69వ జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా సత్తా చాటింది. తమిళ, మలయాళ, కన్నడ సినిమాలు కూడా మెరిశాయి. అయితే సూర్య 'జై భీమ్' చిత్రానికి అవార్డ్ రాకపోవడం మాత్రం చాలామందిని ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచింది. కనీసం ఒక్కటైనా వచ్చుంటే బాగుండేదని వాళ్లు అభిప్రాయపడ్డారు. మరి 'జై భీమ్'కి అవార్డ్ ఎందుకు మిస్ అయింది? కారణాలు ఏంటి?
(ఇదీ చదవండి: జాతీయ అవార్డుల‍్లో 'ఆర్ఆర్ఆర్' హవా.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్)
సామాజిక రుగ్మతలు, అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయాన్ని.. నిజ జీవితంలో జరిగిన ఓ సంఘటనని స్పూర్తిగా తీసిన సినిమా 'జై భీమ్'. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజైనప్పటికీ ప్రతి ఒక్కరి నుంచి ప్రశంసలు అందుకుంది. ఓ సాధారణ లాయర్ పాత్రలో సూర్య అదరగొట్టేశాడు. కానీ ఈ సినిమాకి ఇప్పుడు ఏ విభాగంలోనూ అవార్డ్ రాలేదు.
జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవార్డు గెలవడం ఎవరికీ ఎలాంటి సందేహాలు లేవు. దానికి అతడి పూర్తి అర్హుడు. దీనికి సూర్య కూడా పోటీదారుడే కానీ కొద్దిలో మిస్ అయింది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. 2020లో సూరరై పోట్రు (ఆకాశమే హద్దురా) సినిమాకుగానూ ఉత్తమ నటుడిగా సూర్య.. జాతీయ అవార్డు అందుకున్నాడు.
(ఇదీ చదవండి: 'పుష్ప'కి జాతీయ అవార్డులు.. ఆ అంశాలే కలిసొచ్చాయా?)
'జై భీమ్' కూడా అదే సంస్థ నుంచి వచ్చింది. ఇన్నేళ్ల జాతీయ అవార్డుల చరిత్రలో.. ఏ హీరోకి వరసగా రెండుసార్లు పురస్కారం వరించలేదు. అలానే 'పుష్ప' మూవీకి దేశవ్యాప్తంగా వచ్చినంత పాపులారిటీ 'జై భీమ్'కి రాలేదనేది మీకు తెలుసు! ఇలా అనుకుంటేపోతే.. గతంలోనూ చాలావరకు మంచి మంచి సినిమాలకు కొద్దిలో జాతీయ అవార్డులు మిస్ అయ్యాయి. అంతమాత్రన వాటిని తక్కువ చేసినట‍్లు కాదు.
అవార్డుల వచ్చింది లేనిది కొన్నిరోజుల్లో మర్చిపోతారేమో గానీ ఓ మంచి సినిమాని ఎప్పటికీ గుండెల్లో పెట్టుకుంటారు. 'జై భీమ్' ఈ లిస్టులో కచ్చితంగా ఉంటుంది. ఎంటర్‌టైన్ చేసే విషయంలో 'పుష్ప', మెసేజ్ ఇవ్వడంతోపాటు ఎమోషనల్ చేసే విషయంలో 'జై భీమ్'.. ఎప్పటికీ అలా నిలిచిపోతాయి అంతే!
(ఇదీ చదవండి: ప్రేమ పేరుతో మోసం.. జబర్దస్త్ కమెడియన్ అరెస్ట్)
Comments
Please login to add a commentAdd a comment