Mano... pic.twitter.com/pQ1iTuhwHv— Sudha Kongara (@Sudha_Kongara) January 21, 2025
Comments
Please login to add a commentAdd a comment