National Film Award
-
జాతీయ అవార్డ్.. హీరో పునీత్ - వాళ్లకు అంకితం: రిషబ్ శెట్టి
కేంద్రం తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో దక్షిణాది సినిమాలు అద్భుతాలు చేశాయి. కన్నడ సినిమా 'కాంతార'కి గానూ ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అవార్డ్ రావడంపై రిషబ్ స్పందించాడు. దివంగత హీరో పునీత్‌పై తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)తనకు వచ్చిన జాతీయ అవార్డుని రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్, కన్నడ ప్రేక్షకులకు అంకితమిస్తున్నట్లు రిషబ్ శెట్టి పేర్కొన్నాడు. జాతీయ అవార్డ్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశాడు.హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార' సినిమాలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. కేవలం రూ.15 కోట్లు పెడితే ఏకంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ఇందుకు గానూ రిషబ్.. ఉత్తమ నటుడిగా నిలవడం కన్నడ సినిమా రేంజ్‌ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే) -
పదివేలకు పైగా పాటలు.. నేషనల్ అవార్డ్.. కానీ 37 ఏళ్లకే!
సినీ ఇండస్ట్రీలో సింగర్లకు ప్రత్యేకస్థానం ఉంటుంది. రచయిత రాసిన పాటను మధురమైన స్వరాలను అందించండం వారికి మాత్రమే సొంతం. అలా సినీరంగంలో ఎంతోమంది ప్రముఖ గాయకులు ఉన్నారు. చిన్న వయస్సులోనే విజయం సాధించి ఈ రంగంలో కీర్తిని పొందినవారిని ఇలా వేళ్లమీదే లెక్కపెట్టొచ్చు. తమ టాలెంట్‌తో సినీ ప్రేక్షకులను మైమరపించిన ఎందరో తారలు ఈ కాలగర్భంలో కలిసిపోయారు. అలాంటివారిలో ముఖ్యంగా దివ్యభారతి, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, జియాఖాన్ లాంటి స్టార్స్ కూడా ఉన్నారు. వీరిలాగే ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న సింగర్ స్వర్ణలత సైతం చిన్న వయసులోనే మరణించారు. ఈ స్టోరీలో ఆమె గురించి తెలుసుకుందాం. (ఇది చదవండి: ‘లియో’ వివాదంపై స్పందించిన నిర్మాత నాగవంశీ) స్వర్ణలత.. ఈ పేరు హిందీతో పాటు సౌత్ ఇండియా ఇండస్ట్రీలో సుపరిచితం. 1973లో కేరళలో జన్మించిన ఆమె సెప్టెంబర్ 12, 2010న ఈ లోకాన్ని విడిచి వెళ్లింది. ఆమె తన కెరీర్లో హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, బెంగాలీతో సహా దాదాపు 10 భాషలలో ఏకంగా పదివేల పాటలకు పైగా ఆలపించింది. ముఖ్యంగా స్వర్ణలత దక్షిణాది చిత్రాలకు చాలా పాటలు పాడినప్పటికీ.. ఆమె హిందీలోనూ గుర్తింపు తెచ్చుకుంది. నీతిక్కు తందానైలో కేజే యేసుదాస్‌తో కలిసి 'చిన్నచిరు కిలియే' అనే పాట పాడిన తర్వాత స్వర్ణలత అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత భారతీయ సంగీత పరిశ్రమలో తనకంటూ గుర్తింపు తెచ్చుకోవడంలో విజయం సాధించింది. కరుత్తమ్మ చిత్రంలోని "పోరాలే పొన్నుతాయి" పాటకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకుంది. ఈ పాటను ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచారు. ఆయన సంగీతంలో జాతీయ అవార్డును అందుకున్న మొదటి మహిళా నేపథ్య గాయని కూడా స్వర్ణలతనే. స్వర్ణలత తన ఫేవరెట్ సింగర్ అని గతంలోనే ఆస్కార్ విన్నర్, మ్యూజిక్ కంపోజర్ ఏఆర్ రెహమాన్ ఎప్పుడో చెప్పారు. కేరళలోనే పుట్టి పెరిగిన ఆమె 37 సంవత్సరాల వయసులో చెన్నైలోని మలార్ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఆమె తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ మరణించారు. (ఇది చదవండి: దేశంలో రిచెస్ట్ సింగర్.. వందల కోట్ల ఆస్తి.. ఈమె ఎవరో తెలుసా?) -
బన్నీ ఆస్కార్ అవార్డ్ గెలిచే సత్తా ఉంది: పోసాని కృష్ణ మురళి
స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ రావడం పట్ల ఏపీఎఫ్డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అభినందనలు తెలిపారు. అలాగే ఆర్ఆర్ఆర్, కొండపొలం, ఉప్పెన, పుష్ప చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ కు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. (ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ! ) పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ..'అల్లు అర్జున్‌కు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుంది. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషించాల్సిన విషయం. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్న అల్లు అర్జున్‌కు ఇష్టం. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఉన్నా ఇప్పటికి నేర్చు కుంటూనే ఉంటాడు. అది అతనిలో ఉన్న గొప్ప లక్షణం. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరోకి రాలేదు. అల్లు అర్జున్ ఇలాగే నేర్చుకుంటూ ఉంటే భవిష్యత్తులో ఆస్కార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది.' అని అన్నారు. రాబోయే కాలంలో బన్నీ మరిన్ని అవార్డులు గెలవాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ తెలిపారు. (ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకున్న నటి?!) -
అవార్డ్ రాకపోవడంపై నాని అసంతృప్తి.. ఏ సినిమాకో తెలుసా?
నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన నాని మరోసారి తనదైన నటనతో అభిమానులను అలరించాడు. అయితే ఇటీవల తన మిత్రుడు దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆసక్తికర కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి నాని వార్తల్లో నిలిచాడు. గురువారం ప్రకటించిన జాతీయ చలనచిత్ర అవార్డులపై తనదైన శైలిలో స్పందించారు. (ఇది చదవండి: బ్రహ్మానందం ఇంటికెళ్లిన బన్నీ.. కారణం అదేనా?) 2021 ఏడాది అవార్డులకు గానూ తెలుగు చిత్రాలకే ఎక్కువ అవార్డులు వచ్చాయి. బెస్ట్ యాక్టర్ అవార్డ్ అల్లు అర్జున్ను వరించగా.. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఏకంగా ఆరు, ఉప్పెన చిత్రానికి అవార్డులు దక్కాయి. ఈ సందర్బంగా నాని కంగ్రాట్స్ తెలిపారు. ఈ మేరకు తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. అయితే తమిళ స్టార్ హీరో సూర్య నటించిన జై భీమ్ చిత్రానికి అవార్డ్ రాకపోవడంపై నాని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇన్‌స్టాలో స్టోరీస్‌లో జై భీమ్ అంటూ లవ్ బ్రేకప్ అయిన సింబల్‌ను జోడించారు. అయితే 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్‌లో ఉత్తమ నటుడి విభాగంలో సూపర్‌స్టార్ సూర్య, ఉత్తమ చిత్రం విభాగంలో జై భీమ్ చిత్రానికి వస్తుందని ఆయన అభిమానులు భావించారు. జై భీమ్ పట్ల నాని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కాగా.. టీజే జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన జై భీమ్.. అట్టడుగు వర్గాలపై పోలీసుల దౌర్జన్యాలను చూపించారు. ఈ కథ ముగ్గురు గిరిజనుల చుట్టే తిరుగుతుంది. ఈ చిత్రంలో మణికందన్, లిజిమోల్ జోస్, ప్రకాష్ రాజ్, రజిషా విజయన్, గురు సోమసుందరం, రావు రమేష్, జయప్రకాష్, ఇళవరసు, ఎలాంగో కుమారవేల్ ప్రధాన పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటుడు మృతి!) #Nani's feel sad that #Suriya's #JaiBheem did not win a single #NationalFilmAwards2023 Shares Via Instagram Story.#FilmyBowl @SatishKTweets pic.twitter.com/rVk5xzskVF — Filmy Bowl (@FilmyBowl) August 25, 2023 -
69 ఏళ్ల ఎదురుచూపులు.. ఎట్టకేలకు అవార్డు సాధించిన ఐకాన్ స్టార్
తెలుగు సినీ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. 69 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన ఉత్తమ నటుడు అవార్డు తొలిసారి తెలుగు హీరోను వరించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ధనుష్, శింబు, ఆర్య, జోజు జార్జ్ పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కు నెడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ ఈ అవార్డు ఎగరేసుకుపోయాడు. పుష్ప 1 సినిమాకు గానూ ఆయనకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు వరించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దశాబ్ధాల తరబడి మనకు కాకుండా పోయిన పురస్కారాన్ని ఎట్టకేలకు బన్నీ సాధించాడని సంబరపడుతున్నారు. తెలుగు సినిమాలకు వచ్చిన మరిన్ని అవార్డులు ► ఉత్తమ చిత్రం - ఉప్పెన ► ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 1) ► బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్సమ్ ఎంటర్టైన్మెంట్ - ఆర్ఆర్ఆర్ ► ఉత్తమ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) - కింగ్ సోలోమన్ (ఆర్ఆర్ఆర్) ► ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్) ► ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - వి.శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్) ► ఉత్తమ లిరిక్స్- చంద్రబోస్ (ధమ్ ధమా ధమ్- కొండపొలం) ► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(సాంగ్స్) - దేవి శ్రీప్రసాద్ (పుష్ప 1) ► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాగ్రౌండ్ స్కోర్) - ఎమ్ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్) ► ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్ఆర్ఆర్) ► బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు చదవండి: 'ఆర్ఆర్ఆర్'కి జాతీయ అవార్డుల పంట.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ -
సూర్య సినిమాకు జాతీయ అవార్డుల పంట
న్యూఢిల్లీ: భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రతీ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జాతీయ అవార్డులను (National Awards) ఇవ్వడం ఆనవాయితి. ఈ ఏడాది కూడా 68వ జాతీయ సినిమా అవార్డులను ప్రకటించింది. 2020 సంవత్సరంలో వచ్చిన సినిమాలు ఈ పురస్కారాలను దక్కించుకున్నాయి. సూర్య హీరోగా నటించిన తమిళ చిత్రం 'సూరయై పొట్రు' తెలుగులో ఆకాశం నీ హద్దురా' సినిమాకు అవార్డుల పంట పండింది. నేరుగా ఓటీటీలో విడుదలై ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ‘సూరరై పొట్రు’ సినిమా జాతీయ ఉత్తమ చిత్రంగా నిలిచింది. అదే సినిమాలో హీరోయిన్గా నటించిన అపర్ణ మురళి జాతీయ ఉత్తమ నటి అవార్డుని కైవసం చేసుకుంది. వీటితో పాటు.. ఉత్తమ సంగీత దర్శకుడు( జీవీ. ప్రకాష్ కుమార్), ఉత్తమ స్క్రీన్‌ప్లే (సుధా కొంగర, షాలిని ఉషాదేవి) అవార్డులను దక్కించుకున్నారు. చదవండి: Rakhi Sawant: అభ్యంతరకర సీన్లే ఎందుకు? ఒక్కటైనా మంచి రోల్ ఇవ్వండి -
‘వాళ్లు..నా వాళ్లు..ఇది చరిత్ర’ : ఐశ్వర్య
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు. అందుకే రజనీకాంత్ కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేసు కుంటోంది. ‘‘వాళ్లిద్దరు నావాళ్లే. ఇదొక చరిత్ర’’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా భార్యగా, కుమార్తెగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి సినీ ప్రేమికులంతా కూడా ఈ అరుదైన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ధనుష్ కూడా తాజా పురస్కారాలపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని వర్ణించలేనంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
వాస్తవిక నటి.. షబానా ఆజ్మీ @ 72
పది డైలాగులు అవసరమైన చోట ఒక ముఖ కవళిక. పెద్దగా అరవాల్సిన చోట ఒక లోగొంతుక. భోరున విలపించాల్సిన చోట కంటి నుంచి జారని నీటి చుక్క. పగలబడి నవ్వాల్సిన చోట పంటి మెరుపు... ఇవి నటన అని చూపించిన నటి షబానా ఆజ్మీ. ఆమె వల్ల స్త్రీ పాత్రలు తెరపై వాస్తవికంగా కనిపించాయి. ఆమె వల్ల కథలు నిజంగా నమ్మించాయి. ఆమె కొంతమంది నటీనటులకు నటగ్రంథం అయ్యింది. ఆమెను భారతీయ వెండితెర సదా గౌరవంగా చూస్తుంది. మన హైదరాబాద్ నటి షబానా 72వ ఏట అడుగుపెడుతోంది. చూడండి ఎలా హైదరాబాద్‌తో ఆమె జీవితం ముడిపడిందో. 1950 సెప్టెంబర్ 18న ఇక్కడే పుట్టిందామె. తల్లి షౌకత్ ఆజ్మీది హైదరాబాద్ కనుక కాన్పుకు పుట్టింటికి రావడంతో ఇక్కడే నాలుగు నెలలు ఊపిరి పీల్చింది. ఆ తర్వాత ముంబై చేరుకుంది. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ కోర్స్ నేర్చుకునే సమయంలో ఆమెకు రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి కె.ఏ.అబ్బాస్ ‘ఫాస్లా’, రెండు కాంతిలాల్ రాథోడ్ ‘పరిణయ్’. కాని రెంటి కంటే ముందు తొలిసినిమాగా ‘అంకుర్’ విడుదలైంది. శ్యామ్ బెనగళ్ దర్శకత్వంలో హైదరాబాద్ నేపథ్యంగా సాగే ఆ కథే ఆమె తొలి కథ అయ్యింది. అందులోని గ్రామీణురాలు లక్ష్మి ఆమె తొలి పాత్ర అయ్యింది. దక్కనీ ఉర్దూ ఆమె తొలి సంభాషణ అయ్యింది. తొలి జాతీయ అవార్డు కూడా ఆ సినిమాతోనే వచ్చింది. హైదరాబాద్ గాలి హైదరాబాద్ అమ్మాయికి గొప్ప ప్రారంభం ఇచ్చింది. తండ్రి కైఫీ ఆజ్మీ కమ్యూనిస్టు కవి. షౌకత్ ఆజ్మీ ‘ఇప్టా’ సభ్యురాలు. 9 ఏళ్ల వయసు వచ్చే వరకూ షబానా ఆజ్మీ ముంబైలో రెడ్‌ఫ్లాగ్ హౌస్‌లో ఉండేది. అంటే 8 కమ్యూనిస్టు కుటుంబాలు ఉండే చిన్న భవనం అన్నమాట. దానికి ఒకటే టాయ్‌లెట్. ఒకటే బాత్రూమ్. కాని వాళ్లంతా కలిసి మెలిసి జీవించేవారు. కైఫీ ఆమెకు ఆ వయసులో ఒక నల్లటి బొమ్మ తెచ్చి ఇచ్చాడు. షబానా ఆ బొమ్మను చూసి ‘నా ఫ్రెండ్స్ అందరి దగ్గర తెల్లటి బొమ్మలున్నాయి’ అనంటే ఆయన ‘నలుపు కూడా అందమైనదే. నీకు ఆ సంగతి తెలియాలి’ అని చెప్పాడు. అలాంటి వాతావరణంలో ఆమె పెరిగింది. ఇంటికి ఎప్పుడూ వచ్చేపోయే కవులు... పార్టీ సభ్యులు. షబానాకు పేరు పెట్టక ఇంట్లో ‘మున్నీ’ అని పిలుస్తుంటే ఇంటికి వచ్చిన కవి అలీ సర్దార్ జాఫ్రీ ‘ఇంకా పేరు పెట్టకుండా ఏమిటయ్యా’ అని తనే షబానా అని పేరు పెట్టాడు. ఆమె తోటి స్నేహితురాళ్లు ఫ్యాంటసీ బొమ్మల పుస్తకాలు చదువుతుంటే షబానాకు రష్యా నుంచి వచ్చే పుస్తకాలు చదవడానికి దొరికేవి. తండ్రి వల్ల సాహిత్యం తల్లి పృధ్వీ థియేటర్లో పని చేయడం వల్ల నటన ఆమెకు తెలిశాయి. పృథ్వీ థియేటర్లో నాటకం వేస్తే గ్రూప్‌లో ఒకరిగా స్టేజ్ ఎక్కేసేది. స్కూల్లో కూడా స్టేజ్ వదిలేది కాదు. కాలేజీలో చేరితే అక్కడ కేవలం ఇంగ్లిష్ థియేటరే నడుస్తూ ఉంటే తన సీనియర్ అయిన నటుడు ఫరూక్ షేక్‌తో కలిసి హిందీ డ్రామా ప్రారంభించింది. అన్ని పోటీల్లో ప్రైజులు కొట్టేది. షబానాకు తాను నటించగలనని తెలుసు. కాని నటనను వృత్తిగా తీసుకోవాలనుకున్న సందర్భం వేరు. షబానా ఆజ్మీ ఒకసారి జయ భాదురి నటించిన ‘సుమన్’ అనే సినిమా చూసింది. అందులో జయ భాదురి నటన కొత్తగా అనిపించింది. ‘ఈమెలాగా నేనూ నటిని కావాలి’ అనుకుని తండ్రితో చెప్పి, పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేరతానంటే ‘నువ్వు ఏ రంగమైనా ఎంచుకో. కాని అందులో బెస్ట్‌గా నిలువు’ అని ఆయన అన్నాడు. పూణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో షబానా నటిగా తొలిరోజుల్లోనే అందరి దృష్టిలో పడింది. పాత్రలు వెతుక్కుంటూ వచ్చాయి. ‘అంకుర్’ కూడా అలాగే వచ్చింది. నగరమే తప్ప పల్లెటూరు చూసి ఎరగని షబానా ‘అంకుర్’ కోసం చాలా హోమ్ వర్క్ చేయాల్సి వచ్చింది. మడమల మీదుగా చీర కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్న పల్లెటూళ్లలో అలా ఉండే స్త్రీలను గమనించింది. అంతవరకూ ఆమెకు మునికాళ్ల మీద కూచోవడం రాదు. ‘లక్ష్మి’ పాత్ర వంట చేయాలన్నా పనులు చేయాలన్నా మునికాళ్ల మీద కూచోవాలి. అందుకని శ్యాం బెనగళ్ ఆమెను ‘నువ్వు మునిగాళ్ల మీద కూచుని భోం చేయ్’ అని డైనింగ్ టేబుల్ మీద కూచోనిచ్చేవాడు కాదు. ‘అంకుర్’ సినిమాలో షబానా తన నడక, మాట తీరు, ముఖ కవళికలు వీటన్నింటితో లక్ష్మి పాత్రను గొప్పగా తెర మీద ప్రతిష్టించింది. ఆ సినిమా వేసిన అంకురం అతి త్వరగానే మహా వృక్షమైంది. ఒక కాలం అది. నసీరుద్దీన్ షా, ఫరూక్ షేక్, ఓంపురి, స్మితాపాటిల్, షబానా ఆజ్మీ... వీళ్లు భారతీయ పారలల్ సినిమాకు ఊతంగా నిలబడ్డారు. వీరే పునాది, వీరే గోడలు, వీరే పైకప్పు. స్మితా పాటిల్, షబానా ఆజ్మీల మధ్య పోటీ ఉండేది. కాని ఎవరికి వారు తమ పాత్రలలో చెలరేగి ఎవరు గొప్పో చెప్పడం కష్టం చేసి పెట్టేవారు. శేఖర్ కపూర్ ‘మాసూమ్’ లో భర్త అక్రమ సంతానాన్ని అంగీకరించేందుకు మథన పడే భార్యగా షబానా గొప్ప నటన ప్రదర్శించింది. మహేశ్ భట్ ‘అర్థ్’లో మరొక స్త్రీ ఆకర్షణలో పడిన భర్త గురించి ఆమె పడిన సంఘర్షణ ప్రేక్షకులను కదిలించింది. శ్యామ్ బెనగళ్ ‘మండీ’, మృణాల్‌సేన్ ‘ఖండర్’, గౌతమ్‌ఘోష్ ‘పార్’... దర్శకులు ఆమె వల్ల ఆమె దర్శకుల వల్ల భారతీయ సినిమాను ఉత్కృష్ట ప్రమాణాలకు చేర్చారు. దీపా మెహతా ‘ఫైర్’, శాయి పరాంజపె ‘స్పర్శ్’, సత్యజిత్ రే ‘షత్రంజ్ కే ఖిలాడీ’, తపన్ సిన్హా ‘ఏక్ డాక్టర్ కీ మౌత్’... ఇవన్నీ ఆమెను తలిస్తే తలువబడే సినిమాలు. తెలుగు దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘మార్నింగ్ రాగా’లో క్లాసికల్ సింగర్‌గా నటించిందామె. మూస తల్లి పాత్రలు, మూస వదిన, అత్త పాత్రలు ఆమె ఏనాడూ చేయలేదు. ఆమెకు పాత్ర రాసి పెట్టి ఉండాలి. పాత్రకు ఆమె రాసి పెట్టి ఉండాలి. ‘అమర్ అక్బర్ ఆంథోని’, ‘ఫకీరా’ వంటి కమర్షియల్ సినిమాలు చేసినా ఆమె అందుకు పుట్టలేదు. ఆ తర్వాత ఆ దారి పట్టలేదు. షబానా ఆజ్మీ గీతకర్త జావేద్ అఖ్తర్‌ను వివాహం చేసుకుంది. రాజ్యసభ సభ్యురాలిగా పని చేసింది. సామాజిక కార్యకలాపాలలో పాల్గొంది. తండ్రి పేరు మీద ఆయన స్వగ్రామంలో స్త్రీల కోసం ఉపాధి కల్పనా కేంద్రాలను తెరిచింది. ఆమెకు ప్రభుత్వం పద్మభూషణ్‌తో సత్కరించింది. షబానా వెండితెరకు హైదరాబాద్ అందించిన గోల్కొండ వజ్రం. దాని మెరుపులు మరిన్ని కొనసాగాలి. -
ఇదంతా చూసి ఆమె ఆశీర్వదిస్తారు: కీర్తి సురేశ్
ఇది తన కల కాదు. లక్ష్య సాధనకు మార్గం అంటోంది నటి కీర్తీసురేశ్. ఈ బ్యూటీ చాలా తక్కువ వ్యవధిలోనే నటిగా అతి తక్కువ సమయంలోనే చాలా సాధించేసిందని చెప్పవచ్చు. కారణం తను నటించిన మహానటి చిత్రమే. ఈ చిత్రంలో కీర్తీసురేశ్ మహానటి సావిత్రి పాత్రలో నటించిందనడం కంటే జీవించిందని చెప్పడం కరెక్ట్. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీసురేశ్‌ను ఎంపిక చేశారనగానే విమర్శించిన వారే గానీ, ప్రోత్సహించిన వారు లేరనే చెప్పాలి. అయినా అలాంటి వాటిని అస్సలు పట్టించుకోకుండా తనలోని నటనకు సాన పెట్టి సావిత్రి పాత్రకు కీర్తీసురేశ్ జీవం పోసింది. ఫలితం అభినందనల పరంపరతోపాటు జాతీయ ఉత్తమ నటి అవార్డు కీర్తీసురేశ్ ముంగిట వాలింది. ఇటీవలే ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదగా జాతీయ ఉత్తమ నటి అవార్డును స్వీకరించిన కీర్తీసురేశ్ ఆ ఆనందాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. అందులో పేర్కొంటూ అందరికీ ధన్యవాదాలు. ఈ ఆనందానుదభూతి వ్యక్తం చేయలేనిది.అయినా ప్రయత్నిస్తాను. ఈ అవార్డు నా కల కాదు లక్ష్య సాధనకు పయనం. నా ఈ పయనంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు.ఈ అవార్డును నన్ను ఈ స్థాయికి చేరేలా తయారు పరిచిన నా తల్లికి సమర్పిస్తున్నాను. అదే విధంగా మహానటి చిత్రంలో నటించడానికి ప్రోద్బలం ఇచ్చిన అంకుల్ గోవింద్‌కు, అంతకంటే ఆ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన చిత్రానికి మెదడు లాంటి దర్శకుడు నాగ్‌అశ్విన్‌కు ధన్యవాదాలు. మహానటి చిత్రానికి సమస్తం ఆయనే. అదే విధంగా ఇందంతా చూస్తున్న మహానటి సావిత్రి నన్ను ఆశీర్వదిస్తారు అని కీర్తీసురేశ్ పేర్కొంది. కాగా తాజాగా ఈ చిన్నది సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే మరో లక్కీచాన్స్‌ను అందుకున్న విషయం తెలిసిందే. ఆయన శివ దర్శకత్వంలో నటిస్తున్న తాజా చిత్రంలో నటి కుష్భూ, మీనాలతో పాటు కీర్తీసురేశ్ కూడా నటిస్తోంది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.ఈ చిత్ర షూటింగ్లో పాల్గొనడానికి వెళ్లిన నటి కీర్తీసురేశ్‌కు అందమైన స్వాగతం లభించింది. చిత్ర యూనిట్ జాతీయ అవార్డును అందుకున్న కీర్తీసురేశ్ కోసం పండగ వాతావరణంలో కేక్ కట్ చేసి అభినంధించారు. నటుడు రజనీకాంత్, దర్శకుడు శివ చిత్ర యూనిట్ కీర్తీసురేశ్‌కు కేక్ తినిపించి అభినందించారు. ఆ ఫొటోలిప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చదవండి: సినిమాల్లో హింసకు తావివ్వొద్దు -
కేజే యేసుదాస్ కొత్త రికార్డు
-
తాప్సీ స్పెషల్‌గా ఫీలవుతోంది
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించిన 65వ జాతీయ చలనచిత్ర అవార్డులో జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా దగ్గుబాటి రానా నటించిన ‘ఘాజీ’ చిత్రం ఎంపికైంది. 1971 నాటి భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో సంకల్ప్ రెడ్డి రూపొందించిన ఘాజీ సినిమా సక్సెస్ సాధించటమే కాదు.. విశ్లేషకుల ప్రశంసలనూ అందుకుంది. సబ్ మెరైన్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో రానాతో పాటు తాప్సీ, అతుల్ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. తాను నటించిన ఘాజీ మూవీకి అవార్డు రావడంపై హీరోయిన్ తాప్సీ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ‘ఘాజీ సినిమాలో నటించినందుకు గర్వపడుతున్నాను. ఈ చిత్రానికి పనిచేసిన వారందరికీ శుభాకాంక్షలు. ఇప్పటి వరకు నేను నటించిన మూడు చిత్రాలకు(ఆడుకాలం, పింక్, ఘాజీ) జాతీయ అవార్డులు రావడం సంతోషం కలిగిస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి మరిన్ని వస్తాయని ఆశిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఘాజీలో చేసింది ప్రత్యేక పాత్రే అయినా.. వ్యక్తిగతంగా ఎంతో సంతృప్తినిచ్చిన పాత్ర అని తాప్సీ అన్నారు. -
బాలు రికార్డు బ్రేక్ చేసిన యేసుదాస్
మధుర గాత్రంతో సంగీత ప్రియులను ఓలలాడించి.. ‘గానగంధర్వుడి’గా పేరుగాంచిన కేజే యేసుదాస్ కొత్త రికార్డు తన పేర లిఖించుకున్నారు. ఈరోజు (శుక్రవారం) ప్రకటించిన 65వ జాతీయ సినిమా అవార్డుల్లో ఆయన ఉత్తమ గాయకుడి అవార్డుకు ఎంపియ్యారు. మలయాళ చిత్రం ‘విశ్వాసపూర్వం మన్సూర్’లోని ‘పోయి మరాంజకాలం’ అనే పాటకుగానూ ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఎనిమిదోసారి అవార్డు పొందడం ద్వారా యేసుదాస్ సరికొత్త రికార్డు సృష్టించారు. 1940లో ఎర్నాకులంలో జన్మించిన యేసుదాస్.. కుంజన్ వేలు ఆసన్, రామన్‌కుట్టి భాగవతార్ ప్రముఖ సంగీత విద్వాంసుల వద్ద సంగీతం నేర్చుకున్నారు. అనతికాలంలోనే గొప్ప గాయకుడిగా పేరు పొందారు. ప్రపంచంలోని ప్రముఖ నగరాలన్నింటిలోనూ ప్రదర్శనలు ఇచ్చిన యేసుదాస్ లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. 1961లో గాయకుడిగా ప్రస్థానం మొదలుపెట్టిన యేసుదాస్.. వివిధ భాషల్లో ఎన్నో మధుర గీతాలు ఆలపించారు. తన సుమధుర గాత్రంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ గానగాంధర్వుడు 1972లో మొదటిసారిగా జాతీయ ఉత్తమ గాయకుడిగా అవార్డు పొందారు. తర్వాత 1973, 76, 82, 87, 91, 93 సంవత్సరాల్లో కూడా అవార్డులు పొందారు. దీంతో ఆరు జాతీయ అవార్డులు పొందిన మరో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రికార్డును యేసుదాస్ బ్రేక్ చేసినట్లయింది. అవార్డు వద్దన్నారు.. 23 సార్లు కేరళ రాష్ట్ర ఉత్తమ గాయకుడిగా ఎంపికైన యేసుదాస్.. 1987 నుంచి తన పేరును పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వాన్ని కోరారు. తద్వారా కొత్త గాయకులకు ఈ అవకాశం లభిస్తుందని ఆయన ఉద్దేశం. సంగీత రంగంలో ఆయన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 1977లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2017లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. -
ఉత్తమ ఊరుగా మనోహరాబాద్
-
‘పెళ్లిచూపులు’ బృందానికి ఎంపీ కవిత అభినందనలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ చలనచిత్ర అవార్డులను అందుకున్న పెళ్లిచూపులు సినిమా బృందాన్ని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత అభినందించారు.64వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చలనచిత్రం, ఉత్తమ స్క్రీన్‌ప్లే– డైలాగ్స్ కేటగిరీల్లో రెండు అవార్డులు పెళ్లిచూపులు సినిమాను వరించాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డులను సినిమా బృందం అందుకుంది. కాగా, పెళ్లిచూపులు బృందం సభ్యులు ఎంపీ కవితను గురువారం కలిశారు. ఈ సందర్భంగా వారికి ఆమె అభినందనలు తెలిపారు. చిత్రం నిర్మాతలు యశ్ రంగినేని, రాజ్ కందుకూరితో పాటు చిత్ర దర్శకుడు దాస్యం తరుణ్ భాస్కర్, హీరో విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు మాధవి, వర్ధన్ దేవరకొండ, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, అభయ్ బేచిగంటి కవితను కలిసిన వారిలో ఉన్నారు. యూకే ఎన్నారై అయిన యశ్ రంగినేనికి పెళ్లిచూపులు తొలి సినిమా. దర్శకుడు తరుణ్ భాస్కర్‌కూ మొదటి సినిమా కావడం విశేషం. ఎంపీ కవిత మాట్లాడుతూ... కుటుంబ కథా చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుందని, సందేశాత్మక సినిమాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయని అన్నారు. మంచి సినిమాలు తీసేవారికి తెలంగాణ ప్రభుత్వ సహకారం ఎప్పుడూ ఉంటుందని ఆమె పేర్కొన్నారు. -
రియల్ హీరోలకు అవార్డులివ్వండి
సినిమా పరిశ్రమలో రియల్ హీరోలంటే స్టంట్ కళాకారులే. అలాంటి వారి కోసం దర్శకురాలు, సూపర్‌స్టార్ రజనీకాంత్ పెద్దకూతురు, నటుడు ధనుష్ అర్ధాంగి ఐశ్వర్యధనుష్ గొంతు విప్పారు. ఇటీవల ఐనా సభలో మహిళాభివృద్ధి రాయబారిగా ఎంపికైన ఐశ్వర్య అటు వైపుగా అడుగులు వేస్తున్నారు. తన భర్త ధనుష్ హీరోగా నటించిన 3 చిత్రం ద్వారా దర్శకురాలిగా అవతారమెత్తిన ఈమె తాజా చిత్రం గురించి రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే ప్రస్తుతం సినిమా వీరన్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన భర్త వుండర్‌బార్ ఫిలింస్ పతాకంపై రూపొందిస్తున్న ఈ డాక్యుమెంటరీ చిత్రం ద్వారా సినీ స్టంట్కళాకారుల జీవితాలను ఆవిష్కరించనున్నారు. విశేషం ఏమిటంటే ఈ చిత్రానికి సూపర్‌స్టార్ రజనీకాంత్ బ్యాక్‌గ్రౌండ్ వాయిస్ ఇవ్వనున్నారు. ఇక ఏఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించడం మరో విశేషం. కాగా సినీ కళాకారులను ప్రోత్సహించే విధంగా కేంద్రప్రభుత్వం ఉత్తమ కళాకారులకు జాతీయ అవార్డులను అందించడం ఆనవాయితీగా జరుగుతున్న విషయమే. అయితే ఇందులో స్టంట్ కళాకారుల కేటగిరి చోటు చేసుకోలేదు. ఇప్పుడు స్టంట్ కళాకారుల జీవితాలను డాక్యుమెంటరీగా రూపొందిస్తున్న ఐశ్యర్య ధనుష్ శనివారం కేంద్ర పట్టణాభివృద్ధి, సినిమాటోగ్రఫీ, సమాచార శాఖా మంత్రి వెంకయ్యనాయుడిని కలిశారు. ఆయనతో కాసేపు ముచ్చటించిన ఐశ్వర్యధనుష్ తన డాక్యుమెంటరీకి సంబంధించిన కొన్ని సన్నివేశాలను చూపించారు. అదే సమయంలో జాతీయ అవార్డుల కేటగిరిలో స్టంట్ కళాకారుల శాఖను చేర్చి వారికి అవార్డులందించి ప్రోత్సహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. తమ కోసం గొంతు విప్పిన ఐశ్వర్యధనుష్కు పలువురు స్టంట్ మాస్టర్లు, స్టంట్ కళాకారులు సోషల్ మీడియా ద్వారా కృతజత్ఞలు తెలుపుతున్నారు. -
ప్రభాస్గారూ.. మా థియేటర్‌కు రండి!
ముంబై: 'బాహుబలి' విజయగాథ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం ఈ చిత్రానికి దక్కడంతో 'బాహుబలి'కి ఉన్న క్రేజ్ మరింత పెరిగింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో వివిధ భాషల్లో ఇప్పటికీ ఈ సినిమా థియేటర్లలో ఆడుతోంది. దీంతో చాలామంది థియేటర్ యజమానులు 'బాహుబలి' ప్రభాస్‌కు లేఖలు రాస్తున్నారు. 'మా థియేటర్‌కు ఒక్కసారి వచ్చి వెళ్లండి. మా ప్రేక్షకులకు నిజమైన నిజమైన 'బాహుబలి' ఎలా ఉంటాడో కనిపించి వెళ్లండి' అని థియేటర్ యజమానులు ప్రభాస్‌ను కోరుతున్నారు. దేశంలోని చాలాచోట్ల ఈ సినిమా థియేటర్లలో మ్యాట్నీషో ఆడుతోంది. దీంతో ఆయా థియేటర్ల యజమానులు పలువురు తమ థియేటర్‌కు ఒక్కసారి వచ్చివెళ్లండంటూ ప్రభాస్‌కు విజ్ఞప్తులు చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ప్రభాస్ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ''బాహుబలి' సినిమా విడుదలైన చాలా రోజుల తర్వాత కూడా ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురుస్తూనే ఉంది. ఇది ఎంతో ఆనందం కలిగిస్తోంది. సినీ పరిశ్రమలో థియేటర్ల యజమానులు కూడా భాగమే. వారి నుంచి ఈ స్పందన రావడం ఎంతో గొప్ప విషయం' అని ప్రభాస్ పేర్కొన్నాడు. -
జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానం
-
జాతీయ అవార్డుల్లో మెరిసిన ‘క్వీన్’!
కంగనా రనౌత్‌కు ఉత్తమ నటి అవార్డు ఉత్తమ హిందీ చిత్రంగా క్వీన్ ఉత్తమ తెలుగు చిత్రంగా చందమామ కథలు న్యూఢిల్లీ: అరవై రెండో జాతీయ చలనచిత్ర అవార్డుల్లో బెంగాలీ చిత్రాలకు పంట పండింది. ఏడుకు పైగా బెంగాలీ సినిమాలు అవార్డుకు ఎంపికయ్యాయి. షేక్స్పియర్ నాటకం హామ్లెట్ ఆధారంగా షాహిద్ కపూర్ హీరోగా తెరకెక్కిన బాలీవుడ్ సినిమా హైదర్‌కు ఐదు అవార్డులు లభించాయి. - హిందీ సినిమా క్వీన్‌లో అద్భుతంగా నటించిన కంగనా రనౌత్‌ను జాతీయ ఉత్తమ నటి అవార్డు వరించింది. నాను అవనాళ్ల అవలు(నేను అతడు కాదు, ఆమెను) సినిమాలో హిజ్రాపాత్రలో ఒదిగిపోయిన కన్నడ నటుడు సంచారి విజయ్ ఉత్తమ నటుడిగా అవార్డును గెలుపొందారు. న్యాయ వ్యవస్థలో లోపాలను ఎత్తిచూపుతూ చైతన్య తమానే రూపొందించిన ‘కోర్ట్’ జాతీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైంది. ప్రియాంక చోప్రా నటించిన హిందీ సినిమా ‘మేరీ కోమ్’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచింది. ‘62వ జాతీయ చలన చిత్ర అవార్డులు-2014’ను మంగళవారం ఢిల్లీలో అవార్డుల జ్యూరీ చైర్మన్ జి. భారతీరాజా ప్రకటించారు. ప్రాంతీయ భాషా చిత్రాల విభాగంలో ఉత్తమ తెలుగుచిత్రంగా ‘చందమామ కథలు’, సినీ రచయిత పసుపులేటి పూర్ణచంద్రారావు ‘సెలైంట్ సిని మా (1895-1930)’గ్రంథానికి గాను ఉత్తమ సినీగ్రంథ అవార్డు, ఉత్తమ ప్రచురణ సంస్థగా ‘ఎమెస్కో’ బుక్స్, అలాగే, నల్లమూతు సుబ్బయ్య దర్శకత్వం వహించిన ‘లైఫ్ ఫోర్స్- ఇండియాస్ వెస్టర్న్ ఘాట్స్’ సినిమా ఉత్తమ పరిశోధనాత్మక చిత్రంగా ఎంపికైంది.