సూర్య @ 19 | Surya Aakaasam Nee Haddhu Ra Making video release | Sakshi
Sakshi News home page

సూర్య @ 19

Published Thu, Apr 16 2020 5:43 AM | Last Updated on Thu, Apr 16 2020 5:43 AM

Surya Aakaasam Nee Haddhu Ra Making video release - Sakshi

సూర్య వయసు 44 ఏళ్లు. కానీ అలా కనబడరు. అంతెందుకు? ఏ సినిమాలోనూ ఆయన ఒకలా కనబడరు. కథలతో, గెటప్స్‌తో ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేస్తుంటారు సూర్య. తాజాగా సుధా కొంగర దర్శకత్వంలో ‘సూరరై పోట్రు’ అనే చిత్రం చేశారు. తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ టైటిల్‌ తో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా కోసం 19 ఏళ్ల యువకుడిగా మారిపోయారు సూర్య. ఇందులో పైలట్‌ ‘మారా’ పాత్రలో కనిపించనున్నారు. కొంత భాగం సూర్య 19 ఏళ్ల యువకుడి పాత్రలో కనిపిస్తారు. దానికోసం శారీరకంగా విపరీతమైన శ్రమ పడ్డారట. ఈ పాత్రకు అనుగుణంగా మారడానికి ఆయన ఏం  చేశారు అనేది మేకింగ్‌ వీడియోగా రిలీజ్‌ చేశారు. పాత్ర కోసం ఆయన శ్రమించే తీరుకు అభిమానులు ఫిదా అవుతూ ఆ వీడియోను షేర్‌ చేశారు. ఇందులో మోహన్‌ బాబు కీలక పాత్రలో నటించారు. అపర్ణ బాల మురళి కథానాయిక. ఏప్రిల్‌ మొదటి వారంలో విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement