ఎక్కడైనా తగ్గేదేలే అంటున్న పుష్ప.. ట్రెండ్ సెట్‌ చేస్తానంటున్న శ్రీవల్లి | YouTube top trending songs with the highest number of views in 2022 | Sakshi
Sakshi News home page

YouTube Top 10 Trending Songs: ఈ ఏడాది యూట్యూబ్‌ ట్రెండ్స్‌.. టాప్‌లో శ్రీవల్లి సాంగ్

Published Wed, Dec 7 2022 9:31 PM | Last Updated on Wed, Dec 7 2022 9:33 PM

YouTube top trending songs with the highest number of views in 2022 - Sakshi

అల్లు అర్జున్‌-సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన పుష్ప మూవీ ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటించిన రష్మిక రేంజ్‌ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె పాన్‌ ఇండియా నటిగా మారిపోయింది. పుష్పకు ఈ రేంజ్‌లో గుర్తింపు రావడానికి ఇందులోని పాటలు కూడా ప్రధాన పాత్ర పోషించాయి.  ఇప్పటికీ అభిమానుల గుండెల్లో ఈ పాటలు మారుమోగుతూనే ఉన్నాయి. 

యూట్యూబ్‌లో అయితే పుష్ప సాంగ్స్ ఓ రేంజ్‌లో రికార్డు సృష్టిస్తున్నాయి. ఈ ఏడాది యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అయిన పాటల్లో శ్రీవల్లి పాట ఏకంగా 600 మిలియన్ వ్యూస్‌తో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తరువాత రెండో స్థానంలో బీస్ట్ మూవీలోని అరబిక్‌ కుతు సాంగ్ నిలిచింది. 2022లో యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో టాప్ టెన్ సాంగ్స్ ఏవో ఓ  లుక్కేద్దాం పదండి. తాజాగా ఆ జాబితాను యూట్యూబ్‌ విడుదల చేసింది.

టాప్ 10 సాంగ్స్ ఇవే..

1.  శ్రీవల్లి- పుష్ప

2. అరబిక్‌కుత్తు- బీస్ట్‌

3. సామి సామి- పుష్ప

4. కచ్చా బాదం- ఆల్బమ్‌

5. లే లే ఆయీ కోకకోలా- ఆల్బమ్‌ 

6. ఊ.. బోల్‌గయా ఊహూ బోల్‌గయా- పుష్ప(హిందీ)

7. ఊ.. అంటావా మావ ఊహూ అంటావా-పుష్ప

8. కోక్‌ స్టూడియో, ఆల్బమ్‌

9. అరబిక్‌ కుత్తు (వీడియో సాంగ్)-బీస్ట్‌

10. కేసరి లాల్‌ న్యూ సాంగ్‌- సంగీతం: కన్హయ్య కుమార్‌ యాదవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement