తెలుగు సినీ చరిత్రలో అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. 69 ఏళ్లుగా మనకు కాకుండా పోయిన ఉత్తమ నటుడు అవార్డు తొలిసారి తెలుగు హీరోను వరించింది. 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడి కేటగిరీలో అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్, సూర్య, ధనుష్, శింబు, ఆర్య, జోజు జార్జ్ పోటీపడ్డారు. వీరందరినీ వెనక్కు నెడుతూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగ్గేదే లే అంటూ ఈ అవార్డు ఎగరేసుకుపోయాడు. పుష్ప 1 సినిమాకు గానూ ఆయనకు బెస్ట్ యాక్టర్‌గా జాతీయ అవార్డు వరించింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. దశాబ్ధాల తరబడి మనకు కాకుండా పోయిన పురస్కారాన్ని ఎట్టకేలకు బన్నీ సాధించాడని సంబరపడుతున్నారు.
తెలుగు సినిమాలకు వచ్చిన మరిన్ని అవార్డులు
► ఉత్తమ చిత్రం - ఉప్పెన
► ఉత్తమ నటుడు - అల్లు అర్జున్ (పుష్ప 1)
► బెస్ట్ పాపులర్ ఫిలిం ప్రొవైడింగ్ వోల్‌సమ్ ఎంటర్‌టైన్‌మెంట్ - ఆర్‌ఆర్‌ఆర్
► ఉత్తమ యాక్షన్ డైరెక్షన్(స్టంట్ కొరియోగ్రఫీ) - కింగ్ సోలోమన్ (ఆర్‌ఆర్‌ఆర్)
► ఉత్తమ కొరియోగ్రఫీ - ప్రేమ్ రక్షిత్ (ఆర్‌ఆర్‌ఆర్)
► ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ - వి.శ్రీనివాస్ మోహన్ (ఆర్‌ఆర్‌ఆర్)
► ఉత్తమ లిరిక్స్- చంద్రబోస్ (ధమ్ ధమా ధమ్- కొండపొలం)
► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్(సాంగ్స్) - దేవి శ్రీప్రసాద్ (పుష్ప 1)
► ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ (బ్యాగ్రౌండ్ స్కోర్) - ఎమ్‌ఎమ్ కీరవాణి (ఆర్‌ఆర్‌ఆర్)
► ఉత్తమ మేల్ ప్లేబ్యాక్ సింగర్ - కాల భైరవ (కొమురం భీముడో.. - ఆర్‌ఆర్‌ఆర్)
► బెస్ట్ తెలుగు ఫిలిం క్రిటిక్- పురుషోత్తమాచార్యులు
చదవండి: 'ఆర్ఆర్ఆర్'కి జాతీయ అవార్డుల పంట.. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్
Comments
Please login to add a commentAdd a comment