wax statue
-
గ్లోబల్ స్టార్ అరుదైన ఘనత.. ఆ దిగ్గజాల పక్కన ఛాన్స్!
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. తాజాగా అబుదాబిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఇప్పటికే చరణ్ మైనపు విగ్రహానికి సంబంధించిన కొలతలను మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం ప్రతినిధులు తీసుకున్నారు.వచ్చే ఏడాది సమ్మర్లో విగ్రహాన్ని అందుబాటులోకి తీసుకురానున్నారు. అయితే రామ్‌చరణ్ పెంపుడు శునకం రైమ్ కూడా మైనపు విగ్రహంలో కనిపించనుంది. క్వీన్ ఎలిజిబెత్-2 తర్వాత ఇలా పెట్‌తో ఉన్న వారిలో రెండో వ్యక్తిగా చెర్రీ ఘనత సాధించారు. కాగా.. ఇప్పటికే ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో షారూక్ ఖాన్, అమితాబ్ బచ్చన్, కాజోల్, కరణ్ జోహార్ల మైనపు విగ్రహాలు కొలువుదీరాయి.ఈ అరుదైన గౌరవం దక్కటం పట్ల రామ్ చరణ్ ఆనందం వ్యక్తం చేశారు. లెజెండరీ నటుల విగ్రహాల పక్కన ఉండేలా గౌరవం దక్కుతుందని కలలోనూ ఊహించలేదన్నారు. సినిమాపై నాకున్న ప్యాషన్ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ అవకాశమిచ్చిన మేడమ్ టుస్సాడ్స్ ప్రతినిధులకు చెర్రీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఇండియన్ సినిమా స్టార్స్‌ను మేడమ్ టుస్సాడ్స్‌కు తీసుకురావడం సంతోషంగా ఉందని మ్యూజియం ప్రతినిధులు వెల్లడించారు.Hello Everyone 👋🏻 Iam RAM CHARAN Iam Very Honoured to Joins @MadameTussauds Family!!!!@AlwaysRamCharan Wax Statue to be unveiled at #MadameTussauds this Summer 2025 ⏳🌟😉🤩#GameChanger #RamCharan 🦁👑🔥 pic.twitter.com/dApCKhmUPi— 𝐀𝐤𝐚𝐬𝐡𝐡 𝐑𝐂™ (@AlwaysAkashRC) October 22, 2024 -
తుస్సాడ్స్‌లో ఆర్ఆర్
హీరో రామ్‌చరణ్‌కు అరుదైన గౌరవం దక్కింది. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో రామ్‌చరణ్ మైనపు విగ్రహం ఏర్పాటు కానుంది. ఈ విగ్రహానికి కావాల్సిన కొలతలు పూర్తయ్యాయని, త్వరలోనే ఆయన మైనపు బొమ్మ ఆవిష్కరణ వేడుక ఉంటుందని ఓ అవార్డు ఫంక్షన్లో మేడమ్ తుస్సాడ్స్ ప్రతినిధులు వెల్లడించారు. అలాగే చరణ్ మైనపు విగ్రహంలో ఆయన పెంపుడు కుక్క రైమ్ కూడా కనిపించనుండటం ఓ విశేషం.మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో భాగం కావడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లుగా రామ్‌చరణ్ వెల్లడించారు. మరి... ఆర్ (రామ్‌చరణ్) అండ్ ఆర్ (రైమ్) మైనపు బొమ్మలు ఎలా ఉంటాయో చూడాలంటే మరికొంత సమయం పడుతుంది. మరోవైపు ప్రస్తుతం ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలోని పాత్రకు సంబంధించిన మేకోవర్‌తో రామ్‌చరణ్ బిజీగా ఉన్నారు. అలాగే రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘గేమ్ చేంజర్’ సినిమా క్రిస్మస్ సందర్భంగా విడుదలయ్యే అవకాశం ఉంది. -
అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం.. తొలి నటుడిగా రికార్డ్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రంలో బన్నీ మేనరిజం అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సినిమాకు జాతీయ ఉత్తమ నటుడిగా పురస్కారం కూడా అందుకున్నారు. వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఉన్న బన్నీకి అరుదైన గౌరవం లభించింది. దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. స్వయంగా అల్లు అర్జున్ హాజరైన తన రూపాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. అచ్చం పుష్ప స్టైల్లోనే విగ్రహాన్ని రూపొందించడం మరో విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని బన్నీ తన ట్విటర్ ద్వారా పంచుకున్నారు. తగ్గేదేలే అంటూ పుష్ప స్టైల్లో ఫోటోలో కనిపించారు. ఇది చూసిన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తొలి నటుడిగా రికార్డ్ కాగా.. టాలీవుడ్ ఫ్యాన్స్ ముద్దుగా బన్నీ అని పిలుచుకునే అల్లు అర్జున్ తనదైన నటనతో ఆరు సార్లు ఫిలిం ఫేర్ అవార్డ్స్ గెలుచుకున్నారు. భారతదేశంలో అందించే ప్రతిష్టాత్మక జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. తాజాగా ఐకాన్ స్టార్ వాక్స్ స్టాట్యూ రూపంలో చిరస్థాయిగా తన పేరును చరిత్రలో లిఖించుకున్నారు. అయితే ఇప్పటివరకు సౌత్ ఇండియా నుంచి ఏ ఒక్క నటుడికి ఇలాంటి గౌరవం దక్కలేదు. తొలిసారి మన టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. తన విగ్రహాన్న చూసిన బన్నీ.. నిజంగా తనని తానూ అద్దంలో చూసుకుంటున్నట్టు ఉందని.. చాలా రియలిస్టిక్‌గా చేశారని వారిని ప్రశంసించారు. విగ్రహం ప్రత్యేకతలు ఈ మైనపు విగ్రహం ఫర్ఫెక్ట్గా రావడం కోసం 200 రకాల మేజర్మెంట్స్ను అల్లు అర్జున్ నుంచి సేకరించారు. తన డాన్స్ మూమెంట్స్‌ను కూడా సేకరించడం జరిగిందని మేడమ్ టుస్సాడ్స్ దుబాయ్ జనరల్ మేనేజర్ అయిన సనాజ్ కోల్స్రడ్ వెల్లడించారు. Here we go #MadameTussaudsdubai #ThaggedheLe pic.twitter.com/HuOveipJiO — Allu Arjun (@alluarjun) March 28, 2024 View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) -
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. ప్రభాస్, మహేశ్ తర్వాత బన్నీయే!
మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహం కలిగి ఉండడం గొప్ప గౌరవంగా భావిస్తారు మన సినిమా వాళ్లు. ఒకప్పుడు ఇండియా నుంచి బాలీవుడ్ స్టార్స్‌కి మాత్రమే అక్క చోటు దక్కేది. కానీ ఈ మధ్య కాలంలో సౌత్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు. ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన హీరోలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయిలోనే కాదు వరల్డ్ వైడ్‌గా రాణిస్తోంది. దాని కారణంగానే మన వాళ్లకు ఆ మ్యూజియంలో అవకాశం దక్కుతోంది. ఇప్పటికే స్టార్ హీరోలు ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలు మేడమ్ టుస్సాడ్స్ కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇక తాజాగా టాలీవుడ్‌కి చెందిన మరో స్టార్ హీరోకి అక్కడ చోటు లభించింది. అతనే జాతీయ అవార్డు గ్రహిత అల్లు అర్జున్. ఈ న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. లండన్ వెళ్లనున్న బన్నీ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్‌కు చోటు దక్కిందనే వార్త గత కొన్నాళ్లుగా నెట్టింట వైరల్ అవుతోంది. కొత్త విషయం ఏంటంటే.. త్వరలోనే బన్నీ లండన్ వెళ్లనున్నారట. మైనపు విగ్రహానికి సంబంధించి కొలతలు ఇవ్వడానికి బన్నీ లండన్ వెళ్తున్నట్లు సమాచారం. . రెండు రోజులు అక్కడే ఉండి ఈ ప్రక్రియ పూర్తి చేసుకుని తిరిగి ఇండియాకు వస్తారట. వచ్చే ఏడాదిలో ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారట. ఒకవేళ ఇదే నిజమైతే ఈ ఘనత సాధించిన మూడో టాలీవుడ్ హీరోగా బన్నీ నిలుస్తాడు. పుష్ప-2పై భారీ అంచనాలు పుష్ప చిత్రానికిగాను ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్‌కి జాతీయ అవార్డు లభించిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న ఏకైన హీరో అల్లు అర్జున్. ఈ అవార్డు ప్రకటనతో బన్నీ పాపులారిటీ మరింత పెరిగింది. అందుకే పుష్ప సీక్వెల్ పుష్ప-2(పుష్ప: ది రూల్)కి అంచనాలు మరింత పెరిగాయి. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. -
లండన్‌లో నిరసనలు...కింగ్ చార్లెస్ ముఖంపై కేక్ విసిరి...
లండన్‌లో ఆయిల్ స్టాప్ అంటూ నిరసనలు వెలువెత్తాయి. ఈ నిరసనల నేపథ్యంలోనే లండన్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లోని కింగ్ చార్లెస్ 3 మైనపు విగ్రహాన్ని ఇద్దరు వాతావరణ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ప్రస్తుతం లండన్ ప్రభుత్వం కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లు అనుమతివ్వడంపై పలు ప్రాంతాల్లో వాతావరణ కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఇద్దరు వాతావరణ కార్యకర్తలు తాము ధరించిన నల్లని చొక్కాలను తీసేసి ...జస్ట్ స్టాప్ ఆయిల్ అని రాసి ఉన్న టీ షర్ట్‌లను ధరించి కింగ్ చార్లెస్ మైనపు విగ్రహం ముంఖంపై చాక్లెట్ కేక్ విసిరి తమ నిరసనను వ్యక్తం చేశారు. అంతేగాదు ఆ నిరసకారులు ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడుతూ....ప్రభుత్వం ఆదేశించిన అన్ని కొత్త చమురు, గ్యాస్ లైసెన్స్‌లను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు దీంతో ఈ ఘటనపై స్పందించిన మెట్రోపాలిటన్ పోలీసులు నిరసకారులు నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఇటీవల గత కొద్ది రోజులుగా లండన్‌లో పలు చోట్ల ఈ జస్ట్ స్టాప్ ఆయిల్ నిరసనలు అధికమయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఆన్లైన్లో తెగ వైరల్ అవుతోంది. 🎂 BREAKING: JUST STOP OIL CAKES THE KING 🎂 👑 Two supporters of Just Stop Oil have covered a Madame Tussauds waxwork model of King Charles III with chocolate cake, demanding that the Government halts all new oil and gas licences and consents.#FreeLouis #FreeJosh #A22Network pic.twitter.com/p0DJ8v3XVB — Just Stop Oil ⚖️💀🛢 (@JustStop_Oil) October 24, 2022 (చదవండి: అమెరికా వైట్‌హౌస్‌లో అంగరంగ వైభవంగా దీపావళి: వీడియో వైరల్) -
'అసలు ధోనిలానే లేడు.. ఎవరు తయారు చేశారో కానీ!'
టీమిండియాకు రెండు వరల్డ్‌కప్‌లు అందించిన ఎంఎస్ ధోని ఇప్పటికే ఎన్నో అరుదైన ఘనతలు అందుకున్నాడు. కెప్టెన్‌గా సూపర్ సక్సెస్ అయిన ధోని టీమిండియాలో మంచి ఫినిషర్‌గానూ రాణించాడు. ధోని ఆటకు రిటైర్మెంట్ ప్రకటించి రెండేళ్లు కావొస్తున్నా క్రేజ్ మాత్రం ఇసుమంతైనా తగ్గలేదు. టీమిండియా కెప్టెన్‌గా విజయాలు చవిచూసిన ధోని.. ఐపీఎల్లో సీఎస్కేను విజయపథంలో నడిపించాడు.. నడిపిస్తున్నాడు. అలాంటి ధోనికి దేశంలో ఎక్కడికెళ్లినా అభిమానులుంటారు. తాజాగా ధోనికి సంబంధించిన మైనపు విగ్రహం అభిమానులను షాక్‌కు గురి చేసింది. కర్నాటకలోని మైసూరు మ్యూజియంలో ధోని మైనపు విగ్రహాaన్ని తయారు చేశారు. అయితే అది చూడడానికి కాస్త వింతగా ఉంది. ధోని ముఖకవళికలు తేడాతో ఉన్నాయి. దూరం నుంచి చూస్తే ధోనిలా కనిపించినప్పటికి దగ్గరకెళ్లి చూస్తే ధోని ఆకారాన్ని గుర్తుచేయడం లేదు. ఈ విగ్రహంపై ఫ్యాన్స్ కూడా నిరాశ వ్యక్తం చేశారు.'' ఈ విగ్రహాన్ని ఎవరైతే తయారు చేశారో కానీ.. ఆదిపురుష్ వీఎఫ్ఎక్స్ కూడా అతనే చేసి ఉంటాడు.. ధోని భయ్యా ఎక్కడా.. అసలు ఈ విగ్రహం ఎవరిది.. ధోని విగ్రహం అని చెప్పి వేరేది తయారు చేశాడా ఏంటి?'' అంటూ కామెంట్స్ చేశారు. చదవండి: దీపక్ చహర్‌కు గాయం..! MS Dhoni wax statue in Mysore. pic.twitter.com/KdsKcPLsaM — Mufaddal Vohra (@mufaddal_vohra) October 7, 2022 -
మేడమ్ టుస్సాడ్స్ నుంచి రోడ్డుపైకి బోరిస్ మైనపు విగ్రహం
లండన్: నిండా వివాదాల్లో మునిగి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న బోరిస్ జాన్సన్ ప్రధాని పదవికి గురువారం రాజీనామా చేశారు. కన్జర్వేటివ్ పార్టీ పక్ష నేత పదవి నుంచి సైతం తప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఆయనకు మరో అవమానం ఎదురైంది. బ్లాక్‌పూల్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేసిన ఆయన మైనపు విగ్రహాన్నిప్రభుత్వ కార్యాలయం జాబ్ సెంటర్ ముందుకు తరలించారు. జాబ్ సెంటర్ ముందు రోడ్డుపై విగ్రహం ఉన్న ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. Blackpool Madame Tussauds have put Boris Johnson’s waxwork outside of the job centre and I can’t stop laughing pic.twitter.com/U6VToQSjo9 — Charlotte (@charlotteclaber) July 7, 2022 నీలిరంగు టైతో కూడిన సూట్లో నడుముపై చేతులు ఉంచి నవ్వుతున్న జాన్సన్ విగ్రహాన్ని రూపొందించింది మేడమ్ టుస్సాడ్స్. ప్రస్తుతం ఆ విగ్రహాన్ని తరలించటం చర్చనీయాంశంగా మారింది. జాబ్‌సెంటర్ ముందు రోడ్డుపై కనిపిస్తున్న జాన్సన్ విగ్రహం కొద్ది సమయంలోనే వైరల్‌గా మారింది. ఈ అంశంపై కొందరు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కొందరు స్థానికులు విగ్రహం వద్ద ఫోటోలకు పోజులిచ్చారు. మేడమ్ టుస్సాడ్స్ ఈ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేసింది. 'బోరిస్ ఎక్స్ బ్లాక్పూల్' అంటూ నోట్ రాసుకొచ్చింది. బోరిస్ జాన్సన్ మైనపు విగ్రహాన్ని ఈ ఏడాది మార్చిలోనే ఆవిష్కరించారు. లాన్స్ లైవ్ నివేదిక ప్రకారం.. విగ్రహం తయారు చేసేందుకు ఎనిమిది నెలల సమయం పట్టింది. సుమారు 20 మంది కళాకారులు కొన్ని వందల గంటలు శ్రమించి విగ్రహానికి రూపునిచ్చారు. -
వైరల్: చెల్లెలి పెళ్లిలో సోదరుడి సర్ప్రైజ్.. ఏకంగా తండ్రి రూపాన్నే తీసుకొచ్చి..
అన్న అంటే నాన్నలో సగం అంటారు. అమ్మా, నాన్నల తర్వాత సోదరికి అంతటి ప్రేమను పంచేది అన్నే. చెల్లెలి ముఖంలో సంతోషం చూసేందుకు అన్న ఎంత కష్టమైన సంతోషంగా చేస్తాడు. సోదరి కష్టాన్ని తన కష్టంగా.. సోదరి సంతోషాన్ని తన సంతోషంగా భావించే అన్నలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు చెప్పుకోబోయే అన్న ఈ కోవలోకి చెందినవాడే. పిల్లలను అల్లారుముద్దుగా పెంచిన ఓ తండ్రి దురదృష్టవశాత్తు వారికి దూరమయ్యాడు. ఇటీవలే తండ్రి మరణించడంతో అన్న దగ్గరుండి చెల్లెలి పెళ్లి వైభవంగా జరిపించాడు. అయితే పెళ్లిలో అన్ని ఉన్నా నాన్న లేని లోటు స్పష్టంగా కనిపిస్తుండటంతో సోదరుడు ఓ అద్భుతమైన ఆలోచన చేశాడు. చెల్లెలి పెళ్లిలో నాన్న లేని లోటును తీర్చి ఆమె కళ్లలో ఆనందాన్ని నింపాడు. చనిపోయిన తండ్రి సజీవంగా ఉన్నట్లు మైనంతో ఆయన రూపాన్ని పునఃసృష్టించాడు. సరిగ్గా పెళ్లి సమయానికి మండపంలోకి నాన్న ప్రతి రూపాన్ని తీసుకొచ్చి అందరి కళ్లల్లో ఆశ్యర్యం నింపాడు. వీల్‌చైర్‌లో తండ్రి వస్తుండటం చూసి పెళ్లికూతురు కళ్లల్లో కన్నీరు వరదై పారింది. అది మైనపు బొమ్మ అని తెలిసినా.. నాన్నరూపాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనైంది. ఒక్కరేంటి బంధువులు, కుటుంబ సభ్యులు, అతిథులు ఇలా అందరి కళ్లలోనూ పట్టలేని దుఖం, ఆనందం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆ కుంటుంబంలో ఆనందపు భాష్పాలు వెల్లువిరిశాయి. అబ్బురపరిచే ఆనందం గుండెలోంచి తన్నుకుంటూ వచ్చింది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియరాలేదు గానీ ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. కొడుకు తన తండ్రిపై చాటిన ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. చదవండి: అబ్బబ్బా ఏం చేశారు!.. బాలీవుడ్ పాటకు దుమ్ములేపిన నార్వే డ్యాన్సర్లు -
టీమిండియా కెప్టెన్‌కు మరో అరుదైన గౌరవం..
Virat Kohli Wax Statue At Dubai Madame Tussauds Museum: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లికి మరో అరుదైన గౌరవం దక్కింది. దుబాయ్‌లో ఇటీవల కొత్తగా ప్రారంభించిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో కోహ్లి మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ మ్యూజియంలో ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, హాలీవుడ్ యాక్షన్ కింగ్ జాకీ చాన్, ఫుట్‌బాల్ స్టార్ డేవిడ్ బెక్‌హామ్, నటుడు టామ్ క్రూజ్ వంటి ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందు అక్టోబరు 14న దుబాయ్‌లో మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంను ప్రారంభించారు. టీమిండియా కెప్టెన్ కోహ్లికి ఇది రెండో మైనపు విగ్రహం. గతంలో 2019 వన్డే ప్రపంచకప్ సందర్భంగా లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ మైదానంలో అతని మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇదిలా ఉంటే, టీ20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా ఈనెల 24న దాయాది పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే. చదవండి: ఓ పక్క మన వాళ్లను చంపుతుంటే, పాక్‌తో టీ20 అవసరమా..? ప్రధానిని నిలదీసిన ఓవైసీ -
ఆ దెబ్బలకు ట్రంప్ విగ్రహం తీసేశారు!
వాషింగ్టన్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హోస్‌ను వీడి నెలలు గడుస్తున్నాయి. అయినా! ఆయనపై వ్యతిరేకులకు కోపం తగ్గడం లేదు. అందుకే వీలు దొరికనప్పుడల్లా ట్రంప్‌పై సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ సంతోషపడిపోతున్నారు. మరి కొంతమందైతే ఓ అడుగు ముందుకేసి టెక్సాస్‌లోని లూయిస్ టుస్సాడ్స్ వాక్స్ వర్క్స్‌లో ఉన్న ట్రంప్ మైనపు విగ్రహాన్ని పంచింగ్ బ్యాగ్ బ్యాగ్‌లాగా భావిస్తున్నారు. దానిపై పిడిగుద్దులు కురిపించి, కొంతమంది ముఖంపై గాట్లు పెట్టి సంతోషిస్తున్నారు. విగ్రహం ముఖంపై ఆ గాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో విగ్రహాన్ని తీసేశారు నిర్వహకులు. దీనిపై మ్యూజియం రీజినల్ మేనేజర్ క్లే స్టీవర్ట్ మాట్లాడుతూ.. ‘‘ పెద్ద పెద్ద రాజకీయ నాయకుల విగ్రహాలకు దాడుల బెడద తప్పదు. అందుకే ట్రంప్ విగ్రహాన్ని తొలగించాము. బహుశా భవిష్యత్తులో కూడా ఆయన విగ్రహాన్ని పెట్టకపోవచ్చు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ విగ్రహం మ్యూజియానికి చేరుకోగానే దాన్ని పర్యటకుల సందర్శనార్థం ప్రదర్శనకు ఉంచుతాము. బైడెన్ విగ్రహంపై పర్యటకులు దాడి చేయరని భావిస్తున్నాను’’ అని పేర్కొన్నారు. కాగా, 2019లో ట్రంప్ విగ్రహంతో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ల విగ్రహాలను కూడా పెట్టారు. చదవండి : మానవ బాంబు ఆడియోలు అమ్మేస్తున్నాడు.. -
అచ్చం నాన్న లానే!
తమిళనాడులో ఉంటున్న లక్ష్మీప్రభకు పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి సమయం దగ్గరపడుతున్నా చెల్లెలు బాధగా ఎందుకు ఉంటోందో అక్క భువనేశ్వరి అర్థం చేసుకుంది. తన పెళ్లి చూడకుండానే తండ్రి మరణించాడనే కారణంగా చెల్లెలు ఏ మాత్రం సంతోషం లేదని భువనేశ్వరికి తెలుసు. పెళ్లి సమయానికి తండ్రి మైనపు విగ్రహాన్ని 6 లక్షలు వెచ్చించి, తయారు చేయించి మండపంలో ఉంచింది. మండపంలో తండ్రి(విగ్రహాన్ని)ని చూసిన లక్ష్మీ ప్రభ ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. పెళ్లి తర్వాత తండ్రి ఆశీర్వాదం తీసుకుంది. చెల్లెలు ఆనందమే తనకు కావాల్సింది అని లక్ష్మీప్రభను దీవిస్తూ అక్క భువనేశ్వరి చెప్పిన మాటలు అతిథులనూ ఆనందింపజేశాయి. అక్కాచెల్లెళ్ల అనుబంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలంటూ అతిథులు వారికి అభినందనలు తెలిపారు. కొత్త ఇంటిలో తన గృహలక్ష్మితో కలిసి గృహప్రవేశం వేడుక జరుపుకోవాలనుకున్న పారిశ్రామికవేత్త శ్రీనివాస్ గుప్తా తన దివంగత భార్య మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్న విషయం తెలిసిందే. కర్ణాటకలో జరిగిన ఈ వేడుక వీడియోలు, ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అయ్యాయి. ఇలాగే చాలా మంది తాము పోగొట్టుకన్న ప్రియమైనవారిని విగ్రహాల ఏర్పాటుతో బాధను తగ్గించుకుంటున్నారు. ఇటీవల తమిళనాడు వాసి అయిన లక్ష్మీ ప్రభ వివాహంలో ఆమె తండ్రి మైనపు విగ్రహం సమక్షంలో పెళ్లి జరగడం, ఆ వేడుక భావోద్వేగాలకు ప్రతీకగా నిలవడం అందరినీ ఆకట్టుకుంది. డబ్బు కన్నా ఆనందం మిన్న లక్షీప్రభ తండ్రి ఈ ప్రపంచంలో లేరు. తండ్రి లేకపోవడంతో ఆమె రోజూ బాధపడేది. ఇంతలో, ఆమె ఇంట్లో వివాహానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయి. దీంతో ఆమె ఇంకా నిరాశకు గురైంది. తండ్రి లేకుండా ఈ పెళ్లి అవసరమా అంటూ మాట్లాడేది. లక్ష్మీప్రభ అక్క భువనేశ్వరి చెల్లెలికి ఆనందాన్ని తిరిగి ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైన మార్గాన్ని కనుగొంది. తమ తండ్రి మైనపు విగ్రహాన్ని తయారుచేయించి లక్ష్మీప్రభ పెళ్లికి బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహ తయారీకి భువనేశ్వరి 6 లక్షలు ఖర్చు చేసింది. విగ్రహానికి ఎక్కువ ఖర్చు అవుతుందని చెప్పినా, ‘నా చెల్లెల ముఖంలో ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను, ఆ ఆనందం ముందు ఈ ఖర్చు ప్దెదది కాదు’ అంది భువనేశ్వరి. పెళ్లి రోజున తండ్రితో కలిసి ఉన్నారనే భావనతో లక్ష్మీప్రభ ఆనందంతో పొంగిపోయింది. అక్క ఇచ్చిన అపురూపమైన కానుకకు ఆనందంతో కన్నీరు పెట్టుకుంది. పెళ్లి కాగానే తన భర్తతో కలిసి తండ్రి ఆశీర్వాదం కూడా తీసుకుంది లక్ష్మీ ప్రభ. చెల్లెలు ఆనందం కోసం భువనేశ్వరి చేసిన ఈ ప్రయత్నం విజయవంతమైంది. -
వీరిలో నా డార్లింగ్ ఎవరబ్బా: కాజల్ భర్త
గతేడాది అక్టోబర్ 30న ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ప్రేమించి పెళ్లాడిన విషయం తెలిసిందే. సడెన్‌గా కాజల్ తన ప్రేమ, పెళ్లి విషయం చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేయడంతో వీరిద్దరి టాపిక్ కొంతకాలం వరకు టాలీవుడ్లో సెన్సేషనల్‌గా మారింది. పెళ్లి తర్వాత కూడా కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే చందమామ చేతిలో.. చిరంజీవి ఆచార్య, కమల్ హాసన్ భారతీయుడుతో పాటు హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతోపాటు కాజల్ తన వ్యక్తిగత జీవితానికి కూడా ఎక్కవగానే ప్రధాన్యతే ఇస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా భర్త గౌతమ్‌తో సమయం గడుపుతోంది. అంతేగాక ఇప్పుడిప్పుడే తన ప్రేమ మధుర జ్ఙాపకాలను బయటకు తీస్తోంది. చదవండి: స్టార్ హీరోయిన్ల మధ్య డిజిటల్ వార్ కాగా సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కాజల్ మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించి నేటికి ఏడాది పూర్తయ్యింది. 5 ఫిబ్రవరి 2020న కాజల్ మైనపు విగ్రహాన్ని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆవిష్కరించారు. ఈ వేడుకకు కాజల్ కుటుంబసభ్యులతోపాటు గౌతమ్ కూడా హాజరయ్యాడు. అయితే ఆవిష్కరణ ముందురోజే గౌతమ్ సింగపూర్ చేరుకొని కొన్ని గంటలపాటు కాజల్‌తో గడిపి మరుసటి రోజు బిజినెస్ పని మీద జర్మని వెళ్లాడు. కానీ గౌతమ్ వచ్చినట్లు మీడియాకు పెద్దగా తెలియదు. తాజాగా తన భర్తతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్చేస్తూ కాజల్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో గౌతమ్.. కాజల్, మైనపు విగ్రహం మధ్యలో నిలబడి అసలైన కాజల్ ఎవరని చూస్తున్నట్లు ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చదవండి: రెడ్‌లైట్ ఏరియాకు వెళ్లా: శ్వేతాబసు ప్రసాద్ View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) Deeply humbled and ecstatic to be honoured, standing amongst global icons. Feels like I'm seeing myself through the eyes of an artist 😍 The resemblance is uncanny and the attention to detail is spectacular. pic.twitter.com/WmOz38QBpS — Kajal Aggarwal (@MsKajalAggarwal) February 5, 2020 -
సుశాంత్‌కు అరుదైన నివాళి...
కోల్కత్తా: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం అందర్నీ కలిచివేసింది. అయితే ఆయన మరణించిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక మంది అనేక రకాలుగా నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలోనే పశ్చిమ బెంగాల్‌లోని అసనోల్స్‌కు చెందిన సుకాంతో రాయ్ అనే శిల్పి సుశాంత్ మీద ఉన్న అభిమానాన్ని వినూత్న రీతీలో చాటుకున్నారు. తన ఇంట్లో ఏర్పాటు చేసుకున్న మ్యూజియంలో సుశాంత్ జ్ఞాపకార్థం ఏకంగా మైనపు విగ్రహాన్నే రూపొందించి వినూత్న రీతిలో నివాళులర్పించారు. ఈ విషయంపై సుకాంతో రాయ్ మీడియాతో మాట్లాడుతూ.. నేను సుశాంత్‌ను చాలా ఇష్టపడ్డాను. అతను అర్ధాంతరంగా మృతిచెందడం నన్ను మానసిక వేదనకు గురిచేసింది. అతనికి గుర్తుగా నా మ్యూజియం కోసం నేను ఈ విగ్రహాన్ని తయారు చేశాను. అయితే.. సుశాంత్ విగ్రహం కోసం అతని కుటుంబ సభ్యులు నన్ను సంప్రదిస్తే మరొక విగ్రహాన్ని తయారు చేస్తాను. అని చెప్పుకొచ్చారు. (దిశ ఫోన్ నుంచి పోలీసులకు కాల్: నిజమే కానీ) గతంలో.. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, భారత క్రికెట్జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీతో సహా మరికొందరి ప్రముఖుల మైనపు విగ్రహాలను రాయ్ తయారుచేశారు. ఈ విగ్రహాలన్నీ కూడా రాయ్ మ్యూజియంలోని ప్రత్యేక సేకరణలో ఒక భాగం. కాగా.. జూన్ 14న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ బాంద్రాలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం అతని మరణంపై సీబీఐ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సహా మూడు కేంద్ర సంస్థలు వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నాయి. (కృతికి టైం కేటాయించాలి, వాళ్లతో టూర్ వెళ్లాలి) West Bengal: Sukanto Roy, a sculptor from Asansol has created a wax statue of late actor Sushant Singh Rajput. He says, "I liked him a lot, it is sad that he passed away. I have made this statue for my museum. However, if his family requests for his statue I'll make a new one." pic.twitter.com/H9DxEDwcbN — ANI (@ANI) September 17, 2020 -
మైనపు బొమ్మ
కాజల్ అగర్వాల్ మర్చిపోలేని రోజు ఫిబ్రవరి 5, 2020. సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా మారిపోయిన రోజు. సింగపూర్‌లో బుధవారం తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు కాజల్. మేడమ్ తుస్సాడ్స్‌లో సౌత్ నుంచి మైనపు బొమ్మగా చోటు సంపాదించుకున్న తొలి హీరోయిన్ కాజల్ కావడం విశేషం. ‘‘ఈ గుర్తింపుని అందించిన మేడమ్ తుస్సాడ్స్ సంస్థకు ధన్యవాదాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పర్సనాలిటీల మధ్య నా మైనపు బొమ్మ కూడా ఉండటం గౌరవంగా ఉంది’’ అని పేర్కొన్నారు కాజల్ అగర్వాల్. కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్‌తో... -
అందమైనపు బొమ్మ
శ్రీదేవి గొప్ప అందగత్తె. అంతకు మించిన గొప్ప నటి. సౌతిండియా నుంచి నార్తిండియా వరకూ తన ప్రతిభతో లేడీ సూపర్‌స్టార్ అయ్యారు. ఓ బ్రాండ్లా ఎదిగారు. అనూహ్యంగా గత ఏడాది శ్రీదేవి మరణించారు. అందరి మనసుల్లో చెరిగిపోని బొమ్మగా నిలిచిపోయారు. ఇప్పుడు సింగపూర్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో అందమైన మైనపు బొమ్మగా మారారు శ్రీదేవి. ఈ మైనపు విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. శ్రీదేవి భర్త బోనీ కపూర్, ఆమె కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్, శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి ఈ వేడుకలో పాల్గొన్నారు. ‘‘శ్రీదేవి మరణించిన తర్వాత కూడా ఆమె మీద కురిపిస్తున్న అభిమానాన్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. తను చేసిన సినిమాల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది. నా భార్యగా తనని ఎంతగా ప్రేమించానో, తన ఆర్ట్‌ని, తనకు సినిమా మీద ఉన్న ప్రేమను అంతే గౌరవించాను. ఈ విగ్రహం తన ఆనవాళ్లకు ఓ చిహ్నంలా ఉంటుందనుకుంటున్నాను’’ అన్నారు బోనీ కపూర్. ‘మిస్టర్ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి..’ పాటలో శ్రీదేవి లుక్ ఆధారంగా ఈ మైనపు బొమ్మ తయారు చేశారు. తల్లి బొమ్మను తదేకంగా చూస్తున్న జాన్వీ శ్రీదేవి చెల్లెలు మహేశ్వరి -
మేడమ్ తుస్సాడ్స్ లో శ్రీదేవి మైనపు విగ్రహం ఏర్పాటు
-
ఏఎంబీలో మహేష్ మైనపు విగ్రహం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఎందుకంటే సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్‌లో కొలువుదీరబోయే తమ అభిమాన హీరో మైనపు విగ్రహం ఈ రోజు హైదరాబాద్‌కు వచ్చేసింది కాబట్టి. గచ్చిబౌలిలోని మహేశ్‌కు చెందిన ఏఎంబీ సినిమాస్ థియేటర్లో ఈ విగ్రహాన్ని సోమవారం ప్రదర్శనకు ఉంచారు. బ్లాక్ సూట్లో తీర్చిదిద్దిన మహేశ్ మైనపు బొమ్మ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు మహేశ్ భార్య నమత్ర, పిల్లలు సితార, గౌతమ్‌తో కలిసి ఈరోజు ఉదయం ఏఎంబీ థియేటర్‌కు చేరుకున్నారు. కొన్ని నెలల క్రితం మహేశ్ మైనపు విగ్రహాన్ని సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రూపొందించారు. మహేశ్ అభిమానుల కోసం ఒక రోజు పాటు విగ్రహాన్ని హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. రేపు ఉదయమే మళ్లీ దీనిని సింగపూర్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. విగ్రహాన్ని చూసేందుకు అభిమానులు భారీసంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకున్నారు. తనతో తనే 👌🏼👌🏼👌🏼👌🏼 pic.twitter.com/GEeOijU2Qh — Srinivasareddy (@Actorysr) March 25, 2019 -
మైఖేల్ జాక్సన్ పాప్ సాంగ్స్ బ్యాన్
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్‌ను బాలలపై లైంగిక దాడులు చేసేవారనే ఆరోపణలు న్నప్పటికీ మరణానంతరం ఆయన వేధింపుల పర్వం వెలుగులోకి వస్తున్నాయి. దీంతో ప్రపంచ దేశాల్లోని 12కుపైగా రేడియో స్టేషన్లు ఆయన పాప్ గీతాలను బ్యాన్ చేస్తూ నిర్ణయించాయి. మైఖేల్ జాక్సన్ పాప్ గీతాలను తొలగిస్తున్నట్టు ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్, కెనడా తదితర దేశాలు వెల్లడించాయి. మరణించి ఇన్నేళ్ళయినా చిన్న పిల్లలపై అతను చేసిన దుర్మార్గాల పర్వం మైఖేల్ జాక్సన్‌ను మరింతగా వెంటాడుతోంది. పాప్ గీతాల తొలగింపునకు తోడు బ్రిటిష్ నేషనల్ ఫుట్‌బాల్ మ్యూజియం నుంచి మైఖేల్ జాన్సన్ మైనపు బొమ్మను తొలగింస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. మైఖేల్ జాక్సన్ పాప్సింగర్గా ఒకవెలుగు వెలుగుతున్న క్రమంలో పిల్లలను లైంగికంగా వేధించేవాడని, వారిపట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా జిమ్మీ సెఫ్ చక్ (41), వేడ్ రాబ్సన్ (36) లు తమ పదేళ్ళు, ఏడేళ్ళ వయస్సులో మైఖేల్ తమ పట్ల దారుణంగా, చెప్పలేని విధంగా ప్రవర్తించేవాడని, నెవర్లాండ్ ఎస్టేట్‌లో తాము ఇలాంటి అనుభవాలను ఎదుర్కొన్నామని తాజాగా వెలుగులోకి తీసుకొచ్చారు. అంతేకాదు తమ లాంటి బాధితులు చాలా మంది ఉన్నారంటూ సంచలనం సృష్టించారు. ఈ కథనాన్ని బ్రిటన్‌లోని ఓ ఛానల్ బుధవారం రాత్రి ప్రసారం చేసింది. మైఖేల్ ఫ్యాన్స్ కూడా చాలామంది ఇది విని షాక్ తిన్నారు. ఆ మధ్య అతని ఎస్టేట్ లో పని చేసిన ఓ మహిళ కూడా అతని నిర్వాకాన్ని బహిరంగ పర్చిన సంగతి తెలిసిందే. తను చూసిన దృశ్యాలను ఎవరికైనా చెబితే తన గొంతు కోస్తామని, అక్కడి ఉద్యోగులు తనను బెదిరించిన విషయాన్ని ఆమె గుర్తు చేయడం గమనార్హం. -
హైదరాబాద్‌లో మహేష్ మైనపు బొమ్మ
ప్రఖ్యాత మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారి ఆధ్వరంలో మహేష్‌బాబు మైనపు బొమ్మను మార్చి 25న హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఒక ప్రముఖుని ప్రతిమని సింగపూర్‌లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు తమ అభిమాన హీరోని పోలివుండే ప్రతిమతో సెల్ఫీలు, ఫోటోలు పంచుకునే అవకాశం లభిస్తోంది. ఆ తర్వాత మహేష్ మైనపు ప్రతిమ మేడం టుస్సాడ్స్ సింగపూర్‌లో అంగరంగ వైభవంగా జరిగే ఐఫా ఉత్సవాల్లో భాగం కానుంది. తెలుగు సినిమాలో అత్యంత విజయవంతమైన నటులు, హీరోల్లో ఒకరైన మహేష్ ఎన్నో అద్భుత విజయాలు సాధించారు. 250 సంవత్సరాల చరిత్ర కలిగిన 'మేడం టుస్సాడ్స్' ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ 23 శాఖల్లో అంతర్జాతీయ ప్రముఖుల మైనపు ప్రతిమలు తయారు చేసి ప్రపంచం నలుమూలల నుండి వచ్చే సందర్శకులకు వారి అభిమాన ప్రముఖుల్ని కలిసే అనుభూతిని ఇస్తోంది. మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు తన ప్రతిమని ఆవిష్కరిస్తున్న సందర్భంగా మహేష్ బాబు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఎప్పటికీ గుర్తుంచుకోదగ్గ ఈ గౌరవానికి చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రతిమ తయారు చేయడానికి కావాల్సిన కొలతలు, ఇతర వివరాలు తీసుకోవడానికి నాలుగు గంటలు పట్టిందని తెలిపారు. అభిమానుల లాగానే, తాను కూడా మేడం టుస్సాడ్స్ వారు తయారు చేస్తున్న తన మైనపు బొమ్మని చూడడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని పేర్కొన్నారు. ప్రతిమలు తయారు చేయడంలో సిద్ధహస్తులైన మేడం టుస్సాడ్స్ వారి నిపుణుల బృందం హైదరాబాద్ వచ్చి మహేష్ బాబు ని కలిసి 200 కి పైగా కొలతల్ని, అన్ని వివరాలని సేకరించారు. అచ్చం మహేష్ ని పోలి ఉండేలా బొమ్మని తయారు చేయడానికి జుట్టు, కళ్ళ రంగు వంటి విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకున్నారు. మేడం టుస్సాడ్స్ సింగపూర్ జనరల్ మేనేజర్ అలెక్స్ వార్డ్ మాట్లాడుతూ, మహేష్ బాబు వంటి సూపర్ స్టార్ ప్రతిమని తయారు చేయడం తమకు లభించిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. భారతదేశం నలుమూలల నుండి టూరిస్టులు మా శాఖని సందర్శిస్తుంటారు. భారతీయ సినీ ప్రముఖుల్ని వారికి అందుబాటులో ఉంచడమే మా లక్ష్యం అన్నారు. -
ఒక్కటి కాదు.. నాలుగు బొమ్మలు!
సినిమా ప్రపంచంలో ప్రియాంకా చోప్రా స్టార్డమ్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఒక్క బాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాదు హాలీవుడ్ ఇండస్ట్రీలోనూ తనదైన గుర్తింపును సంపాదించుకున్నారీ బ్యూటీ. ఇప్పుడు ప్రియాంకా చోప్రా మైనపు విగ్రహం న్యూయార్క్‌లోని మేడమ్ తుస్సాడ్స్ మ్యూజియంలో ఉంది. ఆ బొమ్మతో ప్రియాంక ఫొటో దిగారు. ఇదిలా ఉంటే.. ప్రియాంక మైనపు విగ్రహాన్ని తుస్సాడ్స్ వారు కేవలం న్యూయార్క్‌లోనే కాదు యూకే, ఆస్ట్రేలియా, ఆసియాలో కూడా ఆవిష్కరించనున్నారు. విశేషం ఏంటంటే... ఒక్క ప్రియాంకా చోప్రాకు మాత్రమే నాలుగు మైనపు విగ్రహాలు ఉండబోతున్నాయి. ఇప్పటివరకూ అమెరికన్ నటి, గాయని విట్నే ఎలిజబెత్ హూస్టన్‌కు మాత్రమే మూడు మైనపు విగ్రహాలు ఉన్నాయట. ప్రియాంకవి నాలుగు కావడం విశేషం. ప్రస్తుతం హాలీవుడ్లో కీలక పాత్ర చేసిన ‘ఈజింట్ ఇట్ రొమాంటిక్’ సినిమా ప్రమోషన్స్ పనుల్లో ఉన్న ప్రియాంకా చోప్రా హిందీలో ‘ది స్కై ఈజ్ పింక్’ అనే చిత్రంలో నటిస్తున్నారు. నెక్ట్స్ ఆమె ఓ హాలీవుడ్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల ఆమె భర్త, గాయకుడు నిక్ జోనస్ కూడా ఓ హాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. భవిష్యత్తులో ఈ ఇద్దరూ తెరపై కూడా జోడీగా కనిపించే అవకాశం ఉంటుందేమో. -
వైరల్ : విజయ్ మైనపు బొమ్మలు..!
విజయ్ సేతుపతి.. తన సహజ నటనతో తమిళ ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు. అటు మాస్ ఆడియెన్స్ ఫాలోయింగ్ ఉన్నా.. తన క్లాస్ యాక్టింగ్‌తో విజయ్ అందరికీ చేరువయ్యాడు. రీసెంట్గా 96 సినిమాతో మరోసారి సూపర్‌హిట్‌ను కొట్టాడు. అయితే ప్రస్తుతం తమిళనాట విజయ్ సేతుపతి నటించే తదుపరి చిత్రం గురించి చర్చ నడుస్తోంది. భారతీయుడులో కమల్‌హాసన్ గెటప్‌లా ఉందని నెగెటివ్ కామెంట్ వచ్చినా.. విజయ్ ఆ లుక్‌లో అందరినీ ఆకట్టుకున్నాడు. ‘సీతాకది’ సినిమాలోని ఈ లుక్ వైరల్ అవుతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌కు దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాలు పెంచింది చిత్రయూనిట్. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్‌లో సీతాకది చిత్రంలోని గెటప్‌లతో కూడిన మైనపు బొమ్మలను ఏర్పాటు చేశారు. వీటికి విశేషమైన స్పందన వస్తోంది. ఇవి ప్రస్తుతం సెల్ఫీ స్పాట్లుగా మారడటంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. విజయ్ సేతుపతికి ఇది 25వ చిత్రం కాగా.. ఈ మూవీ డిసెంబర్ 20న విడుదల కానుంది. -
ఫొటోలు దిగి మురిసిపోయిన సన్నీ లియోన్
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలోని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మంగళవారం సన్నీ మైనపు విగ్రహం కొలువుదీరింది. విశేషంగా సన్నీ మైనపు విగ్రహాన్ని ఆమే అవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త డానియల్ వెబర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన మైనపు విగ్రహంతో ఫొటోలు దిగుతూ మురిసిపోయారు. గతంలో అమితాబ్ బచ్చన్, విరాట్ కోహ్లి, షారుక్ ఖాన్, అనిల్ కపూర్ వంటి ప్రముఖల మైనపు విగ్రహాలు ఇక్కడ కొలువుదీరిన సంగతి తెలిసిందే. మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని ఉంచడంపై ఆమె తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆమె మాట్లాడుతూ.. ‘నా విగ్రహానికి సరైన ఆకృతి తీసుకురావడానికి చాలా మంది కష్టపడ్డారు. వారి కష్టాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ గొప్ప గౌరవం దక్కినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాన’ని తెలిపారు. ఆమె భర్త డెనియల్ వెబర్ కూడా దీనిపై తన ఆనందాన్ని ట్విటర్లో వ్యక్తం చేశారు. సన్నీ మైనపు విగ్రహాంతో తాను దిగిన ఓ వీడియోను పోస్ట్ చేశారు. మరోవైపు సన్నీతో సెల్ఫీ దిగాలంటే ఢిల్లీలోని టుస్సాడ్స్ మ్యూజియం వెళితే సరిపోతుందంటూ.. నెటిజన్లు సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే సన్నీ జీవితం ఆధారంగా తెరకెక్కిన కరణ్‌జిత్ కౌర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. -
స్మాల్ శాంపిల్ మాత్రమే
లండన్‌లోని మేడమ్ తుస్సాడ్స్‌లో తన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఆ మధ్య మహేశ్ ట్వీటర్లో పేర్కొన్నారు. దానికి సంబంధించిన కొలతలను, వివరాలను తుస్సాడ్స్ టీమ్ మెంబర్స్‌కు ఇచ్చారు మహేశ్. ఇప్పుడు ఆ మైనపు విగ్రహం కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు మేడమ్ తుస్సాడ్స్ నిర్వాహకులు. మహేశ్ బాబు విగ్రహం ఎలా ఉంటుందో? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు చిన్న టీజర్ చూపించారు మేడమ్ తుస్సాడ్స్వారు. చిన్న లుక్‌ను గురువారం రిలీజ్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. ఈ బొమ్మను శిల్పి ఇవాన్ రీస్ తయారు చేస్తున్నారట. త్వరలోనే పూర్తి స్థాయి విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మ్యూజియం బృందం తెలిపింది. సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేశ్‌బాబు ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను మహేశ్ బర్త్ డే సందర్భంగా ఆగస్ట్ 9న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ హైదరాబాద్‌లో స్టార్ట్ కానుంది. -
మహేశ్ మైనపు విగ్రహం ; ఫొటో వైరల్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు మైనపు విగ్రహాన్ని ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. భారత్ నుంచి కొద్ది మంది హీరోలు మాత్రమే ఈ ఘనత దక్కించుకున్నారు. తెలుగులో ఈ గౌరవం అందుకున్న రెండో హీరోగా మహేశ్ నిలిచారు. అంతకు ముందు ప్రభాస్ విగ్రహాన్ని ఈ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. ప్రతిష్టాత్మక మ్యూజియంలో తమ అభిమాన హీరో విగ్రహం ఎలా ఉంటుందో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు తెరదించుతూ.. నిర్మాణంలో ఉన్న మహేశ్ మైనపు విగ్రహానికి సంబంధించిన ఫొటో విడుదల అయింది. కొద్ది గంటల్లోనే ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రముఖ శిల్పి ఇవాన్ రీస్ మహేశ్ విగ్రహాన్ని తయారుచేస్తున్న విధానం అభిమానులను ఆకట్టుకుంటుంది. అతి త్వరలోనే మహేశ్ మైనపు విగ్రహం మ్యూజియంలో కొలువుదీరనుంది. కాగా, ప్రస్తుతం మహేశ్.. వంశీ పైడిపల్లి చిత్రంలో నటిస్తున్నారు. -
మాధురీ, కరీనాల సరసన దీపిక
అందం, అభినయం, అదృష్టం ఈ మూడింటి కలబోతే దీపికా పదుకోన్. వరుస విజయాలతో ఇటు బాలీవుడ్లోనే కాక హాలీవుడ్‌లోనూ దూసుకుపోతున్న ఈ ‘మస్తాని’కి మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్, న్యూఢిల్లీలోని ప్రతిష్ఠాత్మక మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో దీపికా మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారని తెలిసింది. ఇప్పటికే మేడం టుస్సాడ్స్ ప్రతినిధులు లండన్‌లో దీపికాను కలిసి ఆమె కొలతలు, ఫొటోలను తీసుకున్నారు. ఈ సందర్భంగా దీపికా లండన్‌లోని ఓ ప్రముఖ పత్రికతో మాట్లాడుతూ.. ‘ఈ ఫీలింగ్‌ను మాటాల్లో చెప్పలేను. చాలా ఆతృతగానే కాక సంతోషంగా కూడా ఉంది. కేవలం సినిమాల ద్వారానే కాకుండా ఇలాంటి గౌరవం పొంది అభిమానుల సంతోషానికి కారణం కావడం చాలా గొప్ప అనుభూతి. ఈ మ్యూజియం చాలా ప్రత్యేకం. నా మైనపు విగ్రహాన్ని చూసి అభిమానులు ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నా’నన్నారు. అంతేకాక ‘లండన్‌లోని ఈ మ్యూజియాన్ని నా చిన్నతనంలో తల్లిదండ్రులతో కలిసి ఒక్కసారి చూశా’ అని తెలిపారు. ఈ ఏడాది జనవరిలో దీపికా ‘పద్మావత్’ సినిమాతో పెద్ద హిట్ అందుకున్నారు. రాజ్‌పుత్ మహారాణి పద్మిని జీవితం ఆధారంగా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ సినిమా అనేక వివాదాల మధ్య విడుదలై కలెక్షన్ల సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దీపిక విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో దీపికకు జోడిగా ఇర్ఫాన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇర్ఫాన్ అనారోగ్యంతో బాధపడుతుండటంతో షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడినట్లు సమాచారం.