రోలెక్స్‌ని గుర్తుచేసిన సూర్య కొత్త సినిమా టీజర్ | Suriya Birthday Special, Makers Of Suriya 44th Movie Released Glimpse, Video Goes Viral | Sakshi
Sakshi News home page

Suriya 44 Glimpse Video: మరోసారి డాన్‌గా సూర్య.. ఈసారి ఏం చేస్తాడో?

Published Tue, Jul 23 2024 8:12 AM | Last Updated on Tue, Jul 23 2024 10:12 AM

Suriya Birthday Special New Movie Glimpse Telugu

తమిళ స్టార్ హీరో సూర్యకి తెలుగులోనూ అద్భుతమైన ఫాలోయింగ్ ఉంది. ఈ క్రమంలోనే కొత్త సినిమా వస్తుందంటే చాలు, మనోళ్లు తెగ ఎగ్జైట్ అయిపోతుంటారు. ప్రస్తుతానికి 'కంగువ' చేస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబరు 10న ఇది థియేటర్లలోకి రానుంది. ఇది కాకుండా స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‌తో మూవీ చేస్తున్నాడు. సూర్య పుట్టినరోజు సందర్భంగా గ్లింప్స్ పేరిట ఓ వీడియో వదిలారు.

(ఇదీ చదవండి: 'ఆర్ఆర్ఆర్' రికార్డ్ కూడా బ్రేక్ చేసిన 'కల్కి')

'లవ్, లాఫర్, వార్.. ద వన్' ట్యాగ్ లైన్‌తో రిలీజ్ చేసిన సూర్య 44మూవీ గ్లింప్స్ వీడియో సింపుల్‌గా ఉంది. అదే టైంలో ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఎందుకంటే ఇందులోనూ సూర్య.. డాన్‌గా కనిపించబోతున్నాడని క్లారిటీ ఇచ్చేశారు. ఇదివరకు ఈ తరహా పాత్రల్లో సూర్య గతంలో ఒకటి రెండుసార్లు చేశారు. ఈ గ్లింప్స్‌లో సిగరెట్ తాగుతూ, గన్ పట్టుకుని, ఒంటిపై రక్తం మరకలతో నడిచి వస్తుంటే.. 'విక్రమ్' మూవీలో రోలెక్స్.. ఒక్క సెకను అలా వచ్చి వెళ్లిపోయాడా అనిపించింది. త్వరలోనే టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. బహుశా వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాని రిలీజ్ చేస్తారేమో!

(ఇదీ చదవండి: థియేటర్లలో ఉండగానే ఓటీటీలోకి హిట్ సినిమా)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement