ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నారు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న బన్నీకి అరుదైన గౌరవం లభించింది. దుబాయ్‍లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు.
స్వయంగా అల్లు అర్జున్ హాజరైన తన రూపాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. అచ్చం పుష్ప స్టైల్లోనే విగ్రహాన్ని రూపొందించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో ఫోటోలో కనిపించారు. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తొలి నటుడిగా రికార్డ్
కాగా.. టాలీవుడ్ ఫ్యాన్స్ ముద్దుగా బన్నీ అని పిలుచుకునే అల్లు అర్జున్ తనదైన నటనతో ఆరు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. భారతదేశంలో అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ వాక్స్ స్టాట్యూ రూపంలో చిరస్థాయిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండియా నుంచి ఏ ఒక్క నటుడికి ఇలాంటి గౌరవం దక్కలేదు. తొలిసారి మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. తన విగ్రహాన్న చూసిన బన్నీ.. నిజంగా తనని తానూ అద్దంలో చూసుకుంటున్నట్టు ఉందని.. చాలా రియలిస్టిక్‌గా చేశారని వారిని ప్రశంసించారు.
విగ్రహం ప్రత్యేకతలు
ఈ మైనపు విగ్రహం ఫర్‌ఫెక్ట్‌గా రావడం కోసం 200 రకాల మేజర్‌మెంట్స్‌ను అల్లు అర్జున్ నుంచి సేకరించారు. తన డాన్స్ మూమెంట్స్‌ను కూడా సేకరించడం జరిగిందని మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ జనరల్ మేనేజర్ అయిన సనాజ్ కోల్‌స్రడ్ వెల్లడించారు.
Here we go #MadameTussaudsdubai #ThaggedheLe pic.twitter.com/HuOveipJiO
— Allu Arjun (@alluarjun) March 28, 2024
Comments
Please login to add a commentAdd a comment