అల్లు వారబ్బాయిది నెగెటివ్‌ రోల్‌ కాదట..! | Allu Sirishs Role In Suriya Kv Anand Film | Sakshi
Sakshi News home page

Published Wed, May 23 2018 1:49 PM | Last Updated on Wed, May 23 2018 1:49 PM

Allu Sirishs Role In Suriya Kv Anand Film - Sakshi

మెగా ఫ్యామిలీ నుంచి హీరోగా పరిచయం అయిన అల్లు శిరీష్‌. శ్రీరస్తు శుభమస్తు సినిమాతో తొలి విజయాన్ని అందుకున్న ఈ యంగ్ హీరో ఇతర భాషల్లోనూ సినిమాలు చేస్తూ మార్కెట్‌ను పెంచుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మలయాళ సినిమా 1971 బెయాండ్‌ బార్డర్స్‌లో కీలక పాత్రలో నటించి మెప్పించాడు.

తాజా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ సినిమాలోనూ శిరీష్ నటించేందుకు అంగీకరించాడు. అయితే ఈ సినిమాలో శిరీష్‌ నెగెటివ్‌ రోల్‌లో నటిస్తున్నట్టుగా తమిళ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ వార్తలపై స‍్పందించిన శిరీష్ టీం క్లారిటీ ఇచ్చింది.

ఈ సినిమాలో శిరీష్‌ చేసేది నెగెటివ్‌ రోల్‌ కాదని, ఓ డిఫరెంట్‌ క్యారెక్టర్‌లో శిరీష్‌ సర్‌ప్రైజ్‌ ఇవ్వనున్నాడని తెలుస్తోంది. వీడొక్కడే, రంగం చిత్రాల దర్శకుడు కేవీ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మోహన్‌లాల్‌ మరో కీలకపాత్రలో నటిస్తుండగా.. అఖిల్‌ ఫేం సయేషా హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement