మలయాళ బ్యూటీ నజ్రియా మరో బంపరాఫర్ కొట్టేసినట్లు అనిపిస్తుంది. నాని 'అంటే సుందరానికీ' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ 'జవాన్' డైరెక్టర్ అట్లీ తీసిన 'రాజా రాణి'లో నజ్రియా ఓ హీరోయిన్ గా చేసింది. అప్పటి నుంచి ఈమెకు తెలుగులో బోలెడంత మంది అభిమానులు ఏర్పడ్డారు. ఏరికోరి సినిమాలు చేసే ఈమె.. ఇప్పుడు ఓ క్రేజీ ప్రాజెక్టులో భాగమైందట.
(ఇదీ చదవండి: పెళ్లికి వెళ్లిన ఉపాసన.. ఆ ఫొటో బయటపెట్టడంతో)
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఇప్పటికే సగం షూటింగ్ పూర్తయింది. దీని తర్వాత వెట్రిమారన్ దర్శకత్వంలో 'వడివాసల్' మూవీ చేస్తాడు. మరోవైపు 'ఆకాశమే హద్దురా'తో సూపర్ హిట్ ఇచ్చిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య నటించాల్సి ఉంది. ఇందులో హీరోయిన్ గా అదితి శంకర్ అన్నట్లు వార్తలొచ్చాయి.
కానీ ఇప్పుడు నజ్రియా పేరు వినిపిస్తోంది. అయితే ఇందులో నజ్రియాని హీరోయిన్ పాత్ర కోసం సెలెక్ట్ చేశారా? లేదా స్పెషల్ రోల్ అనేది తెలియాల్సి ఉంది. ఇందులో దుల్కర్ సల్మాన్ కూడా గెస్ట్ రోల్ చేయబోతున్నాడనే ప్రచారం సాగుతోంది. ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.
(ఇదీ చదవండి: బిగ్ బాస్ హౌసులో కొత్త గొడవలు.. లవ్‌బర్డ్స్ మధ్య మనస్పర్థలు!?))
Comments
Please login to add a commentAdd a comment