ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఈ శుక్రవారమే థియేటర్లలో పుష్ప..! | Pushpa The Rise Re releases in theatres ahead of Allu Arjun Pushpa 2 Release | Sakshi
Sakshi News home page

Pushpa: ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌.. ఈ శుక్రవారమే థియేటర్లలో పుష్ప..!

Published Tue, Nov 19 2024 7:04 PM | Last Updated on Tue, Nov 19 2024 7:30 PM

Pushpa The Rise Re releases in theatres ahead of Allu Arjun Pushpa 2 Release

అల్లు అర్జున్- సుకుమార్‌ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటేడ్‌ చిత్రం పుష్ప 2 ది రూల్. ఇటీవల ట్రైలర్ రిలీజ్‌ కాగా.. యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. భారతీయ సినిమాలో ఇంతకు ముందెన్నడు లేని రికార్డులు సృష్టస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ విడుదలకు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉంది.  ఇప్పటికే ఓవర్‌సీస్‌లో టికెట్ బుకింగ్స్ ప్రారంభం కాగా.. హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి.

అయితే పుష్ప 2 రిలీజ్‌కు కొద్ది రోజులు సమయం ఉండడంతో మూవీ టీమ్ ప్రమోషన్లతో దూసుకెళ్తున్నారు. తాజాగా పుష్ప ది రైజ్‌ పార్ట్-1 రీ రిలీజ్‌ చేయనున్నట్లు గోల్డ్‌ మైన్స్‌ టెలీ ఫిల్మ్స్ సంస్థ ట్వీట్ చేసింది. హిందీ వర్షన్‌ను ఈ నెల 22న థియేటర్లలో రీ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. దీంతో నార్త్‌లో మార్కెట్‌ను మరింత పెంచుకునే ఆలోచనతో మేకర్స్ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అయితే హిందీలో మాత్రమే పుష్ప పార్ట్-1 రీ రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. అలాగే దక్షిణాది భాషల్లోనూ రీ రిలీజ్ గురించి ఎలాంటి సమాచారం లేదు. మరోవైపు యూఎస్‌లో పుష్ప పార్ట్‌-1 రీ రిలీజ్‌ బుకింగ్స్ ‍ప్రారంభించనున్నట్లు ప్రత్యంగిరా సినిమాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. మలయాళ నటుడు ఫహద్ ఫాసిల్ కీలక పాత్ర పోషించారు. 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement