అవార్డ్ రాకపోవడంపై నాని అసంతృప్తి.. ఏ సినిమాకో తెలుసా? | Nani Disappointment Over Suriya Jai Bhim Losing 69th National Film Awards 2023 - Sakshi
Sakshi News home page

Nani: ఆ చిత్రానికి అవార్డ్ రాకపోవడంపై తీవ్ర నిరాశలో నాని..!

Published Fri, Aug 25 2023 6:43 PM | Last Updated on Fri, Aug 25 2023 7:19 PM

Nani Disappointment Over Suriya Jai Bhim Losing National Film Award - Sakshi

నేచురల్ స్టార్‌ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని మరోసారి తనదైన నటనతో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల తన మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాని వార్తల్లో నిలిచాడు. గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై తనదైన శైలిలో స్పందించారు.

(ఇది చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?)

2021 ఏడాది అవార్డులకు గానూ తెలుగు చిత్రాలకే ఎక్కువ అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్‌ అవార్డ్‌ అల్లు అర్జున్‌ను వరించగా.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆరు, ఉప్పెన చిత్రానికి అవార్డులు దక్కాయి. ఈ సందర్బంగా నాని కంగ్రాట్స్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. 

అయితే తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి అవార్డ్ రాకపోవడంపై నాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్‌స్టాలో స్టోరీస్‌లో జై భీమ్‌ అంటూ లవ్ బ్రేకప్‌ అయిన సింబల్‌ను జోడించారు. అయితే 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ నటుడి విభాగంలో సూపర్‌స్టార్ సూర్య, ఉత్తమ చిత్రం విభాగంలో జై భీమ్ చిత్రానికి వస్తుందని ఆయన అభిమానులు భావించారు. జై భీమ్ పట్ల నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

కాగా.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్.. అట్టడుగు వర్గాలపై పోలీసుల దౌర్జన్యాలను చూపించారు. ఈ కథ ముగ్గురు గిరిజనుల చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రంలో మణికందన్, లిజిమోల్ జోస్, ప్రకాష్ రాజ్, రజిషా విజయన్, గురు సోమసుందరం, రావు రమేష్, జయప్రకాష్, ఇళవరసు, ఎలాంగో కుమారవేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement