ఆ సూపర్ హిట్ కాంబో.. మళ్లీ రిపీట్ చేస్తామంటోన్న మేకర్స్! | Kollywood Star Suriya And Sudha Kongara Combo Repeat Once Again | Sakshi
Sakshi News home page

Suriya: బ్లాక్ బస్టర్‌ కాంబో రిపీట్.. అలాంటి ఎంటర్‌టైన్‌మెంట్‌ అందిస్తాం!

Published Wed, Mar 20 2024 2:44 PM | Last Updated on Wed, Mar 20 2024 3:06 PM

kollywood Star Suriya and Sudha Kongara Combo Repear Once Again - Sakshi

తమిళ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కంగువా చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నారు. శివ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్‌ సంస్థ అధినేత కేఈ జ్ఞానవేల్‌ రాజా, యూవీ క్రియేషన్స్‌ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. తాజాగా దీనికి సంబంధించిన టీజర్‌ విడుదల కాగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా సూర్యకు నిర్మాతగానూ మంచి ట్రాక్‌ రికార్డ్ ఉంది. 2డీ ఎంటర్‌టైయిన్‌మెంట్‌ పతాకంపై పలు సూపర్ హిట్ చిత్రాలను నిర్మిస్తున్నారు.

కాగా సూర్య హీరోగా గతంలోనే సుధా కొంగర దర్శకత్వంలో సూరారై పోట్రు వంటి విజయవంతమైన చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ కాంబో రిపీట్‌ కాబోతోంది. త్వరలో ప్రారంభం కానున్న ఇందులో సూర్యతో పాటు, దుల్కర్‌ సల్మాన్‌, విజయ్‌వర్మ ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. నటి నజ్రియా నాయకిగా నటించనున్న ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని అందించనున్నారు. దీన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్‌టెన్‌మెంట్‌ సంస్థ నిర్మించనుంది. ఈ చిత్రానికి పురనానూరు అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

కాగా ఈ చిత్రం గురించి నటుడు, నిర్మాత సూర్య, దర్శకురాలు సుధా కొంగర సోమవారం సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో పురనానూరు చిత్రానికి అదనంగా సమయం అవసరం అవుతుందని పేర్కొన్నారు. ఈ చిత్రానికి తాము కలిసి పని చేయడం చాలా ప్రత్యేకమన్నారు. ఇది తమ మనసులను హత్తుకునే కథా చిత్రంగా ఉంటుందన్నారు. మీకు మంచి చిత్రాన్ని అందించాలని పని చేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన తదుపరి పనులు ప్రారంభించనున్నట్లు తెలిపారు. దీంతో నటుడు సూర్య పురనానూరు చిత్రానికి ముందు మరో చిత్రం చేయడానికి సిద్ధం అవుతున్నారా? అనే ప్రశ్న తలెత్తుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement