KV Anand
-
Rangam: జీవా ప్లేస్‌లో శింబు, ఫొటోలు వైరల్
సూర్య, తమన్నా జంటగా నటించిన చిత్రం 'అయాన్'. తెలుగులో వీడొక్కడే పేరుతో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఈ సినిమా దర్శకుడు కేవీ ఆనంద్‌కు మంచి పేరును తెచ్చిపెట్టింది. ఈ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తూనే ఆ వెంటనే 'కో' సినిమాను ప్రకటించాడు ఆనంద్. ఇది తెలుగులో 'రంగం' పేరుతో విడుదై సెన్సేషనల్ హిట్ సాధించింది. అయితే ఇక్కడో ఆసక్తికర విషయమేంటంటే ఇందులో మొదట హీరోగా అనుకుంది జీవాను కాదు శింబును! శింబుతో 'కో' సినిమా తీస్తున్నట్లు చిత్రయూనిట్ అధికారంగా ప్రకటించింది. అంతే కాదు, ఇంకొన్ని రోజుల్లో షూటింగ్ మొదలవుతుంది అనుకుంటున్న సమయంలో శింబు-కార్తీక నాయర్లపై ఫొటోషూట్ కూడా నిర్వహించారు. ఇక సినిమా పట్టాలెక్కే సమయానికి మాత్రం శింబు ఆ సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకున్నాడు. దీంతో దర్శకుడు శింబు ప్లేస్‌లో యంగ్ హీరో జీవాను తీసుకోవాల్సి వచ్చింది. అయితే అనుకున్నదానికంటే ఎక్కువగా అఖండ విజయం సాధించిన ఈ సినిమా రిలీజై దాదాపు పదేళ్లు దాటిపోయింది. ఈ సమయంలో తాజాగా శింబు-కార్తీక ఫొటోషూట్‌కు సంబంధించిన పలు ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేస్తున్నాయి. అసలేం జరిగిందంటే.. 'కో' సినిమా చేసేందుకు శింబు రెడీ అన్నాడు. కాకపోతే హీరోయిన్గా కార్తీకకు బదులు తమన్నా కావాలని అడిగాడట. కానీ ఆ సమయంలో వరుస సక్సెస్‌లు అందుకుంటూ పెద్దమొత్తంలో పారితోషికం అందుకుంటున్న మిల్కీ బ్యూటీని ఈ ప్రాజెక్టుకు ఒప్పించడం అంత తేలిక కాదని అభిప్రాయపడ్డారు దర్శకనిర్మాతలు. తమన్నా కోరినంత రెమ్యుననరేషన్ ఇచ్చేంత భారీ బడ్జెట్ తమ వద్ద లేదని తేల్చి చెప్పారు. ఈ విషయంలో దర్శకుడు, హీరో మధ్య బేధాభిప్రాయాలు ఏర్పడటంతో శింబు ప్రాజెక్ట్ నుంచి సైడ్ అయినట్లు ఆ మధ్య వార్తలు వినిపించాయి. చేసేదేం లేక దర్శకుడు కూడా మరో మంచి నటుడు కోసం వెతుకుతుండగా జీవా కంటపడ్డాడు. అలా అతడికి కో మూవీలో చాన్స్ రాగా అది జీవా కెరీర్లోనే బెస్ట్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా రెండు దక్షిణాది ఫిల్మ్‌ఫేర్ అవార్డులతో పాటు, మూడు విజయ్, రెండు సీమా, నాలుగు తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర అవార్డులను గెలుచుకోవడం విశేషం. చదవండి: Anushka Shetty: వైరలవుతున్న స్వీటీ ఫొటో సీఎం స్టాలిన్‌ను కలిసిన సూర్య ఫ్యామిలీ... కోటి విరాళం -
డైరెక్టర్ కేవీ ఆనంద్‌కు కన్నీటి నివాళి
చెన్నై : ప్రముఖ దర్శకుడు, ఛాయాగ్రాహకుడు కేవీ ఆనంద్(54) శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన కేవీ ఆనంద్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. శుక్రవారం వేకువజామున 3 గంటల సమయంలో గుండెపోటు వచ్చి ప్రాణాలు విడిచారు. నటులు రజనీకాంత్, కమల్ హాసన్, ధనుష్, గీత రచయిత వైరముత్తు, ఖుష్బూ, రాధిక శరత్ కుమార్, నిర్మాతలు అఘోరం, పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, తమిళ నిర్మాతల మండలి ఆయన మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆనంద్‌కుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన పార్థివదేహాన్ని ఆయన ఇంటి వద్ద కాసేపు సందర్శనార్థం ఉంచారు. స్థానిక బీసెంట్ నగర్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. ఇదీ సినీ నేపథ్యం.. కేవీ ఆనంద్ ఛాయాగ్రాహకుడుగా, దర్శకుడిగా ఉన్నత స్థాయికి ఎదిగారు. చెన్నై లయోలా కాలేజీలో విజువల్ కమ్యూనికేషన్ పూర్తిచేసిన ఈయన సినీ రంగంపై ఆసక్తితో తొలి రోజుల్లో నిశ్చల ఛాయాగ్రహకుడిగా సినీ జీవితాన్ని ప్రారంభించారు. తమిళ వారపత్రికలో ఫోటో జర్నలిస్టుగా కొంత కాలం పనిచేశారు. ఆ తర్వాత ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ శ్రీరామ్ వద్ద సహాయకుడిగా చేరారు. మోహన్‌లాల్ నటించిన మలయాళ చిత్రం తెన్ మావిన్ కొంబత్తు చిత్రం ద్వారా ఛాయగ్రాహకుడిగా పరిచయమయ్యారు. తొలి చిత్రం తోనే 1994లో జాతీయ ఉత్తమ ఛాయాగ్రాహకుడు అవార్డును అందుకున్నారు. ఆపై తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో సత్తా చాటారు. తమిళంలో శంకర్, మణిరత్నం చిత్రాలకు ఛాయాగ్రహణం అందించారు. తెలుగులో పుణ్యభూమి నాదేశం చిత్రం ద్వారా ఛాయాగ్రహాకుడిగా పరిచయం అయ్యారు. దర్శకుడిగా శ్రీకాంత్ కనా కండేన్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆ తరు సూర్య హీరోగా అయన్, మాట్రాన్, కాప్పాన్ చిత్రాలతోపాటు జీవా కథానాయకుడు నటించిన కో, ధనుష్ హీరోగా అనేగన్, విజయ్ సేతుపతి హీరోగా కవన్ చిత్రాలను తెరకెక్కించారు. ఈయన దర్శకత్వం వహించిన చివరి కాప్పాన్. శింబు కథానాయకుడిగా ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేశారు. ఆలోపే ఆయన కన్నుమూశారు. మరో సీనియర్ నటుడు కన్నుమూత మరో సీనియర్ నటుడు సెల్లదురై(84) గురువారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. ఈయన జాన్సన్, శివాజీ, కత్తి, మారి, రాజారాణి, మనిదన్ వంటి చిత్రాల్లో నటించారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రభుత్వ సర్వే డిపార్ట్మెంట్లో పదవీ విరమణ చేసిన తరువాత సినీరంగ ప్రవేశం చేశారు. అంతేకాకుండా సెల్లదురై రంగస్థల నటుడు కూడా. ఈయన భౌతిక కాయానికి శుక్రవారం సాయంత్రం స్థానిక కీలప్పాకం శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. -
అభిమానులకు సూర్య విన్నపం
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం బందోబస్త్. కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో పాటు ఆర్య, బొమన్ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న హీరో సూర్య అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు. (చదవండి : యువతిని బలిగొన్న బ్యానర్) ఇటీవల చెన్నైలో ఫ్లెక్సీ బ్యానర్ పడి సాఫ్ట్‌పేర్ ఉద్యోగిని శుభశ్రీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సినిమా కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని సూర్య అభిమానులను కోరాడు. ఫ్లెక్సీ కారణంగా ప్రమాదాలు జరగటమే కాదు, పర్యావరణానికి కూడా హాని జరుగుతుందన్న సూర్య, ఫ్లెక్సీల కోసం ఖర్చుపెట్టే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరాడు సూర్య. -
నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్’
‘‘మన దేశ భద్రత కోసం పాటుపడుతున్న ఎంతో మంది నిజమైన హీరోలు గుర్తింపుకు నోచుకోకుండా ఉండిపోతారు. ఈ నిజమైన హీరోలు దేశ సరిహద్దుల్లో ప్రతి రోజూ మనందరి కోసం నిలబడతారు. ఈ సినిమా కోసం వ్యక్తిగతంగా నేను వాళ్లను కలవటం గొప్ప అనుభూతి’’ అన్నారు సూర్య. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘బందోబస్త్’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌పై సుభాస్కరన్ నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను యన్వీఆర్ సినిమాస్ పతాకంపై నిర్మాత యన్వీ ప్రసాద్ విడుదల చేస్తున్నారు. ఈ నెల 20న చిత్రం విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. నిర్మాత డి. సురేశ్‌బాబు చిత్రం ట్రైలర్‌ను విడుదల చేసి, మాట్లాడుతూ – ‘‘సూర్య మాకు ఫ్యామిలీ లాగానే. ఎందుకంటే వాళ్ల నాన్న (శివకుమార్) నటించిన చిత్రాలను మా నాన్న (రామానాయుడు) నిర్మించారు. సూర్యతో నేను ఎప్పుడు సినిమా చేస్తానో తెలియదు. లవ్లీ ఫ్యామిలీ వాళ్లది’’ అన్నారు. సూర్య మాట్లాడుతూ– ‘‘ప్రేక్షకులు ఇచ్చే కిక్, హై డిఫరెంట్‌గా ఉంటుంది. ‘బందోబస్త్’ కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మ్. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి వచ్చిన కె.వి. ఆనంద్ నిజ జీవితంలో జరిగిన సంఘటనల నుండి సినిమాలు తీస్తారు. నేనీ సినిమాలో ఎస్.పి.జి (స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్) కమాండోగా చేశాను. ఎవరైనా ఫైరింగ్ చేస్తే పారిపోకుండా భద్రతాధికారులు తమ గుండెలను చూపిస్తారు. కుటుంబాల్ని త్యాగం చేసే అలాంటి గొప్ప అధికారులకు నేను ఇచ్చే గౌరవమే ఈ సినిమా’’ అన్నారు. కె.వి. ఆనంద్ మాట్లాడుతూ– ‘‘సూర్యలో గొప్ప విషయం ఏంటంటే మనం 50 శాతం ప్లాన్ చేస్తే ఆయన నటనతో, యాక్షన్‌తో 100 శాతం చేస్తారు’’ అన్నారు. ‘‘సూర్య గారితో పని చేయటం అనేది లెర్నింగ్ ప్రాసెస్’’ అన్నారు ఆర్య. ‘‘సూర్య గారితో నటించటం నా డ్రీమ్. అది ఈ సినిమాతో నెరవేరింది’’ అన్నారు సాయేషా. యన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ గారు మా కోసం ‘స్పైడర్’ సినిమాను తమిళనాడులో విడుదల చేసి బ్రహ్మాండమైన బిజినెస్ చేశారు. అప్పటినుండి వాళ్ల సినిమాలను తెలుగులో నేను విడుదల చేస్తున్నాను. లైకా బేనర్ పది కాలాల పాటు ఉండి ఎన్నో విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
‘బందోబస్త్’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
బందోబస్త్ సంతృప్తి ఇచ్చింది
‘‘కేవీ ఆనంద్ సర్ మీడియాలో ఫొటో జర్నలిస్టుగా పనిచేశారు. ఆ సమయంలో ఇండియాలో, ప్రపంచంలో జరుగుతున్న చాలా ఆసక్తికరమైన న్యూస్, ఆర్టికల్స్‌ని సేకరించేవారు. అందుకే ఆయన సినిమాలు నిజ జీవిత సంఘటనల నుంచి, సమాజం నుంచి స్ఫూర్తి పొందినవే ఉంటాయి. మా కాంబినేషన్లో ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి సినిమాలొచ్చాయి. సినిమా అంటే కేవలం ఎంటర్టైన్మెంటే కాదు.. చాలా పరిశోధన చేసి సినిమాలు తీస్తారాయన’’ అని హీరో సూర్య అన్నారు. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో సూర్య, సాయేషా సైగల్ జంటగా నటించిన చిత్రం ‘బందోబస్త్’. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. తెలుగులో నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో సూర్య విలేకరులతో మాట్లాడుతూ... ► చాలా కాలం తర్వాత ‘బందోబస్త్’ నాకొక పెద్ద ప్రాజెక్ట్.. థ్యాంక్స్ టు లైకా ప్రొడక్షన్స్. తెలుగులో విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్‌గారి థ్యాంక్స్. 1997లో కేవీ ఆనంద్ సర్‌తో నా తొలి సినిమా ‘నెరుక్కు నేర్’ స్టార్ట్ చేశా. ఆ సినిమాకి ఆయన సినిమాటోగ్రాఫర్. ఆ సినిమాతో నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన డైరెక్టర్ వసంత్సర్ నాకు గురువుకంటే ఎక్కువ. నా తొలి ఫొటో ఆనంద్ సర్ తీశారు.. అదే న్యూస్పేపర్లలో వచ్చింది. ► ‘బందోబస్త్’ సినిమా చేయడం నా అదృష్టం. వ్యవసాయం, రాజకీయ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. దేశంలోని ప్రముఖులకు భద్రత కల్పించే ఎస్పీజీ, ఎన్ఎస్జీల బ్యాక్‌డ్రాప్ కూడా ఉంటుంది. నేను కమాండర్ పాత్రలో నటించా. ఢిల్లీలో, ప్రధానమంత్రి కార్యాలయంలో ఏం జరిగింది? అనే వాస్తవ సంఘటనల నుంచి స్ఫూర్తి పొందిన చిత్రమిది. మన సమాజంలో ఏం జరుగుతోంది? ఏ విధంగా ప్రొటక్షన్ జరుగుతోంది? అంశాలు కూడా ఉంటాయి. ► ‘బందోబస్త్’ నాకు కొత్త అనుభూతినిచ్చింది. మన కమాండర్స్ అథారిటీస్, పవర్స్, లైఫ్ ఏంటన్నది చాలా మంది మాకు సలహాలు ఇచ్చారు. జీతం తీసుకుంటున్నందుకు రాత్రింబవళ్లు, రోజుకు 18గంటలు వాళ్లు ఏ విధంగా కష్టపడుతున్నారన్నది చూపించాం. ► కాల్పుల సమయంలో పోలీసులు, ఆర్మీ వాళ్లు రియాక్ట్ అయ్యేవిధానం వేరు. కానీ, స్పెషల్ ప్రొటక్షన్ గ్రూప్ వాళ్ల విధానం వేరు. వీరు ప్రత్యేక శిక్షణ తీసుకుని ఉంటారు. బుల్లెట్స్ ఫైర్ అవుతున్నా భయపడరు. ఢిల్లీలో 2000 ఎకరాల్లో ఎన్ఎస్జీ క్యాంపస్ ఉంది. ప్రత్యేక అనుమతి తీసుకుని చాలా మంది అధికారులను కలిసి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం, ఎంతో నేర్చుకున్నాం. అక్కడ మతం, రాష్ట్రం, భాష అనే తేడా ఉండదు. ‘మనమంతా భారతీయులం.. అన్నదమ్ములం’ అనే భావన ఉంటుంది. ► మా 2:30గంటల సినిమాలో చాలా స్టోరీలు చెప్పాం. సాధారణ మనుషుల జీవితం, హై కమాండర్స్ జీవితం ఎలా ఉంటుందన్నది చక్కగా చూపించాం. మోహన్‌లాల్ సర్‌తో తెరని పంచుకోవడం నా కల తీరనట్టు అనిపించింది. బొమన్ ఇరానీ సర్, ఆర్య, సముద్రఖని వంటి వారు కూడా మంచి పాత్రలు చేశారు. ‘బందోబస్త్’ ని కేవీ ఆనంద్సర్ ఎంతో పరిశోధన చేసి ఈ సినిమా తెరకెక్కించారు. సినిమా చూసే ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం కొత్త అనుభూతిని పంచుతుంది. ఎన్ఎస్జీ, ఎస్పీజీ వాళ్లపై ప్రజల్లో గౌరవం పెరుగుతుంది. ఈ సినిమా చేసినందుకు నేను చాలా చాలా సంతృప్తి చెందా. ► ‘బందోబస్త్’ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్సే కాదు.. ప్రొఫెషనల్, ఎమోషన్స్ ఉన్న సినిమా. ఆర్య ఈ సినిమాలో ప్రాధాన్యం ఉన్న పాత్రచేశారు. అతని ముందు సాయేషాతో ప్రేమ సన్నివేశాలు చేయడం ఇబ్బందిగా అనిపించింది(నవ్వుతూ). యాక్షన్ సీక్వెన్స్‌పై ఆనంద్ సర్ చాలా శ్రద్ధ తీసుకున్నారు. 150రోజులు దాదాపు ఇండియాలోని ముఖ్యమైన ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ► సుధ కొంగర దర్శకత్వంలో చేస్తున్న ‘శూరారై పొట్రు’ చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఆ తర్వాత శివ దర్శకత్వంలో ఓ సినిమా ఉండొచ్చు. గౌతమ్ మీనన్ సినిమాకి చర్చలు జరుగుతున్నాయి. తెలుగు నుంచి వస్తున్న పెద్ద సినిమాలు మంచి గౌరవాన్ని తెచ్చిపెడుతున్నాయి. ‘సైరా’ పెద్ద ఫిల్మ్. రామ్‌చరణ్‌కి అభినందనలు. నా ఫ్రెండ్ విక్రమ్ తెరకెక్కించిన ‘నానీస్ గ్యాంగ్‌లీడర్’ శుక్రవారం విడుదలైంది. తనకు నా శుభాకాంక్షలు. డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా నాకు మంచి ఫ్రెండ్. తన ‘వాల్మీకి’ మంచి హిట్ అవ్వాలి. -
బందోబస్త్ రెడీ
‘గజిని, సూర్య సన్నాఫ్ కృష్ణన్, సింగం’ సిరీస్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న సూర్య నటించిన తాజా చిత్రం ‘బందోబస్త్’. సాయేషా సైగల్ కథానాయికగా నటించారు. ‘రంగం’ ఫేమ్ కె.వి. ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరణ్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 20న విడుదలవుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ సినిమాని నిర్మాత ఎన్వీ ప్రసాద్ రిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 13న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఎన్వీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘డిఫరెంట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. కమాండోగా, రైతుగా సూర్య గెటప్పులు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి పెంచాయి. ‘ఎన్నో తారల సంగమం... అంబరం ఒకటే...’ అంటూ సాగే దేశభక్తి గీతానికి, ‘చెరుకు ముక్కలాంటి...’ అనే మాస్ పాటకు మంచి స్పందన వచ్చింది. పాకిస్తాన్ తీరును ఎండగడుతూ ప్రధాని పాత్రలో మోహన్‌లాల్ చెప్పిన డైలాగ్స్, సూర్య నటన సినిమాపై అంచనాలను మరింత పెంచాయి’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని, పూర్ణ, నాగినీడు తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఎం.ఎస్. ప్రభు, సంగీతం: హ్యారీస్ జైరాజ్. -
బందోబస్త్‌కు సిద్ధం
దేశాన్ని రక్షించే కమాండోగా సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘కప్పాన్’. తెలుగులో ‘బందోబస్త్’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. భారత ప్రధానిగా మోహన్‌లాల్ నటించారు. సయేషా కథానాయిక. ఈ చిత్రం సెప్టెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం మాట్లాడుతూ – ‘‘సూర్య డిఫరెంట్ గెటప్స్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు. ఇటీవలే తమిళంలో రజనీకాంత్‌గారు ఆడియో రిలీజ్ చేశారు. పాటలకు మంచి స్పందన లభిస్తోంది. త్వరలోనే తెలుగు పాటలను విడుదల చేసి, గ్రాండ్‌గా ప్రీ–రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రఖని ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంగీతం: హారీస్ జైరాజ్. కెమెరా: ఎం.ఎస్. ప్రభు. -
సూర్యకు నటన రాదనుకున్నా!
‘‘తన సహనటులెవరికీ చెడ్డ పేరు రాకూడదనుకుంటారు శివకుమార్. వాళ్ల అబ్బాయిలు సూర్య, కార్తీని కూడా అలానే పెంచారు. తొలి సినిమా ‘పరుత్తివీరన్ (‘మల్లిగాడు’)లో కార్తీ అద్భుతంగా చేశాడు. సూర్య ఫస్ట్ సినిమా చూసి తనకు నటించడం రాదేమో? అనుకున్నాను. తనని తాను మలచుకొని ఈ స్థాయిలో నిలబడ్డాడు’’ అని రజనీకాంత్ అన్నారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కాప్పాన్’ (తెలుగులో బందోబస్త్). సయేషా కథానాయిక. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, ఆర్య, సముద్రఖని కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రం ఆగస్ట్ 30న రిలీజ్ కానుంది. ఈరోజు సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చెన్నైలో జరిగిన ఈ చిత్రం ఆడియో ఫంక్షన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న రజనీకాంత్ మాట్లాడుతూ – ‘‘దర్శకుడు కేవీ ఆనంద్ నా ‘శివాజీ’ సినిమాకు కెమెరామేన్. ఆయనకు కథ మీద మంచి జడ్జిమెంట్ ఉంది. నేను ఆయనతో ఓ సినిమా చేయాలి కానీ ఆగిపోయింది. మోహన్‌లాల్ గొప్ప నటుడే కాదు గొప్ప వ్యక్తి కూడా. హ్యారిస్ మ్యూజిక్ బావుంటుంది. ‘నేనే దేవుణ్ణి’ సినిమాలో ఆర్య నటన ఆశ్చర్యం కలిగించింది. తమిళ ఇండస్ట్రీకు దొరికిన వరం నిర్మాత సుభాస్కరన్. ప్రస్తుతం ‘ఇండియన్ 2, దర్బార్, పొన్నియిన్ సెల్వన్’ నిర్మిస్తున్నారు. ‘శివపుత్రుడు, గజిని, సింగం, సింగం 2’ వంటి గొప్ప సినిమాలు చేశారు సూర్య. విద్యా వ్యవస్థపై సూర్య చేసిన వ్యాఖ్యలను కొందరు తప్పుబట్టారు. ‘అగరం’ సంస్థ ద్వారా ఎందర్నో విద్యావంతుల్ని చేస్తున్నారు సూర్య’’ అన్నారు. ‘‘కేవీ ఆనంద్‌గారు, నేను చేస్తున్న మూడో (వీడొక్కడే, బ్రదర్స్) సినిమా ఇది. అందర్నీ మెప్పించేలా ఈ సినిమా తీశారాయన. సుభాçస్కరన్గారికి థ్యాంక్స్. ఆర్య ముందే సాయేషాతో ప్రేమగా నటించే సీన్స్ చేయడానికి ఇబ్బందిపడ్డాను (నవ్వుతూ). రజనీకాంత్‌గారికి, శంకర్‌గారికి థ్యాంక్స్. ఒకరి దారి రహదారి.. మరొకరేమో తన సినిమాలతో ఇండస్ట్రీను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్తున్నారు. నా బలం ఫ్యాన్సే. కుటుంబం తర్వాతే సమాజం గురించి ఆలోచించండి (అభిమానులను ఉద్దేశిస్తూ..)’’ అన్నారు సూర్య. ‘‘ఈ కాప్పాన్కు (రక్షించేవాడు) పైనున్న కాప్పాన్ అండగా నిలుస్తాడనుకుంటున్నాను’’ అన్నారు మోహన్‌లాల్. ‘‘సూర్య రానురాను యువకుడిలా మారిపోతున్నాడు. కమర్షియల్ సినిమాకు ఉండాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో కనిపిస్తున్నాయి’’ అన్నారు శంకర్. ‘‘ఈ సినిమాలో మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్ర చేశారు. సూర్యకు, నాకు మధ్య మంచి అనుబంధం ఉంది. సీన్ అద్భుతంగా రావడానికి ఎంత కష్టమైనా పడతాడు సూర్య’’ అన్నారు ఆనంద్. ‘‘సమాజం మీద బాధ్యత ఉన్న కొద్ది మంది నటుల్లో సూర్య ఒకరు. నటుడిగా ఆల్రెడీ నిరూపించుకున్నారు’’ అన్నారు రచయిత వైరముత్తు. ‘‘6వ తరగతిలో పెయింటింగ్ పోటీలో నా చేతుల మీదగా ఆవార్డ్ తీసుకున్నారు ఆనంద్. సూర్యకు, తనకు ఈ సినిమా హ్యాట్రిక్ అవుతుంది’’ అన్నారు శివకుమార్. -
‘మీరు రెచ్చగొట్టింది నిద్రపోతున్న పులిని..’
గత కొన్నేళ్లుగా సూర్య చిత్రాలు సరైన విజయాన్ని నమోదు చేయలేకపోతున్నాయి. రీసెంట్గా వచ్చిన ఎన్జీకే చిత్రం కూడా ఆశించిన మేర ఆకట్టుకోలేకపోయింది. అయితే మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బందోబస్త్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. మళయాల సూపర్‌స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి చేస్తున్న ఈ మూవీ టీజర్ తాజాగా విడుదలైంది. రానా చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఆకట్టుకునేలా ఉంది. ‘మీరు రెచ్చగొట్టింది నిద్రపోతున్న పులిని.. పంజా విసరడానికి ఎంతో సమయం పట్టదు’ లాంటి డైలాగ్‌లు ఆసక్తిని రేకేత్తిస్తున్నాయి. ఆర్య, సాయేషా, బొమన్ ఇరానీ ముఖ్య పాత్రల్లో నటించగా.. కేవీ ఆనంద్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమాకు హారీస్ జయరాజ్ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ ఆగస్ట్‌లో విడుదల కానుంది. -
కమాండో బందోబస్త్
మలయాళ నటుడు మోహన్‌లాల్‌కు బందోబస్త్ ఏర్పాటు చేశారట హీరో సూర్య. కన్ఫ్యూజ్ కావొద్దు. ఇదంతా తమిళ సినిమా ‘కాప్పాన్’ గురించే. ‘వీడొక్కడే, బ్రదర్స్’ వంటి చిత్రాల తర్వాత సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళం చిత్రం ‘కాప్పాన్’. ఈ చిత్రంలో సాయేషా కథానాయికగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాకు తెలుగులో ‘బందోబస్త్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ప్రముఖ దర్శకుడు రాజమౌళి శుక్రవారం ఈ టైటిల్‌ని అనౌన్స్ చేశారు. సూర్య, సముద్రఖని ఈ సినిమాలో ఎన్ఎస్జీ కమాండోలుగా నటించారు. మోహన్‌లాల్ ప్రధానమంత్రి పాత్రలో నటించారని తెలిసింది. బొమన్ ఇరానీ, ఆర్య, నాగినీడు, పూర్ణ తదితరులు నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. -
ఫారిన్లో పాట
ఇండోనేషియాలో ల్యాండయ్యారు హీరో సూర్య. వరుసగా సినిమాలు చేస్తున్నారు కదా! కాస్త విశ్రాంతి తీసుకుందామని టూర్ ప్లాన్ చేశారని అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే అంత టైమ్ లేదు సూర్యకు. ఒప్పుకున్న సినిమాలు లైన్లో ఉన్నాయి. ఇండోనేషియా ఎందుకు వెళ్లారు అంటే.. ‘కాప్పాన్’ సినిమా కోసం. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమాలోని ఓ పాట చిత్రీకరణ కోసం ఇండోనేషియాలోని జావా ద్వీపానికి వెళ్లారు టీమ్. సాయేషా కథానాయికగా నటిస్తున్న సినిమాలో మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, సముద్రఖని, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి హ్యారీస్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టులో ‘కాప్పాన్’ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ‘గురు’ ఫేమ్ సుధా కొంగర దర్శకత్వంలో ‘శూరరై పోట్రు’ అనే సినిమాలో, ఆ తర్వాత శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటిస్తారు సూర్య. అలాగే సూర్య పూర్తి చేసిన ‘ఎన్జీకే’ చిత్రం రిలీజ్‌కు రెడీగా ఉంది. -
పోదుమ్.. పోదుమ్!
హీరో సూర్య ‘బిర్యానీ వేణుమా’ (కావాలా) అంటూ కొసరి కొసరి వడ్డించారట. ‘పోదుమ్ పోదుమ్’ (చాలు చాలు) అన్నప్పటికీ వదలకుండా ప్రేమగా సూర్య వడ్డించడంతో ‘కాప్పాన్’ చిత్రబృందం ఫుల్లుగా బిర్యానీ లాగించేశారు. సూర్య హీరోగా కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘కాప్పాన్’. ఇందులో సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తున్నారు. మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, సముద్రఖని, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఎన్ఎస్జీ కమాండో పాత్రల్లో సూర్య, సముద్రఖని కనిపిస్తారు. దేశ ప్రధానమంత్రి పాత్రలో మోహన్‌లాల్ నటించారని సమాచారం. ఈ సినిమాలో మోహన్‌లాల్ వంతు షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం సూర్యపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లొకేషన్లో సూర్య స్వయంగా సెట్లోని సభ్యులకు బిర్యానీ వడ్డించారు. ఇంకేముంది ‘తంగమాన హీరో’ అంటూ యూనిట్ సభ్యులు సూర్యకు కితాబులిచ్చేశారు. అంటే.. బంగారం లాంటి హీరో అని అర్థం. ఈ సంగతి ఇలా ఉంచితే... కాప్పాన్ సినిమాను ఈ ఏడాది పంద్రాగస్టుకు విడుదల చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని కోలీవుడ్ టాక్. ఆల్రెడీ ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైన సంగతి తెలిసిందే. -
వరుస సినిమాలతో స్టార్ హీరో సందడి
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో సందడి చేయనున్నాడు. ఇప్పటికే సెల్వరాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్జీకే సినిమా షూటింగ్ పూర్తి చేసిన సూర్య, ప్యారలల్‌గా మరో సినిమాను కూడా పూర్తి చేస్తున్నాడు. వీడొక్కడే, బ్రదర్స్ లాంటి సినిమాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ అనే సినిమా చేస్తున్నాడు సూర్య. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ 30 శాతానికి పైగా పూర్తయ్యింది. లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న కాప్పాన్లో సూర్య ఎన్ఎస్జీ కమాండోగా కనిపించనున్నాడు. మాలీవుడ్ సూపర్‌స్టార్ మోహన్ లాల్, తమిళ యంగ్ హీరో ఆర్యలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అఖిల్ ఫేం సయేషా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో అనన్య మరో ఇంపార్టెంట్ రోల్లో కనిపించనుంది. -
కాపాడతాడు!
కంటికి రెప్పలా కాపల కాస్తున్నారు సూర్య. విలన్స్ ఎవరైనా ఎటాక్ చేయాలని ట్రై చేస్తే తూటాతోనే సమాధానం చెబుతున్నాడు. మరి.. సూర్య మిషన్ ఏంటి? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న సినిమాకు ‘కాప్పాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రంలోని సూర్య లుక్‌ని కూడా రిలీజ్ చేశారు చిత్రబృందం. కాప్పాన్ అంటే కాపాడతాడు అని అర్థం. ‘‘మీట్పాన్, కాప్పాన్, ఉయిర్కా’ ఈ మూడు టైటిల్స్‌లో ఏదో ఒక టైటిల్‌ని ఎంపిక చేయవలసిందిగా ఆడియన్స్ కోరి పోల్ పెట్టాం. ‘ఉయిర్కా’ టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, టీమ్ మెంబర్స్, ఇండస్ట్రీ సన్నిహితులు ‘కాప్పాన్’ టైటిల్ సౌండింగ్ బాగుందని, ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశాం. ఇందులో సూర్య ఎన్జీఏ (నేషనల్ సెక్యూరిటీ గార్డు) పాత్రలో కనిపిస్తారు. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం సూర్య ‘ఎన్జీకే’ (నంద గోపాలన్ కుమారన్) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నెల 17నుంచి ‘కాప్పాన్’ షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. -
సూర్య చిత్ర టైటిల్ ఉయిర్కా?
నటుడు సూర్య తాజా చిత్రానికి ‘ఉయిర్కా’ అనే టైటిల్ దాదాపు ఖరారైనట్టే నంటున్నారు. సూర్య, సాయిపల్లవి, రకుల్‌ప్రీత్‌సింగ్ హీరో హీరోయిన్లుగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో డ్రీమ్ వారియర్ ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం ఎన్జీకే. ఈ చిత్రం దీపావళికి విడుదల కావలసి ఉంది. అయితే చిత్ర ని ర్మాణంలో జాప్యం కారణంగా అనుకున్న విధంగా ఎన్జీకే చిత్రం తెరపైకి రాలేదు. ఇప్పటికీ ఈ చిత్ర విడుదలపై క్లారిటీ లేదు. కాగా సూర్య తాజాగా మరో చిత్రంలోనూ నటిస్తున్న విషయం తెలిసిందే. కేవీ.ఆనంద్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తున్న ఇందులో నటి సాయేషా సైగల్ నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ మాత్రం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్ర టైటిల్ విషయంలో చిత్ర వర్గాలు సూర్య అభిమానులకు మీట్పవన్, కాప్పన్, ఉయిర్కా మూడు పేర్లు చెప్పి ఏది బాగుందో చెప్పాల్సిందిగా అడిగారు. దీంతో 50 శాతం ఓట్లు ఉయిర్కా టైటిల్‌కు పడ్డాయి. దీంతో చిత్ర యూనిట్ కూడా ఉయిర్కా టైటిల్‌నే ఖారారు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ చిత్ర టైటిల్‌ను చిత్ర వర్గాలు నూతన సంవత్సం సందర్భంగా జనవరి ఒకటవ తేదీన వెల్లడించడానికి సిద్ధం అవుతున్నారు. ఇందులో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఆర్య, బొమన్ ఇరానీ, సముద్రకని ముఖ్య పాత్రలను పోషించడం విశేషం. హరీశ్జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్న తాజా చిత్రం ఇది. అదేవిధంగా అయన్, మాట్రాన్ చిత్రాల తరువాత సూర్య, దర్శకుడు కేవీ.ఆనంద్‌ల కాంబినేషన్లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది కావడంతో భారీ అంచనాలే నెలకొన్నాయి. -
మాకో టైటిల్ పెట్టండి
సూర్య ఫ్యాన్స్‌కు భలే చాన్స్ ఇచ్చారు దర్శకుడు కేవీ ఆనంద్. సూర్యతో ఈ దర్శకుడు ఓ స్టైలిష్ థ్రిల్లర్ రూపొందిస్తున్నారు. కథానుసారంగా ఆ చిత్రానికి మూడు టైటిల్స్‌ను అనుకున్నారు చిత్రబృందం. అయితే ఏది ఫిక్స్ చేయాలో అర్థం కాలేదు. దాంతో నిర్ణయాన్ని అభిమానులకే వదిలేశారు. ‘‘మేం మూడు టైటిల్స్ అనుకున్నాం. అందులో ఏ టైటిల్ బావుంటుందో చెప్పండి’’ అంటూ ‘మీట్పాన్, కాప్పాన్, ఉయిర్కా’.. ఈ మూడు టైటిల్స్‌ను పెట్టి ఓ పోల్ నిర్వహించారు. ఆ మూడు టైటిల్స్ అర్థం దగ్గరదగ్గరగా ఒకటే. కాపాడటం, రక్షించడం అనే అర్థాలు వస్తాయి. ఫస్ట్ రెండు టైటిల్స్ కంటే మూడో టైటిల్ విభిన్నంగా ఉందని ‘ఉయిర్కా’ అనే టైటిల్‌కు ఎక్కువ ఓట్లు వేశారు. మరి ఫైనల్‌గా చిత్రబృందం ఏ టైటిల్ ఫిక్స్ చేస్తుందో చూడాలి. జనవరి 1న టైటిల్‌ను అనౌన్స్ చేయనున్నారు. ఇందులో సూర్య రక్షణ శాఖ అధికారిగా కనిపిస్తారు. సయేషా కథానాయిక. మోహన్‌లాల్ ముఖ్య పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్ కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. -
కులూలో కూల్ కూల్‌గా...
దేశంలోని సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా సంచరిస్తున్నారు హీరో సూర్య. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు. మోహన్‌లాల్, బొమన్ ఇరానీ, ఆర్య కీలక పాత్రలు చేస్తున్నారు. ఇటీవల నోయిడా షెడ్యూల్‌ను కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రబృందం తాజా షూటింగ్ కోసం కులు మనాలీ వెళ్లారు. ఈ షూట్లో సాయేషా కూడా పాల్గొంటున్నారు. హీరో, హీరోయిన్లపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమ సన్నివేశాలు తీస్తున్నారు. ఈ సినిమాలో సూర్య కమాండో ఆఫీసర్‌గా నటిస్తున్నారట. సామాజిక స్పృహ ఉన్న కథాంశంతో సాగే ఈ సినిమాలో మంచి సందేశం ఉంటుందని సమాచారం. -
రక్షించడానికి రాజధానిలో...
సైనికుడి ముఖ్య కర్తవ్యం ప్రజల రక్షణ. ఆ విషయంలో అతను ఎంత సమర్థవంతంగా వ్యవహరించాడన్న దాని మీదే దేశ శాంతి భద్రతలు ఆధారపడి ఉంటాయి. ఇలాంటి సిన్సియర్ సైనికుడి పాత్రలోనే హీరో సూర్య తన నెక్ట్స్ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి కేవీ ఆనంద్ దర్శకుడు. ఇందులో మోహన్ లాల్, ఆర్య కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సయేషా కథానాయిక. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతోంది. ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
న్యూలుక్లో సూర్య
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం కేవీ ఆనంద్ దర్శకత్వంలో తన 37వ సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్యతో పాటు మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్, తమిళ యంగ్ హీరో ఆర్య, బాలీవుడ్ సీనియర్ యాక్టర్ బొమన్ ఇరానీలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల లండన్ షూట్ ముంగించుకొని వచ్చిన చిత్రయూనిట్ ప్రస్తుతం చెన్నై సెకండ్ షెడ్యూల్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా ఈసినిమాకు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో సూర్య కమాండోగా కనిపించనున్నాడు. కేవీ ఆనంద్ స్టైల్లో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అఖిల్ ఫేం సయేషా సైగల్ హీరోయిన్గా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు హారిస్ జయరాజ్ సంగీతమందిస్తున్నారు. -
మరో పీరియాడిక్ డ్రామాలో సూర్య!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రస్తుతం సెల్వ రాఘవన్ దర్శకత్వంలో ఎన్జీకే సినిమాలో నటిస్తున్న సూర్య, ఆ సినిమా సెట్స్ మీద ఉండగానే కేవీ ఆనంద్ దర్శకత్వంలో మరో సినిమాను ప్రారంభించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లండన్‌లో జరగుతోంది. త్వరలో మరో సినిమాను మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు సూర్య. ఎన్జీకే షూటింగ్ పూర్తయిన వెంటనే కేవీ ఆనంద్ సినిమాతో పాటు ఓ మహిళ దర్శకురాలితో కలిసి పనిచేసేందుకు సూర్య ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. మాధవన్ హీరోగా సాలా ఖదూస్ సినిమాను రూపొందించిన సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్టులో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సూర్య స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా పీరియాడిక్ జానర్లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. ఇటీవల సూర్య హీరోగా తెరకెక్కిన గ్యాంగ్ కూడా పీరియాడిక్ జానర్లో తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. -
సూర్య సినిమాలో బొమన్ ఇరానీ!
కోలీవుడ్‌లో ఓ భారీ మల్టిస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ సూర్య, మాలీవుడ్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్ ఓ సినిమాలో కలిసి నటిస్తున్నారు. కేవీ ఆనంద్ డైరెక్షన్లో తెరకెక్కతున్న ఈ మూవీపై కోలీవుడ్‌లో భారీగానే అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమాలో ‘అత్తారింటికి దారేది’ ఫేం బొమాన్ ఇరానీ ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు ప్రకటించారు. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కల్యాణ్‌కు తాతగా నటించి మెప్పించాడు. ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా.. అంతగా గుర్తింపు తీసుకురాలేదు. అయితే తాజాగా సూర్య , మోహన్‌లాల్ కలిసి నటిస్తున్న సినిమాలో అవకాశం వచ్చింది. లైకా ప్రొడక్షన్స్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లు శిరీష్ కూడా నటించనున్నాడు. ఇది సూర్యకు 37వ చిత్రం. గతంలో కేవీ ఆనంద్ డైరక్షన్లో వచ్చిన వీడొక్కడే, బ్రదర్స్‌తో హిట్స్ కొట్టిన సూర్య ఈ మూవీతో హ్యాట్రిక్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. Welcome to Kollywood, @bomanirani sir! #Suriya37 https://t.co/LNUAkSDVTb — Allu Sirish (@AlluSirish) June 22, 2018 -
క్రేజీ మల్టీస్టారర్‌కు భారీ బడ్జెట్
తెలుగు, తమిళ భాషల్లో మంచి మార్కెట్ సొంతం చేసుకున్న స్టార్ హీరో సూర్య ఇప్పుడు మలయాళ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టారు. అందుకే తన తదుపరి చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహల్ లాల్ తో కలిసి నటిస్తున్నారు. సూర్య హీరోగా వీడొక్కడే, బ్రదర్స్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ ఈ క్రేజీ మల్టీ స్టారర్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. సూర్య 37వ సినిమాగా తెరకెక్కుతున్న ఈసినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు చిత్రయూనిట్ భారీ బడ్జెట్ కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఎక్కువ భాగం అమెరికా, లండన్, బ్రెజిల్ లాంటి దేశాల్లో షూటింగ్ జరుపుకోనున్న ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో సూర్య సరసన అఖిల్ ఫేం సయేషా సైగల్ హీరోయిన్గా నటించనుంది. -
అల్లు వారబ్బాయిది నెగెటివ్ రోల్ కాదట..!
మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన అల్లు శిరీష్. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ సినిమా 1971 బెయాండ్ బార్డర్స్‌లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు. తాజా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలోనూ శిరీష్ నటించేందుకు అంగీకరించాడు. అయితే ఈ సినిమాలో శిరీష్ నెగెటివ్ రోల్లో నటిస్తున్నట్టుగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స్పందించిన శిరీష్ టీం క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాలో శిరీష్ చేసేది నెగెటివ్ రోల్ కాదని, ఓ డిఫరెంట్ క్యారెక్టర్లో శిరీష్ సర్ప్రైజ్ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. వీడొక్కడే, రంగం చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోహన్‌లాల్ మరో కీలకపాత్రలో నటిస్తుండగా.. అఖిల్ ఫేం సయేషా హీరోయిన్గా నటించే అవకాశం ఉంది. -
అభిమాన నటుడితో మెగా హీరో
మలయాళ స్టార్ హీరో కంప్లీట్‌యాక్టర్ మెహన్ లాల్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఓ అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. సూర్య హీరోగా వీడొక్కడే, బ్రదర్స్ లాంటి చిత్రాలను తెరకెక్కించిన కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఓ టాలీవుడ్ యంగ్ హీరో కూడా నటించనున్నాడు. మెగా ఫ్యామిలీ హీరోగా ఎంట్రీ ఇచ్చి స్టార్ ఇమేజ్ కోసం కష్టపడుతున్న అల్లు శిరీష్, మెహన్ లాల్, సూర్య కాంబినేషన్లో రూపొందనున్న సినిమాలో కీలక పాత్రలో నటించనున్నాడట. ఈ విషయాన్ని అల్లు శిరీష్ తన సోషల్ మీడియా పేజ్‌లో అభిమానులతో షేర్ చేసుకున్నారు. తన అభిమాన హీరో సూర్యతో కలిసి నటించటం, మోహన్ లాల్ లాంటి టాప్ హీరోతో రెండో సారి కలిసి నటించే అవకాశం రావటం ఆనందంగా ఉందంటూ ట్వీట్ చేశారు శిరీష్. Excited to be onboard for #Suriya37. As a @Suriya_offl fan its a dream come true to share screen space with him. Honoured to be sharing screen space with Lal sir again. Thx @anavenkat sir for giving me this opportunity. pic.twitter.com/9xIKz4Mc28 — Allu Sirish (@AlluSirish) 13 May 2018 -
సూర్య సినిమాలో మోహన్‌లాల్!
-
సూర్య సినిమాలో మోహన్‌లాల్!
ప్రస్తుతం ఓ మల్టిస్టారర్ సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఒక పెద్ద హీరో, మరో స్టార్ హీరో సినిమాలో నటించడమో, అతిథి పాత్రలో మెప్పించడమో ఈ మధ్య జరుగుతూనే ఉంది. ఈ పరిణామాలతో సినిమాకు ఒక కొత్తదనం వస్తోంది. ఒక సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు ఉంటే సినిమా రేంజ్ పెరిగిపోతుంది. అదే.. వేరే ఇండస్ట్రీకి చెందిన మరో స్టార్ మరో ఇండస్ట్రీకి చెందిన స్టార్‌తో జతకడితే సినిమా స్థాయి అమాంతం పెరిగిపోతుంది. మాలీవుడ్ స్టార్ కంప్లీట్ యాక్టర్ మోహన్‌లాల్, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య సినిమాలో నటించనున్నారు. ఈ విషయాన్ని లైకా సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాను కె.వి. ఆనంద్ డైరెక్ట్ చేయనున్నారు. ఇదివరకే సూర్య ఆనంద్ కాంబినేషన్లో వీడొక్కడే, బ్రదర్స్ సినిమాలు వచ్చాయి. ముచ్చటగా మూడోసారి హిట్ కొట్టాలని, ఈ సారి ప్రత్యేక ఆకర్షణగా మోహన్‌లాల్‌ను ప్రత్యేక పాత్రకు తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాకు మోహన్‌లాల్ పాత్రే కీలకమని తెలుస్తోంది. ప్రస్తుతం సూర్య ఎన్జీకే (NGK) మూవీలో నటిస్తున్నారు. -
రజనీ కోసం ఆ ముగ్గురు..
తమిళసినిమా: దక్షిణాది సినిమానే కాదు ఇప్పుడు తమిళనాడు రాజకీయాలు కమలహాసన్, రజనీకాంత్ చుట్టూనే తిరుగుతున్నాయన్నది వాస్తవం. వీరిలో కమలహాసన్ సినిమాలకు గుడ్‌బై చెప్పేశారు. నిర్మాణంలో ఉన్న విశ్వరూపం–2, శభాష్‌నాయుడు చేయనున్నట్లు ప్రకటించినా ఇండియన్ 2 చిత్రాలనే ఆయన నుంచి ఆశించవచ్చు. ఇక రజనీకాంత్ రాజకీయరంగప్రవేశం కార్యక్రమాలు ముమ్మరంగా జరగుతున్నాయి. ఆయన త్వరలోనే పార్టీ జండా, అజెండాలను వెల్లడించే సమయం ఆసన్నమైంది. రజనీకాంత్ దర్శకుడు శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న 2.ఓ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాల్లో ఉన్న విషయం తెలిసిందే. శంకర్ ఈ చిత్రాన్ని నభూతోనభవిష్యత్ అనే విధంగా తీర్చిదిద్దే పనిలో నిమగ్నమయ్యారు. కబాలి చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకత్వంలో తన అల్లుడు, నటుడు ధనుష్ నిర్మాణంలో రజనీకాంత్ మరోసారి దాదాగా నటించిన కాలా చిత్రం ఏప్రిల్ 27న తెరపైకి రావడానికి ముస్తాబుతోంది. ఇక రజనీకాంత్ మరో చిత్రం చేస్తారా, 2.ఓ చివరి చిత్రం అవుతుందా? అన్న చర్చ జరుగుతున్న సమయంలో ఆయన కోసం ముగ్గురు దర్శకులు కథలు సిద్ధం చేశారు. సూపర్‌స్టార్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడమే ఆలస్యం తమ చిత్రాలను పట్టాలెక్కించడానికి ఆత్రుతగా ఎదురు చూస్తున్నారనే ప్రచారం కోలీవుడ్‌లో వైరల్ అవుతోంది. యువ దర్శకుడు అట్లీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజారాణి, తెరి, మెర్శల్ చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్నారు. ఇక మరో వర్థమాన దర్శకుడు మణికంఠన్ కాక్కాముట్టై చిత్రంలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. ఈ ఇద్దరూ రజనీకాంత్ కోసం కథలను సిద్ధం చేసి ఆయనకు వినిపించారు కూడా. మరో ప్రముఖ ఛాయాగ్రాహకుడు, దర్శకుడు కేవీ.ఆనంద్ కూడా సూపర్‌స్టార్ కోసం బ్రహ్మాండమైన కథను సిద్ధం చేశారట. అట్లి, కేవీ.ఆనంద్ రాజకీయ ఇతివృత్తంతో కథలను తయారు చేయగా కాక్కాముట్టై చిత్రం ఫేమ్ మణకంఠన్ వ్యవసాయం నేపథ్యంలో కథను రెడీ చేశారట. ఈ మూడు కథలు రజనీకాంత్‌ను ఇంప్రెస్ చేశాయని, వీరిలో ఏవరికి ఆయన పచ్చజెండా ఊపుతారన్నది ఆసక్తికరంగా మారిందనేది కోలీవుడ్ వర్గాల సమాచారం. -
‘బిగ్ బి’ని కోలీవుడ్ తీసుకొస్తారా?
2018లో స్పీడ్ పెంచేసిన సూర్య తన 37వ చిత్రానికి రెడీ అయిపోయారు. గత రెండేళ్లుగా సూర్య నటించిన ఒక్కో చిత్రమే తెరపైకి వస్తోంది. 2017లో ఎస్–3 చిత్రం మాత్రమే విడుదలైంది. ఈ ఏడాది ఆరంభంలో తానాసేర్న్‌దకూట్టం సంక్రాంతికి బరిలో దిగుతోంది. నటి కీర్తీసురేశ్ నాయకిగా నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం సెల్వరాఘవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇందులో రకుల్‌ప్రీత్‌సింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటిస్తున్నారు. దీనిని డ్రీమ్‌వారియర్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్ర ప్రారంభ దశలోనే సూర్య మరో చిత్రానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. కేవీ.ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నట్లు ఆయన ఇటీవల తానాసేర్న్‌దకూట్టం చిత్ర ప్రచార వేదికపై వెల్లడించారు. సూర్య, కేవీ.ఆనంద్‌ల కాంబినేషన్లో ఇప్పటికే అయన్, మాట్రాన్ చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి పనిచేయనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను చిత్ర నిర్మాణ సంస్థ త్వరలోనే వెల్లడిస్తారని సూర్య పేర్కొన్నారు. ఈ భారీ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఇందులో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్‌ను నటింపజేసే ప్రయత్నాలు చేస్తున్నారన్న విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమితాబ్‌బచ్చన్ ఇప్పటి వరకూ కోలీవుడ్‌లో నటించలేదు. టాలీవుడ్లో చిరంజీవితో కలిసి సైరా నరసింహారెడ్డి చిత్రంతో పరిచయం అవుతున్నారు. మరి కేవీ.ఆనంద్, సూర్య ఆయన్ని కోలీవుడ్‌కు తీసుకొస్తారా? లేదా అన్నది వేచి చూడాల్సిందే. ఇకపోతే సూర్య 24 చిత్రం ఫేమ్ విక్రమ్‌కుమార్, సింగం ఫేమ్ హరి దర్శకత్వంలోనూ మరో సారి నటించడానికి రెడీ అవుతున్నారని సమాచారం. -
ఇక నాన్ స్టాప్‌గా..
ఇప్పుడు మాంచి కమర్షియల్ కథల కోసం విక్రమ్ ఎదురు చూస్తున్నారు. కథ నచ్చితే చాలు... కొత్త, పాత తేడాలు లేకుండా దర్శకులకు అవకాశాలు ఇస్తున్నారు. అయితే... వాళ్లకు రెండు కండిషన్లు పెడుతున్నారట! అవేంటంటే? ఒకటి... కమర్షియల్ కథలో ఏదొక కొత్త పాయింట్ ఉండాలి. రెండు... సినిమాను వీలైనంత త్వరగా నాలుగైదు నెలల్లో కంప్లీట్ చేయాలి. ఎందుకంటే... శంకర్ ‘ఐ’కు రెండేళ్లు తీసుకోవడంతో ఆ సిన్మా విడుదల తర్వాత ఏడాదికి రెండేసి సినిమాలు చేయాలనుకున్నారు. కానీ, గతేడాది ఒక్క సినిమానే విడుదల చేయగలిగారు. సో, స్పీడుగా కొత్త కాన్సెప్టులతో కమర్షియల్ సినిమాలు తీసే దర్శకుల కోసం చూస్తున్నారు. ఈ టైమ్‌లో కేవీ ఆనంద్ చెప్పిన కథకు విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెన్నై కోడంబాక్కమ్ టాక్. ‘వీడొక్కడే, రంగం, బ్రదర్స్, అనేకుడు’ వంటి డబ్బింగ్ సిన్మాలతో ఈ దర్శకుడు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన కథలెలా ఉంటాయో తెలుసు కదా! సో, అపరిచితుడుతో ఈ ‘రంగం’ దర్శకుడు సినిమా చేయొచ్చు. ఇప్పటివరకు వీళ్లిద్దరూ కలసి సినిమా చేయకపోవడంతో ఈ కాంబినేషన్‌పై అందరిలో క్రేజ్ ఏర్పడింది!! -
ఆ ఇద్దరి కాంబినేషన్లో భారీ చిత్రం
కేవీ.ఆనంద్, విజయ్‌సేతుపతి కాంబినేషన్లో ఒక భా రీ చిత్రం తెరకెక్కనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే కోలీవుడ్ వర్గాల నుంచి వస్తోంది. ఇంతకు ముందు కో, ఆ మధ్య అయన్, ఆ తరువాత అనేగన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు కేవీ.ఆనంద్. ఈయన తాజా చిత్రానికి సిద్ధమయ్యారు.అయితే ఇందులో నటించే కథానాయకుల గు రించి పెద్ద లిస్టే ప్రచారంలో ఉంది. ఆర్య, జీవా,శివకార్తికేయన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరి గింది. ఒక దశలో జీవా ఫిక్స్ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా మరో యువ న టుడు విజయ్‌సేతుపతి పేరు వినిపిస్తోంది. కేవీ.ఆనంద్ విజయ్‌సేతుపతి కాంబినేషన్లో చిత్రం దాదాపు ఖరారైనట్లేనని తా జా సమాచారం. ఈ చిత్రాన్ని ఒక ప్రము ఖ చిత్ర నిర్మాణ సంస్థ భారీ ఎత్తున నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని తెలిసింది. -
'కో' కాంబినేషన్లో మరో సినిమా
2011లో జీవా హీరోగా తెరకెక్కిన 'కో' అప్పట్లో సంచలనం విజయం సాధించింది. తరువాత ఆ సినిమా 'రంగం' పేరుతో తెలుగులోకి అనువాదమై ఇక్కడ కూడా అదే స్ధాయిలో విజయం సాధిచింది. కార్తీక హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కెవి ఆనంద్ దర్శకుడు. ఈ సినిమా విడుదలైన నాలుగేళ్ల తరువాత అదే కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. త్వరలోనే కెవి ఆనంద్ దర్శకత్వంలో జీవా హీరోగా మరో సినిమాకు రెడీ అవుతున్నారు. ధనుష్ హీరోగా తెరకెక్కిన అనేగన్ సినిమా తరువాత ఇంతవరకు నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్ చేయని కెవి ఆనంద్ త్వరలోనే కొత్త సినిమా మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడు. అజిత్, శివకార్తీకేయన్, ఆర్య లాంటి హీరోలతో ఆనంద్ సినిమా ఉంటుందన్న టాక్ వినిపించినా ఫైనల్‌గా జీవాతోనే సినిమా చేయడానికి ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు కెవి ఆనంద్. -
కేవీ ఆనంద్ దర్శకత్వంలో ఆర్య
దర్శకుడు కేవీ ఆనంద్, నటుడు ఆర్య కలయికలో ఒక భారీ చిత్రం తెరకెక్కే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ధనుష్ హీరోగా రూపొందించిన అనేగన్ వంటి సక్సెస్ఫుల్ చిత్రం తరువాత కేవీ ఆనంద్ తెరకెక్కించే చిత్రంలో నటించే హీరో ఎవరన్న విషయం గురించి పలువురి పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. ఇటీవల శివకార్తీకేయన్ నటించనున్నారనే ప్రచారం జరిగింది. అయితే అది అసత్యప్రచారం అని కేవీ ఆనంద్ ఖండించారు. తాజాగా ఆర్య నటించనున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మించనుంది. ఇదే సంస్థ ఇంతకు ముందు కేవీ ఆనంద్ దర్శకత్వంలో మాట్రాన్, అనేగన్ చిత్రాలను నిర్మించిందన్నది గమనార్హం. ఆర్య హీరోగా మదరాసుపట్టణం వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్నీ ఏజీఎస్ సంస్థనే నిర్మించింది. ఇకపోతే ఆర్య ప్రస్తుతం ఇంజిఇడుప్పళగి చిత్రంతో పాటు బెంగళూర్ డేస్ రీమేక్‌లో నటిస్తున్నారు. ఇంజిఇడుప్పళగి చిత్రంలో నాయకి అనుష్కకే ప్రాధాన్యత ఉంటుంది. ఇక బెంగళూర్ డేస్ రీమేక్ చిత్రంలో ఆర్యతో పాటు బాబీసింహా, రానా నటిస్తున్నారు. ఇంతకు ముందు నటించిన యట్చన్ చిత్రంలోనూ మరో హీరోగా క్రిష్ణ నటించారు. దీంతో సోలో హీరోగా మంచి యాక్షన్ కథా చిత్రం చెయ్యాలని ఆశిస్తున్నట్లు సమాచారం. కేవీ ఆనంద్ కథ తెగ నచ్చడంతో ఆర్య ఆయన దర్శకత్వంలో నటించాలని ఆశిస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెలువడనున్నట్లు సమాచారం. -
పునర్జన్మలను సరికొత్తగా డీల్ చేశాం : కె.వి.ఆనంద్
‘‘పునర్జన్మలకు సంబంధించి చాలా వార్తలు చూసే ఉంటాం. ఈ కాన్సెప్ట్ మీద చాలా చిత్రాలు వచ్చాయి. వాటికి భిన్నంగా శాస్త్రీయంగా డీల్ చేస్తూ, నాలుగు తరాలను బేస్ చేసుకుని రాసుకున్న కథ ఇది. తెలుగులో కూడా పెద్ద హిట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని దర్శకుడు కేవీ ఆనంద్ అన్నారు. ఆయన దర్శకత్వంలో ధనుష్, అమైరా దస్తూర్ జంటగా కల్పాత్తి ఎస్. అఘోరమ్, కల్పాత్తి ఎస్. గణేశ్, కల్పాత్తి ఎస్. సురేశ్ నిర్మించిన ‘అనేకుడు’ చిత్రం ఇటీవలే విడుదలైంది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన సక్సెస్ మీట్లో సంగీత దర్శకుడు హ్యారిస్ జైరాజ్ మాట్లాడుతూ-‘‘నాలుగు ప్రేమ కథలను కేవీ ఆనంద్ బాగా తెరకెక్కించారు. పాటలకు, సినిమాకు మంచి స్పందన రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. పాటల రచయిత సాహితి మాట్లాడుతూ -‘‘యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రంలో మాస్ సాంగ్ రాసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది’’అన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత ఎన్.వి.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
అమరన్ సీక్వెల్‌కు సిద్ధం
అమరన్ చిత్ర సీక్వెల్ నటుడు కార్తీక్ సిద్ధమవుతున్నారు. 90స్లో ప్రముఖ నటుడుగా వెలుగొంది న నటుల్లో కార్తీక్ ఒకరు. నటుడిగా మంచి ఫామ్ లో ఉండగానే రాజకీయరంగ ప్రవేశంచేసి సొంతంగా పార్టీని కూడా నెలకొల్పారు. ఆ తరువా త ఆ పార్టీని రద్దుచేసి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ లో చేరారు. కాగా అడపాదడపా సినిమాల్లోనూ నటిస్తున్న కార్తీక్ ఇటీవల కేవీ.ఆనంద్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన అనేగన్ చిత్రంలో ముఖ్య భూమికను పోషించారు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో కార్తీక్‌కు పలు అ వకాశాలు రావడం మొద లెట్టాయి. కాగా ఈయన 1992లో సొంతంగా నిర్మించి హీరోగా నటించిన అమరన్ చిత్రం సీక్వెల్‌ను రూపొందించాలనే నిర్ణయానికి వచ్చారు. ఒక పక్క కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ హీరోగా నటిస్తుంటే ఇప్పుడు ఈయన కూడా కథా నాయకుడిగా నటించడానికి తయారవ్వడం విశే షం. అమరన్ యాక్షన్ అంశాలతో కూడిన కమర్షియల్ చిత్రం ఈ చిత్రానికి రాజేశ్వర్ దర్శకుడు. ఇప్పుడు సీక్వెల్‌కు ఆయన దర్శకత్వం వహించనున్నారట. దీని గురించి కార్తీక్ తెలుపుతూ ఆ మధ్య చిత్రాన్ని రాజేశ్వర్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. ఆయన తనకుమంచి మిత్రుడు అని అన్నారు. ఇదయ తామరై చిత్రానికి ఆయన దర్శకుడు. మళ్లీ ఇన్నాల్టికి కలసి పనిచేయబోవడం సంతోషంగా ఉంది అని అన్నారు. త్వరలోనే దర్శకుడు రాజేశ్వరన్‌ను కలిసి అమరన్-2 చిత్రం గురించి చర్చించనున్నట్లు కార్తీక్ వెల్లడించారు. -
విభిన్న పాత్రలలో...
వైవిధ్యమైన కథా, కథనాలతో ధనుష్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘అనేకుడు’. కేవీ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అమైరా దస్తూర్, ఐశ్వర్యా దేవన్ కథానాయికలుగా నటించారు. కల్పాతి ఎస్.అఘోరం, కల్పాతి ఎస్. సురేశ్, కల్పాతి ఎస్.గణేష్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాతలు మట్లాడుతూ-‘‘ ఇందులో నాలుగు విభిన్నమైన పాత్రల్లో ధనుష్ కనిపిస్తారు. ఆయన పాత్ర అన్ని వర్గాల వారినీ ఆకట్టుకుంటుంది. హారిస్ జైరాజ్ స్వరపరచిన ఈ చిత్రం పాటలకు మంచి ఆదరణ లభిస్తోంది. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను కూడా కచ్చితంగా మెప్పిస్తుందనే నమ్మకం ఉంది’’ అని నిర్మాతలు తెలిపారు.