కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్‌జీకే సినిమాలో నటిస్తున్న సూర్య, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే కేవీ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరగుతోంది. త్వరలో మరో సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు సూర్య.
ఎన్‌జీకే షూటింగ్ పూర్తయిన వెంటనే కేవీ ఆనంద్ సినిమాతో పాటు ఓ మహిళ దర్శకురాలితో కలిసి పనిచేసేందుకు సూర్య ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మాధవన్ హీరోగా సాలా ఖదూస్ సినిమాను రూపొందించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ కూడా పీరియాడిక్ జానర్‌లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment