కేంద్రం తాజాగా ప్రకటించిన జాతీయ అవార్డుల్లో దక్షిణాది సినిమాలు అద్భుతాలు చేశాయి. కన్నడ సినిమా 'కాంతార'కి గానూ ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టి పురస్కారం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అవార్డ్ రావడంపై రిషబ్ స్పందించాడు. దివంగత హీరో పునీత్‌పై తనకు ఎంత ప్రేమ ఉందనే విషయాన్ని బయటపెట్టాడు.
(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?)
తనకు వచ్చిన జాతీయ అవార్డుని రాష్ట్రంలోని దేవ నర్తకులకి, దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్, కన్నడ ప్రేక్షకులకు అంకితమిస్తున్నట్లు రిషబ్ శెట్టి పేర్కొన్నాడు. జాతీయ అవార్డ్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, తన ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. ఈ మేరకు నోట్ రిలీజ్ చేశాడు.
హోంబలే ఫిల్మ్స్ నిర్మించిన 'కాంతార' సినిమాలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. కేవలం రూ.15 కోట్లు పెడితే ఏకంగా రూ.400 కోట్ల మేర వసూళ్లు వచ్చాయి. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ అయితే సినిమాకు ఆయువుపట్టుగా నిలిచింది. ఇందుకు గానూ రిషబ్.. ఉత్తమ నటుడిగా నిలవడం కన్నడ సినిమా రేంజ్‌ని పెంచుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
(ఇదీ చదవండి: 70వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు.. విజేతల జాబితా ఇదే)
Comments
Please login to add a commentAdd a comment