
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు. ఇప్పటికే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే సినిమా షూటింగ్ పూర్తి చేసిన సూర్య, ప్యారలల్‌గా మరో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. వీడొక్కడే, బ్రదర్స్ లాంటి సినిమాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ అనే సినిమా చేస్తున్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతానికి పైగా పూర్తయ్యింది.
లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న కాప్పాన్‌లో సూర్య ఎన్‌ఎస్‌జీ కమాండోగా కనిపించనున్నాడు. మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్ లాల్, తమిళ యంగ్ హీరో ఆర్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖిల్ ఫేం సయేషా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో అనన్య మరో ఇంపార్టెంట్ రోల్‌లో కనిపించనుంది.
Comments
Please login to add a commentAdd a comment