
కంటికి రెప్పలా కాపల కాస్తున్నారు సూర్య. విలన్స్ ఎవరైనా ఎటాక్ చేయాలని ట్రై చేస్తే తూటాతోనే సమాధానం చెబుతున్నాడు. మరి.. సూర్య మిషన్ ఏంటి? అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య హీరోగా రూపొందుతున్న సినిమాకు ‘కాప్పాన్’ అనే టైటిల్‌ను ఖరారు చేసి, న్యూ ఇయర్ సందర్భంగా ఈ చిత్రంలోని సూర్య లుక్‌ని కూడా రిలీజ్ చేశారు చిత్రబృందం. కాప్పాన్ అంటే కాపాడతాడు అని అర్థం. ‘‘మీట్‌పాన్, కాప్పాన్, ఉయిర్కా’ ఈ మూడు టైటిల్స్‌లో ఏదో ఒక టైటిల్‌ని ఎంపిక చేయవలసిందిగా ఆడియన్స్ కోరి పోల్ పెట్టాం.
‘ఉయిర్కా’ టైటిల్‌కు మంచి స్పందన వచ్చింది. కానీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్, టీమ్ మెంబర్స్, ఇండస్ట్రీ సన్నిహితులు ‘కాప్పాన్’ టైటిల్ సౌండింగ్ బాగుందని, ఆడియన్స్‌కి బాగా రీచ్ అవుతుందని అభిప్రాయపడ్డారు. దీంతో ఆ టైటిల్‌నే ఫిక్స్ చేశాం. ఇందులో సూర్య ఎన్‌జీఏ (నేషనల్ సెక్యూరిటీ గార్డు) పాత్రలో కనిపిస్తారు. 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం సూర్య ‘ఎన్‌జీకే’ (నంద గోపాలన్ కుమారన్) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ నెల 17నుంచి ‘కాప్పాన్’ షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రంలో సాయేషా కథానాయికగా నటిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment