ఆస్కార్‌కు నామినేట్‌ అయిన జై భీమ్‌, మరక్కార్‌ చిత్రాలు | Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated For Oscars 2022 | Sakshi
Sakshi News home page

Oscars 2022: ఆస్కార్‌ బరిలో రెండు ఇండియన్‌ సినిమాలు..

Published Fri, Jan 21 2022 9:13 PM | Last Updated on Fri, Jan 21 2022 9:24 PM

Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated For Oscars 2022 - Sakshi

Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated For Oscars 2022: ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్‌ అవార్డుల రేసులో రెండు భారతీయ చిత్రాలు నామినేట్‌ అయ్యాయి. అందులో ఒకటి సూర్య నటించిన 'జై భీమ్‌' చిత్రం కాగా, మరోకటి మోహన్‌ లాల్‌ నటించిన 'మరక్కార్‌' చిత్రం. ఆస్కార్‌ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్‌ లిస్ట్‌ అవగా అందులో రెండు ఇండియన్‌ సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ సౌత్‌ ఇండస్ట్రీకి చెందినవే కావడం విశేషం.

గతేడాది అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైన జై భీమ్‌ 'జై భీమ్‌' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిన ఈ చిత్రానికి టి.జి.జ్ఞానవేల్‌ దర్శకత్వం వహించారు.

ఇక మలయాళ స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన మరక్కార్‌ చిత్రానికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.ఇక ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి27న అమెరికాలో జరగనుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement