మోహన్‌బాబు నా గాడ్‌ ఫాదర్‌: సూర్య | Suriyas Aakaasam Nee Haddhu Ra Telugu Movie Pilla Puli Lyric Song Out | Sakshi
Sakshi News home page

ఆకాశంలో విడుదల చేసిన ‘పిల్ల పులి’పాట

Published Thu, Feb 13 2020 8:33 PM | Last Updated on Thu, Feb 13 2020 8:33 PM

Suriyas Aakaasam Nee Haddhu Ra Telugu Movie Pilla Puli Lyric Song Out - Sakshi

సూర్య హీరోగా సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న తమిళ చిత్రం ‘సూరరై పోట్రు’. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా!’ టైటిల్‌తో విడుదల కానుంది. ఎయిర్‌ దక్కన్‌ వ్యవస్థాపకుడు జిఆర్‌ గోపీనాథ్‌ జీవితం ఆధారంగా దర్శకురాలు సుధ కొంగర ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను జరుపుకుంటునే మూవీ ప్రమోషన్‌ కా​ర్యక్రమాలను చిత్ర బృందం ప్రారంభించింది. ఇక ఇప్పటికే విడుదలైన చిత్ర పోస్టర్లు, టీజర్‌ ఓ రేంజ్‌లో ఉన్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా ప్రేమికుల రోజు కానుకగా ఈ చ్రిత్రంలోని రొమాంటిక్‌ సాంగ్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. ఆకాశంలో విహరించాలనుకునే 100 మంది పిల్లల ను తొలిసారి ఫ్లయిట్‌లో ప్రయాణించేలా చేశారు చిత్ర యూనిట్‌. అంతేకాకుండా ఆకాశం సాక్షిగా ఈ వంద మంది పిల్లల సమక్షంలో ‘పిల్ల పులి’అంటూ సాగే తొలి పాటను విడుదల చేశారు. ఇలా వినూత్నంగా విమానంలో ఓ సినిమా పాట విడుదల చేయడం ఇదే ప్రథమం కావడం విశేషం.

ఇక ఈ పాటలో హీరో హీరోయిన్లు సూర్య, అపర్ణా బాలమురళి మధ్య రొమాన్స్ సూపర్బ్‌గా ఉంది. మ్యూజిక్‌ డైరెక్టర్‌ జీవీ ప్రకాష్ కంపోజ్‌ చేసిన ఈ పాటలో సూర్య డాషింగ్ లుక్ లో కనిపిస్తుంటే, అపర్ణ స్టన్నింగ్ లుక్‌లో వావ్‌ అనిపించేలా ఉంది. రామజోగయ్య శాస్త్రి రాసిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. పాట విడుదల సందర్భంగా దర్శకురాలు సుధ కొంగర మాట్లాడుతూ.. ‘సూర్య నాకు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఇచ్చారు. ఈ సినిమా అద్భుతంగా రావడానికి కృషి​ చేసిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదలు. ఈ సినిమా షూటింగ్‌ సమయంలో మా నాన్న గారు మరణించారు. మోహన్‌ బాబు గారి రూపంలో ఒక కొత్త నాన్నను నేను దత్తత తీసుకున్నాను. నా విషయంలో ఎంతో శ్రద్ధ చూపించిన ఏకైక వ్యక్తి ఆయనే’అని అన్నారు.

అనంతరం హీరో సూర్య మాట్లాడుతూ..‘2000 సంవత్సరంలో కేవలం 1 శాతం మందే విమానంలో ప్రయాణించగల స్థితిలో ఉండేవాళ్ళు. కెప్టెన్ గోపీనాథ్ వచ్చి ఈ ఇండస్ట్రీ మొత్తాన్ని మార్చేశారు. కామన్ మ్యాన్‌ కూడా ఆకాశంలో ప్రయాణించగలిగేలా చేశారు. ఈ మూవీ ఆయనకే అంకితం. ఈ సినిమా సాధ్యపడటానికి సుధ పదేళ్ల కాలం వెచ్చించారు. ఇది ఆమె సినిమా. ఈ సినిమాకు వచ్చే పేరు, ప్రశంసలు ఆమెకే దక్కాలి. నా కెరీర్లో ఇది నిజంగా ముఖ్యమైన కాలం. సోదరి లాంటి సుధ నా పక్కన నిల్చుని, నాకు ఈ సినిమా సాధ్యపడేట్లు చేసింది. ఇక మోహన్ బాబు గారు గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి. మా ఇద్దరి మధ్య వచ్చే సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి. ఫ్లయిట్‌ మీద కనిపించే ఫొటో సూర్యది కాదు. అది మూవీలో నేను చేస్తున్న మారా పాత్రది. ఇది మన దేశంలోని వీరులకు ఇస్తున్న గౌరవం. దీన్ని స్టార్ డమ్ గా పొరబాటు పడొద్దని నా మనవి’ అని పేర్కొన్నారు. ‘శివాజీ గణేశన్ తర్వాత తమిళంలో బెస్ట్ యాక్టర్ శివకుమార్. ఇప్పుడు ఆయన తనయుడు సూర్యతో కలిసి నటించాను. అతను ఎంత గొప్ప మనిషి. అతనిని చూసి శివకుమార్ గారు గర్వించాలి. అలాంటి గొప్ప నటుడు సూర్య. భగవంతుని ఆశీర్వాదంతో ఈ చిత్రం సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. సుధ డిసిప్లిన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమా యూనిట్ అందరికీ నా థాంక్స్‌‌’ అని కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌బాబు చెప్పారు.
 

చదవండి:
రానా.. నీకు హ్యాట్సాఫ్‌!
‘ప్రేమ కూడా ఫీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement