
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై టాలీవుడ్ నిర్మాత బన్నీవాసు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన బన్నీపై ప్రశంసలు కురిపించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలిచే స్నేహితుడు ఆయన ఒక్కడేనన్నారు. ఈ రోజు బన్నీ వాసు ఇక్కడ ఉన్నారంటే కారణం అల్లు అర్జున్ అని ఎమోషనలయ్యారు. మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందని వస్తోన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు.
బన్నీ వాసు మాట్లాడుతూ..' నా లైఫ్‌లో ఒకడున్నాడు. నేను ఎక్కడ ఉన్నా నాకు అండగా వచ్చి నిలబడతాడు. మా మధ్య గ్యాప్ వచ్చిందని డైలాగ్స్ వినిపిస్తున్నాయి. కానీ నాకు కష్టం వచ్చిందంటే ఇద్దరే ముందుంటారు. ఒకటి మా అమ్మ.. రెండో వ్యక్తి నా స్నేహితుడు బన్నీ. ఆయ్ సినిమా ప్రచారం సరిగ్గా జరగడం లేదని.. బన్నీని పోస్ట్ పెట్టమని అడగాలని మా టీమ్ వాళ్లు కోరారు. కానీ నేను అడగలేదు. నేను సమాచారం ఇవ్వకుండానే ఆయనే తన ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. ఒక స్నేహితుడికి ఎప్పుడు నిలబడాలి అని తెలిసిన వ్యక్తి ఎవరంటే ఆయనే. 20 ఏళ్ల క్రితం నేను ఒక మిస్టేక్ చేశా. గీతా ఆర్ట్స్ నుంచి వెళ్లిపోవాల్సిన పరిస్థితి. ఆరోజు నా కోసం వాళ్ల నాన్నను కూడా ఎదిరించారు. అప్పుడు ఆయన సపోర్ట్ చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. నాకే కాదు.. తన లైఫ్‌లో ఎవరికి పడిపోతున్నా బన్నీ సపోర్ట్‌గా నిలుస్తాడు. అంత మంచి వ్యక్తి అల్లు అర్జున్ ఒక్కడే' అంటూ బన్నీ గొప్పతనాన్ని వివరించారు.
కాగా... జూనియర్ ఎన్టీఆర్ బామర్ది నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటించిన చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాను గోదావరి నేపథ్యంలో ఫుల్ కామెడీ అండ్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్‌పై బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్చి చేసుకున్న ఈ చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment