బన్నీ ఆస్కార్ అవార్డ్ గెలిచే సత్తా ఉంది: పోసాని కృష్ణ మురళి | 69th National Film Awards 2023: Posani Krishna Murali Congratulates Allu Arjun For Best Actor - Sakshi
Sakshi News home page

Posani Krishna Murali: అదే అతనిలో ఉన్న గొప్ప లక్షణం: పోసాని

Published Fri, Aug 25 2023 7:14 PM | Last Updated on Fri, Aug 25 2023 8:03 PM

Posani Krishna Murali Congratulates Allu Arjun For National Award - Sakshi

స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డ్ రావడం పట్ల ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి అభినందనలు తెలిపారు. అలాగే ఆర్ఆర్ఆర్, కొండపొలం, ఉప్పెన, పుష్ప చిత్రాలకు జాతీయ అవార్డులు రావడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అల్లు అర్జున్ కు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

(ఇది చదవండి: ఇల్లు అమ్మేస్తోన్న జబర్దస్త్ కమెడియన్.. కన్నీటిని ఆపుకుంటూ! )

పోసాని కృష్ణ మురళి మాట్లాడుతూ..'అల్లు అర్జున్‌కు ఆస్కార్ అవార్డ్ కూడా వస్తుంది. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం చాలా సంతోషించాల్సిన విషయం. అల్లు అర్జున్ అంటే నాకు చాలా ఇష్టం. నేను అన్న అల్లు అర్జున్‌కు ఇష్టం. అల్లు అర్జున్ స్టార్ హీరోగా ఉన్నా ఇప్పటికి నేర్చు కుంటూనే ఉంటాడు. అది అతనిలో ఉన్న గొప్ప లక్షణం. జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఇంతవరకు ఏ తెలుగు హీరోకి రాలేదు. అల్లు అర్జున్ ఇలాగే నేర్చుకుంటూ ఉంటే  భవిష్యత్తులో ఆస్కార్ ఉత్తమ నటుడిగా అవార్డ్ కూడా వచ్చే అవకాశం ఉంది.' ‍అని అన్నారు. రాబోయే కాలంలో బన్నీ మరిన్ని అవార్డులు గెలవాలని కోరుకుంటూ ఆల్‌ ది బెస్ట్‌ తెలిపారు. 

(ఇది చదవండి: ఇద్దరు పిల్లల తండ్రిని కిడ్నాప్‌ చేసి పెళ్లి చేసుకున్న నటి?!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement