పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్‌ | Actress Poorna About Her Marriage | Sakshi
Sakshi News home page

పెళ్లికి నేను సిద్ధం : హీరోయిన్‌

Sep 21 2019 8:14 AM | Updated on Sep 21 2019 8:14 AM

Actress Poorna About Her Marriage - Sakshi

పెళ్లికి తాను సిద్ధంగా ఉన్నానని అంటోంది నటి పూర్ణ. ఈ మలయాళ భామ మంచి నటి, అంతకంటే మంచి డ్యాన్సరు. వివిధ భాషా చిత్రాల్లో కథానాయకిగా నటించిన పూర్ణ ఇప్పుడు కథానాయకిగానే కాదు పాత్ర బాగుంటే సపోర్టింగ్ రోల్స్‌ చేయడానికీ సిద్ధం అంటోంది. ఈ మధ్య ‘సువరకత్త’చిత్రంలో చాలా చక్కని నటన ప్రదర్శించి పేరు తెచ్చుకున్న పూర్ణ ప్రస్తుతం ‘బ్లూవేల్‌’అనే చిత్రంలో పోలీస్‌ అధికారిణిగా ముఖ్య పాత్ర పోషిస్తోంది. సూర్య కథానాయకుడిగా నటించిన ‘కాప్పాన్‌’ (తెలుగులో బందోబస్త్‌) చిత్రంలో చిన్న పాత్రలో మెరిసింది. సాయేషా సైగల్‌ కథానాయకిగా నటించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా నటి పూర్ణ మీడియా ముచ్చటించారు‌.

కాప్పాన్‌ చిత్రంలో నటించిన అనుభవం గురించి?
కాప్పాన్‌ చిత్రంలో నటుడు సముద్రఖనికి జంటగా నటించాను. పాత్ర చిన్నదే అయినా సంతృప్తినిచ్చింది. ఇందులో నా పాత్రకు నేనే డబ్బింగ్‌ చెప్పుకున్నాను. భారీ చిత్రంలో నటించాలన్న ఆశ కాప్పాన్‌తో తీరింది.

ఎక్కువగా క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా నటించడానికి కారణం?
చాలా చిత్రాల్లో హీరోయిన్‌గా నటించాను. అలాంటిది సమీప కాలంలో కథానాయకిగానే నటించాలన్న ఆలోచన మారింది. పాత్రలో కొత్తదనం ఉందనిపిస్తే అది ఎలాంటిదైనా చేయడానికి వెనుకాడటం లేదు. చిత్రంలో అన్ని పాత్రలు ముఖ్యమే అవుతాయి. కొన్ని పాత్రలు కథానాయకి పాత్ర కంటే మంచి పేరు తెచ్చి పెడతాయి.

ప్రస్తుతం నటిస్తున్న చిత్రాలు?
తమిళంలో బ్లూవేల్‌ చిత్రంతో పాటు తెలుగు, మలయాళ భాషల్లో ఒక్కో చిత్రం చేస్తున్నాను.

బ్లూవేల్‌ చిత్రం గురించి?
ఇది లో బడ్జెట్‌లో రూపొందిస్తున్న చిత్రమే కానీ, బ్లూవేల్‌ గేమ్‌ గురించి అవగాహన కలిగించే చిత్రంగా ఉంటుంది. ఇందులో పోలీస్‌ అధికారిణిగా, ఒక బిడ్డకు తల్లిగా నటిస్తున్నాను. చిత్రంలో పోరాట సన్నివేశాల కంటే ఎమోషనల్‌ సన్నివేశాలు అధికంగా ఉంటాయి. 

అవార్డుల ఆశతో పాత్రలను ఎంచుకుంటున్నారా?
నేనెప్పుడూ అవార్డుల కోసమే నటించలేదు. పారితోషికం కూడా ముఖ్యమే. ఇప్పుడు చిన్న చిన్న పాత్రలకు కూడా మంచి పారితోషికం లభిస్తోంది. నాకు జీవితాంతం నటించాలని ఆశ. అయితే అది నా కుటుంబాన్ని బట్టి ఉంటుంది. కాప్పాన్‌ చిత్రంలో నా నటన కోసమే సంప్రదించారు. అలాంటి పేరు తెచ్చుకోవాలన్నదే నా ఆశ.

పెళ్లెప్పుడు చేసుకుంటారు?
పెళ్లి జీవితంలో ముఖ్యమైనది. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. సరైన సమయంలో చేసుకోవాలి. కుటుంబ సభ్యులు ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఇక ఆ భగవంతుడే నిర్ణయించాలి. నా వివాహ రిసేప్షన్‌ మాత్రం కచ్చితంగా చెన్నైలోనే ఏర్పాటు చేస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement