అభిమానులకు సూర్య విన్నపం | Hero Suriya's Request To Fans | Sakshi
Sakshi News home page

అభిమానులకు సూర్య విన్నపం

Sep 15 2019 10:11 AM | Updated on Sep 15 2019 11:54 AM

Hero Suriya's Request To Fans - Sakshi

కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం బందోబస్త్‌. కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌తో పాటు ఆర్య, బొమన్‌ ఇరానీ కీలక పాత్రల్లో నటించారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న హీరో సూర్య అభిమానులకు ఓ విజ్ఞప్తి చేశారు.
(చదవండి : యువతిని బలిగొన్న బ్యానర్‌)

ఇటీవల చెన్నైలో ఫ్లెక్సీ బ్యానర్‌ పడి సాఫ్ట్‌పేర్‌ ఉద్యోగిని శుభశ్రీ మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తన సినిమా కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దని సూర్య అభిమానులను కోరాడు. ఫ్లెక్సీ కారణంగా ప్రమాదాలు జరగటమే కాదు, పర్యావరణానికి కూడా హాని జరుగుతుందన్న సూర్య, ఫ్లెక్సీల కోసం ఖర్చుపెట్టే డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించాలని కోరాడు సూర్య.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement