హీరో సూర్య భారీ బడ్జెట్ సినిమా ఆగిపోయిందా? | Suriya's Vaadivaasal Movie With Vetrimaaran Puts On Hold | Sakshi
Sakshi News home page

Suriya: జల్లికట్టు కథతో సినిమా.. ఇప్పట్లో షూటింగ్ కష్టమేనా!?

Published Sun, Apr 14 2024 2:19 PM | Last Updated on Sun, Apr 14 2024 3:19 PM

Suriya's Vaadivaasal Movie With Vetrimaaran Puts On Hold - Sakshi

సూర్య పేరుకే తమిళ హీరో కానీ తెలుగులో మన బడా హీరోల రేంజులో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం 'కంగువ' అనే పీరియాడికల్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఇతడు.. దీని తర్వాత పలు చిత్రాలు చేయబోతున్నాడు. అయితే సూర్య చేయాల్సిన ఓ భారీ బడ్జెట్ మూవీ మాత్రం ఆగిపోయిందనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఏమైంది?

(ఇదీ చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన హీరో మంచు మనోజ్ భార్య.. పాపకు వెరైటీ పేరు)

తమిళ దర్శకుల్లో వెట్రిమారన్‌ ది సెపరేట్ బ్రాండ్. రియాలిటీకి దగ్గరగా ఉండేలా అద్భుతమైన చిత్రాలు తీస్తుంటారు. ఇతడు సూర్యతో 'వడివాసల్' అనే మూవీ చేస్తానని ప్రకటించారు. ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జరిగింది. జల్లికట్టు క్రీడ నేపథ్యంలో సాగే కథ అని దర్శక, నిర్మాతలు ప్రకటించారు కూడా. సినిమాలో పాత్ర కోసం సూర్య ఓ ఎద్దును కూడా పెంచాడు. కానీ షూటింగ్‌ అనుకున్నట్లు ప్రారంభమే కాలేదు. దీంతో ఈ చిత్రం ఆగిపోయిందనే రూమర్స్ ఎక్కువయ్యాయి.

ఎందుకంటే సూర్య, వెట్రిమారన్ ఎవరికి వాళ్లు పలు సినిమాలతో బిజీగా ఉన్నారు. మరో 3-4 ఏళ్ల వరకు ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడిన వెట్రిమారన్‌.. తాను తీసే 'విడుదలై 2' ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదని, దీని తర్వాతే వాడివాసల్‌ షూటింగ్‌ మొదలవుతుందని చెప్పారు. దీనిబట్టి చూస్తే 'వడివాసల్' ఉంది కానీ ఇప్పట్లో కష్టమేనని విశ్లేషకులు అభిప్రాయం.

(ఇదీ చదవండి: నేను అనుకున్న కలని అతడు నిజం చేశాడు: చిరంజీవి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement